
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం (డిజిన్వెస్ట్‌మెంట్) ద్వారా నిర్దేశించుకున్న నిధుల సమీకరణ లక్ష్యాన్ని అధిగమించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఈసారి డిజిన్వెస్ట్‌మెంట్ నిధుల సమీకరణ రూ. 85,000 కోట్లకు చేరిందని, ఇది నిర్దేశిత లక్ష్యానికన్నా రూ. 5,000 కోట్లు అధికమని మైక్రోబ్లాగింగ్ సైటు ట్విట్టర్‌లో ఆయన పేర్కొన్నారు. ‘ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 80,000 కోట్లు సమీకరించాలని నిర్దేశించుకున్నాం.
నిధుల సమీకరణ ప్రస్తుతం లక్ష్యాన్ని అధిగమించి రూ. 85,000 కోట్లకు చేరింది‘ అని ఆయన పేర్కొన్నారు. అయిదో విడత సీపీఎస్‌ఈ ఈటీఎఫ్ ద్వారా కేంద్రం రూ. 9,500 కోట్లు సమీకరించగా, ఆర్‌ఈసీ–పీఎఫ్‌సీ డీల్‌తో మరో రూ. 14,500 కోట్లు వచ్చాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 90,000 కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment