చేతులు కాలిన తర్వాత ఆప్‌ నిర్ణయం | Manish Sisodia Is AAP Punjab In-Charge | Sakshi
Sakshi News home page

చేతులు కాలిన తర్వాత ఆప్‌ నిర్ణయం

Published Tue, Dec 19 2017 2:25 PM | Last Updated on Fri, Mar 22 2019 6:18 PM

Manish Sisodia Is AAP Punjab In-Charge - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్‌ ఆద్మీ పార్టీ పంజాబ్‌కు కొత్త ఇంచార్జ్‌ను నియమించింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాను పంజాబ్‌కు కొత్త ఇంచార్జ్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆప్‌ పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ మంగళవారం ఈ మేరకు ప్రకటన చేసింది.

అంతకుముందు ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న సంజయ్‌ సింగ్‌ రాష్ట్ర పార్టీ చీఫ్‌ పదవికి ఏప్రిల్‌లో రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ నియామకం తప్పనిసరి అయింది. అంతేకాకుండా ఇటీవల 414 రాష్ట్ర మున్సిపల్‌ వార్డులకు జరిగిన ఎన్నికల్లో ఆప్‌ కేవలం ఒక్క సీటును మాత్రమే గెలుచుకుంది. వీటిల్లో 267 వార్డులను కాంగ్రెస్‌ పార్టీనే కొల్లగొట్టింది. అలాగే, 29 మున్సిపల్‌ కౌన్సిల్స్‌లో 20 సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆప్‌ శరవేగంగా మనీష్‌ సిసొడియాకు పంజాబ్‌ బాధ్యతలు అప్పగించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement