జీఎస్టీ హెల్ప్‌లైన్ నెంబర్లు..
జీఎస్టీ హెల్ప్‌లైన్ నెంబర్లు..
Published Sat, Jul 1 2017 11:15 AM | Last Updated on Tue, Sep 5 2017 2:57 PM
స్వాతంత్య్ర భారత చరిత్రలో అతిపెద్ద పన్ను సంస్కరణ జీఎస్టీ శుక్రవారం అర్థరాత్రి 12 గంటలకు ఎంతో అట్టహాసంగా లాంచ్ అయింది. పార్లమెంట్ సెంట్రల్ హాలు వేదికగా లాంచ్ అయిన జీఎస్టీ నేటి నుంచి అమల్లోకి వచ్చేసింది. ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్ అంటూ 1.3 బిలియన్ మంది ప్రజలను కామన్ మార్కెట్‌లోకి తెచ్చేసింది. అయితే ఈ కొత్త పన్ను విధానంపై ఇప్పటికే చాలామందికి చాలా సందేహాలున్నాయి.
అంతేకాక దీన్ని ఎలా అమలు చేయాలా? అని ఇటు వ్యాపారస్తులు, వర్తకులు, తయారీదారులు, సప్లయిదారులు సతమతమవుతున్న సంగతి తెలిసిందే. వారిని ఈ గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడేయడానికి, సందేహాలను నివృత్తి చేయడం కోసం అథారిటీలు స్పెషల్ వార్ రూమ్‌ను ఏర్పాటుచేశారు. అంతేకాక హెల్ప్‌లైన్ నెంబర్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అధికారులు ఈ బాధ్యతను చూసుకోనున్నారు. తరుచూ అడిగే ప్రశ్నలకు సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సమాధానాలను రూపొందించారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్ నుంచి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఎక్సైజ్ క్రెడిట్ వరకు అన్ని అంశాలపై వచ్చే సందేహాలన్నింటిన్నీ వారు నివృతి చేయనున్నారు.
జీఎస్టీ కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ డెస్క్ :
Email: cbecmitra.helpdesk@icegate.gov.in
Telephone: 1800 1200 232
జీఎస్టీఎన్ హెల్ప్ డెస్క్ :
Email: helpdesk@gst.gov.in
Telephone: 0120 4888999
Twitter handles: @askGST_GOI, @askGSTech
టెక్ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టెక్ మహింద్రాలతో కలిసి జీఎస్టీఎన్ నెట్‌వర్క్ రెండు కాల్ సెంటర్లను కూడా పన్ను చెల్లింపుదారులకు, పన్ను అధికారుల కోసం ఏర్పాటుచేసింది. పన్ను చెల్లింపుదారులకు హెల్ప్‌లైన్ నెంబర్: 0120-4888999 కాగ, పన్ను అధికారులకు 0124-4479900 నెంబర్‌ను అందుబాటులో ఉంచింది.
Advertisement
Advertisement