Gas trouble
-
జీర్ణాశయాన్ని బాధించే.. ఈ సమస్యలోంచి బయటపడాలంటే?
జీర్ణాశయాన్ని బాధించే సమస్యలలో ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ (ఐబీడీ), ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’ అనే రెండూ ప్రధానమైనవి. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్‌లో తిన్న వెంటనే మలవిసర్జనకు వెళ్లాల్సి రావడమనే ఇబ్బంది తప్ప ‘ఐబీడీ’లాగా పెద్దగా ఇబ్బంది పెట్టే అంశాలేమీ ఉండవు. ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’ అంటే ఏమిటి, దాని లక్షణాలూ, దానిని అదుపులో ఉంచుకోవడం ఎలాగో తెలిపే కథనమిది.తినీ తినగానే వెంటనే టాయ్‌లెట్‌కు పరుగెత్తాలనిపించడం లేదా బయట ఎక్కడైనా తినాల్సి వస్తే అలా తినడానికి ముందే మరుగుదొడ్డి ఎక్కడుందో వెతుక్కోవాల్సి రావడం ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’ (ఐబీఎస్)లో ప్రధాన సమస్య. అందుకే ఈ సమస్య ఉన్నవారు బయట లంచ్ చేయడానికీ, ఎవరి ఇంటికైనా అతిథిగా హాజర య్యేందుకూ, విహార యాత్రలకు వెళ్లడానికీ వెనకాడుతుంటారు. అయితే మరికొందరిది దీనికి పూర్తిగా భిన్నమైన పరిస్థితి. వాళ్లను మలబద్ధకం వేధిస్తుంటుంది.ఈ అంశం ఆధారంగా ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’లో నాలుగు రకాలుంటాయి.ఐబీఎస్ రకాలు:– ఐబీఎస్ – డయేరియా (ఐబీఎస్–డీ): నీళ్లవిరేచనాలతో కడుపులో ఇబ్బంది. – ఐబీఎస్ – కాన్స్టిపేషన్ (ఐబీఎస్–సీ): మలబద్ధకంతో పాటు కడుపులో ఇబ్బంది. – ఐబీఎస్ – మిక్స్డ్ (ఐబీఎస్ – ఎమ్): కొన్నిసార్లు నీళ్లవిరేచనాలూ, మరికొన్నిసార్లు మలబద్ధకం... ఈ రెండు ఇబ్బందులూ మార్చి మార్చి వస్తుండడం. – ఐబీఎస్ – అన్–ఐడెంటిఫైడ్ (ఐబీఎస్–యూ): లక్షణాలు స్థిరంగా ఉండక మారుతుంటాయి.కారణాలు: నిర్దిష్టమైన కారణాలు లేవు. అయితే, జీర్ణాశయానికీ, మెదడుకు మధ్య ఏర్పడే కమ్యూనికేషన్ లోపాలే ఈ సమస్యకు ముఖ్య కారణాలుగా భావిస్తుంటారు. దాంతోపాటు పేగుల కదలికలలో లోపాలు, జీర్ణాశయపు నరాల్లో అతి చురుకుదనం, జీర్ణాశయం (గట్) బ్యాక్టీరియాలో మార్పుల వల్ల వచ్చే తేడాలు, కొందరిలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ల తర్వాత, మరికొందరిలో కొన్ని రకాల ఆహారాలు సరిపడక΄ోవడం, బాల్యంలో తీవ్రమైన ఒత్తిడులు ఎదుర్కోవడం వంటివి.లక్షణాలు:– విరేచనానికి వెళ్లగానే కడుపులోని ఇబ్బంది తొలగి΄ోవడం– లవిసర్జనలో విరేచనం అయ్యాక కూడా ఇంకా ఏదో మిగిలి ఉన్న ఫీలింగ్– కడుపులో గ్యాస్, కడుపు ఉబ్బరం– మలంలో బంక.నిర్ధారణ:– లక్షణాలను బట్టి నిర్ధారణ చేస్తారు.– కొన్ని సందర్భాల్లో కొన్ని రక్తపరీక్షలు, మల పరీక్షతో పాటు జీర్ణాశయంలో బ్యాక్టీరియా పెరుగుతోందేమో తెలుసుకోవడం కోసం ‘హైడ్రోజన్ బ్రెత్ టెస్ట్’ అనే పరీక్ష.చికిత్స:పీచు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలతో పాటు‘లో–ఫోడ్మ్యాప్’ఆహారం.లో–ఫోడ్మ్యాప్ ఆహారం అంటే...‘ఫర్మెంటబుల్ ఆలిగోశాకరైడ్స్, డై శాకరైడ్స్, మోనో శాకరైడ్స్ అండ్ పాలీయాల్స్’అనే రకాల ఆహార పదార్థాల మొదటి అక్షరాలను (ఇంగ్లిష్‌లోని) చేర్చడం ద్వారా ‘ఫోడ్మ్యాప్’ అనే మాటను రూ΄÷ందించారు. ఆహారాల్లోని ΄ోషకాల నిర్మాణాన్ని బట్టి, వాటిలోని చక్కెరలను బట్టి ఆ ఆహారాలను అలా పిలుస్తుంటారు. ఆ ఫోడ్మ్యాప్ డైట్ చార్ట్ ప్రకారం...తీసుకోవాల్సిన ఆహారాలు... అన్నం, ఓట్స్, గ్లూటెన్ ఫ్రీ బ్రెడ్; అరటి, నేరేడు, ద్రాక్ష, కివీ, నిమ్మ, బత్తాయి, నారింజ, బొ΄్పాయి, పైనాపిల్, స్ట్రాబెర్రీ; క్యారట్, దోస, అల్లం, మిరియాలు, లెట్యూస్, ఆలూ, పాలకూర, టొమాటో వంటివి. ్ర΄÷టీన్లలో చికెన్, ఫిష్, టోఫూ, నట్స్‌లో పల్లీలు, వాల్నట్స్.తీసుకోకూడనివి...పాస్తా, కేక్స్, బిస్కెట్లు, పండ్లలో పియర్స్, ప్రూన్, పీచెస్, చెర్రీస్ వంటివి, ఆకుకూరలలో బ్రాకలీ, కాలీఫ్లవర్, ఉల్లి, వెల్లుల్లి, బీట్రూట్, పప్పులలో బీన్స్, సోయాబీన్స్ మొదలైనవి.పాటించాల్సినవి...– నీళ్లు ఎక్కువగా తాగడం, క్రమబద్ధమైన వ్యాయామం, కంటినిండా నిద్ర ∙లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటే... మలబద్ధకం ఉన్నవారికి లాక్సెటివ్స్ అనే విరేచనకారి మందులూ, నీళ్లవిరేచనాలు అయ్యేవారికి యాంటీ డయేరియల్ మందులు, అవసరాన్ని బట్టి కొందరికి యాంటీ డిప్రెసెంట్స్, ఇంటెస్టినల్ స్పాజమ్స్, క్రాంప్స్ తగ్గించే మందులూ వాడాల్సి రావచ్చు. – డా. కావ్య దెందుకూరి, కన్సల్టెంట్ హెపటాలజిస్ట్ – గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ఇవి చదవండి: ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అంటే? -
గ్యాస్ ట్రబుల్ కంట్రోల్ కావాలంటే.. ఇలా చేయండి!
గ్యాస్ కడుపులోకి చేరాక పొట్టఉబ్బరంగా అనిపించడం... కొన్నిసార్లు అది ఛాతీలోనొప్పి కలిగించడం, ఒక్కోసారి గుండెపోటుగా పొరబడటం... ఇలాంటి ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తుంది. ఈ సమస్యకు తేలికపాటి పరిష్కారాలివి... ∙ ఆహారాన్ని మెల్లమెల్లగా తినాలి. తినే సమయంలో గాలి మింగకుండా ఉండటం కోసం పెదవులు మూసి ఆహారాన్ని నమలాలి. తక్కువ తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు తినడం మంచిది. కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలు, బాగా వేయించిన పదార్థాలకూ దూరంగా ఉండాలి. పొగ, మద్యం అలవాట్లను మానేయాలి. రోజూ కనీసం రెండు లీటర్ల కంటే ఎక్కువగా మంచినీళ్లు తాగాలి. గ్యాస్ ఎక్కువగా ఉండే కూల్‌డ్రింక్స్, సోడాలు, కార్బొనేటెడ్ డ్రింక్స్ వంటి బీవరేజెస్‌కు దూరంగా ఉండాలి. గ్యాస్‌ను పెంచే వెజిటబుల్స్నూ, సిట్రస్ జాతికి చెందిన పండ్లను పరిమితంగా తీసుకోవాలి. పాలు, పాల ఉత్పాదనలతో కడుపు ఉబ్బరమై, పొట్టలో గ్యాస్ పెరిగితే ల్యాక్టోజ్ రహిత పాలు, పాల ఉత్పాదనలను తీసుకోవడం. బరువు పెరగకుండా చూసుకోవాలి. చురుగ్గా ఉంటూ, రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. (చదవండి: ఆరోగ్యవంతమైన వ్యక్తికి రోజూకి..అది జస్ట్ ఐదు గ్రాములే చాలట!) -
గ్యాస్ట్రబుల్ అని వెళ్తే.. షాక్ ఇచ్చిన డాక్టర్.. ఎంత పనిచేశాడంటే?
కర్నూలు(హాస్పిటల్): తనకు గ్యాస్ట్రబుల్ ఉందని, కడుపు ఉబ్బరంగా అనిపిస్తోందని వైద్యుని వద్దకు వెళితే స్కానింగ్ చేసి అపెండిక్స్ ఉందని ఆపరేషన్ చేశాడు ఓ డాక్టర్. తీరా సదరు రోగి కోలుకోకపోగా ఆపరేషన్ వికటించి తనువు చాలించాడు. మృతుని కుటుంబసభ్యులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నాగర్‌కర్నూలులోని కొల్లాపూర్‌కు చెందిన సుమంత్(28) బంగారు నగలు చేసే పనిలో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య లావణ్య, ఏడాది వయస్సున్న కుమారుడు ఉన్నాడు. కొంత కాలంగా అతనికి కడుపు ఉబ్బరం, కడుపులో మంటగా ఉండటంతో స్థానికంగా ఉండే ఆర్ఎంపీని కలిశాడు. అతని సలహాతో కర్నూలులోని ఎన్ఆర్ పేటలో ఉన్న మెడికేర్ హాస్పిటల్‌కు వెళ్లాడు. అక్కడి ఓ సర్జన్ అతన్ని పరీక్షించి స్కానింగ్ తీయించాడు. స్కానింగ్‌లో నీకు అపెండిక్స్ ఉందని, వెంటనే ఆపరేషన్ చేయాలని, లేకపోతే కడుపులోనే అపెండిక్ పగిలి అపాయం కలుగుతుందని చెప్పడంతో సుమంత్ ఆపరేషన్‌కు ఒప్పుకున్నాడు. దీంతో బుధవారం అతనికి సదరు ఆసుపత్రిలోనే ఆపరేషన్ చేశారు. అయితే రాత్రి అతనికి విపరీతమైన కడుపునొప్పి, ఆయాసం రావడంతో వైద్యులు వచ్చి చికిత్స చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎంత మొత్తుకున్నా డాక్టర్లు ఎవ్వరూ రాలేదని, గురువారం ఉదయం 7 గంటలకు భర్త మృతి చెందినట్లు భార్య లావణ్య చెప్పారు. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే సుమంత్ మృతి చెందాడని ఆరోపిస్తూ మృతదేహాన్ని ఆసుపత్రి ఎదుట ఉంచి ఆందోళన చేశారు. కర్నూలు రెండో పట్టణ పోలీసులు అక్కడికి చేరుకుని బాధితులతో పాటు ఆసుపత్రి యాజమాన్యాన్ని స్టేషన్‌కు తీసుకెళ్లి ఇరువర్గాలతో రాజీ చేసినట్లు సమాచారం. కాగా సదరు ఆసుపత్రికి వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఎలాంటి అనుమతులు ఇప్పటి వరకు లభించలేదు. తాత్కాలిక అనుమతి కూడా ఆసుపత్రికి లేదని, ఈ విషయమై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ డాక్టర్ బి. రామగిడ్డయ్య తెలిపారు. చదవండి: ప్రియుడి మైకంలో దారుణానికి ఒడిగట్టిన తల్లి.. -
పొట్టలో గ్యాస్!.. సమస్యను అధిగమించండిలా..
ఇది బయటకు చెప్పుకోలేని సమస్య. చాలా ఇబ్బంది కలిగిస్తుంది కూడా. పొట్టలోకి చేరిన గాలి... వస్తే అటు తేన్పు రూపంలో రావాలి... లేదా మలద్వారం నుంచి బయటకు పోవాలి. ఇలా జరగనప్పుడు కడుపులో గ్యాస్ చేరి, పొట్ట ఉబ్బరంగా అనిపించి, బాధితులు తీవ్రమైన సమస్యకు లోనవుతుంటారు. ఒక్కోసారి గ్యాస్ పెరగడం అనే అంశం ఛాతీలో నొప్పి కలిగించి, ఒక్కోసారి గుండెపోటు వచ్చిందేమోననే అనుమానంతో హాస్పిటళ్లకూ తిప్పుతుంది. ఈ గ్యాస్ సమస్యను అధిగమించడం ఎలాగో చూద్దాం. మనం ఏదైనా తినే సమయంలో మనకు తెలియకుండానే గాలినీ మింగుతుంటాం. అలా మన జీర్ణవ్యవస్థలోకి చేరిన ఆ గాలి ఆహారంలాగే... పెరిస్టాలిటిక్ చలనంతో ముందుకు వెళ్తూ ఉంటుంది. గొంతు కిందనే ఉండి తేన్పు రూపంలో వస్తే పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ పొట్టలోనే ఉన్నా లేదా తరచూ కింది నుంచి వెళ్తున్నా ఇబ్బందిగా ఉంటుంది. ఎవరెవరిలో ఎక్కువ...? ఎప్పుడూ ఏదో ఒకటి నములుతూ / చప్పరిస్తూ ఉండేవారు వేగంగా తినే/తాగేవారు గ్యాస్ ఎక్కువగా ఉండే కార్బొనేటెడ్ డ్రింక్స్ / కూల్‌డ్రింక్స్ ఎక్కువగా తాగేవారు పొగతాగేవారు, మద్యం అలవాటు ఉన్నవారు వదులుగా ఉండే కట్టుడుపళ్లు ఉన్నవారు ∙ బీన్స్, బ్రాకోలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ వంటి వెజిటబుల్స్ ఎక్కువగా తినేవారు ఐస్‌క్రీములు, పాల ఉత్సాదనలు ఎక్కువగా తీసుకునేవారు... వీళ్లందరిలోనూ పొట్టలో గ్యాస్ సమస్య ఎక్కువ. సమస్యను అధిగమించడం ఎలా? మెల్లగా తినడం: ఆహారం తీసుకునే సమయంలో గాలి నోట్లో పోకుండా చేయడం కోసం పెదవులను మూసి ఉంచి ఆహారాన్ని నమలడం. పొగతాగే అలవాటు మానేయడం . కట్టుడు పళ్లు ఉన్నవారు డెంటిస్ట్ సహాయంతో అవి సరిగా అమరేలా చూసుకోవడం∙ సోడాలు, కార్బొనేటెడ్ డ్రింక్స్, కూల్‌డ్రింక్స్, బీర్ వంటి బీవరేజెస్‌కు దూరంగా ఉండటం. గ్యాస్‌ను పెంచే వెజిటబుల్స్ / పండ్లను పరిమితంగా తీసుకోవడం. మేనేజ్మెంట్ / చికిత్స : కొవ్వు ఎక్కువగానూ ఉండేవీ, బాగా వేయించినవి వీలైనంతవరకు తీసుకోవడం, తీసుకోవాల్సి వస్తే పరిమితంగానే తినడం ∙పాలు, పాల ఉత్పాదనలతో కడుపు ఉబ్బరమై, పొట్టలో గ్యాస్ పెరిగితే ల్యాక్టోజ్ రహిత పాలు, పాల ఉత్పాదనలను తీసుకోవడం ∙తక్కువ తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు తినడం ∙పొగతాగడం పూర్తిగా మానేయడం; కాఫీ, టీ, బీర్ వంటికొన్ని ఆల్కహాల్ బీవరేజెస్‌కు దూరంగా ఉండటం ∙రోజూ కనీసం రెండు లీటర్ల కంటే ఎక్కువగా మంచినీళ్లు తాగడం. ∙బరువు పెరగకుండా చూసుకుంటూ, చురుగ్గా ఉంటూ, రోజూ వ్యాయామం చేయడం. మందుల విషయానికి వస్తే... బీన్స్ లేదా గ్యాస్‌ను పెంచే కూరగాయలతో భోజనం చేసినప్పుడు డాక్టర్ల సలహాతో అల్ఫా–గెలాక్టోసైడేజ్ మందులు తీసుకోవచ్చు. ∙కడుపులో గ్యాస్‌తో నొప్పి వస్తుంటే డాక్టర్ సలహా మేరకు సైమెథికోన్ వంటి మందులు వాడాలి. డాక్టర్ల సూచనల ప్రకారం మందులు వాడిన మూడు నెలల తర్వాత కూడా గ్యాస్ సమస్య తగ్గకపోతే పూర్తి స్థాయి పరీక్షలతో పాటు ఎండోస్కోపీ వంటివి చేయించాల్సి ఉంటుంది. -
పదే పదే గ్యాస్ వదలుతున్నాడంటూ...
-
గ్యాస్ వదలుతున్నాడంటూ...
వియన్నా : కొన్ని మనకు చెప్పి రావు. ఎంత నియంత్రించుకున్న అలాంటి వాటి విషయంలో మనమేం చెయ్యగలిగింది ఏం లేదు. సరిగ్గా అలాంటి సమస్యతో బాధపడుతున్న ఓ పెద్దాయన ఇక్కడ విమానంలో రచ్చ రచ్చ రేపాడు. పదే పదే గ్యాస్ వదులుతున్నాడంటూ ఓ వ్యక్తితో ప్రయాణికులు గొడవకు దిగగా.. ఏం చేయాలో పాలుపోనీ పైలెట్ జట్టు పీకున్నాడు. డచ్ ఎయిర్ లైన్స్ ట్రాంసవియాకు చెందిన ఓ విమానం దుబాయ్ నుంచి అమస్టర్‌డామ్‌కు ప్రయాణికులతో బయలుదేరింది. అయితే జీర్ణకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ ప్రయాణికుడు పదే పదే ‘గ్యాస్’ వదులుతుండటంతో ఇతరులకు ఇబ్బంది కలిగించింది. అదే వరుసలో కూర్చున్న ఇద్దరు మహిళలతోపాటు మరో ఇద్దరు అభ్యంతరం వ్యక్తం చేశారు. విమాన సిబ్బందికి ఈ విషయంపై ఫిర్యాదు చేయగా.. ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఆ నలుగురు సదరు పెద్దాయనతో గొడవకు దిగారు. ఈ వ్యవహారంతో ఏం చేయాలో పాలుపోనీ పైలెట్ వియన్నాలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. గొడవ పడ్డ నలుగురిని దించేసి.. ఆపై ఫ్లైట్ తిరిగి బయలుదేరినట్లు సమాచారం. అక్కడి నుంచి వారిని ప్రత్యామ్నయ మార్గంలో అమస్టర్‌డామ్‌కు తరలించినట్లు తెలుస్తోంది. అయితే ఇంత గొడవకు కారణమైన ఆ వ్యక్తిని తిరిగి ఫ్లైట్ ఎక్కించుకున్నారా? లేక అతన్ని కూడా దించేశారా? అన్న దానిపై స్పష్టత కొరవడింది. -
ముందుగా గుర్తిస్తే మేలు... అప్పుడు పెద్దపేగు క్యాన్సర్‌కు చిన్నపాటి చికిత్సే చాలు...
పేరుకూ, విధులకూ... ఈ రెండిటి విషయంలోనూ పెద్దది... పెద్దపేగు. దీన్నే ఇంగ్లిష్‌లో కోలన్ అంటారు. ఈ అవయవానికి క్యాన్సర్ వస్తే దాన్ని ‘కోలన్ క్యాన్సర్’ అని పిలుస్తారు. మనం తిన్న ఆహారంలో అన్ని పోషకపదార్థాలను ఒంటికి పట్టేలే చేసేవి చిన్న పేగులైతే... శరీరానికి అవసరమైన నీటిని, పొటాషియం లవణాలను, కొవ్వులో కరిగే విటమిన్లను ఒంటికి పట్టేలా చేసే బాధ్యత పెద్దపేగుదే. ఆ తర్వాత వ్యర్థాలను మల ద్వారం గుండా బయటికి పంపివేయడం కూడా దానిపనే. మలద్వారాన్ని రెక్టమ్ అంటారు. పెద్దపేగుకు క్యాన్సర్ వస్తే దాన్ని కోలన్ క్యాన్సర్ అని, మలద్వారానికీ అది సోకితే రెక్టల్ క్యాన్సర్ అనీ అంటారు. ఇప్పుడు ముందుగానే గుర్తిస్తే కోలన్ క్యాన్సర్‌కు సమర్థంగా చికిత్స చేయవచ్చు. క్యాన్సర్ సోకినప్పుడు పెద్దపేగుకు కండపెరిగినట్లుగా కొన్ని బొడిపెలు వస్తాయి. వాటినే పాలిప్స్ అని చెప్పవచ్చు. కొందరిలో ఎలాంటి బొడిపెలూ లేకుండా కూడా క్యాన్సర్ రావచ్చు. ఇది వంశపారంపర్యంగా రాదు. కాకపోతే తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు ఉంటే ఇది వచ్చే రిస్క్ కాస్త ఎక్కువ. అందుకే ఇలా వచ్చిన వారి పిల్లలకు 15 ఏళ్ల వయసు నుంచే తరచూ స్క్రీనింగ్ చేయడం అవసరం. ఎందుకంటే కోలన్ క్యాన్సర్‌ను ఎంత ముందుగా గుర్తిస్తే అంత బాగా నయమవుతుంది. లక్షణాలు / గుర్తించడం ఎలా... కోలన్ క్యాన్సర్ లక్షణాలు పెద్ద పేగులో క్యాన్సర్ వచ్చిన ప్రదేశం, దాని పరిమాణం, ఏయే భాగాలకు అది వ్యాపించింది వంటి అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. సాధారణ లక్షణాలు: మలద్వారం నుంచి రక్తస్రావం మలం, మలవిసర్జనలో మార్పులు అజీర్తి లేదా విరేచనాలు పొట్ట కింది భాగంలో నొప్పి, పట్టేసినట్లుగా ఉండటం, గ్యాస్ పోవడం జిగురుతో మలం రావడం అకారణంగా నీరసం, బరువు తగ్గడం ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్)... అయితే ఇక్కడ పేర్కొన్న లక్షణాల్లో అజీర్తి, మలబద్ధకం, నీళ్ల విరేచనాల వంటివి మనలోని చాలామందిలో కనిపించేవే. ముఖ్యంగా మల విసర్జనలో రక్తస్రావం అన్నది పైల్స్ (మూలశంక) వ్యాధి ఉన్నవారిలో చాలా సాధారణం. అయితే ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు, తగిన పరీక్షలు చేయించుకుని అది క్యాన్సర్ కాదని నిర్ధారణ చేసుకుని నిశ్చింతగా ఉండవచ్చు. ఒకవేళ క్యాన్సర్ అని తేలితే, ముందుగానే గుర్తిస్తారు కాబట్టి నయమయ్యే అవకాశాలు ఎక్కువే. అయితే ఆలస్యం చేసిన కొద్దీ క్యాన్సర్ ఒకచోటి నుంచి మరోచోటికి (అంటే కాలేయం వంటి కీలక భాగాలకు లేదా లింఫ్ గ్రంథులకు) పాకుతుంది. దీన్నే మెటస్టాసిస్ అంటారు. ఇలా క్యాన్సర్ గనక కాలేయానికి లేదా లింఫ్ గ్రంథులకు చేరితే అది చాలా ప్రమాదం. కాబట్టి లక్షణాలు కనిపించగానే పరీక్షలు చేయించుకోవడం ఎంతో మేలు. రిస్క్ ఫ్యాక్టర్లు : పెరిగే వయసు స్థూలకాయం డయాబెటిస్, ఫాస్ట్‌ఫుడ్, రెడ్‌మీట్ ఎక్కువగా తీసుకోవడం పీచు పదార్థాలు ఉండే ఆహారాన్ని తక్కువగా తీసుకోవడం పొగతాగడం మద్యపానం తల్లిదండ్రుల్లో ఎవరికైనా అంతకుమునుపే కోలన్ క్యాన్సర్ వచ్చి ఉండటం...ఇవీ సాధారణ రిస్క్ ఫ్యాక్టర్లు. సాధారణంగా కోలన్ క్యాన్సర్ 50 ఏళ్లు పైబడ్డాకే ఎక్కువగా కనిపిస్తుంది. అయితే పైన పేర్కొన్న రిస్క్‌ఫ్యాక్టర్లు ఉన్నప్పుడు చిన్న వయసులోనైనా రావచ్చు. నిర్ధారణ ఇలా... పైన పేర్కొన్న లక్షణాలు కనిపించినప్పడు వెంటనే తప్పనిసరిగా డాక్టర్‌ను కలవాలి. అప్పుడు డాక్టర్లు రోగిని భౌతికంగా పరీక్షించడంతోపాటు ఫ్యామిలీ, మెడికల్ హిస్టరీని అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి కొలనోస్కోపీ, బేరియమ్ అనీమా, ఎక్స్-రే వంటి పరీక్షలు చేస్తారు. కొలనోస్కోపీ అంటే సన్నటి గొట్టాన్ని మలద్వారంనుంచి లోపలికి ప్రవేశపెట్టి లోపల ఏవైనా కణుతులు ఉన్నాయేమో చూడటం. ఒకవేళ కణుతులు కనిపిస్తే వాటినుంచి చిన్న ముక్కను సేకరించి బయాప్సీ పరీక్షకు పంపుతారు. అక్కడ అవి క్యాన్సర్ కణాలా కాదా అన్న విషయాన్ని నిర్ధారణ చేస్తారు. బేరియమ్ మింగించి ఎక్స్‌రే తీస్తే క్యాన్సర్ ఉన్న ప్రదేశం నల్లగా కనిపిస్తుంది. ఇక స్టూల్ అక్కల్ట్ బ్లడ్ టెస్టింగ్ అనే చిన్న పరీక్ష ద్వారా కూడా దీన్ని సులువుగా నిర్ధారణ చేయవచ్చు. ఒకవేళ రెక్టమ్ (మలద్వారం)లోనే సమస్య ఉంటే దాన్ని వేలి ద్వారానే డాక్టర్లు చాలా సులువుగా గుర్తించగలరు. ఒకవేళ క్యాన్సర్ సోకినట్లు తెలిస్తే అప్పుడది ఏ మేరకు విస్తరించి ఉందో చూడటానికి పెట్ సీటీ స్కాన్ వంటి పరీక్షలు అవసరమవుతాయి. చికిత్స : పెద్దపేగు క్యాన్సర్‌కు చికిత్స అన్నది వ్యాధి దశను బట్టి ఉంటుంది. వ్యాధిని మొదట్లోనే గుర్తిస్తే రాడికల్ సర్జరీ అనే ప్రక్రియతో క్యాన్సర్ సోకిన భాగాన్ని తొలగిస్తారు. ఈ తరహా శస్త్రచికిత్సను ఇప్పుడు కీ-హోల్ (ల్యాపరోస్కోపిక్) ప్రక్రియ ద్వారా కూడా నిర్వహించవచ్చు. ఇలా చేసిన శస్త్రచికిత్సలో పూర్తిగా కోత అవసరం లేకుండా చిన్న గాటు మాత్రమే ఉంటుంది కాబట్టి రోగి వేగంగా కోలుకుంటాడు. ఒకవేళ కోలన్ క్యాన్సర్ అన్నది లింఫ్ గ్రంథులకూ పాకితే వాటినీ తొలగించాల్సి వస్తుంది. క్యాన్సర్ గనక మలద్వారాన్ని గట్టిగా బిగుసుకుపోయేలా ఉంచి, మలాన్ని బయటకు రాకుండా చేసే స్ఫింక్టర్కూ వ్యాప్తిస్తే దాన్ని కూడా తొలగించాల్సి వస్తుంది. అప్పుడు మలవిసర్జనకు వీలుగా పేగును బయటకు అమర్చాల్సిన శస్త్రచికిత్స కూడా చేయాల్సి ఉంటుంది. ఇక క్యాన్సర్ రకాన్ని బట్టి కీమోథెరపీ, రేడియోథెరపీ లేదా ఈ రెండూ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ క్యాన్సర్‌ను చివరిదశలో గుర్తిస్తే, కీమోథెరపీ, మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనే మందుల ద్వారా రోగి జీవితకాలాన్ని గణనీయంగా పెంచవచ్చు. నివారణ: దీని నివారణకు చేయాల్సిన పనులు చాలా సులభం. ఆరోగ్యకరమైన విసర్జక అలవాట్లు అంటే... రోజూ క్రమబద్ధంగా మల విసర్జనకు వెళ్లడం, అజీర్తి, గ్యాస్ ట్రబుల్ వంటివి లేకుండా చూసుకోవడం మంచిది. వేళకు సాఫీగా మలవిసర్జన జరగాలంటే శరీరానికి తగినంత వ్యాయామం, కదలికలు ఉండాలి. అందుకే తగినంత శారీరక శ్రమ చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉంటే పూర్తిగా మానేయాలి. ఇది కేవలం కోలన్ క్యాన్సర్‌కు మాత్రమే కాదు... అన్ని రకాల క్యాన్సర్లకూ నివారణ. ఇప్పుడు కోలన్ క్యాన్సర్ విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ముందుగా కనుగొంటే చికిత్స ద్వారా చాలా వరకు నయమవుతుంది. ఒకవేళ ఆలస్యంగా కనుగొన్నా జీవితకాలాన్ని చాలావరకు పొడిగించడం సాధ్యమవుతుంది. ఆహారం - ప్రాధాన్యం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో కోలన్ క్యాన్సర్‌ను నివారించడం సులువే. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం అంటే... కొవ్వులు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం, తాజా ఆకుకూరలను, పండ్లను ఎక్కువగా తీసుకోవడం, మాంసాహారాన్ని పరిమితంగా తినడం అందులోనూ కొవ్వు తక్కువగా ఉండే చికెన్, చేపలను మాత్రమే తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంలోనూ పీచు ఎక్కువగా ఉండే కాయధాన్యాల వంటివాటికి ఆహారంలో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. డాక్టర్ సిహెచ్.మోహనవంశీ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమేగా హాస్పిటల్స్, హైదరాబాద్ ఫోన్: 98480 11421