Digestive problems
-
ఇవి కలిపితే ఆరోగ్యం పెరుగుతుంది
పెరుగు ఆరోగ్యానికి మంచిదని తెలిసిందే. పెరుగులో కొందరు పంచదార కలిపి తింటే, ఉప్పు కలిపి మరికొందరు తింటుంటారు. గతవారం మనం పెరుగుతో కలిపి తినకూడని పదార్థాలేమిటో చెప్పుకున్నాం. పెరుగులో ఏయే పదార్థాలు కలిపి తింటే ఏయే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఈ వారం చూద్దాం.జీలకర్రతో...పెరుగు, జీలకర్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఒకవేళ మీరు అధిక బరువు సమస్యతో బాధపడుతుంటే, పెరుగుతో జీలకర్ర పోడిని కలిపి తింటే, దాని నుంచి మంచి ప్రయోజనం పోందుతారు. దీని కోసం ముందు జీలకర్రను కాస్త వేయించి, ఆ తర్వాత దానిని పెరుగులో కలుపుకుని తినాలి.సైంధవ లవణంతో...పెరుగు, సైంధవ లవణం కలిపి తింటే ఎసిడిటీ తగ్గుతుంది.కోడి గుడ్డుతో...పెరుగు, కోడిగుడ్డు కలిపి తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి మేలు జరుగుతుంది. మీకు పంటి నొప్పి ఉంటే, ఈ రెండు పదార్థాలను కలిపి తినండి. ఇది నోటి అల్సర్ల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. నల్ల ఉప్పుతో,,,నల్ల ఉప్పును పెరుగు లో కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు, కడుపునొప్పి తగ్గుతాయి.వాముతో...కొంత వాము తీసుకుని ఓ కప్పు పెరుగులో కలిపి తినాలి. దీనివల్ల నోటిపూత, పంటి నొప్పి, ఇతర దంత సంబంధ సమస్య లు తొలగుతాయి.చక్కెరతో కలిపితే...పెరుగు చక్కెర... ఈ రెండింటిని కలిపి తినడం వల్ల దగ్గు తగ్గుతుంది. వంటికి తక్షణ శక్తి లభిస్తుంది.మిరియాల పోడితో...ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే మలబద్దకం పోతుంది.పండ్ల ముక్కలతో కలిపితే... పెరుగులో తాజా పండ్లముక్కలు కలిపి తింటే వ్యాధి నిరోధకత పెరుగుతుంది. తేనెతో... పెరుగులో పోటీన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. తేనెలో రోగనిరోధక శక్తి సమృద్ధిగా ఉంటుంది. ఈ రెండు పోషకాలు కలిసి ఎముకలను దృఢపరుస్తాయి కాబట్టి ఎముకల నొప్పులు ఉన్నవారు పెరుగు, తేనె కలిపి తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పోందవచ్చు. ఇంకా బోలు ఎముకల వ్యాధి, రక్తం గడ్డకట్టడం, అతిసార, ఊబకాయం, కీళ్లనొప్పులు, గుండె, రక్త సంబంధిత వ్యాధులు నయం అవుతాయి. -
ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అంటే?
వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనపడ్డప్పుడు జీర్ణ వ్యవస్థ ప్రధానంగా ఎదుర్కొనే సమస్యల్లో ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ ఒకటి. ఇది రెండు రకాలు. ఒకటి అల్సరేటివ్ కొలైటిస్, రెండోది క్రోన్స్ డిసీజ్.జీర్ణవ్యవస్థలో వచ్చే ఈ సమస్యలోని ‘అల్సరేటివ్ కొలైటిస్’లో పెద్దపేగు లోపలి లైనింగ్లో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. అప్పుడు అక్కడ పుండ్లు పడటం, కొన్నిసార్లు ఆ పుండ్ల నుంచి రక్తస్రావం కావచ్చు. ఆ భాగం మినహాయించి మిగతా జీర్ణవ్యవస్థలో మరెక్కడైనా ఇన్ఫ్లమేషన్ రావడాన్ని ‘క్రోన్స్ డిసీజ్’ అంటారు. అంటే నోరు మొదలుకొని, చిన్నపేగుల వరకు ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల ఒక్కోసారి ఆ భాగం సన్నగా మారడం లేదా పుండ్లు పడటం జరగవచ్చు.కారణాలు..ఈ సమస్యలకు కారణాలు నిర్దిష్టంగా తెలియదు గానీ వ్యాధినిరోధక వ్యవస్థ బలహీనం కావడం వల్ల ఈ సమస్య వస్తుందని నిపుణులు భావిస్తున్నారు. జన్యుపరమైన అంశాలతోనూ, పర్యావరణ కారణాలతోనూ రావచ్చు. పొంగతాగడం క్రోన్స్ డిసీజ్‌కు దారితీయవచ్చని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది.అల్సరేటివ్ కొలైటిస్ లక్షణాలు..నీళ్లవిరేచనాలుకడుపునొప్పిజ్వరంబరువు తగ్గడంతరచూ మలద్వారం నుంచి రక్తం, బంక (మ్యూకస్) పడుతుండటంకొన్నిసార్లు మలబద్దకంఇవిగాక... కీళ్ల నొప్పులు, కీళ్ల వాపు వంటి లక్షణాలు కూడా ఉంటే వ్యాధి తీవ్రంగా ఉందని భావించాలి.క్రోన్స్ డిసీజ్ లక్షణాలు..నీళ్ల విరేచనాలుకడుపునొప్పితీవ్రమైన అలసటనీరసంనిస్సత్తువబరువు తగ్గడంనోటి పొక్కులుచర్మసమస్యలుకళ్లు ఎర్రబారడం, మండడంకొందరిలో మలద్వార సమస్యలైన ఫిస్టులా, మలద్వారం చీరుకు΄ోవడం, కుచించుకు΄ోవడం.నిర్ధారణ పరీక్షలు..కొలనోస్కోపీగ్యాస్ట్రో ఇంటస్టినల్ ఎండోస్కోపీ ∙రక్తపరీక్షలు, అవసరాన్ని బట్టి సీటీ స్కాన్, ఎమ్మారైలతోపాటు కొన్ని సందర్భాల్లో పెద్ద పేగు బయాప్సీ.చికిత్స..– అల్సరేటివ్ కొలైటిస్‌కు... కొన్ని మందులతో లక్షణాలు తగ్గించడంతోపాటు అవి మళ్లీ రాకుండా చూస్తారు. ఉదాహరణకు నొప్పి తగ్గడానికి వాడే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ వంటి వాటి వాడకం– మందులు వాడినప్పటికీ లక్షణాలు తగ్గని కండిషన్‌ను రిఫ్రాక్టరీ అల్సరేటివ్ కొలైటిస్ అంటారు. వ్యాధినిరోధక వ్యవస్థ అతిగా స్పందించడం వల్ల ఇలా జరుగుతుందని గుర్తించినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ తాత్కాలికంగా మందగించేందుకు 6–మెర్కా΄్టోప్యూరిన్, అజాథియోప్రిన్ వంటి మందులూ, అప్పటికీ గుణం కనిపించక΄ోతే సైక్లోస్పోరిన్ వంటి మందులు వాడాలని సూచిస్తారుశస్త్రచికిత్స..– సమస్య ఎంతకీ తగ్గక΄ోతే అప్పుడు శస్త్రచికిత్స చేసి ప్రభావితమైన మేరకు పెద్దపేగు భాగాన్ని తొలగిస్తారు. అవసరమైతే దేహంలో మరెక్కడైనా (సాధారణంగా నడుము దగ్గర) మలద్వారం ఏర్పాటు చేసి, చిన్నపేగు చివరి భాగం అక్కడ తెరుచుకునేలా చూస్తారు.– క్రోన్స్ డిసీజ్‌కు... ఇందులో జీర్ణవ్యవస్థలోని ఏ భాగమైనా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది కాబట్టి... నిర్దిష్టంగా ఏ భాగం ప్రభావితమైందన్న అంశాన్ని బట్టి చికిత్స అందిస్తారు.ఈ వ్యాధికి చేసే చికిత్సల్లో కొన్ని... – జీర్ణవ్యవస్థలోని వాపును తగ్గించడానికి 5–అమైనోశాల్సిలేట్స్ (5–ఏఎస్ఏ) అనే మందులూ, వాటితో ఫలితం కనిపించక΄ోతే అవసరాన్ని బట్టి యాంటీబయాటిక్స్ ఇస్తారు– వీటితో గుణం కనిపించక΄ోతే అవసరాన్ని బట్టి పరిమిత కాలం పాటు ప్రెడ్నిసోన్, బ్యూడిసోనైడ్ వంటి స్టెరాయిడ్స్‌ను వైద్యులు సూచించవచ్చు– లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ఇమ్యునో మాడ్యులేటర్స్ లేదా బయలాజిక్ రెస్పాన్స్ మాడిఫైయర్స్ అనే మందులను సూచిస్తారు.ఆహారంతో అదుపు ఇలా...– పాలు, పాల ఉత్పాదనలైన జున్ను, వెన్న, పెరుగు పుడ్డింగ్స్– చాక్లెట్లు, పేస్ట్రీలు, కేకులు– పల్లీలు ∙కృత్రిమరంగులు వాడిన ఆహారాలు– పుల్లటి పండ్లు, పండ్ల రసాలు ∙మసాలాలు– వేపుళ్లు, ఫాస్ట్‌ఫుడ్, చైనీస్ ఫుడ్స్– కెచప్ క్యాబేజీ, బ్రాకలీ, క్యాలీఫ్లవర్– బీన్స్, కందులు– వేటమాంసం– ఆల్కహాల్ కు పూర్తిగా దూరంగా ఉండాలి.ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ (ఐబీడీ)తో పాటు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) అనే మరో సమస్యా ఉంది. తినగానే విరేచనానికి వెళ్లడం, కొందరిలో మలబద్ధకంతో బాధించే ఈ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్)లో తినగానే వెంటనే మల విసర్జనకు వెళ్లాల్సిరావడమనే ఇబ్బంది తప్ప పెద్దగా సమస్యలు బాధించక΄ోవచ్చు. ఐబీఎస్ (ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్), ఐబీడీ (ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్) రెండూ వేర్వేరనీ, అందులో ఐబీడీ తీవ్రమైనదని గుర్తించాలి. (ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) వివరాలు పక్కనే...) – డా. కావ్య దెందుకూరి, కన్సల్టెంట్ హెపటాలజిస్ట్ – గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ -
Health: సౌండ్ బాత్.. ప్రయోజనాలెన్నో! ఒత్తిడి మాయం.. మూడ్స్ మారతాయి! కానీ..
తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆహ్లాదకరమైన సంగీతం విని, దాన్ని తగ్గించుకోవడం చాలామందికి అలవాటే. ఇందుకోసం కొందరు లలితమైన సంగీతం ఆలకిస్తుంటారు. మరికొందరు బీట్ బాగా ఉండే హుషారు, ఊపు పాటలను వింటారు. ఈ భిన్న ఆసక్తులు ఉన్నవారికి ఒకరి సంగీతం మరొకరికి అంత ఇంపుగా అనిపించదు. కేవలం ఇలా సంగీత మాధ్యమంలోనే కాకుండా... కొన్ని నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీలలో వెలువడే శబ్దాలతో ఒత్తిడి తగ్గించే ప్రక్రియే సౌండ్‌బాత్. ఇది కూడా ఒక ధ్యానం (మెడిటేషన్) లాంటి లేదా యోగాలాంటి ఫలితాలనిచ్చే ప్రక్రియ. కొన్ని రకాల శబ్దాలు ఓ క్రమపద్ధతిలో ఒకేలాంటి ఫ్రీక్వెన్సీ స్థాయుల్లో మంద్రంగా వెలువడుతూ... మన దేహాన్ని కండరాల ఒత్తిడి ఉన్నప్పుడు వాటిని రిలాక్స్ చేసేలా, మానసిక ఒత్తిడి నుంచి విముక్తం చేసేందుకు ఉపకరించే ఈ ప్రక్రియ ఒక యోగాలాంటిదని క్లివ్లాండ్ క్లినిక్‌లోని మేరిమైంట్ మెడికల్ సెంటర్, బ్రాడ్‌వ్యూ హైట్‌కు చెందిన ఇంటర్నల్ మెడిసిన్ వైద్య సహాయకురాలు కరేన్‌బాండ్ చెప్పారు. ఇలా ఒత్తిడి మాయం దీనికి ఆమె భారతీయ యోగా ప్రక్రియలో ఉచ్చరించే ‘ఓమ్’ శబ్దాలు, చైనా సంప్రదాయ వైద్యం (ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్–టీఎమ్సీ)లో ఉచ్చరించే ‘చి’ లాంటి శబ్దాలను (చైనీస్ అక్షరమైన దీని స్పెల్లింగ్ ఇంగ్లిష్‌లో ‘క్యూఐ’ కాగా దీన్ని (సీహెచ్ఐ గా ఉచ్చరిస్తారు) ఉదాహరణలుగా చూపుతున్నారు. అవి శరీరంలోని శక్తిప్రవాహాన్ని ఏర్పరచడం, క్రమబద్ధ పద్ధతిలో ప్రవహింపజేయడం ద్వారా ఒత్తిడిని తొలగించేందుకు సహాయపడతాయని పేర్కొంటున్నారు. అధ్యయనాల ఫలితంగానే ఇదెలా జరుగుతుందనేది చెబుతూ ‘‘ఉదాహరణకు ఎవరైనా వ్యక్తి తన జీర్ణవ్యవస్థ క్రమబద్ధంగా లేకపోవడాన్ని కంప్లెయింట్‌గా చెబితే... వారిలో ఆ ప్రాంతాన్ని నయం చేసేలా ఒక నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీలో శబ్దాలు వినిపించడం జరుగుతుంది’’ అని తెలిపారు. శబ్దాలతో కలిగే వైద్య ప్రయోజనాలపై 2014 నుంచి అనేక అధ్యయనాలు జరుగుతున్నాయనీ, ఈ తరహా శబ్దచికిత్సలు చవకైనవి మాత్రమే గాక... సురక్షితమైనవని ఆమె తెలిపారు. చిన్న చిన్న సమస్యల్లోనే కాకుండా దీర్ఘకాలిక వెన్నునొప్పులు, క్యాన్సర్‌తో బాధపడేవారిలో కలిగే నొప్పుల ఉపశమనానికి కూడా ఈ శబ్ద చికిత్సలు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ఇవే కాకుండా ఈ తరహా పరిశీలనలు జరుగుతున్నప్పుడు నిదర్శనాలు, ఫలితాల ఆధారంగా వాస్తవాలు తెలుసుకునే పరిశోధన జరుగుతోందని వెల్లడించారు. అనేక నిదర్శనాలు, ఫలితాలను పరిశీలించినప్పుడు సౌండ్ బాత్ తర్వాత తమ క్లయింట్లను ప్రశ్నించినప్పుడు... కొందరు ఒత్తిడి తగ్గిందనీ, మరికొందరు తమ కండరాలు వదులుగా, రిలాక్స్డ్గా మారాయనీ, నొప్పి తగ్గిందనీ, నిద్ర బాగా పట్టిందని, మూడ్స్ మెరుగుపడ్డాయని, తమ శరీరంలో చోటు చేసుకుంటున్న మార్పులు తమకు బాగా తెలిసినట్లుగా అనుభూతి కలిగిందనీ వివరించినట్లు కరేన్ బాండ్ తెలిపారు. సౌండ్ బాత్ కోసం ఏయే పరికరాలు ఉపయోగిస్తారంటే...? ►జేగంటలు (గాంగ్) ►జలతరంగిణిలో ఉపయోగించేలాంటి గిన్నెలు ►టిబెటన్ పాటల్లో ఉపయోగించేలాంటి గిన్నెలు ►ట్యూనింగ్ ఫోర్క్‌లు ►ఫెంగ్ షుయీ పద్ధతుల్లో ఇంట్లో వేలాడదీసినప్పుడు ఆహ్లాదకరంగా మోగుతుండే స్తూపాకారపు అలంకరణ వస్తువులు (చిమ్స్) ►కొన్ని చిరుమువ్వలు ►ఆహ్లాదకరమైన శబ్దాలను వెలువరించే చిరు గంటలను సౌండ్ బాతింగ్ కోసం ఉపయోగిస్తారు. సైడ్ ఎఫెక్ట్స్ కూడా.. దీని ఫలితాలు అందరిలోనూ ఒకేలా ఉండవు. చాలా తక్కువమందిలోనే అయినా కొందరిలో సౌండ్‌బాత్ తర్వాత కొందరు కాస్త అలసట ఫీలవుతారు. దీనికి భిన్నంగా మరికొందరు బాగా శక్తిపుంజుకున్నట్లు అనుభూతి చెందుతారు. అందుకే సౌండ్బాతింగ్ ప్రక్రియకు ముందు మంచి ఆహారం, తగినన్ని నీళ్లతో పాటు కంటినిండా నిద్ర అవసరమని సూచించారు. మానసిక (సైకియాట్రిక్) సమస్యలతో బాధపడేవారు సౌండ్ బాత్కు ముందు తమ డాక్టర్‌ను సంప్రదించాలని చెబుతున్నారు. చదవండి: నోటి నుంచి దుర్వాసన వస్తోందా? నీటిలో తౌడు వేసి.. తెల్లారి పరగడుపున వీటిని కలిపి తాగితే.. -
సిజేరియన్ అయిన అమ్మలు ఇలా చేస్తే మేలు!
సిజేరియన్ ఆపరేషన్‌తో బిడ్డను కన్న కొత్త అమ్మలకు పేగుల కదలికలకు సంబంధించిన కొన్ని సమస్యలు చాలా సాధారణంగా కనిపిస్తుంటాయట. అయితే తమ సమస్యను పరిష్కరించుకోవడం చాలా తేలిక అంటున్నారు శాస్త్రజ్ఞులు. వాళ్లు రోజుకు మూడుసార్లు చ్యూయింగ్ గమ్ నమిలితే పేగుల కదలికలు బాగా మెరుగుపడతాయంటున్నారు సైంటిస్టులు. సిజేరియన్ ద్వారా బిడ్డను కన్న కొత్త మాతృమూర్తులకు పేగు కదలికలలో ఇబ్బందులతోపాటు కడుపునొప్పి, వికారం, కింది నుంచి గ్యాస్ పోవడం, మలబద్దకం వంటి పేగులకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తాయి. సిజేరియన్ ప్రసవం జరిగిన ఐదుగురిలో ఒకరు పైన పేర్కొన్న సమస్యలతో బాధపడటం మామూలే. అయితే కేవలం చ్యూయింగ్‌గమ్ నలమడం ద్వారానే ఆ సమస్య తేలిగ్గా పరిష్కారం అవుతుందంటున్నారు ఫిలడెల్ఫియాకు చెందిన పరిశోధకులు. చ్యూయింగ్ గమ్ వేసుకున్న తర్వాత అరగంట దాన్ని నములుతూ ఉండాలని వారు సూచిస్తున్నారు. ఇలా చేసే సమయంలో శరీరానికి రెండు రకాలుగా స్టిమ్యూలేషన్స్ కలుగుతాయట. మొదటిది ఆ వ్యక్తి ఏదో తింటున్నందున దానికి తగినట్లుగా పేగుల కదలికలు జరిగేలా అంతర్గత అవయవాలు స్పందిస్తాయి. ఇక రెండోది చ్యూయింగ్ గమ్ నమిలే సమయంలో అంతసేపూ లాలాజలం స్రవిస్తుంది. అది లోపలికి స్రవించాక పేగులు దానికి తగినట్లుగా కదలికలు సంతరించుకుంటాయని పేర్కొంటున్నారు ఈ పరిశోధనలో పాలుపంచుకున్న డాక్టర్ బెర్ఘెల్లా. అయితే రోజుకు మూడుసార్లు... ప్రతిసారీ అరగంటకు మించనివ్వవద్దని కూడా సూచిస్తున్నారు. మరింత ఎక్కువగా చ్యూయింగ్‌గమ్ నమలడం వల్ల అందులోని విరేచనకారక ఔషధగుణం ఉన్న పదార్థాల వల్ల కొన్నిసార్లు విరేచనాలు అయ్యే అవకాశం కూడా ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. చదవండి: చనుబాలు ఇస్తున్నారా? అయితే.. -
బుద్ధికి గడ్డి పెట్టండి
శరీరానికి మంచిది తినిపించాలి. నిజమే. మరి బుద్ధికి? మంచి ఆలోచనలు జీర్ణం చేసుకుని చెడు ఆలోచనలు విసర్జించగలిగే మానసిక జీర్ణవ్యవస్థ మనకు ఉందా? కట్టు తప్పే బుద్ధికి అప్పుడప్పుడు గడ్డి పెట్టాల్సిన పని లేదా? నేడు ‘వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే’. శారీరక జీర్ణవ్యవస్థ గురించి చైతన్యం కలిగించుకోవాల్సిన రోజు. కాని మనిషి బుద్ధితో, మనసుతో, ప్రవర్తనతో ముడిపడిన జీర్ణవ్యవస్థ గురించి ఇక్కడ మాట్లాడుకుందాం. మనిషి అన్నమే కాదు. తిట్లు కూడా తింటుంటాడు. అన్నం దేహానికి. తిట్లు ఆత్మకి. శరీర శుద్ధికి జీర్ణవ్యవస్థ ఉంది. అది నిర్విరామంగా మన ప్రమేయం లేకుండానే పని చేస్తూ శరీరానికి కావలసిన మంచిని తీసుకుని అక్కర్లేని దానిని బయటకు వెళ్లగొడుతూ ఉంటుంది. కాని ఆత్మవిషయం అలా కాదు. దానికి మంచిని అరాయించాల్సిన పని మనదే. దాని నుంచి చెడు తీసేయాల్సిన పనీ మనదే. మనిషి అన్నం తినకపోతే సొమ్మసిల్లిపోతాడు కనుక తప్పక ఆహారం తీసుకుంటాడు. కాని బుద్ధి సొమ్మసిల్లిపోవడం మనకు తెలియదు. అది పతనమైపోవడం తెలియదు. అది పెడత్రోవ పట్టిపోవడం తెలియదు. గమనించుకుంటూ ఉండాలి. ‘ఫుడ్ ఫర్ థాట్’ అన్నారు పెద్దలు. ఈ మేధో ఆహారం కోసం ఏ నాగలి భుజం మీద వేసుకొని ఏ పంట చేల వైపు మనం నడుచుకుంటూ వెళుతున్నామో చూసుకోవాలి. మెదడుకు మేత ‘ఖాళీగా ఉండే మనసు దెయ్యాల కార్ఖానా’ అన్నారు పెద్దలు. భారతదేశ పర్యటన చేసిన గాంధీజీ ఊళ్లల్లో మనుషులు ఖాళీగా గంటలు గంటలు కూచుని ఉండటాన్ని చూసి చాలా విముఖం చెందాడు. మనిషి ఎప్పుడూ పనిలో ఉండాలని తద్వారా మనసు కూడా ధ్యాసతో ఉండాలని ఆయన భావించాడు. చరఖా ఉద్యమం వెనుకగానీ, పని–పరిశుభ్రత పిలుపు ఇవ్వడం వెనుక గానీ గాంధీజీకి ఉన్న ఉద్దేశ్యం మనిషి కార్యకలాపిగా ఉండాలన్నదే. శరీరం పనిలో ఉంటే మనసుకు కళ్లెం ఉంటుంది. శరీరం విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా దానికి సరైన నీరు పడుతుండాలి. కళలు, పుస్తకాలు, బోధనలు, ప్రవచనాలు... ఇవన్నీ మనసు తాలూకు డైజెస్టివ్ సిస్టమ్‌ను దారిలో పెడుతుంటాయి. బలహీనతలు, వ్యసనాలు, అనవసర వ్యాపకాలు ఇవన్నీ మానసిక అజీర్తిని వ్యక్తపరిచే లక్షణాలు. సంస్కార సమృద్ధి, సాంస్కృతిక సమృద్ధి ఉన్న మనసుకు ఈ తేన్పులు, వికృత వాంతులు ఉండవు. మనసు మంట కొందరికి కడుపుమంట ఎక్కువగా ఉంటుంది. ‘ఫలానా వారికి కడుపుమంట జాస్తి’ అని వింటుంటాం. పాపం కడుపు ఏం చేసిందని. తన మానాన తాను తిన్నది అరిగించుకునే పని చేస్తుంటుంది. మంట ఉండేది మనసుకే. ఈ మనసుకు ఆకర్షణీయమైన రంగులు నిండిన, రుచి ఉంటుందనిపించే జంక్ఫుడ్లాంటి ఈర్ష్య, అసూయ, ద్వేషం, అక్కసు, ఓర్వలేనితనం కావాలనిపిస్తూ ఉంటుంది. మనం పెడుతూ పోతుంటే అది నింపుకుంటూ పోతూ ఉంటుంది. ఇవి నిండే కొద్దీ వాటికి తగినట్టుగా శరీరం పనుల్లోకి దిగుతుంది. ఆ పనులే తప్పులు, పాపాలు, నేరాలు, ఘోరాలు. బుద్ధికి సరైన తిండి తినని, సరి కానిది విసర్జించుకోలేని మనసుల చర్యలే నేడు మానవ ప్రపంచానికి ప్రమాదాలుగా, పీడనలుగా, వేదనలుగా, యుద్ధాలుగా పరిణామిస్తున్నాయి. నెమరువేసుకోవాల్సిన మాట ‘నీ అన్నం నువ్వే అరాయించుకోవాలి... నీ కష్టాలు నువ్వే భరాయించుకోవాలి’ అని అత్తారింటికి వెళుతున్న వాణిశ్రీతో ఆమె తండ్రి కాంతారావు ‘గోరంతదీపం’లో అంటాడు. ముళ్లపూడి వెంకటరమణ రాసిన డైలాగ్ ఇది. దాంతోపాటు ‘నీకు చెడు అయినది వదులుకోవాలి... నువ్వు చెడు చేసేది వదిలించుకోవాలి’ అని కూడా ఉండాలి. ఆ చెడు వదులుకోలేని, అంటే మలబద్ధకం వలే చెడు బద్ధకం ఉన్న మనుషులు పురాణాల్లో, కథల్లో, నిజజీవితాల్లో ఎన్ని ఉత్పాతాలు సృష్టించగలరో మనకు తెలుసు. చూస్తున్నాం. దుర్యోధనుడు, రావణుడు తిన్నది అరక్క అంటే శరీరం కాదు మనసు ఏం చేశారో యుగాలుగా చెప్పుకుంటున్నాం. కులాలని, మతాలని, ప్రాంతాలని, భాషలని, స్త్రీ పురుష భేదాలని ఎన్ని విభేదాలకు పోతున్నామో అనుభవిస్తున్నాం. చక్కటి అరిటాకు మీద తెల్లటి వరి అన్నం తిన్నప్పుడు కడుపుకు ఎలాగైతే శాంతి కలుగుతుందో ఈ నేలన పుట్టిన సమస్త జనులూ సమానమే ఆదరణీయమే సహోదర రూపమే అనుకున్నప్పుడు మనసుకు కూడా అంతే శాంతి కలగదా? మనసు కోరుకోవాల్సిన ఆహారం అదే కదా? దాని ప్రేవుల్లో నిండాల్సిన ఆలోచన అదే కాదా? అక్కడ శక్తిగా మారి వెలికి రావాల్సిన కాంతి అదే కదా? ఇవాళ ఏం తింటున్నాం అని కిచెన్‌లోకి వెళ్లడం, ఫ్రిజ్జు తెరవడం ఎప్పుడూ చేసే పనే. మన మనసు ఏం తింటోంది... దానిలో అరక్క అడ్డం పడి ఉన్నది ఏది అనేది ఇవాళ తరచి చూసుకుందాం. -
లక్ష్యాన్ని అధిగమించిన డిజిన్వెస్ట్‌మెంట్: జైట్లీ
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం (డిజిన్వెస్ట్‌మెంట్) ద్వారా నిర్దేశించుకున్న నిధుల సమీకరణ లక్ష్యాన్ని అధిగమించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఈసారి డిజిన్వెస్ట్‌మెంట్ నిధుల సమీకరణ రూ. 85,000 కోట్లకు చేరిందని, ఇది నిర్దేశిత లక్ష్యానికన్నా రూ. 5,000 కోట్లు అధికమని మైక్రోబ్లాగింగ్ సైటు ట్విట్టర్లో ఆయన పేర్కొన్నారు. ‘ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 80,000 కోట్లు సమీకరించాలని నిర్దేశించుకున్నాం. నిధుల సమీకరణ ప్రస్తుతం లక్ష్యాన్ని అధిగమించి రూ. 85,000 కోట్లకు చేరింది‘ అని ఆయన పేర్కొన్నారు. అయిదో విడత సీపీఎస్ఈ ఈటీఎఫ్ ద్వారా కేంద్రం రూ. 9,500 కోట్లు సమీకరించగా, ఆర్ఈసీ–పీఎఫ్సీ డీల్‌తో మరో రూ. 14,500 కోట్లు వచ్చాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 90,000 కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. -
సత్తువకు బత్తాయి
హాస్పిటల్లో ఉన్న రోగులకూ, కోలుకుంటున్న వ్యక్తులకూ ఇచ్చే పళ్ల రసం సాక్షాత్తూ బత్తాయి రసమే తప్ప మరోటీ ఇంకోటీ కాదు. బత్తాయితో ఒనగూరే ఆరోగ్యప్రయోజనాల గురించి చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలదూ! బత్తాయితో కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇంకా అనేకం ఉన్నాయి. విటమిన్–సి పుష్కలంగా ఉండే బత్తాయితో రోగనిరోధక శక్తి సమకూరుతుందన్న సంగతి తెలిసిందే. రోగులకు దీనిని ఇచ్చేందుకు మరో కారణమూ ఉంది. గ్లూకోజ్‌తో తేలిగ్గా కలిసిపోయే ఇందులోని లిమోనాయిడ్స్ అనే పోషకాలు చాలా తేలిగ్గా జీర్ణమవుతాయి. బత్తాయిలోని జీవరసాయనాలు జీర్ణశక్తిని పెంపొందించి జీర్ణవ్యవస్థ కార్యకలాపాలను మెరుగుపరుస్తాయి. అజీర్తి, పేగుల కదలికలు సక్రమంగా లేకపోవడం (ఇర్రెగ్యులర్ బవెల్ మూవ్మెంట్స్) వంటి సమస్యలను బత్తాయి సమర్థంగా చక్కదిద్దుతుంది. ఒంట్లోని విషపదార్థాలను బయటకు సమర్థంగా పంపడంలో బత్తాయి బాగా తోడ్పడుతుంది. అందుకే దీన్ని శక్తిమంతమైన డీ–టాక్సిఫైయింగ్ ఏజెంట్‌గా పరిగణిస్తారు. బత్తాయిలోని విటమిన్–సి ఇన్ఫ్లమేషన్నూ (నొప్పి, మంట, వాపు)లను తేలిగ్గా తగ్గిస్తుంది. బత్తాయిలోని ఈ గుణం వల్లనే రుమటాయిడ్ ఆర్థరైటిస్ రోగులకు ఉపశమనం కోసం పళ్ల రసాన్ని ఇస్తుంటారు. బత్తాయి రసంలో కొలెస్ట్రాల్ పాళ్లను అదుపు చేసే స్వభావం ఉంది. అలాగే దీనిలో పోటాషియమ్ కూడా పుష్కలంగా ఉంది. ఈ కారణంగా బత్తాయికి రక్తపోటును నివారించే గుణమూ ఉంది. బత్తాయిలోని పొటాషియమ్ మూత్రపిండాల్లోని అనేక విషాలను బయటకు నెట్టేస్తుంది. బ్లాడర్ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇందులోని విటమిన్–సి యూరినరీ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. అందుకే ఇది మూత్రపిండాల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని క్యాల్షియమ్ ఎముకలకు మేలు చేస్తుంది. అంతేకాదు... ఇదే క్యాల్షియమ్ ప్రత్యేకంగా గర్భవతుల్లో పిండం అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. మెదడూ, నాడీవ్యవస్థ చురుగ్గా పనిచేయడానికి బత్తాయి బాగా సహాయపడుతుంది. -
స్మోకింగ్‌తో ఇవి బోనస్..
లండన్: పొగతాగడం పలు వ్యాధులకు దారితీస్తుందని ఇప్పటికే నిర్ధారణ కాగా, తాజా పరిశోధన స్మోకింగ్ ఆరోగ్యానికి ఎంతటి చేటో వెల్లడించింది. సిగరెట్ తాగడం వల్ల జీర్ణాశయం వాపు సంభవించి తీవ్ర అనారోగ్యానికి కారణమవుతుందని తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు హెచ్చరించారు. కార్డియోవాస్కులర్ వ్యాధితో పాటు లంగ్ క్యాన్సర్‌కూ స్మోకింగ్ ప్రధాన కారణమని తక్షణమే దీన్ని వదిలివేయాలని స్మోకర్లకు సూచించారు. తాజా పరిశోధన జీర్ణకోశ వ్యాధుల చికిత్సలో నూతన మార్పులకు నాందిపలుకుతుందని నిపుణులు చెబుతున్నారు. జీర్ణాశయం వాపుతో తీవ్ర పరిస్థితి తలెత్తుతుందని ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని తెలిపారు. స్మోకింగ్ వల్ల ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఎన్నో రెట్లు అధికమని శాస్ర్తవేత్తలు వెల్లడించారు. కడుపు నొప్పి, డయేరియా, బరువు తగ్గడం వీటి లక్షణాలని చెప్పారు. పొగతాగేవారు ముఖ్యంగా అజీర్ణంతో బాధపడేవారు తక్షణమే స్మోకింగ్‌కు స్వస్తిపలకాలని సూచిస్తున్నారు. -
బుర్ర తిరిగితే బాడీ బ్లాక్ అవుద్ది!
► మానసిక కారణాలతోనూ శారీరక నొప్పులు: వెన్ను సున్నమవుతోందా? మాటిమాటికీ ఒళ్లు వెనక్కు విరుచుకోవాలనిపిస్తోందా? మెడలో నొప్పి విడువకుండా ఉందా? కొన్నాళ్ల పాటు నొప్పి నివారణ మందులు వాడుతున్నా తగ్గకపోతే అది మానసిక ఒత్తిడి వల్ల కావచ్చు. అంతేకాదు, ఒళ్లంతా నొప్పులుగా అనిపించడం వంటి సమస్యలూ మానసిక ఒత్తిడికి సంకేతాలే. ► జీర్ణ సమస్యలు: కడుపులో ఉబ్బరం కనిపిస్తోందా? మాటిమాటికీ తేన్పులా? మానసిక సమస్య గుండెల మీది కుంపటిలా రగులుతుంటే ఛాతీలో మంట రాజుకుంటోందేమో గమనించుకోండి. ఇక మలబద్ధకం, తిన్నవెంటనే బాత్రూమ్కు వెళ్లాల్సి వచ్చే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) లక్షణాలూ శారీరక సమస్యలుగా వెల్లడికావచ్చు. కానీ వాటి మూలాలు మెదడులో ఉండవచ్చు. ►న్యూరాలజీ లక్షణాలు: సమస్యను అధిగమించలేక కాళ్లు, చేతుల కొనలు మొద్దుబారితే అది ఆలోచనలతో మొద్దుబారిపోయిన మెదడు వల్ల కావచ్చు. ఇక ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో మెదడు ఏమీ చేయలేక చేతులెత్తేస్తే... చేతుల చివర్లలోనే సూదులు గుచ్చుకుంటున్న ఫీలింగ్ ఉండవచ్చు. సరసరా పాకే నొప్పి జరజరా పాములా పాకుతున్న మానసిక ఆందోళనకూ, యాంగ్జైటీకీ గుర్తు. ► తల తిరగడం: యాంగ్జైటీ తాడు తల లోపలి మెదడును బొంగరంలా తిప్పవచ్చు. దాంతో తలకాయంతా రంగుల రాట్నంలా తిరుగుతున్న ఫీలింగ్ రావచ్చు. మాటిమాటికీ తలనొప్పిగా అనిపించవచ్చు. ఈ లక్షణాలతో పాటు నోరంతా ఎండిపోయినట్లు ఉంవచ్చు. ఎన్ని మందులు వాడుతున్నా తలతిరుగుడుకు విరుగుడు కనిపించకపోతే దీనికి కారణాలు మానసికమైనవేమోనని చూడాలి. ► దడదడలాడే గుండెలు: ఛాతీలో నొప్పి, గుండెపోటును భ్రమింపజేసే లక్షణాలు, ఆయాసం వంటి లక్షణాలు కొన్నిసార్లు కనిపిస్తాయి. కానీ తీరా గుండెకు సంబంధించిన ఈసీజీ, టూడీ ఎకో, ట్రెడ్మిల్ చివరకు యాంజియో లాంటి పరీక్షలు చేయించినా ఏమీ ఉండదు. అప్పుడు కనిపించని బరువేదో మెదడులో ఉందనీ, అది గుండెల మీద భారంలా అనిపిస్తోందనీ అనుమానించాలి. ►మూత్ర సంబంధిత లక్షణాలు: అనుక్షణం మూత్రం వస్తున్న ఫీలింగ్ ఉంటుంది. బరువు దించుకోడానికి వేగంగా పరుగెత్తుతారు. కానీ బ్లాడర్‌లో ఏమీ ఉండదు. ఇక దీనికి రివర్స్ కేసుల్లో మూత్రవిసర్జన కోసం త్వరగా పరుగెత్తాల్సి రావచ్చు. బ్లాడర్‌పై కంట్రోల్ ఉండకపోవచ్చు. మూత్రధార వెంబడే కొనసాగే మంట వంటి లక్షణాలూ ఉండవచ్చు. ఇలాంటి లక్షణాలన్నీ మానసిక ఒత్తిడికి సంకేతాలే. ► బాల నెరుపులు : వయసుపైబడ్డ లక్షణాలు త్వరగా కనిపిస్తాయి. చర్మంపై ముడతలు త్వరగా ఏర్పడతాయి. ఈ ప్రీ-మెచ్యుర్ ఏజింగ్ కారణంగా తలపై ఉండే జుట్టు విషయంలో కూడా ప్రభావం ప్రస్ఫుటంగా కనపడుతుంది. వెంట్రుకలు వయసుకు ముందే నెరుస్తుంటాయి. వెంట్రుకలు త్వరగా రాలిపోతుంటాయి. వెంట్రుకల్లో బలం తగ్గి, విరిగిపోతుంటాయి. ► మహిళలకు ప్రత్యేకం ఇది: రుతుస్రావం మరీ ఎక్కువగా రావచ్చు. రుతుశూల మరీ ఎక్కువగా ఉండవచ్చు. పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి. ఆ నొప్పి వల్ల ప్రదర్శించే చికాకు. దగ్గరివాళ్లపై విరుచుకుపడాలనిపించే చిరాకు. మాటల్లో వివరించలేని బాధ... ఇవన్నీ మానసిక ఒత్తిడికి మెదడు పంపే సంకేతాలు కావచ్చు. ఇవి మనసులో ఉన్న బాధనూ, వ్యథనూ ప్రతిఫలించే మార్గాలు కావచ్చు. ► ఎముకల్లో నొప్పి: అస్థి బాధలు విస్తృతంగా ఉండవచ్చు. మోకాళ్లు. మణికట్టు, ముంజేయి... ఇతర కీళ్లలోనూ నొప్పి రావచ్చు. పరీక్షిస్తే అంతా సవ్యంగానే ఉన్నట్లు రిపోర్టు రావచ్చు. కానీ ఎంతకీ నొప్పులు తగ్గకపోవచ్చు. కీళ్లనొప్పులను అదుపు చేయడానికి పెయిన్ కిల్లర్స్ వాడినా బాధానివారణ కలగకపోవచ్చు. ఇలాంటి నొప్పులకూ మానసిక అలజడే కారణం కావచ్చు. ► ఊపిరితిత్తులకు సమస్యలు: మానసిక సమస్యలు ఆస్తమాను ప్రేరేపించవచ్చు. ఉబ్బసంతో ఊపిరాడకపోవచ్చు. దమ్ము సరిపోక విపరీతమైన ఆయాసమూ రావచ్చు. దీర్ఘకాలికంగా ఎడతెరిపి లేకుండా ‘సైకోజెనిక్ కాఫ్’ అని పేర్కొనే దగ్గు రావచ్చు. ఎన్ని పరీక్షలు చేసినా దగ్గుకు కారణం కనిపించకపోవచ్చు. ఎన్ని యాంటీబయోటిక్స్ వాడినా అది తగ్గకపోవచ్చు. ►చర్మసమస్యలు: శరీరంపై దద్దుర్లు పుట్టవచ్చు. దురదలు పెరగవచ్చు. ఎంత గీరుకున్నా దురద తగ్గకపోవచ్చు. దీన్నే సైకోజెనిక్ ఇచ్ అంటారు. సైకోజెనిక్ డర్మటైటిస్ అనే చర్మ సమస్య రావచ్చు. మేనిపై పగుళ్లూ, మానసిక ఒత్తిడి పెరగగానే సోరియాసిస్ వంటి సమస్యలూ కనిపించవచ్చు. ఒంటిపైన కొరడాతో కొట్టినట్లుగా నొప్పులు లేని కదుములు తేలవచ్చు. మరింత చెలరేగవచ్చు. ► చెప్పనలవి కాని బాధలు: ఇదీ బాధ అని ఇదమిత్థంగా చెప్పలేని ఇతర సమస్యలూ ఉండవచ్చు. లైంగిక సమస్యల రూపంలోనూ వ్యక్తం కావచ్చు. విముక్తి పొందడంలో అశక్తత కనిపించవచ్చు. ఇతర చిట్కాలూ, సలహాలతోనూ ప్రయోజనం కనిపించకపోవచ్చు. కారణం... సమస్య మేనిలో లేదు. మెదడులో ఉంటుంది. కాబట్టి ఇవేవీ సత్ఫలితాలు ఇవ్వకపోవచ్చు. ► ఇలాంటి సమస్యలు కనిపిస్తున్నప్పుడు, ఎంతోకాలం మందులు వాడి చూసినా గుణం కనిపించనప్పుడు చేయాల్సిందల్లా శాంతంగా బతకడం. మనసును ప్రశాంతపరచే మార్గాలను వెతకాలి. మన వంతు ప్రయత్నాలు మనం చేసినా, మనసుపై అదుపు సాధించలేనప్పుడే నిపుణులను సంప్రదించాలి. - ఇన్పుట్స్: డాక్టర్ కల్యాణ చక్రవర్తి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, హైదరాబాద్