వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనపడ్డప్పుడు జీర్ణ వ్యవస్థ ప్రధానంగా ఎదుర్కొనే సమస్యల్లో ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ ఒకటి. ఇది రెండు రకాలు. ఒకటి అల్సరేటివ్ కొలైటిస్, రెండోది క్రోన్స్ డిసీజ్.
జీర్ణవ్యవస్థలో వచ్చే ఈ సమస్యలోని ‘అల్సరేటివ్ కొలైటిస్’లో పెద్దపేగు లోపలి లైనింగ్‌లో ఇన్‌ఫ్లమేషన్ వస్తుంది. అప్పుడు అక్కడ పుండ్లు పడటం, కొన్నిసార్లు ఆ పుండ్ల నుంచి రక్తస్రావం కావచ్చు. ఆ భాగం మినహాయించి మిగతా జీర్ణవ్యవస్థలో మరెక్కడైనా ఇన్‌ఫ్లమేషన్ రావడాన్ని ‘క్రోన్స్ డిసీజ్’ అంటారు. అంటే నోరు మొదలుకొని, చిన్నపేగుల వరకు ఎక్కడైనా ఇన్‌ఫ్లమేషన్ రావడం వల్ల ఒక్కోసారి ఆ భాగం సన్నగా మారడం లేదా పుండ్లు పడటం జరగవచ్చు.
కారణాలు..
ఈ సమస్యలకు కారణాలు నిర్దిష్టంగా తెలియదు గానీ వ్యాధినిరోధక వ్యవస్థ బలహీనం కావడం వల్ల ఈ సమస్య వస్తుందని నిపుణులు భావిస్తున్నారు. జన్యుపరమైన అంశాలతోనూ, పర్యావరణ కారణాలతోనూ రావచ్చు. పొంగతాగడం క్రోన్స్ డిసీజ్‌కు దారితీయవచ్చని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది.
అల్సరేటివ్ కొలైటిస్ లక్షణాలు..
నీళ్లవిరేచనాలు
కడుపునొప్పి
జ్వరం
బరువు తగ్గడం
తరచూ మలద్వారం నుంచి రక్తం, బంక (మ్యూకస్) పడుతుండటం
కొన్నిసార్లు మలబద్దకం
ఇవిగాక... కీళ్ల నొప్పులు, కీళ్ల వాపు వంటి లక్షణాలు కూడా ఉంటే వ్యాధి తీవ్రంగా ఉందని భావించాలి.
క్రోన్స్ డిసీజ్ లక్షణాలు..
నీళ్ల విరేచనాలు
కడుపునొప్పి
తీవ్రమైన అలసట
నీరసం
నిస్సత్తువ
బరువు తగ్గడం
నోటి పొక్కులు
చర్మసమస్యలు
కళ్లు ఎర్రబారడం, మండడం
కొందరిలో మలద్వార సమస్యలైన ఫిస్టులా, మలద్వారం చీరుకు΄ోవడం, కుచించుకు΄ోవడం.
నిర్ధారణ పరీక్షలు..
కొలనోస్కోపీ
గ్యాస్ట్రో ఇంటస్టినల్ ఎండోస్కోపీ ∙రక్తపరీక్షలు, అవసరాన్ని బట్టి సీటీ స్కాన్, ఎమ్మారైలతోపాటు కొన్ని సందర్భాల్లో పెద్ద పేగు బయాప్సీ.
చికిత్స..
– అల్సరేటివ్ కొలైటిస్‌కు... కొన్ని మందులతో లక్షణాలు తగ్గించడంతోపాటు అవి మళ్లీ రాకుండా చూస్తారు. ఉదాహరణకు నొప్పి తగ్గడానికి వాడే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ వంటి వాటి వాడకం
– మందులు వాడినప్పటికీ లక్షణాలు తగ్గని కండిషన్‌ను రిఫ్రాక్టరీ అల్సరేటివ్ కొలైటిస్ అంటారు. వ్యాధినిరోధక వ్యవస్థ అతిగా స్పందించడం వల్ల ఇలా జరుగుతుందని గుర్తించినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ తాత్కాలికంగా మందగించేందుకు 6–మెర్కా΄్టోప్యూరిన్, అజాథియోప్రిన్ వంటి మందులూ, అప్పటికీ గుణం కనిపించక΄ోతే సైక్లోస్పోరిన్ వంటి మందులు వాడాలని సూచిస్తారు
శస్త్రచికిత్స..
– సమస్య ఎంతకీ తగ్గక΄ోతే అప్పుడు శస్త్రచికిత్స చేసి ప్రభావితమైన మేరకు పెద్దపేగు భాగాన్ని తొలగిస్తారు. అవసరమైతే దేహంలో మరెక్కడైనా (సాధారణంగా నడుము దగ్గర) మలద్వారం ఏర్పాటు చేసి, చిన్నపేగు చివరి భాగం అక్కడ తెరుచుకునేలా చూస్తారు.
– క్రోన్స్ డిసీజ్‌కు... ఇందులో జీర్ణవ్యవస్థలోని ఏ భాగమైనా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది కాబట్టి... నిర్దిష్టంగా ఏ భాగం ప్రభావితమైందన్న అంశాన్ని బట్టి చికిత్స అందిస్తారు.
ఈ వ్యాధికి చేసే చికిత్సల్లో కొన్ని...
– జీర్ణవ్యవస్థలోని వాపును తగ్గించడానికి 5–అమైనోశాల్సిలేట్స్ (5–ఏఎస్‌ఏ) అనే మందులూ, వాటితో ఫలితం కనిపించక΄ోతే అవసరాన్ని బట్టి యాంటీబయాటిక్స్ ఇస్తారు
– వీటితో గుణం కనిపించక΄ోతే అవసరాన్ని బట్టి పరిమిత కాలం పాటు ప్రెడ్నిసోన్, బ్యూడిసోనైడ్ వంటి స్టెరాయిడ్స్‌ను వైద్యులు సూచించవచ్చు
– లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ఇమ్యునో మాడ్యులేటర్స్ లేదా బయలాజిక్ రెస్పాన్స్ మాడిఫైయర్స్ అనే మందులను సూచిస్తారు.
ఆహారంతో అదుపు ఇలా...
– పాలు, పాల ఉత్పాదనలైన జున్ను, వెన్న, పెరుగు పుడ్డింగ్స్
– చాక్లెట్లు, పేస్ట్రీలు, కేకులు
– పల్లీలు ∙కృత్రిమరంగులు వాడిన ఆహారాలు
– పుల్లటి పండ్లు, పండ్ల రసాలు ∙మసాలాలు
– వేపుళ్లు, ఫాస్ట్‌ఫుడ్, చైనీస్ ఫుడ్స్
– కెచప్ క్యాబేజీ, బ్రాకలీ, క్యాలీఫ్లవర్
– బీన్స్, కందులు
– వేటమాంసం
– ఆల్కహాల్ కు పూర్తిగా దూరంగా ఉండాలి.
ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ (ఐబీడీ)తో పాటు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) అనే మరో సమస్యా ఉంది. తినగానే విరేచనానికి వెళ్లడం, కొందరిలో మలబద్ధకంతో బాధించే ఈ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్)లో తినగానే వెంటనే మల విసర్జనకు వెళ్లాల్సిరావడమనే ఇబ్బంది తప్ప పెద్దగా సమస్యలు బాధించక΄ోవచ్చు. ఐబీఎస్ (ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్), ఐబీడీ (ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్) రెండూ వేర్వేరనీ, అందులో ఐబీడీ తీవ్రమైనదని గుర్తించాలి.
(ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) వివరాలు పక్కనే...) – డా. కావ్య దెందుకూరి, కన్సల్టెంట్ హెపటాలజిస్ట్ – గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment