Sebi boards
-
నిధుల సమీకరణకు సెబీ దన్ను
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పలు నిబంధనలను సరళతరం చేసేందుకు నిర్ణయించింది. గురువారం నిర్వహించిన సమావేశంలో సెబీ బోర్డు కొన్ని మార్గదర్శకాలలో అవసరానికి అనుగుణమైన సవరణలు చేపట్టేందుకు అంగీకరించింది. దీనిలో భాగంగా నిధుల అవసరాలకుగాను భారీ కార్పొరేషన్లు చేపట్టే రుణ సెక్యూరిటీల జారీ నిబంధనలను సరళీకరించనుంది. అంతేకాకుండా కంపెనీలుకాని లిస్టెడ్ సంస్థలలో ఇన్వెస్టర్లు క్లెయిమ్ చేయని సొమ్మును ఇన్వెస్టర్ల పరిరక్షణ, ఎడ్యుకేషన్ ఫండ్(ఐపీఈఎఫ్)కు బదిలీ చేసే మార్గదర్శకాలనూ క్రమబద్ధీకరించనుంది. రీట్స్, ఇన్విట్స్ నుంచి అన్క్లెయిమ్డ్ నిధులను జమ చేయడంతోపాటు ఐపీఈఎఫ్ నుంచి రిఫండ్ విధానాలనూ సవరించనుంది. ఈ బాటలో నిబంధనల ప్రకారం ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్స్‌కు అర్హతల పెంపు, ఎక్స్పీరియన్స్ సాధించడంలో గడువును సైతం పెంచనుంది. 2025 సెప్టెంబర్‌వరకూ గడువును పెంచేందుకు సెబీ బోర్డ్ నిర్ణయించింది. సెక్యూరిటీల మార్కెట్లో కనిపిస్తున్న టెక్నలాజికల్ ట్రెండ్స్ తదితర విభిన్న ట్రెండ్స్‌పైనా సెబీ బోర్డు చర్చించింది. సెబీ సైతం మరింత ఆధునిక టెక్నాలజీ వినియోగంపై దృష్టి పెట్టనుంది. -
ఆర్బీఐ, సెబీలతో మంత్రి మంతనాలు
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా, మార్కెట్ రెగ్యులేటరీ సెబీతో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ భేటీ కాబోతున్నారు. ఫిబ్రవరి 11న ఇరు బోర్డులతో జైట్లీ భేటీ కాబోతున్నట్టు అధికార వర్గాలు చెప్పాయి. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన 2017-18 కేంద్ర బడ్జెట్లో తీసుకొచ్చిన వివిధ ఆర్థిక రంగ సంస్కరణలపై జైట్లీ వారితో చర్చించనున్నారు. అదేవిధంగా 2018 మార్చిలోపల ద్రవ్యలోటును జీడీపీలో 3.2 శాతానికి తగ్గించాలనే విషయంపై కూడా బోర్డు సభ్యుల ముందు చర్చకు రానుంది. స్టాక్ ఎక్స్చేంజ్లో ఆస్తి పునర్ నిర్మాణ కంపెనీలు జారీచేసిన సెక్యురిటీ రశీదులను లిస్టింగ్‌కు అనుమతివ్వాలనే ప్రతిపాదనపై కూడా బోర్డుల నిర్ణయం తీసుకోనున్నారు. వచ్చే ఏడాదిలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోకి రూ.10వేల కోట్ల నగదును చొప్పించాలని ఆర్థికమంత్రి ప్రతిపాదించారు. అవసరమైతే మరింత పెంచుతామన్నారు. బ్రోకరేజ్ సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్‌ఫోలియో మేనేజర్లు, ఇతర మార్కెట్ మధ్యవర్తిత్వల రిజిస్ట్రేషన్‌కు కాగితరహిత ఆన్లైన్ మెకానిజంను మంత్రి ప్రకటించారు. ఆధార్‌తో డీమ్యాట్ అకౌంట్ల లింక్‌ను కూడా తీసుకొచ్చారు. ఈ విషయాలన్నింటిపైన బోర్డులతో మంత్రి చర్చించనున్నారు.