Mahakumbh Mela: ‘ధాన్యం బాబా’ తలపై పంటలు.. చూసేందుకు జనం క్యూ | Anaaj Wale Baba Draws Attention At Mahakumbh Mela with Unique Eco Message In Prayagraj, Know Interesting Facts In Telugu | Sakshi
Sakshi News home page

Mahakumbh Mela: ‘ధాన్యం బాబా’ తలపై పంటలు.. చూసేందుకు జనం క్యూ

Published Wed, Jan 8 2025 7:05 AM | Last Updated on Wed, Jan 8 2025 9:52 AM

Anaaj Wale Baba Draws Attention at Aahakumbh Mela with Unique Eco Message in Prayagraj

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా సందడి నెలకొంది. ఈ నెల 13 నుంచి ఇక్కడ కుంభమేళా జరగనుంది. ఇందుకోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇంతలో పలువురు బాబాలు, స్వామీజీలు కుంభమేళా ప్రాంతానికి చేరుకుంటున్నారు. వీరిలో కొందరి వేషధారణ అందరినీ ఆకట్టుకుంటోంది. అలాంటివారిలో ఒకరే అనాజ్‌వాలీ బాబా.

బాబా అమర్జీత్ ‘అనాజ్‌వాలీ బాబా’('Anajwali Baba')గా పేరొందారు. ఈయనను చూసేందుకు జనం ఉత్సాహం చూపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాకు చెందిన బాబా అమర్జీత్‌ బాబా తన తన తలపై ధాన్యం, గోధుమలు, మినుములు లాంటి పంటలను పండిస్తూ, అందరినీ విశేషంగా ఆకర్షిస్తున్నారు. గత ఐదేళ్లుగా ఆయన పర్యావరణ పరిరక్షణ గురించి అందరికీ అవగాహన కల్పించేందుకు ఈ తరహా విధానాన్ని అవలంబిస్తున్నారు.

హఠ యోగి అమర్జీత్ బాబా  మీడియాతో మాట్లాడుతూ తాను చేస్తున్న ఈ ప్రయత్నం ప్రపంచంలో శాంతిని పెంపొందించడానికి, పచ్చదనం(Greenery) ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయడానికి ఒక మార్గమన్నారు.  అటవీ నిర్మూలన  అనేది పర్యావరణానికి హాని కలిగిస్తున్నదన్నారు. చెట్లను నరికివేయడం కారణంగా మన పర్యావరణానికి జరుగుతున్న చేటును గుర్తించి, తాను తన తలపై పంటలను పండిస్తూ, అందరికీ పర్యావరణ ప్రాముఖ్యతను తెలియజేయాలని అనుకున్నానని అమర్జీత్‌ బాబా తెలిపారు.

తాను ఎక్కడికి వెళ్లినా అక్కడి జనం పచ్చదనాన్ని పెంచిపోషించేలా ప్రోత్సహిస్తానని, తన తలపై ఉన్న పంటలకు క్రమం తప్పకుండా నీటిని చిలకరిస్తూ వాటిని పోషిస్తానని తెలిపారు. బాబా మాటలు విన్నవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం కిలా ఘాట్ సమీపంలో ఈ  ధాన్యం బాబా ఉంటున్నారు. ఇతనిని చూసేందుకు జనం క్యూ(Queue) కడుతున్నారు. బాబా తన తలపై పంటలను ఎలా పండిస్తున్నాడో చూసి తెగ ఆశ్చర్యపోతున్నారు. 

ఇది కూడా చదవండి: బీహార్‌ భూకంపం: 90 ఏళ్ల క్రితం ఇదేవిధంగా.. చెరగని ఆనవాళ్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement