digestive problem
-
జీర్ణాశయాన్ని బాధించే.. ఈ సమస్యలోంచి బయటపడాలంటే?
జీర్ణాశయాన్ని బాధించే సమస్యలలో ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ (ఐబీడీ), ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’ అనే రెండూ ప్రధానమైనవి. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్‌లో తిన్న వెంటనే మలవిసర్జనకు వెళ్లాల్సి రావడమనే ఇబ్బంది తప్ప ‘ఐబీడీ’లాగా పెద్దగా ఇబ్బంది పెట్టే అంశాలేమీ ఉండవు. ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’ అంటే ఏమిటి, దాని లక్షణాలూ, దానిని అదుపులో ఉంచుకోవడం ఎలాగో తెలిపే కథనమిది.తినీ తినగానే వెంటనే టాయ్‌లెట్‌కు పరుగెత్తాలనిపించడం లేదా బయట ఎక్కడైనా తినాల్సి వస్తే అలా తినడానికి ముందే మరుగుదొడ్డి ఎక్కడుందో వెతుక్కోవాల్సి రావడం ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’ (ఐబీఎస్)లో ప్రధాన సమస్య. అందుకే ఈ సమస్య ఉన్నవారు బయట లంచ్ చేయడానికీ, ఎవరి ఇంటికైనా అతిథిగా హాజర య్యేందుకూ, విహార యాత్రలకు వెళ్లడానికీ వెనకాడుతుంటారు. అయితే మరికొందరిది దీనికి పూర్తిగా భిన్నమైన పరిస్థితి. వాళ్లను మలబద్ధకం వేధిస్తుంటుంది.ఈ అంశం ఆధారంగా ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’లో నాలుగు రకాలుంటాయి.ఐబీఎస్ రకాలు:– ఐబీఎస్ – డయేరియా (ఐబీఎస్–డీ): నీళ్లవిరేచనాలతో కడుపులో ఇబ్బంది. – ఐబీఎస్ – కాన్స్టిపేషన్ (ఐబీఎస్–సీ): మలబద్ధకంతో పాటు కడుపులో ఇబ్బంది. – ఐబీఎస్ – మిక్స్డ్ (ఐబీఎస్ – ఎమ్): కొన్నిసార్లు నీళ్లవిరేచనాలూ, మరికొన్నిసార్లు మలబద్ధకం... ఈ రెండు ఇబ్బందులూ మార్చి మార్చి వస్తుండడం. – ఐబీఎస్ – అన్–ఐడెంటిఫైడ్ (ఐబీఎస్–యూ): లక్షణాలు స్థిరంగా ఉండక మారుతుంటాయి.కారణాలు: నిర్దిష్టమైన కారణాలు లేవు. అయితే, జీర్ణాశయానికీ, మెదడుకు మధ్య ఏర్పడే కమ్యూనికేషన్ లోపాలే ఈ సమస్యకు ముఖ్య కారణాలుగా భావిస్తుంటారు. దాంతోపాటు పేగుల కదలికలలో లోపాలు, జీర్ణాశయపు నరాల్లో అతి చురుకుదనం, జీర్ణాశయం (గట్) బ్యాక్టీరియాలో మార్పుల వల్ల వచ్చే తేడాలు, కొందరిలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ల తర్వాత, మరికొందరిలో కొన్ని రకాల ఆహారాలు సరిపడక΄ోవడం, బాల్యంలో తీవ్రమైన ఒత్తిడులు ఎదుర్కోవడం వంటివి.లక్షణాలు:– విరేచనానికి వెళ్లగానే కడుపులోని ఇబ్బంది తొలగి΄ోవడం– లవిసర్జనలో విరేచనం అయ్యాక కూడా ఇంకా ఏదో మిగిలి ఉన్న ఫీలింగ్– కడుపులో గ్యాస్, కడుపు ఉబ్బరం– మలంలో బంక.నిర్ధారణ:– లక్షణాలను బట్టి నిర్ధారణ చేస్తారు.– కొన్ని సందర్భాల్లో కొన్ని రక్తపరీక్షలు, మల పరీక్షతో పాటు జీర్ణాశయంలో బ్యాక్టీరియా పెరుగుతోందేమో తెలుసుకోవడం కోసం ‘హైడ్రోజన్ బ్రెత్ టెస్ట్’ అనే పరీక్ష.చికిత్స:పీచు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలతో పాటు‘లో–ఫోడ్మ్యాప్’ఆహారం.లో–ఫోడ్మ్యాప్ ఆహారం అంటే...‘ఫర్మెంటబుల్ ఆలిగోశాకరైడ్స్, డై శాకరైడ్స్, మోనో శాకరైడ్స్ అండ్ పాలీయాల్స్’అనే రకాల ఆహార పదార్థాల మొదటి అక్షరాలను (ఇంగ్లిష్‌లోని) చేర్చడం ద్వారా ‘ఫోడ్మ్యాప్’ అనే మాటను రూ΄÷ందించారు. ఆహారాల్లోని ΄ోషకాల నిర్మాణాన్ని బట్టి, వాటిలోని చక్కెరలను బట్టి ఆ ఆహారాలను అలా పిలుస్తుంటారు. ఆ ఫోడ్మ్యాప్ డైట్ చార్ట్ ప్రకారం...తీసుకోవాల్సిన ఆహారాలు... అన్నం, ఓట్స్, గ్లూటెన్ ఫ్రీ బ్రెడ్; అరటి, నేరేడు, ద్రాక్ష, కివీ, నిమ్మ, బత్తాయి, నారింజ, బొ΄్పాయి, పైనాపిల్, స్ట్రాబెర్రీ; క్యారట్, దోస, అల్లం, మిరియాలు, లెట్యూస్, ఆలూ, పాలకూర, టొమాటో వంటివి. ్ర΄÷టీన్లలో చికెన్, ఫిష్, టోఫూ, నట్స్‌లో పల్లీలు, వాల్నట్స్.తీసుకోకూడనివి...పాస్తా, కేక్స్, బిస్కెట్లు, పండ్లలో పియర్స్, ప్రూన్, పీచెస్, చెర్రీస్ వంటివి, ఆకుకూరలలో బ్రాకలీ, కాలీఫ్లవర్, ఉల్లి, వెల్లుల్లి, బీట్రూట్, పప్పులలో బీన్స్, సోయాబీన్స్ మొదలైనవి.పాటించాల్సినవి...– నీళ్లు ఎక్కువగా తాగడం, క్రమబద్ధమైన వ్యాయామం, కంటినిండా నిద్ర ∙లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటే... మలబద్ధకం ఉన్నవారికి లాక్సెటివ్స్ అనే విరేచనకారి మందులూ, నీళ్లవిరేచనాలు అయ్యేవారికి యాంటీ డయేరియల్ మందులు, అవసరాన్ని బట్టి కొందరికి యాంటీ డిప్రెసెంట్స్, ఇంటెస్టినల్ స్పాజమ్స్, క్రాంప్స్ తగ్గించే మందులూ వాడాల్సి రావచ్చు. – డా. కావ్య దెందుకూరి, కన్సల్టెంట్ హెపటాలజిస్ట్ – గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ఇవి చదవండి: ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అంటే? -
World Digestive Health Day: తిన్నది అరక్కపోతే తిప్పలే!
గుంటూరు మెడికల్: ఆధునిక జీవన శైలి వల్ల ఎక్కువ మంది జీర్ణక్రియ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ప్రతి ఏడాది డైజిస్టీవ్ సమస్యలు పెరిగిపోతున్నాయి. ప్రాథమిక దశలోనే వాటిని గుర్తించి అరికట్టకపోతే పెద్దపేగు క్యాన్సర్‌కు దారితీయవచ్చు. జీర్ణక్రియ సంబంధిత సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వరల్డ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆర్గనైజేషన్ ఫౌండేషన్ 2004 నుంచి మే 29న వరల్డ్ డైజిస్టివ్ డే (జీర్ణ ఆరోగ్య దినోత్సవం) నిర్వహిస్తున్నారు. ఈఏడాది కొలొరెక్టల్ క్యాన్సర్ (పెద్దపేగు క్యాన్సర్)పై అవగాహన కల్పించాలని డైజిస్టివ్డే సందర్భంగా నిర్ణయించారు. ఈసందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. తిన్న ఆహారం అరగకపోతే సమస్యలు.. జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా మనం తీసుకునే ఆహారం సరైన పద్ధతిలో తీసుకోకపోవడం వల్ల వస్తున్నాయి. తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం అవకపోవడం కూడా వ్యాధులు రావడానికి కారణమవుతోంది. తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణమైనప్పుడే శరీరంలోని వివిధ అవయవాలకు శక్తి లభిస్తోంది. జీర్ణవ్యవస్థ మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేసి అందులోని పోషకాలను రక్తంలోకి చేరుస్తోంది. రక్తం నుంచి కాలేయానికి అక్కడి నుంచి పోషకాలు శరీరంలోని వివిధ అవయవాలకు చేరడం ద్వారా మనిషికి శక్తి లభిస్తోంది. యాంత్రిక జీవనం వల్ల హడావుడిగా ఆహారం తీసుకోవడం, ఫాస్ట్ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, నిర్ణీత ఆహార వేళలు పాటించకుండా మసాలా దినుసులతో కూడిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉత్పన్నమవుతున్నాయి. జీవనశైలితో పెరుగుతున్న వ్యాధులు.. జీర్ణక్రియ సంబంధిత వ్యాధులు ఆధునిక జీవన శైలి వల్ల పెరుగుతున్నాయి. ఇంట్లో ఆహారం తయారు చేసుకుని తినకుండా ఎక్కువ శాతం హోటళ్లలో తినడం వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులు సంక్రమిస్తాయి. ఉద్యోగరీత్యా, చదువులు, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలతో ఎక్కువగా ఒత్తిడికి లోనవడం ద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పెద్దపేగు క్యాన్సర్‌కు దారి తీయొచ్చు... జీర్ణకోశ సంబంధిత సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స చేయకపోవడం ద్వారా అవి పెద్ద పేగు క్యాన్సర్‌కు దారి తీసే ప్రమాదం ఉంది. పెద్దపేగు క్యాన్సర్ సోకిన వారిలో ప్రాథమిక దశలో పొట్టకింద నొప్పి, పొట్టబిగపట్టడం, మలవిసర్జన సమయంలో నొప్పి, మలద్వారం నుంచి రక్తస్రావం అవడం, కొన్ని సార్లు ఎక్కువగా విరోచనాలు అవడం, బరువు తగ్గిపోవడం, అలసట, తదితర సమస్యలు కనిపిస్తాయి. జీజీహెచ్‌లో ఉచిత వైద్య సేవలు.. గుంటూరు జీజీహెచ్‌లో జీర్ణకోశ సంబంధిత సమస్యల బాధితులకు ఉచితంగా అత్యాధునిక వైద్య పరికరాలతో కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా వైద్య సేవలు అందిస్తున్నారు. వారంలో మంగళవారం, శుక్రవారం గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్య విభాగంలో వివిధ రకాల జీర్ణకోశ సంబంధిత సమస్యలతో బాధితులు చికిత్స కోసం వస్తున్నారు. ప్రతిరోజూ 300 మంది వివిధ రకాల సమస్యలతో వైద్యం కోసం వస్తున్నారు. జీర్ణకోశ సంబంధిత సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స చేయవచ్చని గ్యాస్ట్రో ఎంట్రాలజీస్టులు తెలియజేస్తున్నారు. జీజీహెచ్‌లో ఈ సమస్యలకు అత్యాధునిక ఆపరేషన్లు కూడా ఉచితంగా చేస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలు మేలు.. ఆహారం తిన్నవెంటనే ఎట్టిపరిస్థితుల్లోనూ నిద్రకు ఉపక్రమించకూడదు. సాధ్యమైంత మేర రాత్రి వేళల్లో త్వరితగతిన 9 గంటల్లోపు భోజనం చేయాలి. భోజనం చేసిన అనంతరం కొంతసేపు నడవడం ద్వారా జీర్ణక్రియ మెరుగు పడుతోంది. ఒత్తిడి, ఆందోళన లేకుండా యోగా, నడక, కొద్దిపాటి వ్యాయామాలు చేయాలి. జీర్ణ వ్యవస్థకు హాని కలిగించే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. – డాక్టర్ షేక్ నాగూర్‌బాషా, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు, గుంటూరు జీజీహెచ్ -
అధిక ప్రొటీన్లు తీసుకుంటున్నారా? ఈ సమస్యలు రావొచ్చు
సాక్షి, హైదరాబాద్: అధిక ప్రొటీన్లు, తక్కువ ఫైబర్ తీసుకోవడం ద్వారా జీర్ణకోశ సంబంధ సమస్యలకు దారితీస్తుంది. కోవిడ్ సోకిన సమయంలో వైద్యంతో పాటు సూచిస్తున్న ఆహారం, పోషకాల్లోని వ్యత్యాసాల వల్ల పలువురికి ఇలాంటి సమస్యలే తలెత్తుతున్నట్లు వైద్యులు గుర్తిస్తున్నారు. సమతుల ఆహారంతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని వారు సూచిస్తున్నారు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత అనేక మందిలో మలబద్ధకం, కడుపులో ఇబ్బందులు సర్వసాధారణంగా మారాయని ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలోని యూరాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్.ఆనంద్ పేర్కొన్నారు. దీనిద్వారా మలద్వారం దగ్గర పగుళ్లు, రక్తస్రావం వంటి సమస్యలతో కొందరు తమను సంప్రదిస్తున్నారని చెప్పారు. కరోనా నుంచి కోలుకున్నవారు ఇతరత్రా తీవ్రమైన సమస్యలేవీ లేకుండా మలబద్ధకం మాత్రమే ఉంటే వంటింటి వైద్యం ద్వారా ఉపశమనం పొందుతున్నారని తెలిపారు. తాత్కాలిక ఉపశమనం సంగతెలా ఉన్నా ఆహారంలో మార్పు చేర్పులు అవసరం అని సూచిస్తున్నారు. లిక్విడ్ డైట్, వాకింగ్ బెస్ట్.. ఆహారం ద్వారా ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే మలబద్ధకం సమస్యలు రావడం సాధారణమే. దీనికి విరుగుడుగా ఫైబర్, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఆహారంలో రోజుకు కనీసం 30 గ్రాముల ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. వాకింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలు, శారీరక శ్రమ ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. – జి.సుష్మ, సీనియర్ క్లినికల్ డైటీషియన్, కేర్ హాస్పిటల్స్ ఎక్కువైతే ముప్పే.. శరీరం సక్రమంగా తన విధులు నిర్వర్తించడానికి, వ్యాధి నిరోధక వ్యవస్థ పనితీరుకు రోజుకు ఒక వ్యక్తి తన శరీరం బరువులో ఒక కిలోకు 0.66 గ్రాముల ప్రొటీన్ అవసరం. అత్యధికంగా అది ఒక్క గ్రాము దాటకూడదు. రోజుకు 15 శాతం శక్తి (కేలరీలు)నిచ్చే హై ప్రొటీన్ ఆహారం సాధారణ పరిస్థితుల్లో వైద్యులు సూచించరు. అయితే కోవిడ్ చికిత్స సమయంలో తక్కువ ఫైబర్, అధిక ప్రోటీన్ ఉన్న ఆహారం చాలా మంది తీసుకున్నారు. దీంతో బాధాకరమైన మలవిసర్జన, పగుళ్లకు కారణమవుతుంది. ఎక్కువ రోజుల పాటు ఇలాగే ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు, మలబద్ధకమే కాకుండా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడొచ్చని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ డైరెక్టర్ ఆర్.హేమలత పేర్కొన్నారు. సమతుల ఆహారం క్షేమం ఎక్కువ ప్రోటీన్ కారణంగా వచి్చన సమస్యలను అధిగమించడానికి తగినంత ఫైబర్, తగినంత నీరు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కొన్ని స్టెరాయిడ్స్, యాంటీ బయాటిక్స్ సైతం ఆకలి పెరిగేందుకు కారణమవుతాయని పేర్కొంటున్నారు. దీంతో కోవిడ్ చికి త్స తర్వాత అధికంగా ఆహారం తీసుకునే అవకాశం లేకపోలేదు. అయితే ప్రొటీన్ ఎక్కువగా ఉన్నవి కాకుండా ఫైబర్, కార్బోహైడ్రేట్లు, యాం టీఆక్సిడెంట్లు ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు తప్పనిసరిగా దాన్ని బ్యాలెన్స్ చేసేందుకు తగినంత ఫైబర్ ఆహారం కూడా ఉండాలి. సైడ్ ఎఫెక్ట్స్ కూడా కారణమే.. ఏ రకమైన ఔషధం వల్లనైనా ఎసిడిటీ, అజీర్తి తదితర జీర్ణకోశ సంబంధ సమస్యలు అత్యంత సాధారణ దుష్ప్రభావాలు. జీర్ణకోశ సమస్యలు, ఎసిడిటీని ఎదుర్కోవటానికి తాము సాధారణంగా యాంటీయాసిడ్స్ సూచిస్తామని వైద్యులు చెబుతున్నారు. అయితే ఖాళీ కడుపుతో లేదా ఆహారం తర్వాత మందులు తీసుకోవాలా అనే విషయంలో రోగులకు స్పష్టత ఉండాలంటున్నారు. ఆకుకూరలు, పండ్లు, సలా డ్స్, మొలకలు, చిక్కుళ్లు వంటివి అధికమైన పీచు పదార్ధాలను తినాలని ఉంటాయి. అలాగే తృణ/చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, బీన్స్, పండ్లు, కూరగాయలు ద్వారా కూడా ఫైబర్‌ను పొందవచ్చు. పీచు తగినంత ఉండేలా చూసుకుంటే మలబద్ధకాన్ని నివారించడానికి, హృద్రోగ, డయాబెటిస్, పెద్ద ప్రేగు కేన్సర్లను అడ్డుకుంటుంది. -
పొట్టలో అల్సర్... తగ్గుతుందా?
నా వయసు 37 ఏళ్లు. ఇటీవల కడుపులో మంట, వికారంతో డాక్టర్ దగ్గరికి వెళ్తే పరీక్షలు చేయించి, అల్సర్ ఉందని చెప్పారు. నా సమస్యకు హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? – డి. రవిచంద్ర, నేలమర్రి ఇటీవలి ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల జీర్ణకోశ సమస్యలు ముఖ్యంగా గ్యాస్ట్రిక్ అల్సర్ వంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మన జీర్ణవ్యవస్థలో ఒక నిర్ణీత పరిమాణంలో ఆమ్లం (యాసిడ్) అవసరం. అందుకే ఆమ్లం ఎక్కువైతేనే కాదు... తక్కువైనప్పుడూ అల్సర్లు తయారవుతాయి. జీర్ణాశయంలో ఏర్పడే అల్సర్స్‌ను గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటారు. హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా కూడా అల్సర్స్‌కు కారణమవుతుంది. సాధారణంగా ఇతర ఏ బ్యాక్టీరియా అయినా కడుపులోని ఆమ్లంలో చనిపోతుంది. కానీ ఈ ఒక్క బ్యాక్టీరియా మాత్రమే ఆమ్లాన్ని తట్టుకొని జీవిస్తుంది. పైగా ఆమ్లం అధిక ఒత్తిడికి కూడా దోహదం చేస్తుంది. దాంతో జీర్ణశయంలో అల్సర్లు పెరుగుతాయి. కారణాలు: ∙80 శాతం మందిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల అల్సర్లు వస్తాయి ∙చాలామందిలో కడుపులో పుండ్లు రావడానికి హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా ముఖ్యమైనది ∙మానసిక ఒత్తిడి, కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ∙మద్యపానం, పొగతాగడం ∙వేళకు ఆహారం తీసుకోకపోవడం ∙కలుషితమైన ఆహారం, నీరు వంటి ద్వారా క్రిములు చేరి, అవి జీర్ణవ్యవస్థలో విషపదార్థాలను విడుదల చేసి పుండ్లు రావడానికి కారణమవుతాయి. లక్షణాలు: ∙కడుపులో నొప్పి, మంట, ఉబ్బరం ∙ఛాతీలో నొప్పి, పుల్లటి తేన్పులు, మలబద్దకం ∙తలనొప్పి, బరువు తగ్గడం, రక్త వాంతులు, రక్త విరేచనాలు ∙కొంచెం తిన్నా కడుపు నిండినట్లు ఉండటం, ఆకలి తగ్గడం ∙నోటిలో ఎక్కువగా నీళ్లు ఊరడం. నివారణ జాగ్రత్తలు: ∙పరిశుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవాలి ∙మద్యపానం, పొగతాగడం అలవాట్లు మానేయాలి ∙కారం, మసాలా ఆహారాల విషయంలో జాగ్రత్త వహించాలి ∙కంటి నిండా నిద్రపోవాలి ∙మానసిక ఒత్తిడి దూరం కావడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలి ∙ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. సమతులాహారం తీసుకోవాలి. చికిత్స: గ్యాస్ట్రిక్ అల్సర్‌కు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఆర్సనిక్ ఆల్బ్, యాసిడ్ నైట్రికమ్, మెర్క్‌సాల్, గ్రాఫైటిస్, ఫాస్ఫరస్ వంటి మందులు ఈ సమస్యకు చక్కగా పనిచేస్తాయి. అయితే అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వీటిని తీసుకోవాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ -
మావాడు తిననే తినడు...
చిన్నపిల్లలు అంటే పాలు తాగే పిల్లల దగ్గర్నుంచి పదీ, పన్నెండేళ్ల పిల్లల వరకూ వస్తారు. చంటిపిల్లలు పాలు తాగేసి, మళ్లీ కక్కినా పెద్దలు అంతగా బాధపడరు. ఎందుకంటే పిల్లలు అలా పాలు కక్కడం సాధారణమేననీ, ఇది మరీ అదేపనిగా జరుగుతుంటే ఆందోళన పడాలని అనుభవజ్ఞానంతో వారు చెబుతుంటారు. కానీ ఘనాహారం తీసుకుంటూ అది జీర్ణం కాకపోతేనే సమస్య. అయితే చాలామంది పిల్లల తల్లిదండ్రులది ఒకటే ఫిర్యాదు. అది... వాళ్ల చిన్నారి సరిగా ఆహారం తీసుకోడనీ, చాలా అరకొరగా తింటుంటాడని. ఈ నేపథ్యంలో ‘పిల్లలకు జీర్ణ సమస్య’ అనేది ఒకింత సంక్లిష్టమైన అంశం. అందుకే పిల్లల్లో ఆహారం జీర్ణం కాకపోతే వచ్చే సమస్యలూ, వాటి నివారణ అంశాలను తెలుసుకుందాం. పిల్లల్లో ఆహారం జీర్ణం కాకపోవడం, తిన్న తర్వాత ఆహారం పైకి తన్నడం వంటి లక్షణాలు పెద్దలతో పోలిస్తే చాలా తక్కువ. అయితే కొందరు పిల్లల్లోనూ పెద్దలలో కనిపించేలాంటి అజీర్తి సమస్యలు కనిపిస్తుంటాయి. దీని వల్ల పిల్లలూ బాధపడుతుంటారు. పెద్దల్లో కనిపించే గ్యాస్ పైకి తన్నడం, ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, ఒక్కోసారి జీర్ణం కాని ఆహారం మెతుకులు గొంతులోకి రావడం వంటి సమస్యను ‘జీఈఆర్డీ’ (గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్)గా పేర్కొంటారు. ఇదే సమస్యతో పిల్లలకూ, పెద్దలకూ ఒకేలాంటి లక్షణాలు కనిపిస్తున్నా పిల్లలలో వైద్యచికిత్స విషయంలోనూ లేదా ఈ సమస్యను అధిగమించడానికి అనుసరించాల్సిన ప్రక్రియలోనూ తేడా ఉంటుంది. పిల్లలలో అజీర్తికి కారణాలు చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు సరిగా తినడం లేదనీ, అవసరమైన మేరకు ఆహారం తీసుకోవడం లేదనే అపోహతో వారి పొట్ట సామర్థ్యానికి మించి ఆహారాన్ని బలవంతంగా కూరుతుంటారు. దాంతో వారి పొట్టలలో ఖాళీ స్థలమే లేకుండా పోతుంది. ఇది పిల్లల్లో అజీర్తికి ఒక కారణమవుతుంది. రాత్రి వేళల్లో పిల్లలు ఆడీ ఆడీ అలసిపోయి వచ్చాక అన్నం తినిపిస్తారు తల్లిదండ్రులు. అంతగా అలసిపోవడంతో పిల్లలు తిన్న వెంటనే పడుకోవడం వల్ల కూడా తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణం కాదు. దాంతో ఉదయం బ్రేక్‌ఫాస్ట్ సమయానికి పిల్లలు తగినంత ఆహారం తీసుకోలేరు. ఫలితంగా పిల్లలు సరిగా అన్నం తినడం లేదంటూ మళ్లీ తల్లిదండ్రుల ఫిర్యాదులు మొదలైపోతాయి. ఎలాంటి ఆహారాన్నైనా జీర్ణం చేసుకోగల సామర్థ్యం సాధారణంగా పిల్లలకు ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకొని తల్లిదండ్రులు అవసరానికి మించిన కొవ్వుపదార్థాలు, తీపిపదార్థాల్ని వాళ్లకు పెట్టడం వల్ల అజీర్తి సమస్యతో పాటు, పిల్లల్లో స్థూలకాయానికీ ఇది కారణం కావచ్చు. ఇక కొన్నిసార్లు పిల్లలకు ఏదైనా చిరుతిండ్లుగానీ, జంక్‌ఫుడ్ గానీ పెట్టాక అసలు భోజనం పెడతారు. అప్పుడు కూడా పిల్లల్లో అజీర్తి సమస్య ఎదురయ్యే అవకాశాలుంటాయి. పిల్లల అజీర్తి సమస్యల లక్షణాలు పిల్లలలో అజీర్తి సమస్యలు ఎదురైనప్పుడు... పక్కమీదికి ఒరగగానే వారికి వాంతులు కావడంతో పాటు మరికొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి. అవి... బరువు తగ్గడం అన్నం తినడానికి గట్టిగా నిరాకరిస్తూ ఉండటం ఆహారం తిన్న తర్వాత తీవ్రంగా దగ్గు రావడం గొంతుల నుంచి పిల్లికూతలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లల్లో కాస్తంత భిన్నంగా కనిపించే ఈ అజీర్తి లక్షణాలను గుర్తించినప్పుడు వారికి కొన్ని పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. పిల్లలకు చికిత్స పద్ధతులు... సాధారణంగా పిల్లల్లో అజీర్తి సమస్యను గమనించినప్పుడు కొందరు డాక్టర్లు వారికి సంప్రదాయ చికిత్స ప్రక్రియ అయిన ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ (పీపీఐ) మందులను రాస్తూ ఉంటారు. పెద్దలకూ, పిల్లలకూ ఒకేలా చికిత్స చేస్తుంటారు. కానీ పిల్లలకు సంప్రదాయ చికిత్సకు బదులుగా వారికి అవసరమైన చికిత్స చేయాల్సి ఉంటుందని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రీషియన్స్ పేర్కొంటోంది. పిల్లల విషయంలో పెద్ద పెద్ద చికిత్సలకు బదులు చిన్న చిన్న సూచనల ద్వారానే సమస్యలను దూరం చేయవచ్చని తెలియజేస్తోంది. ఆ జాగ్రత్తలివే... కాస్తంత పెద్ద పిల్లల విషయానికి వస్తే... వారు కెఫీన్ పాళ్లు ఎక్కువగా ఉండే చాక్లెట్లు, కూల్‌డ్రింక్స్ వంటి పదార్థాలను ఎక్కువగా తీసుకోకుండా చూడాలి.మసాలాలతో కూడిన ఆహారాలను ఎక్కువగా తీసుకోకుండా చూడాలి. పిల్లలు అధిక మోతాదులో చక్కెర తినకుండా చూడాలి. దానిలో భాగంగా వాళ్లకు ఏదో ఒకటి నములుతూ ఉండే అలవాటు ఉంటే... చక్కెర లేని చ్యూయింగ్ గమ్ నమిలేలా జాగ్రత్త తీసుకోవాలి. పిల్లలకు అనేక రకాల పోషకాలు అందేలా చూడాలి. కాయగూరలు, ఆకుకూరలనే రుచికరంగా, ఆరోగ్యకరంగా ఉండేలా అనేక రూపాల్లో (వేర్వేరు రెసిపీలుగా) వండి తినిపిస్తూ ఉండాలి. ఒకేరకమైన ఆహారం తినడాన్ని పిల్లలు అంతగా ఇష్టపడరు కాబట్టి... పోషకాలు పుష్కలంగా ఉండే అవే పదార్థాలను వేర్వేరు రీతుల్లో వండటం వల్ల పిల్లలు ఆసక్తికరంగా తింటారు. వాళ్లకు ఆరోగ్యమూ సమకూరుతుంది. అంతేగానీ పిల్లలకు పెద్దల రీతిలో పీపీఐ మందులు వాడటం, వాటితోనూ గుణం కనిపించకపోతే పెద్దలకోసం వాడే ప్రక్రియలను ఉపయోగించడం సరికాదు.పిల్లలకు ఒక పట్టాన ఆహారం జీర్ణం కాని పరిస్థితులు అదే పనిగా చాలా కాలం కొనసాగితే తప్పనిసరిగా డాక్టర్‌కు చూపించాలి. పిల్లలకు అందుబాటులో చాక్లెట్లు, క్యాండీలు, జంక్‌ఫుడ్స్‌కు బదులుగా బాదంపప్పు, వాల్నట్స్ వంటి పోషకాహారాలు అందేలా ఉంచండి{ఫిజ్‌లో కోలా డ్రింక్స్, కూల్‌డ్రింక్స్ వంటి వాటికి బదులు మజ్జిగ, మిల్క్ షేక్స్ వంటి ఆరోగ్యకరమైన ద్రవాహారాలను పిల్లలకు అందుబాటులో ఉంచండి. డాక్టర్ సేతుబాబు సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ - హెపటాలజిస్ట్ కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
బాబుకు ఈ వయసులోనే జీర్ణ సమస్య... తగ్గేదెలా?
మా అబ్బాయికి ఐదేళ్లు. ఇటీవల వాడికి ఏం తినిపించినా జీర్ణం కావడం లేదు. ఎప్పుడూ కడుపు ఉబ్బరంగా ఉంటోంది. ఏదైనా తినిపించిన కొద్దిసేపటికే వాంతులు చేసుకుంటున్నాడు. ఎప్పుడూ నీరసంగా ఉంటున్నాడు. వాడి విషయంలో మాకు తగిన సలహా ఇవ్వండి. - ఆర్. కుమార్, విజయవాడ చిన్న పిల్లలు వాంతులు చేసుకోవడం అన్నది తరచూ చూసే సమస్యే అయినా మీరు చెబుతున్నట్లుగా ఈ వయసులో అరుగుదలలో లోపాలు ఉండటం, కడుపు ఉబ్బరంగా ఉండటం, తిన్న వెంటనే వాంతులు కావడం అన్న విషయాలను కాస్త సీరియస్‌గానే పరిగణించాల్సిన అవసరం ఉంది. సాధారణంగా ఈ వయసు పిల్లల్లో... గాస్ట్రో ఎంటిరైటిస్, గ్యాస్ట్రో ఇంటస్టినల్ రిఫ్లక్స్, ఎక్కువగా తినేయడం, చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్, పొట్టలో అల్సర్స్, కొన్ని మెటబాలిక్ కండిషన్స్ వల్ల తరచూ ఈ తరహా లక్షణాలను చూస్తుంటాం. అలాగే మాల్ అబ్జార్ప్షన్ (అంటే తిన్నది సరిగా ఒంటబట్టకపోవడం) కూడా ఒక కారణం కావచ్చు. అయితే మీ అబ్బాయి విషయంలో అతడి సమస్యకు గ్యాస్ట్రో ఇంటస్టినల్ రిఫ్లక్స్ లేదా శరీర నిర్మాణపరమైన అడ్డంకులు (అంటే... పేగు తిరగబడటం లాంటి మాల్రొటేషన్, హయటస్ హర్నియా, కంజెనిటల్ బ్యాండ్) వంటివి కారణాలు కావచ్చా అని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. అందుకోసం కొన్ని రొటీన్ ఇవాల్యుయేషన్స్తో పాటు బేరియం మీల్ పరీక్షలు చేయించడం కూడా అవసరం. ఆ పరీక్షలతో చాలావరకు సమాచారం తెలుసుకోవచ్చు. పై విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మీరు ఒకసారి మీ పీడియాట్రీషియన్ లేదా గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌లను సంప్రదించి తగిన సూచనలు, చికిత్స తీసుకోండి. మా బాబుకు ఏడేళ్లు. పుట్టుకతోనే రక్తంలో తెల్లరక్తకణాలు లేవని డాక్టర్లు చెప్పారు. దాంతో తరచూ రక్తం ఎక్కిస్తూ తెల్లరక్తకణాలను భర్తీ చేయాల్సి వస్తోంది. మా బాబుకు ఇలా ఎన్నాళ్లు ఎక్కించాలి? అతడి కండిషన్‌కు శాశ్వత చికిత్స లేదా? దయచేసి మాకు తగిన సలహా ఇవ్వండి. - ఎమ్. నారాయణరావు, రాజమండ్రి మీరు చెప్పిన లక్షణాలను బట్టి, మీ బాబుకి థ్రాంబో సైటోపీనియా ఉన్నట్లు అందులోనూ... ఏమెగాకారియోసైటిక్ థ్రాంబోసైటోపీనియా అనే కండిషన్ ఉన్నట్లు అనిపిస్తోంది. ఈ కండిషన్ ఉన్నవాళ్లలో సాధారణంగా రక్తం గడ్డకట్టడంలో సమస్యలు ఉంటారుు. ఇది వురికొన్ని జన్యుపరమైన సవుస్యలతోనూ ఇది కలిసి ఉండవచ్చు. ఇలాంటి సవుస్య ఉన్నవారిలో దాదాపు 20 శాతం వుంది పిల్లల్లో ఇది ఎప్లాస్టిక్ అనీమియా అనే వురింత తీవ్రమైన పరిస్థితికి దారితీయువచ్చు. అంటే... సాధారణ అనీమియూలో ఎర్రరక్తకణాలు వూత్రమే తగ్గితే... ఈ ఎప్లాస్టిక్ అనీమియూలో రక్తంలోని అన్ని రకాల కణాలూ తగ్గుతారుు. అరుదుగా ఒక శాతం వుంది పిల్లల్లో ల్యూకేమియూ కూడా రావచ్చు. మీ బాబుకు పీడియూట్రిక్ హివుటాలజిస్ట్ ఆధ్వర్యంలో చికిత్స అందించండి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్