వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) బిల్లు రాజ్యసభ ఆమోదం పొందడంతో వీలైనంత త్వరగా అమలు చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు మొదలుపెట్టింది. జీఎస్టీ అమలుకు ఏప్రిల్ 1, 2017ను లక్ష్యంగా నిర్ణయించిన కేంద్రం అందుకు పూర్తిస్థాయి రోడ్‌మ్యాప్‌ను గురువారం విడుదల చేసింది. పన్ను రేటుపై అందరికీ ఆమోదయోగ్య నిర్ణయమే తమ లక్ష్యమని ప్రకటించింది.