పెరుగు ఆరోగ్యానికి మంచిదని తెలిసిందే. పెరుగులో కొందరు పంచదార కలిపి తింటే, ఉప్పు కలిపి మరికొందరు తింటుంటారు. గతవారం మనం పెరుగుతో కలిపి తినకూడని పదార్థాలేమిటో చెప్పుకున్నాం. పెరుగులో ఏయే పదార్థాలు కలిపి తింటే ఏయే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఈ వారం చూద్దాం.
జీలకర్రతో...
పెరుగు, జీలకర్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఒకవేళ మీరు అధిక బరువు సమస్యతో బాధపడుతుంటే, పెరుగుతో జీలకర్ర పోడిని కలిపి తింటే, దాని నుంచి మంచి ప్రయోజనం పోందుతారు. దీని కోసం ముందు జీలకర్రను కాస్త వేయించి, ఆ తర్వాత దానిని పెరుగులో కలుపుకుని తినాలి.
సైంధవ లవణంతో...
పెరుగు, సైంధవ లవణం కలిపి తింటే ఎసిడిటీ తగ్గుతుంది.
కోడి గుడ్డుతో...
పెరుగు, కోడిగుడ్డు కలిపి తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి మేలు జరుగుతుంది. మీకు పంటి నొప్పి ఉంటే, ఈ రెండు పదార్థాలను కలిపి తినండి. ఇది నోటి అల్సర్ల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. నల్ల ఉప్పుతో,,,నల్ల ఉప్పును పెరుగు లో కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు, కడుపునొప్పి తగ్గుతాయి.
వాముతో...
కొంత వాము తీసుకుని ఓ కప్పు పెరుగులో కలిపి తినాలి. దీనివల్ల నోటిపూత, పంటి నొప్పి, ఇతర దంత సంబంధ సమస్య లు తొలగుతాయి.
చక్కెరతో కలిపితే...
పెరుగు చక్కెర... ఈ రెండింటిని కలిపి తినడం వల్ల దగ్గు తగ్గుతుంది. వంటికి తక్షణ శక్తి లభిస్తుంది.
మిరియాల పోడితో...
ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే మలబద్దకం పోతుంది.
పండ్ల ముక్కలతో కలిపితే...
పెరుగులో తాజా పండ్లముక్కలు కలిపి తింటే వ్యాధి నిరోధకత పెరుగుతుంది.
తేనెతో...
పెరుగులో పోటీన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. తేనెలో రోగనిరోధక శక్తి సమృద్ధిగా ఉంటుంది. ఈ రెండు పోషకాలు కలిసి ఎముకలను దృఢపరుస్తాయి కాబట్టి ఎముకల నొప్పులు ఉన్నవారు పెరుగు, తేనె కలిపి తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పోందవచ్చు. ఇంకా బోలు ఎముకల వ్యాధి, రక్తం గడ్డకట్టడం, అతిసార, ఊబకాయం, కీళ్లనొప్పులు, గుండె, రక్త సంబంధిత వ్యాధులు నయం అవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment