న్యూఢిల్లీ: కీలక, సున్నితమైన ఉద్యోగంలో ఏ అధికారి ఒకే ప్రాంతంలో మూడేళ్లకన్నా ఎక్కువ కాలం కొనసాగకూడదని ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సెంట్రల్ బోర్డ్ (సీబీఈసీ) స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల్లో పటిష్ట నైతికత విలువలు, పారదర్శకత నెలకొల్పడానికి ఈ విధానాన్ని కొనసాగించాలని పరోక్ష పన్ను విభాగంలో అత్యున్నత స్థాయి అధికారులకు పంపిన ఒక వర్తమానంలో తెలిపింది.