కీవ్:కొత్త ఏడాది సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ దేశ ప్రజలకు కీలక సందేశమిచ్చారు. రాజధాని కీవ్ నుంచి ఆయన మాట్లాడారు. మూడు సంవత్సరాలుగా తమ దేశంపై కొనసాగుతున్న రష్యా దురాక్రమణను అడ్డుకుని తీరుతామన్నారు.
‘శాంతి మాకు బహుమతిగా రాదని తెలుసు. అన్ని వనరులున్న రష్యాను అడ్డుకుని శాంతిని సాధించేందుకు ఈ ఏడాది గట్టిగా పోరాడతాం.అమెరికాకు కొత్తగా రానున్న అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్‌కు అన్ని విధాలా అండగా ఉంటారని ఆశిస్తున్నా. పుతిన్ దురాక్రమణను ఆయన ఆపుతారనడంలో నాకెలాంటి సందేహం లేదు’అని జెలెన్‌స్కీ అన్నారు.
కాగా, రష్యాతో జరుగుతున్న యుద్ధంలో 2023తో పోలిస్తే 2024లో ఉక్రెయిన్ ఏడు రెట్ల భూభాగాన్ని నష్టపోయింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారం చేపట్టాక ఉక్రెయిన్‌కు సహకారం తగ్గొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తమకు సహకరిస్తారని జెలెన్‌స్కీ వ్యాఖ్యానించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment