పసిడి, వెండి టారిఫ్ విలువ తగ్గింపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ధరలు తగ్గిన నేపథ్యంలో కేంద్రం శనివారం బంగారం, వెండి టారిఫ్ విలువలను తగ్గించింది. దీని ప్రకారం పసిడి టారిఫ్ విలువ 10 గ్రాములకు 393 డాలర్ల నుంచి 375 డాలర్లకు తగ్గింది. వెండి కేజీకి టారిఫ్ విలువ 549 డాలర్ల నుంచి 512కు తగ్గింది. ఈ మేరకు కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్ బోర్డు (సీబీఈసీ) ఒక ప్రకటన చేసింది. ఈ మెటల్స్ దిగుమతులపై కస్టమ్స్ సుంకం విధింపునకు ఈ టారిఫ్ విలువ(బేస్ ధర)ను సీబీఈసీ పరిగణనలోకి తీసుకుంటుంది. విలువను తక్కువచేసి చూపేందుకు (అండర్ ఇన్వాయిసింగ్) ఆస్కారం లేకుండా చేయడమే దీని ప్రధానోద్దేశం.