గ్యాస్ కడుపులోకి చేరాక పొట్టఉబ్బరంగా అనిపించడం... కొన్నిసార్లు అది ఛాతీలోనొప్పి కలిగించడం, ఒక్కోసారి గుండెపోటుగా పొరబడటం... ఇలాంటి ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తుంది.
ఈ సమస్యకు తేలికపాటి పరిష్కారాలివి... ∙
- ఆహారాన్ని మెల్లమెల్లగా తినాలి. తినే సమయంలో గాలి మింగకుండా ఉండటం కోసం పెదవులు మూసి ఆహారాన్ని నమలాలి. తక్కువ తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు తినడం మంచిది.
- కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలు, బాగా వేయించిన పదార్థాలకూ దూరంగా ఉండాలి.
- పొగ, మద్యం అలవాట్లను మానేయాలి.
- రోజూ కనీసం రెండు లీటర్ల కంటే ఎక్కువగా మంచినీళ్లు తాగాలి.
- గ్యాస్ ఎక్కువగా ఉండే కూల్‌డ్రింక్స్, సోడాలు, కార్బొనేటెడ్ డ్రింక్స్ వంటి బీవరేజెస్‌కు దూరంగా ఉండాలి. గ్యాస్‌ను పెంచే వెజిటబుల్స్‌నూ, సిట్రస్ జాతికి చెందిన పండ్లను పరిమితంగా తీసుకోవాలి.
- పాలు, పాల ఉత్పాదనలతో కడుపు ఉబ్బరమై, పొట్టలో గ్యాస్ పెరిగితే ల్యాక్టోజ్ రహిత పాలు, పాల ఉత్పాదనలను తీసుకోవడం.
- బరువు పెరగకుండా చూసుకోవాలి. చురుగ్గా ఉంటూ, రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
(చదవండి: ఆరోగ్యవంతమైన వ్యక్తికి రోజూకి..అది జస్ట్ ఐదు గ్రాములే చాలట!)
Comments
Please login to add a commentAdd a comment