CBEC
-
హైదరాబాద్‌లో ఫారిన్ పోస్టాఫీస్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన విశ్వాస్ తయారీ రంగంలో వ్యాపారం ప్రారంభించాడు. మందులు, బలవర్ధకమైన పదార్థాల తయారీకి సంబంధించి చిన్న పరిశ్రమ ఏర్పాటు చేసుకున్నాడు. పోస్టాఫీస్‌ల ద్వారా పార్శిళ్లను ఎగుమతి చేస్తున్నాడు. అలాగే కొన్ని ముడి సరుకులను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాడు. పార్శిళ్ల రూపంలో జరిగే దిగుమతి ఎగుమతుల్లో పెద్ద చికాకు ఎదురైంది. హైదరాబాద్‌లో తపాలా శాఖకు సంబంధించి ఫారిన్ పోస్టాఫీస్ లేకపోవటంతో కస్టమ్స్ ఎగ్జామినేషన్ కోసం పార్శిళ్లను ముంబై పంపుతున్నాడు. కొన్ని పార్శిళ్ల క్లియరెన్సుకు పక్షం రోజుల నుంచి నెలకు పైబడి సమయం పడుతోంది. అలాగే కస్టమ్ డ్యూటీ ఎంత చెల్లించాలో ముందు తెలియక అప్పటికప్పుడు ముంబై పరుగెత్తాల్సి వస్తోంది. ఇది కేవలం విశ్వాస్ ఒక్కడి సమస్యే కాదు. చివరకు ఇతర దేశాల్లో ఉండే బంధువులకు పంపే పార్శిళ్లలో కూడా ఇదే సమస్య ఏర్పడుతోంది. దేశంలోనే ఓ ప్రధాన నగరంగా భాసిల్లుతున్న హైదరాబాద్‌కు ఇంతకాలం ఇదో సమస్య. ఈ సమస్య పరిష్కరించాలంటూ ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌కు స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. నగరంలో ఫారిన్ పోస్టాఫీస్ ఏర్పాటు చేసింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఇది పూర్తిస్థాయిలో పని ప్రారంభించనుంది. ఇప్పటివరకు ఆ నాలుగు చోట్లే.. దేశంలో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాల్లో మాత్రమే ఇవి అందుబాటులో ఉన్నాయి. వాటికి కొన్ని చొప్పున దేశాలను కేటాయించారు. ఆయా దేశాలకు ఎగుమతి కావాల్సిన, దిగుమతి కావాల్సిన పార్శిళ్లు ఆయా నగరాల్లోని ఫారిన్ పోస్టాఫీసులకు వెళ్లాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి అమెరికా, యూ రప్, గల్ఫ్ దేశాలకు ఎక్కువ పార్శిళ్లు ఎగుమతి అవుతాయి. ఇవి ముంబైకి వెళ్లాల్సి ఉంటుంది. ముంబైలో లక్షల సంఖ్యలో పార్శిళ్లు పేరుకుపోతుండటంతో రోజుల తరబడి, ఒక్కోసారి నెలల తరబడి జాప్యం జరుగుతోంది. ఈలోపు కొన్ని సరుకులు పాడైపోతున్నాయి. ఇది పెద్ద సమస్యగా పరిణమించింది. ఎట్టకేలకు రాజధానిలో.. ఈ సమస్యను గుర్తించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) దేశవ్యాప్తంగా అదనంగా ఫారిన్ పోస్టాఫీసులను ఏర్పాటు చేయాలంటూ 2016లో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో హైదరాబాద్‌ను కూడా చేర్చింది. కానీ దాని ఏర్పాటులో జాప్యం జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు తపాలా శాఖ సెంట్రల్ ఎక్సైజ్ విభాగంతో కలసి ఇప్పుడు ఫారిన్ పోస్టాఫీస్‌ను ఏర్పాటు చేసింది. నగరంలోని హుమాయూన్‌నగర్ తపాలా కార్యాలయంలో ఇందుకు కొంత స్థలాన్ని కేటాయించారు. ఇక్కడే సెంట్రల్ ఎక్సైజ్ విభాగం ప్రత్యేకంగా స్కానర్లను ఏర్పాటు చేసింది. ఇక నుంచి విదేశాలకు ఎగుమతయ్యే, విదేశాల నుంచి దిగుమతయ్యే పార్శిళ్లను ఇక్కడే తనిఖీ చేస్తారు. అవసరమైన వాటికి కస్టమ్ డ్యూటీ కట్టించుకుని డెలివరీకి వీలుగా తపాలా సిబ్బందికి అందిస్తారు. ఎగుమతులకు ప్రోత్సాహం.. నగరం ఇప్పుడు ఎన్నో ఉత్పత్తులకు హబ్‌గా మారుతోంది. శివారు ప్రాంతాల్లో తయారీ రంగం విస్తరిస్తోంది. ఫార్మాతోపాటు చాలా వస్తువులు ఇక్కడ ఉత్పత్తవుతున్నాయి. వీటిల్లో తక్కువ పెట్టుబడితో చిన్నస్థాయి తయారీ యూనిట్లు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఈ ఉత్పత్తుల్లో చాలా వరకు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. పెద్దపెద్ద యూనిట్లు షిప్పింగ్ ద్వారా ఎగుమతి చేస్తుండగా.. చిన్నచిన్న తయారీ యూనిట్లు మాత్రం తపాలా ద్వారా పార్శిళ్ల రూపంలో పంపుతోంది. ఇంతకాలం ఫారిన్ పోస్టాఫీసు లేకపోవటంతో ఎగుమతుల్లో తీవ్ర జాప్యం జరుగుతూ వారంతా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఇక్కడే ఫారిన్ పోస్టాఫీసు ఏర్పాటు అవటంతో జాప్యం బాగా తగ్గి ఎగుమతులు భారీగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. నగరం నుంచి నిత్యం వేల సంఖ్యలో పార్శిళ్లు ఎగుమతవుతున్నాయి. ఆ సంఖ్య బాగా పెరిగి ఎగుమతులకు ప్రోత్సాహం లభించినట్లవుతుంది. విదేశాలకు నిత్యం వేలల్లో పార్సిళ్లు.. నగరం నుంచి నిత్యం వేల సంఖ్యలో విదేశాలకు పార్శిళ్లు ఎగుమతవుతుంటాయి. అంతకంటే ఎక్కువ సంఖ్యలో విదేశాల నుంచి దిగుమతి అవుతుంటాయి. దేశాల మధ్య సరఫరా అయ్యే ఈ పార్శిళ్లన్నింటిని కచ్చితంగా కస్టమ్స్ ఎక్సైజ్ విభా గం తనిఖీ చేయాల్సి ఉంటుంది. వాటిల్లో నిషేధిత వస్తువులు, సరుకులు ఎగుమతి, దిగుమతి కాకుం డా నిరోధించటంలో భాగంగా ఈ తనిఖీ తప్పనిసరి. పార్శిళ్లను బుక్ చేసే వారు వాటిల్లో ఉన్న వస్తువుల వివరాలు పేర్కొంటూ డిక్లరేషన్ ఇస్తారు. డిక్లరేషన్‌లో పేర్కొన్న వస్తువులే అందులో ఉన్నాయో లేదో తెలుసుకోవాలంటే కచ్చితంగా యంత్రాలతో స్కాన్ చేయాల్సిందే. నిబంధనల ప్రకారమే దిగుమతి, ఎగుమతి ప్రక్రియ సాగుతోందని స్పష్టమైన తర్వాతే వాటిని తరలించేందుకు కస్టమ్స్ సెంట్రల్ ఎక్సైజ్ విభాగం అధికారులు పచ్చజెండా ఊపుతారు. అవసరమైతే కస్టమ్ డ్యూటీ కట్టించుకుంటారు. కానీ హైదరాబాద్‌లో ఇప్పటివరకు ఫారిన్ పోస్టాఫీస్ లేకపోవటంతో స్థానికంగా ఈ ప్రక్రియకు వీల్లేకుండా పోయింది. -
ఐటీ నెత్తిన టాక్స్ పిడుగు: స్పందించిన కేంద్రం
సాక్షి: న్యూఢిల్లీ: దేశీయ ఐటీ రంగంపై పడిన టాక్స్ బాంబుపై కేంద్రం స్పందించింది. ఐటీ, ఐటీ ఆధారిత సేవలను అందించే కంపెనీలను ఆదుకునేందుకు రంగంలోకి దిగింది. దాదాపు రెండువందలకు పైగా కంపెనీలకు షాకిస్తూ జరిమానాతో సహా భారీ ఎత్తున సేవాపన్ను చెల్లించాలంటూ జారీ అయిన నోటీసుల పరిశీలనకు దిగింది. దీనిపై సవివరమైన నివేదిక సమర్పించాల్సిందిగా సంబంధిత అధికారులకు అదేశాలు జారీ చేసింది. రూ.10వేల కోట్ల మేర సర్వీస్ టాక్స్ చెల్లించాలంటూ ఇండియాలోని 200 ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలకు నోటీసులు జారీ కావడంతో సెంట్రల్ బోర్డ్ అఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) రంగంలోకి దిగింది. దీని ద్వారా ప్రభావితమైన కంపెనీల పేర్లు, సేవలందించిన ప్రదేశాలు తదితర వివరాలతో కూడిన వివరణాత్మక నివేదికను సిద్ధం చేయాలని పత్యక్ష పన్నుల కమిషనర్‌ను కోరింది. కాగా గత ఐదేళ్ళలో విదేశాలకు సాఫ్ట్వేర్ సేవలను ఎక్స్పోర్ట్ చేసి.. తద్వారా పొందిన ప్రయోజనాల రిటర్న్స్ దాఖలు చేయాల్సిందిగా ఇండియాలోని ఐటీ కంపెనీలకు నోటీసులు జారీ అయ్యాయి. దీంతో అసలే సంక్షోభంలో పడిన దేశీయ ఐటీరంగంపై ఏకంగా పదివేల కోట్ల మేర సర్వీస్ ట్యాక్స్ భారం మరింత కలకం రేపింది. అటు దీని ప్రభావం ఐటీ రిక్రూట్ మెంట్ మీద పడే ప్రమాదం ఉందన్న ఆందోళన కూడా నెలకొంది. -
జీఎస్టీ హెల్ప్‌లైన్ నెంబర్లు..
స్వాతంత్య్ర భారత చరిత్రలో అతిపెద్ద పన్ను సంస్కరణ జీఎస్టీ శుక్రవారం అర్థరాత్రి 12 గంటలకు ఎంతో అట్టహాసంగా లాంచ్ అయింది. పార్లమెంట్ సెంట్రల్ హాలు వేదికగా లాంచ్ అయిన జీఎస్టీ నేటి నుంచి అమల్లోకి వచ్చేసింది. ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్ అంటూ 1.3 బిలియన్ మంది ప్రజలను కామన్ మార్కెట్లోకి తెచ్చేసింది. అయితే ఈ కొత్త పన్ను విధానంపై ఇప్పటికే చాలామందికి చాలా సందేహాలున్నాయి. అంతేకాక దీన్ని ఎలా అమలు చేయాలా? అని ఇటు వ్యాపారస్తులు, వర్తకులు, తయారీదారులు, సప్లయిదారులు సతమతమవుతున్న సంగతి తెలిసిందే. వారిని ఈ గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడేయడానికి, సందేహాలను నివృత్తి చేయడం కోసం అథారిటీలు స్పెషల్ వార్ రూమ్‌ను ఏర్పాటుచేశారు. అంతేకాక హెల్ప్‌లైన్ నెంబర్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అధికారులు ఈ బాధ్యతను చూసుకోనున్నారు. తరుచూ అడిగే ప్రశ్నలకు సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సమాధానాలను రూపొందించారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్ నుంచి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఎక్సైజ్ క్రెడిట్ వరకు అన్ని అంశాలపై వచ్చే సందేహాలన్నింటిన్నీ వారు నివృతి చేయనున్నారు. జీఎస్టీ కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ డెస్క్ : Email: cbecmitra.helpdesk@icegate.gov.in Telephone: 1800 1200 232 జీఎస్టీఎన్ హెల్ప్ డెస్క్ : Email: helpdesk@gst.gov.in Telephone: 0120 4888999 Twitter handles: @askGST_GOI, @askGSTech టెక్ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టెక్ మహింద్రాలతో కలిసి జీఎస్టీఎన్ నెట్వర్క్ రెండు కాల్ సెంటర్లను కూడా పన్ను చెల్లింపుదారులకు, పన్ను అధికారుల కోసం ఏర్పాటుచేసింది. పన్ను చెల్లింపుదారులకు హెల్ప్‌లైన్ నెంబర్: 0120-4888999 కాగ, పన్ను అధికారులకు 0124-4479900 నెంబర్‌ను అందుబాటులో ఉంచింది. -
జూలై 1 నుంచే జీఎస్టీ
-
జూలై 1 నుంచే జీఎస్టీ
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను(జీఎస్టీ) జూలై 1వ తేదీ నుంచే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం మంగళవారం స్పష్టంచేసింది. జూలై 1 నుంచి అమలు చేయడం కోసం పనులన్నీ చకచకా జరుగుతున్నాయంది. ‘జూలై 1 నుంచే జీఎస్టీని అమలు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అనుకున్న సమయానికి వ్యాపారులందరూ జీఎస్టీ కింద నమోదయ్యేలా చూసేందుకు సీబీఈసీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్) రాష్ట్రాలతో కలిసి తీవ్రంగా శ్రమిస్తోంది’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ‘జీఎస్టీ అమలు ఆలస్యం అవుతుందని వస్తున్న వార్తలు అవాస్తవాలు. వాటిని నమ్మి తప్పుదారి పట్టకండి’ అని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా ట్విటర్లో పేర్కొన్నారు. 2.29 శాతం పెరగనున్న ముఖ్యమైన ఔషధాల ధరలు జీఎస్టీ అమలైతే చాలా వరకు ముఖ్యమైన ఔషధాల ధరలు 2.29 శాతం వరకు పెరగనున్నాయి. ‘ముఖ్యమైన ఔషధాల జాతీయ జాబితా’లో హెపారిన్, వార్ఫారిన్, డైల్టియాజెమ్, డయాజెపమ్, ఐబూప్రొఫేన్, ప్రొప్రనోలోల్, ఇమాటినిబ్ తదితర మందులు ఉన్నాయి. వీటన్నింటి ధరలు 2.29 శాతం పెరుగుతాయి. జీఎస్టీలో మందులను 12 శాతం శ్లాబ్‌లోకి చేర్చడమే ఇందుకు కారణం. -
సీబీఈసీ.. ఇక సీబీఐసీ
♦ జూన్ 1వ తేదీ నాటికి ఏర్పాటు ♦ సీబీఐసీ కింద దేశవ్యాప్తంగా 21 జీఎస్టీ జోన్లు, 102 కమిషనరేట్లు సాక్షి ప్రతినిధి, తిరుపతి: జులై ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి రానున్న నేపథ్యంలో కేంద్రంలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెచ్ఆర్డీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్’(సీబీఈసీ) స్థానంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్(సీబీఐసీ)ను తీసుకు వస్తున్నారు. జూన్ మొదటి తేదీ లోగా ఇది ఏర్పాటు కానుంది. సీబీఐసీలో ఛైర్మన్‌తో పాటు జీఎస్టీ అండ్ సెంట్రల్ ట్యాక్స్, ఐటీ లీగల్, ఇన్వెస్టిగేషన్, ట్యాక్స్ పాలసీ, కస్టమ్స్, అడ్మినిస్ట్రేషన్ అండ్ విజిలెన్స్ విభాగాలకు చెందిన ఆరుగురు సీబీఐసీలో కీలక సభ్యులుగా ఉంటారు. ఇకపోతే సీబీఐసీ నూతన స్వరూపంలో దేశవ్యాప్తంగా∙21 జీఎస్టీ జోన్లు, 102 జీఎస్టీ పన్ను చెల్లింపు సర్వీస్ కమిషనరేట్లు ఉండడంతో పాటు 14 జీఎస్టీ సబ్ కమిషనరేట్లు, 768 డివిజన్లు, 3969 రేంజి కార్యాలయాలు పని చేస్తాయి. ఇవి మాత్రమే కాకుండా 49 జీఎస్టీ ఆడిట్ కమిషనరేట్లు, 50 జీఎస్టీ అప్పీల్ కమిషనరేట్లు, 11 కస్టమ్స్ జోన్లు, 60 కస్టమ్స్ కమిషనరేట్లు, 10 కస్టమ్స్ అప్పీల్లు కస్టమ్స్ కమిషనరేట్లు సీబీఐసీ పరిధిలోనే ఉంటాయి. కొత్త సీబీఐసీ క్రింద చిన్నచిన్న కేంద్రాల్లో సైతం జీఎస్టీ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వీటిని విశాఖపట్నం, గుంటూరు, తిరుపతిల్లో ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చెల్లతో పాటు మరో పట్టణంలో వీటిని ఏర్పాటుచేస్తారన్నది సమాచారం. సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ కమిషనరేట్లు ఇకపై జీఎస్టీ పన్ను చెల్లింపు సర్వీసు కమిషనరేట్లుగా మారనున్నాయి. కొత్తపన్ను చెల్లింపుదారులందరూ కొత్త సీబీఐసీ పరిధిలోకే వస్తారని కేంద్ర ఎక్సైజ్ అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్ను వ్యవస్థ విజయవంతం కావాలంటే సంస్కరణలు అవసరమని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ భావిస్తోంది. -
జీఎస్టీలో అన్ని వివరాలు నమోదు కావాల్సిందే
న్యూఢిల్లీ: జీఎస్టీ చట్టం అమల్లోకి వస్తే.. వస్తువులు పోయినా, చోరీకి గురైనా, దెబ్బతిన్నా పూర్తి సమాచారం తప్పకుండా నమోదు చేయాలని సీబీఈసీ (కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్ బోర్డు) పేర్కొంది. ఈ మేరకు జీఎస్టీ నమూనా నిబంధనలు విడుదల చేస్తూ... ఉచితంగా ఇచ్చే వస్తువులు, బహుమతుల వివరాల్ని కూడా తప్పకుండా నమోదు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఖాతా పుస్తకాలకు వరుస సంఖ్యలు కేటా యించాలని, రిజిస్టర్లు, పత్రాల్లో నమోదు చేసిన సమాచారం చెరపడం, కొట్టి వేయడం, దిద్దడం చేయకూడదని జీఎస్టీ నిబంధనల్లో పేర్కొన్నారు. ప్రతి పనికి ప్రత్యేక ఖాతాను నిర్వహించాలని, వస్తువుల తయారీ, వర్తకం, సేవలకు వేర్వేరు ఖాతాలు కొనసాగించాలని సూచించారు. వస్తువులు, సేవలకు సంబంధించి నిజమైన, సరైన సమాచారంతో కూడిన ఖాతాలతో పాటు సంబంధింత పత్రాలైన ఇన్వాయిస్లు, సరఫరా బిల్లులు, డెలివరీ చలానాలు, క్రెడిట్, డెబిట్ నోట్స్, రసీదులు, చెల్లింపుల వోచర్లు, వాపసు వస్తువుల వోచర్లు, ఈ–వే బిల్లులు తప్పకుండా ఉండాలని జీఎస్టీ నిబంధనల్లో స్పష్టం చేశారు. ముందస్తు వసూళ్లు, చెల్లింపులు, సర్దుబాట్లకు కూడా ప్రత్యేక ఖాతాలు నిర్వహించాల్సి ఉంటుంది. -
దాంతో కేంద్ర అధికారాలకు కత్తెర: సీబీఈసీ
న్యూఢిల్లీ: కోటిన్నర రూపాయలకు తక్కువ టర్నోవర్ కలిగిన పన్ను చెల్లింపుదారులపై పూర్తి నియంత్రణ తమకు ఇవ్వాలనే రాష్ట్రాల డిమాండ్ కేంద్రానికి అధికారం లేకుండా చేయడమేనని సెంట్రల్ బోర్డ్ ఫర్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ (సీబీఈసీ) చైర్పర్సన్ నజీబ్ షా అన్నారు. ఏ పన్ను చెల్లింపుదారునిపై ఎవరి పర్యవేక్షణ ఉండాలో నిర్ధారించేందుకు జీఎస్టీ కౌన్సిల్ మరికొద్ది రోజుల్లో భేటీ కానుండగా షా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జీఎస్టీ ద్వంద్వ నిర్మాణంతో కూడినదైనప్పటికీ ప్రభుత్వం దాన్ని ఘర్షణాత్మక మదింపుగా మార్చాలని అనుకోవడం లేదని అసోచామ్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో షా చెప్పారు. -
సీబీఈసీ ఇకపై సీబీఐటీ
న్యూఢిల్లీ: పరోక్ష పన్నుల అత్యున్నత విభాగం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) త్వరలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డెరైక్ట్ ట్యాక్స్ (సీబీఐటీ)గా పేరు మార్చుకోనుంది. జీఎస్టీ అమలు గడువు అయిన వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. జీఎస్టీ వ్యవస్థాగత నిర్మాణానికి సంబంధించిన ముసాయిదాలో ఈ విషయాన్ని పేర్కొన్నట్టు రెవెన్యూ శాఖ వర్గాలు తెలిపాయి. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించే నిబంధనలు, మినహాయింపులను సీబీఐటీ అమలు చేస్తుంది. సీబీఐటీలో ఆరుగురు సభ్యులు ఉంటారు. వీరు కస్టమ్స్, ఐటీ, సెంట్రల్ ఎక్సైజ్, న్యాయ పరమైన అంశాలు, శిక్షణ, వివాదాల వంటివి పర్యవేక్షిస్తారు. -
జీఎస్టీ రోడ్‌మ్యాప్ విడుదల
-
జీఎస్టీ రోడ్‌మ్యాప్ విడుదల
♦ ఏప్రిల్ 1, 2017 నుంచి అమలయ్యేలా ప్రణాళిక ♦ వీలైనంత త్వరగా జీఎస్టీ అమలుకు ప్రయత్నం: జైట్లీ న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) బిల్లు రాజ్యసభ ఆమోదం పొందడంతో వీలైనంత త్వరగా అమలు చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు మొదలుపెట్టింది. జీఎస్టీ అమలుకు ఏప్రిల్ 1, 2017ను లక్ష్యంగా నిర్ణయించిన కేంద్రం అందుకు పూర్తిస్థాయి రోడ్‌మ్యాప్‌ను గురువారం విడుదల చేసింది. పన్ను రేటుపై అందరికీ ఆమోదయోగ్య నిర్ణయమే తమ లక్ష్యమని ప్రకటించింది. కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా మాట్లాడుతూ... రాబోయే 30 రోజుల్లో 50 శాతం రాష్ట్రాలు(దాదాపు 16) రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదిస్తాయని ఆశిస్తున్నామన్నారు. జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లును వచ్చేవారం ప్రారంభంలో లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. బిల్లును లోక్‌సభ ఇంతకముందే ఆమోదించినా సవరణల నేపథ్యంలో మళ్లీ ఆమోదం పొందాలి. 60 వేల మందికి ప్రత్యేక శిక్షణ.. అధియా రూపొందించిన రోడ్ మ్యాప్ ప్రకారం.. 60 వేలమంది రెవెన్యూ అధికారులకు జీఎస్టీ నిబంధనలు, ఐటీ వ్యవస్థపై శిక్షణనిస్తారు. డిసెంబర్ 2016లోగా శిక్షణ పూర్తయ్యాక ఐటీ సంబంధ మౌలికసదుపాయాల ఏర్పాటును మార్చి 2017లోగా పూర్తిచేస్తారు. ఐటీ (సాంకేతిక అంశాలు)పై అధికారులకు జీఎస్టీఎన్ (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్వర్క్) శిక్షణనిస్తుంది. కేంద్ర, రాష్ట్రాలు ఏర్పాటు చేసే ఈ జీఎస్టీఎన్.. ఐటీ వ్యవస్థ, సేవలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పన్ను చెల్లింపుదారులు, ఇతర వర్గాలకు సాయం అందిస్తుంది. మార్చి చివరికి అనుసంధానం రోడ్ మ్యాప్ ప్రకారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్(సీబీఈసీ), బ్యాంకులు, ఆర్బీఐ, రాష్ట్ర రెవెన్యూ విభాగాలు, రాష్ట్రాలకు సంబంధించిన ఐటీ నెట్‌వర్క్‌ను డిసెంబర్, 2016 చివరికల్లా సిద్ధం చేస్తారు. జనవరి-మార్చి, 2017 మధ్యలో నెట్వర్క్ అనుసంధానంతో పాటు పరీక్షిస్తారు. ప్రస్తుత వ్యాట్, సేవా పన్ను , కేంద్ర ఎక్సైజ్ పన్ను డీలర్లు జీఎస్టీ కోసం కొత్తగా నమోదు చేసుకోనక్కర్లేదు. ప్రస్తుతమున్న సమాచారమే జీఎస్టీ వ్యవస్థలో పొందుపరుస్తారు. కొత్త డీలర్ల కోసం ఆన్లైన్లో ఒక్క దరఖాస్తు సమర్పిస్తే, మూడు రోజుల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు. జీఎస్టీ రిటర్న్స్ విషయంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కేవలం ఒక్క దరఖాస్తు దాఖలు చేస్తే సరిపోతుంది. రిటర్న్స్ కోసం నాలుగు దరఖాస్తులే.. సగటు పన్ను చెల్లింపుదారులు సరఫరా రిటర్న్స్, అమ్మకాల రిటర్న్స్, నెలవారీ, వార్షిక రిటర్న్స్‌ల దాఖలుకు నాలుగు దరఖాస్తులు సమర్పిస్తే చాలు. సరఫరా రిటర్న్‌ను ప్రతి నెల 10న సమర్పించాల్సి ఉండగా, ఆ సమాచారాన్నీ పేర్కొంటూ అమ్మకపు రిటర్న్ ను ప్రతి నెలా 15న దాఖలు చేయాలి. ఈ మొ త్తం వివరాలు నెలవారీ, వార్షిక రిటర్న్స్‌లో పొందుపరుస్తారు. చిన్నస్థాయి పన్ను చెల్లింపుదారుల కోసం నాలుగు నెలలకోసారి రిటర్న్స్ దాఖలు చేసేలా పథకం రూపొందించారు. సరైన పరిమితి లేకపోతే ఆర్థిక లోటు జీఎస్టీ రేటుపై 18 శాతం పరిమితి విధించాలన్న కాంగ్రెస్ డిమాండ్‌పై జైట్లీ మాట్లాడుతూ.. ‘తమ సొంత కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్రాలకు ఆదాయం అవసరం. అదే సమయంలో రాష్ట్రాలకు ఇచ్చేందుకు కేంద్రానికి నిధులు అవసరం. సరైన పరిమితి లేకపోతే ఆర్థిక లోటుకు దారితీస్తుంది. తక్కువ ఆదాయం వసూలు చేసి, ఖర్చు పెంచమని ప్రస్తుత ఆర్థికమంత్రి చెప్పలేరు’ అని జైట్లీ పేర్కొన్నారు. ప్రస్తుతం 27 నుంచి 32 శాతం పన్ను రేట్లు ఉండగా అవి దిగొస్తాయన్నారు. 22 శాతంతో ద్ర వ్యోల్బణ ప్రమాదం జీఎస్టీ రేటు 22 శాతంగా ఉంటే ద్రవ్యోల్బణం ముప్పు ఉందని, 27 శాతంగా నిర్ణయిస్తే ఆత్మహత్యా సదృశ్యమేనని ప్రధాన ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణియన్ అన్నారు. జీఎస్టీ 17 నుంచి 19 శాతం మధ్య ఉండాలని, ఆదాయం కోసం పన్ను విధానంపై భారం మోపకూడద ని చెప్పారు. బిల్లు ఆమోదం రేసులో అస్సాం ముందంజ జీఎస్టీ బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా నిలిచేందుకు అస్సాం సిద్ధమవుతుంది. ఆగస్టు 13తో ముగిసే ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ఆమోదం పొందేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హిమంత బిశ్వ శర్మ చెప్పారు. వస్తు, సేవల పన్ను అమలుకు క ర్నాటక ప్రభుత్వం సిద్ధమని సీఎం సిద్ధరామయ్య చెప్పారు. మోదీది పార్లమెంటు ధిక్కారమే!: కాంగ్రెస్ న్యూఢిల్లీ: జీఎస్టీ బిల్లు ఆమోదం సందర్భంగా ఉభయసభల్లో దేనికీ హాజరుకాకుండా ప్రధాని మోదీ పార్లమెంటు ధిక్కారానికి పాల్పడ్డారని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రగతిశీలమైన బిల్లుపై చర్చలో పాల్గొనేందుకు ప్రధానికి కనీసం 5 నిమిషాల తీరిక దొరకలేదా? అని పార్టీ ప్రతినిధి జైరాం రమేశ్ ప్రశ్నించారు. ‘ప్రధాని విదేశీ పర్యటనలో లేరు. పార్లమెంటులోని తన కార్యాలయంలోనే ఉన్నారు. అయినా చర్చలో పాల్గొనకపోవటం పార్లమెంటు ధిక్కారమే!. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం సందర్భంగా ప్రధాని పార్లమెంటుకు హాజరు కాకపోవటం స్వతంత్ర భారత చరిత్రలో ఇదే తొలిసారి’ అని తెలిపారు. రాజ్యాంగమే తన భగవద్గీత అన్న ప్రధాని.. ఇప్పుడు రాజ్యాంగాన్నే అవమానిస్తున్నారన్నారు. గతేడాది లోక్‌సభలో జీఎస్టీ బిల్లు ఆమోద సందర్భంలోనూ ప్రధాని సభలో లేని విషయాన్ని గుర్తుచేశారు. జీఎస్టీ రోడ్‌మ్యాప్ క్లుప్తంగా 1. సవరణ బిల్లుకు 30 రోజుల్లో కనీసం 16 రాష్ట్రాల ఆమోదం. 2. రాష్ట్రపతి సమ్మతి అనంతరం జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు. 3. నమూనా జీఎస్టీ నిబంధనలకు జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సు 4. సీజీఎస్టీ, ఐజీఎస్టీ(అంతరాష్ట్ర) చట్టాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం. 5. ఎస్జీఎస్టీ(రాష్ట్రాల జీఎస్టీ)కి అన్ని రాష్ట్రాల ఆమోదం. 6. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సీజీఎస్టీ, ఐజీఎస్టీ చట్టాల ఆమోదం. 7. డిసెంబర్‌లోగా కేంద్ర, రాష్ట్ర అధికారులకు శిక్షణ పూర్తి 8. డిసెంబర్ 2016 నాటికి జీఎస్టీ సాఫ్ట్వేర్ సిద్ధం. 9. జనవరి- మార్చి, 2017 మధ్యలో జీఎస్టీ సాఫ్ట్వేర్ పరీక్షించడం, అనుసంధానం చేయడం. 10. సంబంధిత వర్గాలతో మార్చి, 2017లోగా సంప్రదింపులు పూర్తి. 11. జీఎస్టీ నిబంధనలపై మార్చి 31, 2017లోగా నోటిఫికేషన్ 12. వ్యాట్, సర్వీస్ ట్యాక్స్, కేంద్ర ఎక్సైజ్ పన్ను జీఎస్టీలో విలీనం అన్నింటిని దృష్టిలో పెట్టుకునే పన్ను నిర్ణయం: జైట్లీ వీలైనంత త్వరగా జీఎస్టీ అమలుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అరుణ్ జైట్లీ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ‘ఆర్థిక అవసరాలతో పాటు, పన్ను తక్కువ ఉండేలా అన్నింటిని దృష్టిలో పెట్టుకుని పన్నురేటుపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుంది’ అని తెలిపారు. అమలుకు తుదిగడువు ఏప్రిల్, 2017పై స్పందిస్తూ... దృఢలక్ష్యం పెట్టుకుంటే ఎప్పటికీ మంచిదేనన్నారు. ‘ఏళ్లు గడిచేకొద్దీ పన్ను రేట్లు దిగొస్తాయి. అనేక నిత్యావసరాల ధరలు తగ్గుతాయి. రోడ్ మ్యాప్‌ను పూర్తిచేయడంతో పాటు జీఎస్టీ అమలుకు ప్రయత్నిస్తాం. ఒకసారి జీఎస్టీ అమలైతే భారత్‌లో వ్యాపారం సులువవుతుంది. ఇది వర్తకులు, వ్యాపారవేత్తలు, ప్రజలకు ఉపయోగకరం. అన్ని పార్టీలకు చెందిన రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటించాయి. చివరి దశ చర్చల్లో బిల్లులోని ప్రధాన అంశాలపై రాజీపడకుండా’ అని జైట్లీ చెప్పారు. -
బాలీవుడ్ దిగ్గజాలకు టాక్స్ నోటీసులు
ముంబై : బాలీవుడ్ దిగ్గజాలకు సర్వీసు టాక్స్ నోటీసులు జారీ అయ్యాయి. యశ్ రాజ్ ఫిల్మ్స్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్, అమీర్ ఖాన్, రన్ వీర్ సింగ్ లాంటి అధిక పేరు ప్రఖ్యాతలున్న మూవీ మేకర్లు, యాక్టర్లకు సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్(సీబీఎఫ్సీ) ఈ నోటీసులు జారీచేసింది. అమీర్ ఖాన్, రన్ వీర్ సింగ్‌లాంటి స్టార్ హీరోలకు ఎంత మొత్తంలో రెమ్యూనురేషన్ చెల్లించారో తెలపాలని ఆదేశిస్తూ టాప్ ప్రొడక్షన్ హోస్లకు ఈ నోటీసులు పంపింది. అదేవిధంగా యశ్ రాజ్ ఫిల్మ్స్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ లాంటి ప్రొడక్షన్ సంస్థల నుంచి యాక్టర్లు తీసుకున్న రెమ్యూనురేషన్ వివరాలు తెలపాలని యాక్టర్లనూ సీబీఎఫ్సీ ఆదేశించింది. అధిక పేరు ప్రఖ్యాతలున్న సర్వీసు టాక్స్ ఎగవేతదారుల సమాచార ఏరివేతలో భాగంగా, పన్ను అధికారులు ఈ నోటీసులు జారీచేస్తున్నట్టు గ్లామర్ వరల్డ్ చెబుతోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్, అమీర్ ఖాన్, రన్ వీర్ సింగ్‌లు తాజాగా సర్వీసు టాక్స్ డివిజన్ నుంచి ఈ నోటీసులు అందుకున్నారని దీనికి సంబంధించిన ఓ అధికారి చెప్పారు. ఇంటిలిజెన్స్ ఆఫీసర్లు వారి వద్ద నుంచి చెల్లింపులు, రెమ్యూనురేషన్ వివరాలను కోరుతూ ఈ ఎంక్వయిరీ లేఖలు పంపారని ఆయన పేర్కొన్నారు. బాలీవుడ్ లో సర్వీసు టాక్స్ ఎగవేతదారులను గుర్తించే పనిలో డిపార్ట్మెంట్ ప్రస్తుతం నిమగ్నమైందని, ఈ వారంలోనే వారినుంచి సమాచారాన్ని కోరే అవకాశముందని తెలుస్తోంది. ఏక్తా టైగర్, ధూమ్ 3, బాజీరావ్ మస్తానీ, బజరంగీ భాయిజాన్, సుల్తాన్ లాంటి బ్లాక్ బాస్టర్ మూవీలను ఈ ప్రొడక్షన్ సంస్థలు, నటులు తీశారు. -
15 ఏళ్ల పాత కేసులు వెనక్కి
♦ రూ.5 లక్షలలోపు ఎక్సైజ్ ఎగవేత ♦ కేసులపై సీబీఈసీ కీలక నిర్ణయం ♦ పన్ను వివాదాల తగ్గింపు దిశలో అడుగు న్యూఢిల్లీ: పన్ను వివాదాల సత్వర పరిష్కారం దిశలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్ల క్రితం నుంచీ అపరిష్కృతంగా ఉన్న రూ. 5 లక్షల లోపు సెంట్రల్ ఎక్సైజ్ ఎగవేత కేసులను ఉపసంహరించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ కేసులను ప్రాసిక్యూషన్ నుంచి ఉపసంహరించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ తగిన స్థాయి అధికారి హైకోర్డులో పిటిషన్ దాఖలు చేయడానికి వీలు కల్పిస్తూ తాజా నిర్ణయం తీసుకున్నట్లు ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సెంట్రల్ బోర్డ్ (సీబీఈసీ) ఒక ప్రకటనలో తెలిపింది. పన్ను వివాదాలను తగ్గించుకోవాలన్న ప్రభుత్వ విధానపరమైన నిర్ణయంలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు సెంట్రల్ ఎక్సైజ్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్లు, చీఫ్ కమిషనర్లకు పంపిన ఉత్తర్వుల్లో సీబీఈసీ పేర్కొంది. కారణాలు చూస్తే... ♦ చివరకు కేసులు తేలే విషయం ఎలా ఉన్నా... అంతకుమించి ఆయా కేసుల విషయంలో ప్రాసిక్యూషన్‌కు వ్యయాలు భారంగా ఉండడం సీబీఈసీ నిర్ణయానికి ఒక కారణం. ♦ దీనితోపాటు ఈ కేసులను పరిశీలిస్తున్న అధికారులను ఖజానాకు ఆదాయం తెచ్చే ఇతర బాధ్యతల్లోకి మళ్లిస్తే... తక్షణం కొంత ఫలితం ఉంటుందన్న అభిప్రాయం కూడా కారణమే. ♦ ఇలాంటి సుదీర్ఘ అపరిష్కృత కేసుల ఉపసంహరణ... తయారీ రంగానికి ఒక సానుకూల సంకేతం పంపుతుందని కూడా అధికారులు భావిస్తున్నారు. ఇది ప్రభుత్వ ప్రతిష్టాత్మక మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం విజయానికి దోహదపడే వీలుందన్నది ఒక విశ్లేషణ. ♦ సెంట్రల్ ఎక్సైజ్‌లో ప్రాసిక్యూషన్, అరెస్ట్‌కు ప్రస్తుత పరిమితి కోటి రూపాయలు. నల్లధనానికి ఆభరణాల రంగమూ కారణమే: సీబీఈసీ చైర్మన్ న్యూఢిల్లీ: నల్లధనం సమస్యకు ఆభరణాల రంగమూ కారణమేనని కేంద్రీయ ఎక్సైజ్, కస్టమ్స్ బోర్డు (సీబీఈసీ) చైర్మన్ నజీబ్ షా వ్యాఖ్యానించారు. జ్యుయలరీ రంగంపై రెండేళ్ల క్రితమే ఎక్సైజ్ సుంకం విధించినా ఆ తర్వాత ఉపసంహరించామని, దాన్నే తాజాగా మళ్లీ విధించడం జరిగిందన్నారు. పన్ను పరిధిలో ఉండాల్సిన రంగాల్లో ఇది కూడా ఒకటని అంతా కచ్చితంగా ఏకీభవిస్తారని షా చెప్పారు. -
ఒక చోట మూడేళ్లే ఉద్యోగం: సీబీఈసీ
న్యూఢిల్లీ: కీలక, సున్నితమైన ఉద్యోగంలో ఏ అధికారి ఒకే ప్రాంతంలో మూడేళ్లకన్నా ఎక్కువ కాలం కొనసాగకూడదని ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సెంట్రల్ బోర్డ్ (సీబీఈసీ) స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల్లో పటిష్ట నైతికత విలువలు, పారదర్శకత నెలకొల్పడానికి ఈ విధానాన్ని కొనసాగించాలని పరోక్ష పన్ను విభాగంలో అత్యున్నత స్థాయి అధికారులకు పంపిన ఒక వర్తమానంలో తెలిపింది. -
పసిడి దిగుమతుల టారిఫ్ విలువ పెంపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ధోరణికి అనుగుణంగా గురువారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) పసిడి దిగుమతులపై టారిఫ్ విలువను పెంచింది. 10 గ్రాములకు 363 డాలర్ల నుంచి 388 డాలర్లకు ఈ ధర పెరిగింది. వెండి విషయంలో ఈ ధర 443 డాలర్ల నుంచి 487 డాలర్లకు ఎగసింది. ఎటువంటి అవకతవకలకూ(అండర్ ఇన్వాయిసింగ్) వీలులేకుండా పసిడి దిగుమతులపై కస్టమ్స్ సుంకం విధించడానికి దిగుమతి టారిఫ్ విలువ ప్రాతిపదికగా ఉంటుంది. అంతర్జాతీయ ధోరణులకు అనుగుణంగా లేదా ప్రతి 15 రోజులకు ఒకసారి సీబీఈసీ ఈ టారిఫ్‌లను సమీక్షించి, తగిన నిర్ణయం తీసుకుంటుంది. గోల్డ్ ఈటీఎఫ్ అవుట్‌ఫ్లో రూ.656 కోట్లు... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గడచిన 10 నెలల కాలంలో ఇన్వెస్టర్లు పసిడి ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) నుంచి రూ.656 కోట్లు వెనక్కు తీసుకున్నారు (అవుట్‌ఫ్లోస్). దీనితో ఫండ్స్ నిర్వహణలోని ఈటీఎఫ్‌ల విలువ (ఏయూఎం) మొత్తం దాదాపు 8.5 శాతం వరకూ పడిపోయింది. ఈటీఎఫ్‌ల నికర అవుట్‌ఫ్లోలు ఈ ఏడాది వరుసగా మూడవ సంవత్సరం. అయితే ఈక్విటీ మార్కెట్లు, ఆర్థిక వ్యవస్థల మందగమనం వల్ల గడచిన రెండేళ్లతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అవుట్‌ఫ్లో స్పీడ్ తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు. 2014-15 మొత్తం ఆర్థిక సంవత్సరంలో అవుట్‌ఫ్లో మొత్తం విలువ రూ.1,475 కోట్లు. మొదటి 10 నెలల కాలానికి రూ.1,290 కోట్లు. 2013-14లో వెనక్కు వెళ్లిన మొత్తం రూ. 2,293 కోట్లు. -
పసిడిది వెనుకడుగే!
న్యూయార్క్/ముంబై: సమీప కాలంలో పసిడిది వెనుకడుగేనని నిపుణులు అంచనావేస్తున్నారు. సమీప భవిష్యత్తులో పసిడిపై పెట్టుబడుల పట్ల సంబంధిత ఇన్వెస్టర్లు పూర్తి నిరాశాజనకంగా ఉన్నట్లు ఈ రంగంలో నిపుణులు పేర్కొంటున్నాయి ఫెడ్ రేటు పెంపు, హోల్డింగ్ వ్యయాలు పెరగడంతో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో అమ్మకాలు వంటి అంశాలు దీనికి ప్రధాన కారణాలు. వారం వారీగా చూస్తే... న్యూయార్క్ కామెక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న ఫిబ్రవరి కాంట్రాక్ట్ ఔన్స్ (31.1గ్రా)కు వారం వారీగా దాదాపు 15 డాలర్లు పడిపోయి, 1,060 వద్ద ముగిసింది. వెండి కూడా 14.37 డాలర్ల నుంచి 13.80 డాలర్లకు పడింది. దేశీయంగా ఇలా.. ఇక దేశీయంగా కూడా అంతర్జాతీయ బలహీన ధోరణే ప్రతిబింబిస్తోంది. 99.5 ప్యూరిటీ ధర 10 గ్రాములకు శుక్రవారంతో ముగిసిన వారానికి రూ.180 తగ్గింది. రూ.25,015 వద్ద ముగిసింది. ఇక 99.9 ప్యూరిటీ ధర కూడా అంతే మొత్తం తగ్గి రూ.25,165 వద్దకు చేరింది. ఇక వెండి కేజీ ధర రూ.850 పడిపోయి రూ.33,610 వద్ద ముగిసింది. ఆభరణాలు, రిటైలర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు మందకొడిగా ఉన్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా అంతర్జాతీయ ధోరణులకు అనుగుణంగా తాజా సమీక్ష వారంలో ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సెంట్రల్ బోర్డ్ పసిడి దిగుమతి టారిఫ్ రేట్లను 10 గ్రాములకు 347 డాలర్ల నుంచి 345 డాలర్లకు తగ్గించింది. మెటల్స్ దిగుమతులపై కస్టమ్స్ సుంకం విధింపునకు ఈ టారిఫ్ విలువ(బేస్ ధర)ను సీబీఈసీ పరిగణనలోకి తీసుకుంటుంది. -
పసిడి, వెండి టారిఫ్ విలువ తగ్గింపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ధరలు తగ్గిన నేపథ్యంలో కేంద్రం శనివారం బంగారం, వెండి టారిఫ్ విలువలను తగ్గించింది. దీని ప్రకారం పసిడి టారిఫ్ విలువ 10 గ్రాములకు 393 డాలర్ల నుంచి 375 డాలర్లకు తగ్గింది. వెండి కేజీకి టారిఫ్ విలువ 549 డాలర్ల నుంచి 512కు తగ్గింది. ఈ మేరకు కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్ బోర్డు (సీబీఈసీ) ఒక ప్రకటన చేసింది. ఈ మెటల్స్ దిగుమతులపై కస్టమ్స్ సుంకం విధింపునకు ఈ టారిఫ్ విలువ(బేస్ ధర)ను సీబీఈసీ పరిగణనలోకి తీసుకుంటుంది. విలువను తక్కువచేసి చూపేందుకు (అండర్ ఇన్వాయిసింగ్) ఆస్కారం లేకుండా చేయడమే దీని ప్రధానోద్దేశం. -
రెవెన్యూ సెక్రటరీ పోస్టు రద్దు చేయాలి
ఆర్థిక మంత్రికి టార్క్ తొలి నివేదిక న్యూఢిల్లీ: రెవెన్యూ కార్యదర్శి పోస్టు రద్దు... సీబీడీటీ, సీబీఈసీల విలీనం... పర్మనెంట్ అకౌంట్ నంబర్ (పాన్) వినియోగాన్ని విస్తృతపర్చడం... ఇవీ, పన్ను వ్యవస్థ సంస్కరణల కమిషన్(టార్క్) చేసిన కొన్ని సిఫార్సులు. పార్థసారథి షోమ్ సారథ్యంలోని టార్క్ తన తొలి నివేదికను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి అందజేసింది. పన్ను చట్టాలకు పాత తేదీ నుంచి సవరణల అమలుకు స్వస్తిపలకాలని కోరింది. ఆదాయ పన్ను రిటర్నుల్లో సంపద పన్ను వివరాలు కూడా ఉండాలని సూచించింది. ఈ నివేదికలోని కొన్ని సిఫార్సులు... * నిర్ణీతకాలంలో ట్యాక్స్ రిఫండ్ల కోసం బడ్జెట్ కేటాయింపులుండాలి. టీడీఎస్ కోసం పాస్‌బుక్ స్కీమును ప్రవేశపెట్టాలి. * మెరుగైన పన్నుల వ్యవస్థ కోసం సీబీడీటీ, సీబీసీఈల్లో ఎంపిక చేసిన విభాగాలు వెంటనే విలీనం కావాలి. మరో ఐదేళ్లలో ప్రత్యక్ష, పరోక్ష పన్నులకు ఉమ్మడి బోర్డుతో సీబీడీటీ, సీబీసీఈలు ఏకీకృత యాజమాన్యం దిశగా సాగాలి. * కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, ఈపీఎఫ్ఓ వంటి ప్రభుత్వ విభాగాలకు సైతం ఉపయోగపడే విధంగా పాన్‌ను కామన్ బిజినెస్ ఐడెంటిఫికేషన్ నంబర్ (సీబీఐఎన్)గా మార్చాలి. * ఒకే విభాగం పరిధిలో ఉండే సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్సులకు సింగిల్ రిజిస్ట్రేషన్ అమలు. * సంపద పన్ను రిటర్నులను విడిగా దాఖలు చేయాల్సిన అవసరం లేకుండా ఐటీ రిటర్నుల్లోనే వెల్త్ ట్యాక్స్ రిటర్నులను కలపాలి. ట్యాక్స్ రిఫండ్లను నిర్ణీత కాలంలోపు కచ్చితంగా జారీచేయాలి. -
స్విమ్మింగ్ పూల్ వద్ద సర్వ్ చేసినా సేవా పన్ను తప్పదు
న్యూఢిల్లీ: ఒక హోటెల్లో స్విమ్మింగ్ పూల్ లేదా ఆ హోటెల్‌కు సంబంధించిన ఓపెన్ ఏరియాల వద్ద సర్వ్ చేసే ఆహారం, పానీయాలకు కూడా సేవల పన్ను వర్తిస్తుంది. రెస్టారెంట్లలో ఆయా ప్రాంతాల్లో కస్టమర్లకు అందించే సదుపాయాలు సేవల పరిధిలోకే వస్తాయని స్పష్టం చేసింది. రెస్టారెంట్ సేవలకు సంబంధించి వచ్చిన కొన్ని సందేహాలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) వివరణ ఇచ్చింది. పరోక్ష పన్ను వ్యవస్థకు సంబంధించిన వ్యవహారాలను సీబీఈసీ పర్యవేక్షించే సంగతి తెలిసిందే. కాగా రెస్టారెంట్లలో వాటర్ బాటిల్ వంటి ఎంఆర్పీ (మాగ్జిమం రిటైల్ ప్రైస్) ధరలకు అమ్మే ఉత్పత్తులపై సేవల పన్ను వర్తించబోదని కూడా సీబీఈసీ పేర్కొంది. ఎయిర్ కండీషనింగ్ లేదా సెంట్రల్ ఎయిర్ హీటింగ్ సౌకర్యంతో ఉన్న రెస్టారెంట్లలో సర్వ్ చేసే ఆహారం, పానీయాలపై సేవల పన్ను వర్తిస్తుందని అయితే నాన్-ఎయిర్ కండీషన్డ్ రెస్టారెంట్లలో సర్వీసులను దీని నుంచి మినహాయించడం జరిగిందని సీబీఈసీ ఒక ప్రకటనలో పేర్కొంది. రెస్టారెంట్లలో 12 శాతం సేవల పన్నుతో పాటు ఫుడ్ బిల్లు 40 శాతంపై సెస్‌ను చార్జ్ చేస్తారు. -
పసిడి దిగుమతి టారిఫ్ విలువ పెంపు
న్యూఢిల్లీ: ప్రభుత్వం శుక్రవారం పసిడి, వెండి దిగుమతి టారిఫ్ విలువను పెంచింది. దీని ప్రకారం ఇప్పటి వరకూ 10 గ్రాములకు 432 డాలర్లుగా ఉన్న పసిడి దిగుమతి టారిఫ్ విలువ 461 డాలర్లకు పెరిగింది. వెండికి సంబంధించి ఈ విలువ 697 డాలర్ల నుంచి 803 డాలర్లకు చేరింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎటువంటి అవకతవకలకూ వీలులేకుండా దిగుమతి చేసుకునే మెటల్స్‌పై కస్టమ్స్ సుంకాన్ని విధించడానికి ఈ టారిఫ్ విలువే ప్రాతిపదికగా ఉంటుంది. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. సహజంగా 15 రోజులకు ఒకసారి ఈ రేట్లపై అధికారుల సమీక్ష ఉంటుంది. ఇదిలావుండగా, ముంబైసహా దేశ వ్యాప్తంగా పలు స్పాట్ బులియన్ మార్కెట్లలో బంగారం ధరలు శుక్రవారం వరుసగా రెండవరోజు కూడా రికార్డు స్థాయిల నుంచి కిందకు దిగొచ్చాయి. పసిడి కాంట్రాక్ట్‌ల మార్జిన్లు పెంపు అన్ని రకాల గోల్డ్ ఫ్యూచర్స్‌లో ప్రాథమిక మార్జిన్లను 1%మేర పెంచుతున్నట్లు కమోడిటీ మార్కెట్ల నియంత్రణ ఫార్వర్డ్ మార్కెట్ కమిషన్(ఎఫ్ఎంసీ) తెలిపింది. దీంతో ఇవి ప్రస్తుత 4% నుంచి తాజాగా 5%కు పెరిగాయి. కొత్త మార్జిన్లు సెప్టెంబర్ 2 నుంచి వర్తిస్తాయని ఎఫ్ఎంసీ పేర్కొంది. గోల్డ్ కాంట్రాక్ట్‌ల విలువపై 5% మార్జిన్లను అమలు చేయాల్సిందిగా అన్ని ఎక్స్ఛేంజీలకూ ఆదేశాలు జారీ చేశామని తెలిపింది. పసిడి ధరల్లో భారీ హెచ్చుతగ్గులు నమోదవుతున్న నేపథ్యంలో జాతీయస్థాయి ఎక్స్ఛేంజీలు నిర్వహించే అన్ని రకాల గోల్డ్, సిల్వర్, బ్రెంట్ క్రూడ్, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ కాంట్రాక్ట్‌లపై 5% అదనపు మార్జిన్లను సైతం విధిస్తున్నట్లు వెల్లడించింది.