Digestive diseases
-
జీర్ణాశయాన్ని బాధించే.. ఈ సమస్యలోంచి బయటపడాలంటే?
జీర్ణాశయాన్ని బాధించే సమస్యలలో ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ (ఐబీడీ), ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’ అనే రెండూ ప్రధానమైనవి. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్‌లో తిన్న వెంటనే మలవిసర్జనకు వెళ్లాల్సి రావడమనే ఇబ్బంది తప్ప ‘ఐబీడీ’లాగా పెద్దగా ఇబ్బంది పెట్టే అంశాలేమీ ఉండవు. ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’ అంటే ఏమిటి, దాని లక్షణాలూ, దానిని అదుపులో ఉంచుకోవడం ఎలాగో తెలిపే కథనమిది.తినీ తినగానే వెంటనే టాయ్‌లెట్‌కు పరుగెత్తాలనిపించడం లేదా బయట ఎక్కడైనా తినాల్సి వస్తే అలా తినడానికి ముందే మరుగుదొడ్డి ఎక్కడుందో వెతుక్కోవాల్సి రావడం ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’ (ఐబీఎస్)లో ప్రధాన సమస్య. అందుకే ఈ సమస్య ఉన్నవారు బయట లంచ్ చేయడానికీ, ఎవరి ఇంటికైనా అతిథిగా హాజర య్యేందుకూ, విహార యాత్రలకు వెళ్లడానికీ వెనకాడుతుంటారు. అయితే మరికొందరిది దీనికి పూర్తిగా భిన్నమైన పరిస్థితి. వాళ్లను మలబద్ధకం వేధిస్తుంటుంది.ఈ అంశం ఆధారంగా ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’లో నాలుగు రకాలుంటాయి.ఐబీఎస్ రకాలు:– ఐబీఎస్ – డయేరియా (ఐబీఎస్–డీ): నీళ్లవిరేచనాలతో కడుపులో ఇబ్బంది. – ఐబీఎస్ – కాన్స్టిపేషన్ (ఐబీఎస్–సీ): మలబద్ధకంతో పాటు కడుపులో ఇబ్బంది. – ఐబీఎస్ – మిక్స్డ్ (ఐబీఎస్ – ఎమ్): కొన్నిసార్లు నీళ్లవిరేచనాలూ, మరికొన్నిసార్లు మలబద్ధకం... ఈ రెండు ఇబ్బందులూ మార్చి మార్చి వస్తుండడం. – ఐబీఎస్ – అన్–ఐడెంటిఫైడ్ (ఐబీఎస్–యూ): లక్షణాలు స్థిరంగా ఉండక మారుతుంటాయి.కారణాలు: నిర్దిష్టమైన కారణాలు లేవు. అయితే, జీర్ణాశయానికీ, మెదడుకు మధ్య ఏర్పడే కమ్యూనికేషన్ లోపాలే ఈ సమస్యకు ముఖ్య కారణాలుగా భావిస్తుంటారు. దాంతోపాటు పేగుల కదలికలలో లోపాలు, జీర్ణాశయపు నరాల్లో అతి చురుకుదనం, జీర్ణాశయం (గట్) బ్యాక్టీరియాలో మార్పుల వల్ల వచ్చే తేడాలు, కొందరిలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ల తర్వాత, మరికొందరిలో కొన్ని రకాల ఆహారాలు సరిపడక΄ోవడం, బాల్యంలో తీవ్రమైన ఒత్తిడులు ఎదుర్కోవడం వంటివి.లక్షణాలు:– విరేచనానికి వెళ్లగానే కడుపులోని ఇబ్బంది తొలగి΄ోవడం– లవిసర్జనలో విరేచనం అయ్యాక కూడా ఇంకా ఏదో మిగిలి ఉన్న ఫీలింగ్– కడుపులో గ్యాస్, కడుపు ఉబ్బరం– మలంలో బంక.నిర్ధారణ:– లక్షణాలను బట్టి నిర్ధారణ చేస్తారు.– కొన్ని సందర్భాల్లో కొన్ని రక్తపరీక్షలు, మల పరీక్షతో పాటు జీర్ణాశయంలో బ్యాక్టీరియా పెరుగుతోందేమో తెలుసుకోవడం కోసం ‘హైడ్రోజన్ బ్రెత్ టెస్ట్’ అనే పరీక్ష.చికిత్స:పీచు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలతో పాటు‘లో–ఫోడ్మ్యాప్’ఆహారం.లో–ఫోడ్మ్యాప్ ఆహారం అంటే...‘ఫర్మెంటబుల్ ఆలిగోశాకరైడ్స్, డై శాకరైడ్స్, మోనో శాకరైడ్స్ అండ్ పాలీయాల్స్’అనే రకాల ఆహార పదార్థాల మొదటి అక్షరాలను (ఇంగ్లిష్‌లోని) చేర్చడం ద్వారా ‘ఫోడ్మ్యాప్’ అనే మాటను రూ΄÷ందించారు. ఆహారాల్లోని ΄ోషకాల నిర్మాణాన్ని బట్టి, వాటిలోని చక్కెరలను బట్టి ఆ ఆహారాలను అలా పిలుస్తుంటారు. ఆ ఫోడ్మ్యాప్ డైట్ చార్ట్ ప్రకారం...తీసుకోవాల్సిన ఆహారాలు... అన్నం, ఓట్స్, గ్లూటెన్ ఫ్రీ బ్రెడ్; అరటి, నేరేడు, ద్రాక్ష, కివీ, నిమ్మ, బత్తాయి, నారింజ, బొ΄్పాయి, పైనాపిల్, స్ట్రాబెర్రీ; క్యారట్, దోస, అల్లం, మిరియాలు, లెట్యూస్, ఆలూ, పాలకూర, టొమాటో వంటివి. ్ర΄÷టీన్లలో చికెన్, ఫిష్, టోఫూ, నట్స్‌లో పల్లీలు, వాల్నట్స్.తీసుకోకూడనివి...పాస్తా, కేక్స్, బిస్కెట్లు, పండ్లలో పియర్స్, ప్రూన్, పీచెస్, చెర్రీస్ వంటివి, ఆకుకూరలలో బ్రాకలీ, కాలీఫ్లవర్, ఉల్లి, వెల్లుల్లి, బీట్రూట్, పప్పులలో బీన్స్, సోయాబీన్స్ మొదలైనవి.పాటించాల్సినవి...– నీళ్లు ఎక్కువగా తాగడం, క్రమబద్ధమైన వ్యాయామం, కంటినిండా నిద్ర ∙లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటే... మలబద్ధకం ఉన్నవారికి లాక్సెటివ్స్ అనే విరేచనకారి మందులూ, నీళ్లవిరేచనాలు అయ్యేవారికి యాంటీ డయేరియల్ మందులు, అవసరాన్ని బట్టి కొందరికి యాంటీ డిప్రెసెంట్స్, ఇంటెస్టినల్ స్పాజమ్స్, క్రాంప్స్ తగ్గించే మందులూ వాడాల్సి రావచ్చు. – డా. కావ్య దెందుకూరి, కన్సల్టెంట్ హెపటాలజిస్ట్ – గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ఇవి చదవండి: ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అంటే? -
ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అంటే?
వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనపడ్డప్పుడు జీర్ణ వ్యవస్థ ప్రధానంగా ఎదుర్కొనే సమస్యల్లో ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ ఒకటి. ఇది రెండు రకాలు. ఒకటి అల్సరేటివ్ కొలైటిస్, రెండోది క్రోన్స్ డిసీజ్.జీర్ణవ్యవస్థలో వచ్చే ఈ సమస్యలోని ‘అల్సరేటివ్ కొలైటిస్’లో పెద్దపేగు లోపలి లైనింగ్లో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. అప్పుడు అక్కడ పుండ్లు పడటం, కొన్నిసార్లు ఆ పుండ్ల నుంచి రక్తస్రావం కావచ్చు. ఆ భాగం మినహాయించి మిగతా జీర్ణవ్యవస్థలో మరెక్కడైనా ఇన్ఫ్లమేషన్ రావడాన్ని ‘క్రోన్స్ డిసీజ్’ అంటారు. అంటే నోరు మొదలుకొని, చిన్నపేగుల వరకు ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల ఒక్కోసారి ఆ భాగం సన్నగా మారడం లేదా పుండ్లు పడటం జరగవచ్చు.కారణాలు..ఈ సమస్యలకు కారణాలు నిర్దిష్టంగా తెలియదు గానీ వ్యాధినిరోధక వ్యవస్థ బలహీనం కావడం వల్ల ఈ సమస్య వస్తుందని నిపుణులు భావిస్తున్నారు. జన్యుపరమైన అంశాలతోనూ, పర్యావరణ కారణాలతోనూ రావచ్చు. పొంగతాగడం క్రోన్స్ డిసీజ్‌కు దారితీయవచ్చని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది.అల్సరేటివ్ కొలైటిస్ లక్షణాలు..నీళ్లవిరేచనాలుకడుపునొప్పిజ్వరంబరువు తగ్గడంతరచూ మలద్వారం నుంచి రక్తం, బంక (మ్యూకస్) పడుతుండటంకొన్నిసార్లు మలబద్దకంఇవిగాక... కీళ్ల నొప్పులు, కీళ్ల వాపు వంటి లక్షణాలు కూడా ఉంటే వ్యాధి తీవ్రంగా ఉందని భావించాలి.క్రోన్స్ డిసీజ్ లక్షణాలు..నీళ్ల విరేచనాలుకడుపునొప్పితీవ్రమైన అలసటనీరసంనిస్సత్తువబరువు తగ్గడంనోటి పొక్కులుచర్మసమస్యలుకళ్లు ఎర్రబారడం, మండడంకొందరిలో మలద్వార సమస్యలైన ఫిస్టులా, మలద్వారం చీరుకు΄ోవడం, కుచించుకు΄ోవడం.నిర్ధారణ పరీక్షలు..కొలనోస్కోపీగ్యాస్ట్రో ఇంటస్టినల్ ఎండోస్కోపీ ∙రక్తపరీక్షలు, అవసరాన్ని బట్టి సీటీ స్కాన్, ఎమ్మారైలతోపాటు కొన్ని సందర్భాల్లో పెద్ద పేగు బయాప్సీ.చికిత్స..– అల్సరేటివ్ కొలైటిస్‌కు... కొన్ని మందులతో లక్షణాలు తగ్గించడంతోపాటు అవి మళ్లీ రాకుండా చూస్తారు. ఉదాహరణకు నొప్పి తగ్గడానికి వాడే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ వంటి వాటి వాడకం– మందులు వాడినప్పటికీ లక్షణాలు తగ్గని కండిషన్‌ను రిఫ్రాక్టరీ అల్సరేటివ్ కొలైటిస్ అంటారు. వ్యాధినిరోధక వ్యవస్థ అతిగా స్పందించడం వల్ల ఇలా జరుగుతుందని గుర్తించినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ తాత్కాలికంగా మందగించేందుకు 6–మెర్కా΄్టోప్యూరిన్, అజాథియోప్రిన్ వంటి మందులూ, అప్పటికీ గుణం కనిపించక΄ోతే సైక్లోస్పోరిన్ వంటి మందులు వాడాలని సూచిస్తారుశస్త్రచికిత్స..– సమస్య ఎంతకీ తగ్గక΄ోతే అప్పుడు శస్త్రచికిత్స చేసి ప్రభావితమైన మేరకు పెద్దపేగు భాగాన్ని తొలగిస్తారు. అవసరమైతే దేహంలో మరెక్కడైనా (సాధారణంగా నడుము దగ్గర) మలద్వారం ఏర్పాటు చేసి, చిన్నపేగు చివరి భాగం అక్కడ తెరుచుకునేలా చూస్తారు.– క్రోన్స్ డిసీజ్‌కు... ఇందులో జీర్ణవ్యవస్థలోని ఏ భాగమైనా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది కాబట్టి... నిర్దిష్టంగా ఏ భాగం ప్రభావితమైందన్న అంశాన్ని బట్టి చికిత్స అందిస్తారు.ఈ వ్యాధికి చేసే చికిత్సల్లో కొన్ని... – జీర్ణవ్యవస్థలోని వాపును తగ్గించడానికి 5–అమైనోశాల్సిలేట్స్ (5–ఏఎస్ఏ) అనే మందులూ, వాటితో ఫలితం కనిపించక΄ోతే అవసరాన్ని బట్టి యాంటీబయాటిక్స్ ఇస్తారు– వీటితో గుణం కనిపించక΄ోతే అవసరాన్ని బట్టి పరిమిత కాలం పాటు ప్రెడ్నిసోన్, బ్యూడిసోనైడ్ వంటి స్టెరాయిడ్స్‌ను వైద్యులు సూచించవచ్చు– లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ఇమ్యునో మాడ్యులేటర్స్ లేదా బయలాజిక్ రెస్పాన్స్ మాడిఫైయర్స్ అనే మందులను సూచిస్తారు.ఆహారంతో అదుపు ఇలా...– పాలు, పాల ఉత్పాదనలైన జున్ను, వెన్న, పెరుగు పుడ్డింగ్స్– చాక్లెట్లు, పేస్ట్రీలు, కేకులు– పల్లీలు ∙కృత్రిమరంగులు వాడిన ఆహారాలు– పుల్లటి పండ్లు, పండ్ల రసాలు ∙మసాలాలు– వేపుళ్లు, ఫాస్ట్‌ఫుడ్, చైనీస్ ఫుడ్స్– కెచప్ క్యాబేజీ, బ్రాకలీ, క్యాలీఫ్లవర్– బీన్స్, కందులు– వేటమాంసం– ఆల్కహాల్ కు పూర్తిగా దూరంగా ఉండాలి.ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ (ఐబీడీ)తో పాటు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) అనే మరో సమస్యా ఉంది. తినగానే విరేచనానికి వెళ్లడం, కొందరిలో మలబద్ధకంతో బాధించే ఈ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్)లో తినగానే వెంటనే మల విసర్జనకు వెళ్లాల్సిరావడమనే ఇబ్బంది తప్ప పెద్దగా సమస్యలు బాధించక΄ోవచ్చు. ఐబీఎస్ (ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్), ఐబీడీ (ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్) రెండూ వేర్వేరనీ, అందులో ఐబీడీ తీవ్రమైనదని గుర్తించాలి. (ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) వివరాలు పక్కనే...) – డా. కావ్య దెందుకూరి, కన్సల్టెంట్ హెపటాలజిస్ట్ – గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ -
Health Tips: ఎసిడిటీ బాధలు వేధిస్తున్నాయా? వాము, ధనియాలు, తేనె.. ఇంకా..
ఎసిడిటీ సమస్య ఈ రోజుల్లో సాధారణమైపోయింది. అందుకు ప్రస్తుత జీవనశైలి ప్రధాన కారణమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎసిడిటీ వల్ల తరచుగా గుండె, కడుపు, గొంతులో మంట వంటి సమస్యలు సంభవిస్తాయి. ఒక్కోసారి తీవ్ర ఆనారోగ్యానికి కారణమౌతుంది. సమయానికి తినడం, బాగా నమలడం, భోజనం తర్వాత కనీసం అరగంట పాటు నిటారుగా కూర్చోవడం వంటి చిన్నపాటి అలవాట్లు ఆచరించడం ద్వారా దీని నుంచి బయటపడవచ్చు. అలాగే వంటగదిలో దొరికే కొన్ని పధార్ధాల ద్వారా ఎసిడిటీని నియంత్రించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.. వాము గింజలు వాములో బయోకెమికల్ థైమోల్ అనే క్రియాశీలక పధార్థం గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గించి, మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. స్పూన్ వాములో చిటికెడు ఉప్పు కలిపి తింటే తక్షణ ఉపశమనం ఉంటుంది. గ్లాస్ నీళ్లలో టీ స్పూన్ వాము కలిపి, ఒక గంట నినబెట్టి, రాత్రి నిద్రపోయే ముందు తాగినా ఫలితముంటుంది. సోంపు గింజలు భోజనం తర్వాత చిటికెడు సోపు గింజలు తీసుకోవడం పూర్వకాలం నుంచే సంప్రదాయంగా ఉంది. ఇది నోటి దుర్వాసన పోగొట్టడమేకాకుండా, మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. పిల్లల్లో తరచూ వచ్చే కడుపునొప్పి ఉపశమనానికి సోంపు, పటిక బెల్లం (రాక్ షుగర్) మిశ్రమం బాగా పనిచేస్తుంది. సోంపు గింజలతో చేసిన టీ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పాలు, పెరుగు పుల్లని త్రేన్పులకు చక్కటి విరుగుడు పాలు. గోరు వెచ్చని లేదా చల్లని పాలు ఎసిడిటీకి తక్షణ ఉపశమనాన్నిస్తాయి. పాలు సహజ యాంటాసిడ్‌లా పనిచేస్తుంది. పాలల్లో కాల్షియం లవణాలు అధికంగా ఉండటం వల్ల యాసిడ్‌ను వెంటనే తటస్థీకరిస్తుంది. ఎసిడిటీని నియంత్రించడానికి పెరుగు మరొక మార్గం. దీనిలో కాల్షియంతో పాటు, సహజమైన ప్రోబయోటిక్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియను అందిస్తుంది. తేనె గ్లాస్ నీళ్లలో టీస్పూన్ తేనె కలిపి తాగినా ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ మిశ్రమానికి కొంచెం నిమ్మరసం కలిపి తాగితే కడుపులో పుల్లని త్రేన్పులకు కారణయ్యే ఆమ్లాలను తలస్థీకరిస్తుంది. కొత్తమీర లేదా ధనియాలు కొత్తమీర విత్తనాల (ధనియాలు) పొడి లేదా కొత్తిమీర ఆకులు ఏ విధంగా తీసుకున్నా ఎసిడిటీని తగ్గిస్తుంది. 10 మీ.లీ కొత్తిమీర రసాన్ని, నీళ్లలో కానీ మజ్జిగలోగానీ కలిపి తాగితే వెంటనే ఉపశమనం పొందవచ్చు. కొత్తిమీర ఆకులతో తయారుచేసిన టీ కూడా తాగవచ్చు. కడుపు ఉబ్బరాన్ని నివరించడమేకాకుండా వాంతులు, విరేచనాల నియంత్రణకు చక్కగా పనిచేస్తుంది. తాజా పండ్లు సిట్రస్ పండ్లతో సహా అన్ని రకాల తాజా పండ్లు జీర్ణక్రియ మెరుగుపరచడమేకాకుండా, ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఫైబర్‌ను కూడా అందిస్తాయి. రోజూ రెండు తాజా పండ్లను తీసుకోవడం వల్ల ఎసిడిటీని నియంత్రించవచ్చు. చదవండి: ఎడమచేతివాటం వారు ఈ విషయాల్లో నిష్ణాతులట.. మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు..! -
కల్తీ ఆహారం..క్యాన్సర్ కారకం
ఆధునిక నగర జీవనం నేటి యువత జీవన ప్రమాణాలను ప్రమాదకర స్థితిలోకి నెట్టివేస్తోంది. వయసులో ఉన్నప్పుడు ఏమీ తెలియకపోయినా...నడి వయసుకు వచ్చేసరికే క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు బయటపడుతూ వారిని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా కృంగదీస్తున్నాయి. సమయపాలన లేని ఆహార నియమాలు, ఆహారంలో కల్తీ, జీవనశైలి మార్పులు క్యాన్సర్‌కు దారితీస్తున్నాయి. ఇటీవల కాలంలో నమోదవుతున్న క్యాన్సర్ కేసులు నిపుణులను సైతం ఆందోళన కలిగిస్తున్నాయి. మధ్య వయస్సులోనే అన్నవాహిక క్యాన్సర్, జీర్ణాశయ, పెద్దపేగు, గర్భాశయ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్టు ఇటీవల సర్వేల్లో వెల్లడైంది. దీనిపై ‘సాక్షి’ కథనం.. లబ్బీపేట(విజయవాడ తూర్పు): సమయపాలన లేని ఆహారపు అలవాట్లు కొంప ముంచుతున్నాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టుల్లో బిర్యానీలు లాగించేస్తుండడంతో తొలుత జీర్ణాశయ వ్యాధులు. అనంతరం క్యాన్సర్‌కు దారితీస్తున్నాయి. ఇటీవల నగరంలో నమోదవుతున్న క్యాన్సర్ కేసులు చూస్తుంటే ఆందోళన కలిగిస్తున్నట్టు వైద్యులు చెపుతున్నారు. నాలుగు పదుల వయస్సులోనే జీర్ణాశయ, పెద్దపేగు, లివర్ క్యాన్సర్ సోకుతున్నట్టు వైద్యులు చెపుతున్నారు. ఇప్పటికైనా అప్రమత్తం కాకుంటే రానున్న కాలంలో పెనుముప్పు పొంచి ఉన్నట్టు హెచ్చరిస్తున్నారు. గాంధీనగర్‌కు చెందిన 42 ఏళ్ల వ్యాపారి శ్రీనివాస్(పేరుమార్చాం) అర్ధరాత్రి వరకూ బిజినెస్ వ్యవహారాలు చూస్తుంటారు. అనంతరం తరచూ స్నేహితులతో కలిసి బయట ఎక్కువగా నాన్‌వెజ్ వంటకాలు తింటుంటారు. ఇటీవల తరచూ కడుపునొప్పి రావడం, అరుగుదల తగ్గడంతో వైద్యుని వద్దకు వెళ్లారు.అక్కడ పరీక్షలు జరిపి జీర్ణాశయ క్యాన్సర్ వచ్చినట్టు నిర్ధారించారు. ∙పశ్చిమ కృష్ణాకు చెందిన ఓ ఉద్యోగి వారంలో నాలుగు రోజులు బయట హోటళ్లలో భోజనం చేస్తుంటారు. నాన్‌వెజ్, బిర్యానీలు లాగించేస్తుంటారు. దీంతో అతనికి తరచూ కడుపునొప్పితో పాటు, విరోచనంలో రక్తం పడడంతో అనుమానం వచ్చి వైద్యుడిని సంప్రదించారు. పెద్ద పేగు క్యాన్సర్‌గా నిర్ధారించారు.ఇలా వీరిద్దరే కాదు.. ఇటీవల వైద్యులను సంప్రదిస్తున్న వారిలో పెద్దపేగు, జీర్ణాశయ, లివర్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా వస్తున్నట్టు చెపుతున్నారు. అందుకు కల్తీ ఆహారమే కారణంగా చెపుతున్నారు. కొంప ముంచుతున్న కల్తీ ఆహారం నాన్‌వెజ్ వంటకాలు ఆకర్షణీయంగా కనిపించేందుకు రసాయనాలు కలిసిన కారం పొడులు ఎక్కువగా వాడుతుంటారు.అంతేకాకుండా మృత జంతువుల కొవ్వు నుంచి తయారు చేసిన కల్తీ నూనెలు ఎక్కువగా వినియోగించి వంటలు చేస్తుండడంతో జీర్ణకోశ వ్యాధులు పెరుగుతున్నట్టు చెపుతున్నారు, ఫుడ్ కంట్రోల్ శాఖ వారు ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో కల్తీ ఆహారాన్ని గుర్తించడమే అందుకు నిదర్శనంగా చెపుతున్నారు. ఇప్పటికైనా బయట ఆహారం తినడం తగ్గించడం ఎంతో ఉత్తమం అని వైద్యులు సూచిస్తున్నారు. పెరిగిన గర్భాశయ క్యాన్సర్ మహిళల్లో ఒకప్పుడు బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదయ్యేవి. ప్రస్తుతం సర్వైకల్ క్యాన్సర్ కేసులు తగ్గగా, జీవనశైలి కారణంగా బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్టు క్యాన్సర్ వైద్య నిపుణులు చెపుతున్నారు. వీటితో పాటు గర్భాశయ క్యాన్సర్ కేసులు కూడా పెరుగుతున్నాయని వైద్యులు చెపుతున్నారు. ముందుచూపే మందు ఇటీవల కాలంలో జీర్ణాశయ, పెద్దపేగు క్యాన్సర్లు పెరిగాయి. అందుకు కల్తీ ఆహారం, నాన్‌వెజ్ ఎక్కువగా తీసుకోవడం కూడా కారణంగా చెప్పవచ్చు. ఆహార పదార్ధాలు కల్తీ అవుతున్న నేపథ్యంలో అత్యవసరమైతేనే బయట తినాలి. మాంసాహారంలో కలిపే రసాయనిక రంగులు క్యాన్సర్‌కు దారి తీస్తున్నాయి. మహిళల్లో శారీరక శ్రమ తగ్గడంతో రొమ్ము క్యాన్సర్‌తో పాటు, గర్భాశయ క్యాన్సర్ కేసులు అధికమయ్యాయి. పట్టణ వాసుల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి. క్యాన్సర్‌ను ముందు జాగ్రత్తల ద్వారానే నివారించగలుగుతాం. –డాక్టర్ ఎన్.సుబ్బారావు, మెడికల్ అంకాలజిస్ట్ -
విషం తాగుతున్నామా!
-
విషం తాగుతున్నామా!
జలమండలి నీటిలో ప్రమాదకరమైన ఈ-కొలి, కోలిఫాం బ్యాక్టీరియా ఏసిరెడ్డి రంగారెడ్డి: బొట్టుబొట్టులో హాలాహలం.. ప్రమాదకరమైన ఈ-కొలి, కోలిఫాం బ్యాక్టీరియా.. మంచినీరే కదా అని తాగారో.. అతిసారం, టైఫాయిడ్, న్యుమోనియా, జీర్ణకోశ వ్యాధులు తథ్యం! భాగ్యనగరానికి జలమండలి సరఫరా చేస్తున్న మంచినీటిలోకి ఓసారి తొంగిచూస్తే ఇన్ని రకాల జబ్బులు పలకరించాయి మరి!! ఆరోగ్యాన్ని కుప్పకూల్చే బ్యాక్టీరియాలు కుప్పలుతెప్పలుగా కనిపించాయి. ఒకటి కాదు రెండు కాదు.. నగరంలో 8.65 లక్షల నివాసాలకు జలమండలి మంచినీటి రూపంలో ఇలా హాలాహలాన్ని పంచుతోంది. నగరంలో కలుషిత జలాలపై స్వల్ప కాలంలోనే 647 ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో.. పలు ప్రాంతాల్లో జలమండలి సరఫరా చేస్తున్న మంచినీటిని ‘సాక్షి’ సేకరించింది. ఆ నీటిని ల్యాబ్‌లో పరీక్షించగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి. పలు బస్తీలు, కాలనీలకు సరఫరా చేస్తున్న జలంలో మానవ మలమూత్రాదుల్లో ఉండే కోలిఫాం, ఈ-కొలి, సిట్రోబ్యాక్టర్ బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. ఎల్బీనగర్, సికింద్రాబాద్, బహదూర్‌పురా, ముషీరాబాద్, చంచల్‌గూడ, కార్వాన్, మెహిదీపట్నం, సీతాఫల్మండి తదితర ప్రాంతాల నుంచి సేకరించిన నీటిలో ఈ విష కారకాలు ఉన్నట్టు వెల్లడైంది. నగరంలో అనేకచోట్ల మంచినీటి పైప్లైన్లు డ్రైనేజీ లైన్లతో కలిసిపోవటం, పలుచోట్ల లీకేజీలు, శుద్ధి కేంద్రాల్లో నిబంధనలను గాలికొదిలేయడంతో మంచినీళ్లు పూర్తిగా కలుషితమైపోతున్నాయి. చిత్త’శుద్ధి’ఏదీ?: హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్, సింగూరు, మంజీరా, కృష్ణా నీటిని శుద్ధిచేసి సరఫరా చేసేందుకు జలమండలి ఏటా సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రతి వెయ్యి లీటర్ల నీటి శుద్ధికి రూ.27 ఖర్చు చేస్తున్నారు. నగరంలో నాలుగు చోట్ల, మెదక్, నల్లగొండ జిల్లాల పరిధిలో మరో 12 చోట్ల ఫిల్టర్బెడ్లున్నాయి. ఈ నీటిని మహానగరానికి సరఫరా చేసేందుకు 250 స్టోరేజీ రిజర్వాయర్లున్నాయి. ఈ కేంద్రాల వద్ద నీటిశుద్ధి ప్రక్రియను గాలికొదిలేస్తున్నారు. పొరుగు జిల్లాల నుంచి నగరానికి నీటిని తరలించేందుకు 900 కి.మీ. మేర ట్రంక్మెయిన్ భారీ పైపులైన్లు, నగరవ్యాప్తంగా మరో 9 వేల కి.మీ. మేర పైపులైన్లు ఉన్నాయి. వీటికి తరచూ ఏదో ఓచోట లీకేజీలు ఏర్పడుతుండడంతో పైప్లైన్లలోకి మురుగు నీరు, చెత్తాచెదారం చేరుతోంది. ఇలా శుద్ధి చేయాలి.. జలాశయాల్లోని నీటిని(రా వాటర్) నాలుగు దశల్లో శుద్ధి చేయాలి. మొదటి దశ: క్లోరిన్, ఫెర్రిక్ సల్ఫేట్ రసాయనాలు కలిపి కెమికల్ ట్రీట్మెంట్ నిర్వహించాలి. రెండో దశ: నిల్వ ఉన్న నీటిలో ఆలం కలిపి అందులోని ఘన వ్యర్థాలు, ధూళి కణాలు రిజర్వాయర్ అడుగున చేరేలా చూడాలి. మూడో దశ: మంచినీటిని వివిధ ఫిల్టర్ల ద్వారా శుద్ధిచేయాలి. చిన్న, పెద్ద సైజు గులక రాళ్లు, సన్న ఇసుక, దొడ్డు ఇసుక, లేయర్స్ మీడియా ఫిల్టర్ల మీదుగా నీటి ప్రవాహం వెళ్లనివ్వాలి. నాలుగో దశ: బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద ప్రతి వెయ్యి లీటర్ల నీటికి 2 పీపీఎం, సర్వీసు రిజర్వాయర్ల వద్ద 1.5 పీపీఎం, వినియోగదారుడికి నల్లాల ద్వారా అందించే సమయంలో 0.2 పీపీఎం మోతాదులో క్లోరిన్ ఉండేలా చూడాలి. * కార్బోనేట్ ఫిల్టర్లను ఏర్పాటు చేసి నీటిని పూర్తి స్థాయిలో శుద్ధిచేయాలి. * ఫిల్టర్ బెడ్‌లోకి వచ్చిన నీటిలోకి ఆక్సిజన్‌ను అధిక మోతాదులో పంపితే నీటి నాణ్యత మెరుగుపడుతుంది. రంగు మటుమాయమౌతుంది. కాలుష్యానికి కారణాలెన్నో.. * ఫిల్టర్ బెడ్లు, స్టోరే జీ రిజర్వాయర్ల వద్ద నీటిని శుద్ధి చేసేందుకు ఆలం, క్లోరిన్, ఫెర్రిక్ సల్ఫేట్లను సరైన మోతాదులో కలపడం లేదు. క్షేత్రస్థాయి సిబ్బంది క్లోరిన్ గ్యాస్ సిలిండర్లు, ఇతర రసాయనాలను ప్రైవేటు వ్యక్తులకు, దళారులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. * ప్రతి స్టోరేజీ రిజర్వాయర్ వద్ద 600 కేజీల ఆలం, 36 కేజీల క్లోరిన్గ్యాస్ను కలిపి నీటిని శుద్ధి చేయాల్సి ఉన్నా ఆ నిబంధన పాటించడం లేదు. * మంచినీటిలోకి ఆక్సిజన్‌ను పంపే ఏరియేషన్ వ్యవస్థలు ఏర్పాటు చేయకపోవడం. నీటిలో రంగు పూర్తిగా పోవాలంటే నాన్ఫెర్రిక్ హైడ్రేటెడ్ లైమ్ కలపాలి. దీన్నీ గాలికొదిలేస్తున్నారు. * బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, సర్వీసు రిజర్వాయర్ల వద్ద క్లోరినేషన్ కోసం కేటాయించిన క్లోరిన్ గ్యాస్ సిలిండర్లు పక్కదారిపడుతున్నాయి. దీంతో తగు మోతాదులో క్లోరిన్ ను కలపడం లేదు. * నగరంలో 250 సర్వీసు రిజర్వాయర్లను సీజన్ మారగానే శుద్ధి చేయాల్సి ఉన్నా పట్టించుకోవడంలేదు. సుమారు 50 రిజర్వాయర్ల వద్ద అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. * మంచినీరు, డ్రైనేజీ పైప్లైన్లు అల్లుకుపోయిన ప్రాంతాల్లో లీకేజీల వల్ల మురుగు నీరు, మంచినీటి లైన్లలోకి ప్రవేశిస్తోంది. గ్రేటర్లో 1,500 బస్తీలు ఉండగా.. లీకేజీల వల్ల తరచూ 100 బస్తీలు కలుషిత జలాల బారిన పడుతున్నాయి. * నగరంలో యుద్ధప్రాతిపదికన 1,100 కిలోమీటర్ల మేర పురాతన మంచినీటి పైప్లైన్లు మార్చాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. * నీటి నాణ్యత తెలుసుకునేందుకు చేసే ఫిజికో కెమికల్, బ్యాక్టీరియాలజీ పరీక్షలను మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. * జలాశయాల నుంచి ఫిల్టర్‌బెడ్‌కు వచ్చే నీటికి కెమిక ల్, క్లోరిన్, బ్లీచింగ్, ఆలం, వైట్ పౌడర్లను సరైన మోతాదులో కలపకుండానే శుద్ధి చేస్తున్నారు. * గండిపేట క్యాండుట్ కాలువ నిజాంకాలం నాటిది. కొన్నిచోట్ల నాలాపై కప్పు లేకపోవడంతో చెత్తాచెదారం చేరుతోంది. * అనేక స్టోరేజీ రిజర్వాయర్ల వద్ద నీటిలో ఘన వ్యర్థాలు, ధూళి కణాలను తొలగించేందుకు ఫిల్టర్లు లేవు. పురాతన పైపులైన్ల వల్లే.. నగరంలో డ్రైనేజీ, మంచినీరు పైపులైన్లు పక్కపక్కనే ఉండ డం, చాలాచోట్ల 50 ఏళ్ల నాటి పైపులైన్ల కారణంగానే తరచూ జలాలు కలుషితమవుతున్నాయి. తక్ష ణం పురాతన పైపులైన్లు మార్చి స్టెయిన్లెస్ స్టీలు పైపులు వేస్తే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. - పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధి తాగడానికి పనికిరాదు ఈ-కొలి, కోలిఫాం బ్యాక్టీరియా ఆనవాళ్లున్న నీరు తాగడానికి పనికిరాదు. తాగితే తీవ్రమైన జీర్ణకోశ వ్యాధుల బారిన పడతారు. యూవీ ఫిల్టర్స్ ద్వారా శుద్ధిచేసిన నీటిని తాగితే మంచిది. - ఎనుముల రాజు, వాటర్ క్వాలిటీ అనలిస్ట్ జలమండలి వైఫల్యమే.. నగరవాసులకు స్వచ్ఛమైన నీటి ని సరఫరా చేయడంలో జల మండలి విఫలమవుతోంది. కలుషిత జలాలు జనం ఉసురు తీస్తున్నాయి. ఈ నీళ్లు తాగి అనారోగ్యానికి గురవుతున్నారు. స్వచ్ఛమైన తాగునీరు అందించే బాధ్య త ప్రభుత్వానిదే. జలమండలిపై నమ్మకం లేక జనం ఫిల్టర్ నీళ్లు కొనుక్కుంటున్నారు. -ప్రొఫెసర్ డి.నరసింహారెడ్డి, చేతనా సొసైటీ ఫర్ వాటర్ చీఫ్ మెంటార్ జీర్ణకోశ వ్యాధులు వస్తాయి కోలిఫాం, ఈ-కొలి బ్యాక్టీరియా ఉన్న నీళ్లు తాగి తే జీర్ణకోశ వ్యాధులు వస్తాయి. అతిసారం, టైఫాయిడ్, న్యుమోనియా వంటి వ్యాధులకు గురవుతారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణిలపై దీని ప్ర భావం అధికం. నల్లా నీరు కాచి చల్లార్చి తాగాలి. - డాక్టర్ బి.రమేష్,గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, ఉస్మానియా ఆస్పత్రి