వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలులోకి వచ్చిన ఏడు సంవత్సరాల తర్వాత మొదటిసారి పన్ను రేట్లలో భారీ మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే దీనిపై తుది నిర్ణయం ఈనెల 21న జరిగే 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో వెలువడుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరగబోయే ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రులు పాల్గొననున్నారు. ఈ సమావేశం రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో నిర్వహిస్తున్నారు. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం ఈ సమావేశంలో తీసుకుబోయే నిర్ణయాలు కింది విధంగా ఉంటాయని ఊహాగానాలు వస్తున్నాయి.
మినహాయింపులు..
జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ రేట్లను తగ్గించే ప్రతిపాదనలున్నాయి.
సీనియర్ సిటిజన్లు చెల్లించే ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ మినహాయింపు.
సీనియర్ సిటిజన్లు కాకుండా ఇతర వ్యక్తులకు రూ.5 లక్షల వరకు కవర్ చేసే పాలసీలకు ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ మినహాయింపు.
రూ.5 లక్షల కంటే ఎక్కువ కవరేజీ ఉన్న పాలసీల ప్రీమియంలపై 18% జీఎస్టీ కొనసాగిస్తారని అంచనా.
మార్పులు..
జీఎస్టీ హేతుబద్ధీకరణపై మంత్రుల బృందం విలాసవంతమైన వస్తువులు, సిన్ గూడ్స్ (అత్యంత ఖరీదైన దిగుమతి చేసుకునే వస్తువులు)పై పన్ను పెంచుతారు.
చేతి గడియారాల ధర రూ.25,000 ఉంటే జీఎస్టీ 18% నుంచి 28%కి పెంపు.
రూ.15,000 కంటే ఎక్కువ ధర ఉన్న షూస్‌పై జీఎస్టీ 18% నుంచి 28%కి పెంపు.
రూ.1,500 వరకు ధర ఉన్న రెడీమేడ్ దుస్తులపై 5% జీఎస్టీ.
రూ.1,500-రూ.10,000 మధ్య ధర ఉన్న దుస్తులపై 18% జీఎస్టీ.
రూ.10,000 కంటే ఎక్కువ ధర ఉన్న రెడీమేడ్ దుస్తులపై 28% జీఎస్టీ.
కొన్ని పానీయాలు, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న 28% జీఎస్టీను కొత్తగా 35% స్లాబ్‌లోకి తీసుకురాబోతున్నట్లు అంచనా.
ఇదీ చదవండి: వాట్సప్‌లో చాట్‌జీపీటీ.. అందుకు ఏం చేయాలంటే..
పన్ను తగ్గింపు..
ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ (20 లీటర్లు, అంతకంటే ఎక్కువ)పై జీఎస్టీ 18% నుంచి 5%కి తగ్గింపు.
రూ.10,000 కంటే తక్కువ ధర ఉన్న సైకిళ్లపై జీఎస్టీ 12% నుంచి 5%కి తగ్గింపు.
నోట్‌బుక్‌లపై 12% నుంచి 5%కి తగ్గింపు.
Comments
Please login to add a commentAdd a comment