దాంతో కేంద్ర అధికారాలకు కత్తెర: సీబీఈసీ | Ceding control of GST admin to states will disempower centre: CBEC | Sakshi
Sakshi News home page

దాంతో కేంద్ర అధికారాలకు కత్తెర: సీబీఈసీ

Published Fri, Dec 9 2016 6:10 PM | Last Updated on Mon, Sep 4 2017 10:18 PM

Ceding control of GST admin to states will disempower centre: CBEC

న్యూఢిల్లీ: కోటిన్నర రూపాయలకు తక్కువ టర్నోవర్‌ కలిగిన పన్ను చెల్లింపుదారులపై పూర్తి నియంత్రణ తమకు ఇవ్వాలనే రాష్ట్రాల డిమాండ్‌ కేంద్రానికి అధికారం లేకుండా చేయడమేనని సెంట్రల్‌ బోర్డ్‌ ఫర్‌ కస్టమ్స్‌ అండ్‌ ఎక్సైజ్‌ (సీబీఈసీ) చైర్‌పర్సన్‌ నజీబ్‌ షా అన్నారు.

ఏ పన్ను చెల్లింపుదారునిపై ఎవరి పర్యవేక్షణ ఉండాలో నిర్ధారించేందుకు జీఎస్టీ కౌన్సిల్‌ మరికొద్ది రోజుల్లో భేటీ కానుండగా షా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జీఎస్టీ ద్వంద్వ నిర్మాణంతో కూడినదైనప్పటికీ ప్రభుత్వం దాన్ని ఘర్షణాత్మక మదింపుగా మార్చాలని అనుకోవడం లేదని అసోచామ్‌ నిర్వహించిన ఒక కార్యక్రమంలో షా చెప్పారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement