సాక్షి: న్యూఢిల్లీ: దేశీయ ఐటీ రంగంపై పడిన టాక్స్ బాంబుపై కేంద్రం స్పందించింది. ఐటీ, ఐటీ ఆధారిత సేవలను అందించే కంపెనీలను ఆదుకునేందుకు రంగంలోకి దిగింది. దాదాపు రెండువందలకు పైగా కంపెనీలకు షాకిస్తూ జరిమానాతో సహా భారీ ఎత్తున సేవాపన్ను చెల్లించాలంటూ జారీ అయిన నోటీసుల పరిశీలనకు దిగింది. దీనిపై సవివరమైన నివేదిక సమర్పించాల్సిందిగా సంబంధిత అధికారులకు అదేశాలు జారీ చేసింది.
రూ.10వేల కోట్ల మేర సర్వీస్ టాక్స్ చెల్లించాలంటూ ఇండియాలోని 200 ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలకు నోటీసులు జారీ కావడంతో సెంట్రల్ బోర్డ్ అఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) రంగంలోకి దిగింది. దీని ద్వారా ప్రభావితమైన కంపెనీల పేర్లు, సేవలందించిన ప్రదేశాలు తదితర వివరాలతో కూడిన వివరణాత్మక నివేదికను సిద్ధం చేయాలని పత్యక్ష పన్నుల కమిషనర్‌ను కోరింది.
కాగా గత ఐదేళ్ళలో విదేశాలకు సాఫ్ట్వేర్ సేవలను ఎక్స్పోర్ట్ చేసి.. తద్వారా పొందిన ప్రయోజనాల రిటర్న్స్ దాఖలు చేయాల్సిందిగా ఇండియాలోని ఐటీ కంపెనీలకు నోటీసులు జారీ అయ్యాయి. దీంతో అసలే సంక్షోభంలో పడిన దేశీయ ఐటీరంగంపై ఏకంగా పదివేల కోట్ల మేర సర్వీస్ ట్యాక్స్ భారం మరింత కలకం రేపింది. అటు దీని ప్రభావం ఐటీ రిక్రూట్ మెంట్ మీద పడే ప్రమాదం ఉందన్న ఆందోళన కూడా నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment