లండన్: పొగతాగడం పలు వ్యాధులకు దారితీస్తుందని ఇప్పటికే నిర్ధారణ కాగా, తాజా పరిశోధన స్మోకింగ్ ఆరోగ్యానికి ఎంతటి చేటో వెల్లడించింది. సిగరెట్ తాగడం వల్ల జీర్ణాశయం వాపు సంభవించి తీవ్ర అనారోగ్యానికి కారణమవుతుందని తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు హెచ్చరించారు. కార్డియోవాస్కులర్ వ్యాధితో పాటు లంగ్ క్యాన్సర్‌కూ స్మోకింగ్ ప్రధాన కారణమని తక్షణమే దీన్ని వదిలివేయాలని స్మోకర్లకు సూచించారు. తాజా పరిశోధన జీర్ణకోశ వ్యాధుల చికిత్సలో నూతన మార్పులకు నాందిపలుకుతుందని నిపుణులు చెబుతున్నారు.
జీర్ణాశయం వాపుతో తీవ్ర పరిస్థితి తలెత్తుతుందని ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని తెలిపారు. స్మోకింగ్ వల్ల ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఎన్నో రెట్లు అధికమని శాస్ర్తవేత్తలు వెల్లడించారు. కడుపు నొప్పి, డయేరియా, బరువు తగ్గడం వీటి లక్షణాలని చెప్పారు. పొగతాగేవారు ముఖ్యంగా అజీర్ణంతో బాధపడేవారు తక్షణమే స్మోకింగ్‌కు స్వస్తిపలకాలని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment