ఆర్బీఐ, సెబీలతో మంత్రి మంతనాలు
Published Tue, Feb 7 2017 5:05 PM | Last Updated on Tue, Sep 5 2017 3:09 AM
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా, మార్కెట్ రెగ్యులేటరీ సెబీతో ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ భేటీ కాబోతున్నారు. ఫిబ్రవరి 11న ఇరు బోర్డులతో జైట్లీ భేటీ కాబోతున్నట్టు అధికార వర్గాలు చెప్పాయి. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన 2017-18 కేంద్ర బడ్జెట్లో తీసుకొచ్చిన వివిధ ఆర్థిక రంగ సంస్కరణలపై జైట్లీ వారితో చర్చించనున్నారు. అదేవిధంగా 2018 మార్చిలోపల ద్రవ్యలోటును జీడీపీలో 3.2 శాతానికి తగ్గించాలనే విషయంపై కూడా బోర్డు సభ్యుల ముందు చర్చకు రానుంది. స్టాక్ ఎక్స్చేంజ్లో ఆస్తి పునర్ నిర్మాణ కంపెనీలు జారీచేసిన సెక్యురిటీ రశీదులను లిస్టింగ్కు అనుమతివ్వాలనే ప్రతిపాదనపై కూడా బోర్డుల నిర్ణయం తీసుకోనున్నారు.
వచ్చే ఏడాదిలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోకి రూ.10వేల కోట్ల నగదును చొప్పించాలని ఆర్థికమంత్రి ప్రతిపాదించారు. అవసరమైతే మరింత పెంచుతామన్నారు. బ్రోకరేజ్ సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్ఫోలియో మేనేజర్లు, ఇతర మార్కెట్ మధ్యవర్తిత్వల రిజిస్ట్రేషన్కు కాగితరహిత ఆన్లైన్ మెకానిజంను మంత్రి ప్రకటించారు. ఆధార్తో డీమ్యాట్ అకౌంట్ల లింక్ను కూడా తీసుకొచ్చారు. ఈ విషయాలన్నింటిపైన బోర్డులతో మంత్రి చర్చించనున్నారు.
Advertisement
Advertisement