
రంజాన్ మాసం ఈరోజు(ఆదివారం) నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘పవిత్ర రంజాన్ మాసం మన సమాజంలో శాంతి సామరస్యాలను తీసుకురావాలని’ ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ‘ఈ పవిత్ర మాసం.. కృతజ్ఞత, భక్తిప్రపత్తులను సూచిస్తుంది. కరుణ, దయ, సేవలకున్న విలువలను మనకు గుర్తు చేస్తుంది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
As the blessed month of Ramzan begins, may it bring peace and harmony in our society. This sacred month epitomises reflection, gratitude and devotion, also reminding us of the values of compassion, kindness and service.
Ramzan Mubarak!— Narendra Modi (@narendramodi) March 2, 2025
ఇస్లాంలో రంజాన్(Ramadan) మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నెలలో ముస్లిం సోదరులు ఉపవాసం ఉంటూ భగవంతుడిని ఆరాధిస్తారు. ఇస్లాంలోని ఐదు స్తంభాలలో రంజాన్‌ను ఒకటిగా పరిగణిస్తారు. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ అవతరణ కూడా ఈ నెలలో ఒక రోజు రాత్రి వేళ జరిగిందని చెబుతారు. రంజాన్ ముగిసిన తర్వాత, ముస్లిం సోదరులు ఈద్-ఉల్-ఫితర్ పండుగను జరుపుకుంటారు. ముస్లింలు ఈ నెలను ఆరాధన మాసంగా భావిస్తారు.
ఇది కూడా చదవండి: నేడు తొలి విశ్వశాంతి కేంద్రం ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment