జీర్ణాశయాన్ని బాధించే సమస్యలలో ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ (ఐబీడీ), ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’ అనే రెండూ ప్రధానమైనవి. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్‌లో తిన్న వెంటనే మలవిసర్జనకు వెళ్లాల్సి రావడమనే ఇబ్బంది తప్ప ‘ఐబీడీ’లాగా పెద్దగా ఇబ్బంది పెట్టే అంశాలేమీ ఉండవు. ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’ అంటే ఏమిటి, దాని లక్షణాలూ, దానిని అదుపులో ఉంచుకోవడం ఎలాగో తెలిపే కథనమిది.
తినీ తినగానే వెంటనే టాయ్‌లెట్‌కు పరుగెత్తాలనిపించడం లేదా బయట ఎక్కడైనా తినాల్సి వస్తే అలా తినడానికి ముందే మరుగుదొడ్డి ఎక్కడుందో వెతుక్కోవాల్సి రావడం ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’ (ఐబీఎస్)లో ప్రధాన సమస్య. అందుకే ఈ సమస్య ఉన్నవారు బయట లంచ్ చేయడానికీ, ఎవరి ఇంటికైనా అతిథిగా హాజర య్యేందుకూ, విహార యాత్రలకు వెళ్లడానికీ వెనకాడుతుంటారు. అయితే మరికొందరిది దీనికి పూర్తిగా భిన్నమైన పరిస్థితి. వాళ్లను మలబద్ధకం వేధిస్తుంటుంది.
ఈ అంశం ఆధారంగా ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’లో నాలుగు రకాలుంటాయి.
ఐబీఎస్ రకాలు:
– ఐబీఎస్ – డయేరియా (ఐబీఎస్–డీ): నీళ్లవిరేచనాలతో కడుపులో ఇబ్బంది.
– ఐబీఎస్ – కాన్‌స్టిపేషన్ (ఐబీఎస్–సీ): మలబద్ధకంతో పాటు కడుపులో ఇబ్బంది.
– ఐబీఎస్ – మిక్స్‌డ్ (ఐబీఎస్ – ఎమ్): కొన్నిసార్లు నీళ్లవిరేచనాలూ, మరికొన్నిసార్లు మలబద్ధకం... ఈ రెండు ఇబ్బందులూ మార్చి మార్చి వస్తుండడం.
– ఐబీఎస్ – అన్–ఐడెంటిఫైడ్ (ఐబీఎస్–యూ): లక్షణాలు స్థిరంగా ఉండక మారుతుంటాయి.
కారణాలు: నిర్దిష్టమైన కారణాలు లేవు. అయితే, జీర్ణాశయానికీ, మెదడుకు మధ్య ఏర్పడే కమ్యూనికేషన్ లోపాలే ఈ సమస్యకు ముఖ్య కారణాలుగా భావిస్తుంటారు. దాంతోపాటు పేగుల కదలికలలో లోపాలు, జీర్ణాశయపు నరాల్లో అతి చురుకుదనం, జీర్ణాశయం (గట్) బ్యాక్టీరియాలో మార్పుల వల్ల వచ్చే తేడాలు, కొందరిలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ల తర్వాత, మరికొందరిలో కొన్ని రకాల ఆహారాలు సరిపడక΄ోవడం, బాల్యంలో తీవ్రమైన ఒత్తిడులు ఎదుర్కోవడం వంటివి.
లక్షణాలు:
– విరేచనానికి వెళ్లగానే కడుపులోని ఇబ్బంది తొలగి΄ోవడం
– లవిసర్జనలో విరేచనం అయ్యాక కూడా ఇంకా ఏదో మిగిలి ఉన్న ఫీలింగ్
– కడుపులో గ్యాస్, కడుపు ఉబ్బరం
– మలంలో బంక.
నిర్ధారణ:
– లక్షణాలను బట్టి నిర్ధారణ చేస్తారు.
– కొన్ని సందర్భాల్లో కొన్ని రక్తపరీక్షలు, మల పరీక్షతో పాటు జీర్ణాశయంలో బ్యాక్టీరియా పెరుగుతోందేమో తెలుసుకోవడం కోసం ‘హైడ్రోజన్ బ్రెత్ టెస్ట్’ అనే పరీక్ష.
చికిత్స:
పీచు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలతో పాటు‘లో–ఫోడ్‌మ్యాప్’ఆహారం.
లో–ఫోడ్‌మ్యాప్ ఆహారం అంటే...
‘ఫర్మెంటబుల్ ఆలిగోశాకరైడ్స్, డై శాకరైడ్స్, మోనో శాకరైడ్స్ అండ్ పాలీయాల్స్’అనే రకాల ఆహార పదార్థాల మొదటి అక్షరాలను (ఇంగ్లిష్‌లోని) చేర్చడం ద్వారా ‘ఫోడ్‌మ్యాప్’ అనే మాటను రూ΄÷ందించారు. ఆహారాల్లోని ΄ోషకాల నిర్మాణాన్ని బట్టి, వాటిలోని చక్కెరలను బట్టి ఆ ఆహారాలను అలా పిలుస్తుంటారు. ఆ ఫోడ్‌మ్యాప్ డైట్ చార్ట్ ప్రకారం...
తీసుకోవాల్సిన ఆహారాలు...
అన్నం, ఓట్స్, గ్లూటెన్ ఫ్రీ బ్రెడ్; అరటి, నేరేడు, ద్రాక్ష, కివీ, నిమ్మ, బత్తాయి, నారింజ, బొ΄్పాయి, పైనాపిల్, స్ట్రాబెర్రీ; క్యారట్, దోస, అల్లం, మిరియాలు, లెట్యూస్, ఆలూ, పాలకూర, టొమాటో వంటివి. ్ర΄÷టీన్లలో చికెన్, ఫిష్, టోఫూ, నట్స్‌లో పల్లీలు, వాల్‌నట్స్.
తీసుకోకూడనివి...
పాస్తా, కేక్స్, బిస్కెట్లు, పండ్లలో పియర్స్, ప్రూన్, పీచెస్, చెర్రీస్ వంటివి, ఆకుకూరలలో బ్రాకలీ, కాలీఫ్లవర్, ఉల్లి, వెల్లుల్లి, బీట్‌రూట్, పప్పులలో బీన్స్, సోయాబీన్స్ మొదలైనవి.
పాటించాల్సినవి...
– నీళ్లు ఎక్కువగా తాగడం, క్రమబద్ధమైన వ్యాయామం, కంటినిండా నిద్ర ∙లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటే... మలబద్ధకం ఉన్నవారికి లాక్సెటివ్స్ అనే విరేచనకారి మందులూ, నీళ్లవిరేచనాలు అయ్యేవారికి యాంటీ డయేరియల్ మందులు, అవసరాన్ని బట్టి కొందరికి యాంటీ డిప్రెసెంట్స్, ఇంటెస్టినల్ స్పాజమ్స్, క్రాంప్స్ తగ్గించే మందులూ వాడాల్సి రావచ్చు. – డా. కావ్య దెందుకూరి, కన్సల్టెంట్ హెపటాలజిస్ట్ – గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్
ఇవి చదవండి: ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అంటే?
Comments
Please login to add a commentAdd a comment