
ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమాల్లో ఒకటైన మహా కుంభమేళా 2025లో రోజూ దాదాపు 20 మిలియన్ల(రెండు కోట్లు) మంది భక్తులు పాల్గొన్నారని అంచనా. ఈ భారీ జన సమూహం ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చాటడమే చేయడమే కాకుండా టెలికాం పరిశ్రమపై గణనీయమైన ప్రభావం చూపింది. టెలికమ్యూనికేషన్స్ విభాగం, సర్వీస్ ప్రొవైడర్ల సహకారంతో లక్షలాది మంది భక్తులకు అంతరాయం లేని కనెక్టివిటీని అందించేందుకు డేటా ట్రాఫిక్‌ను నిశితంగా పర్యవేక్షించినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
రంగంలోకి దిగిన టెలికాం దిగ్గజాలు
మహా కుంభమేళా సమయంలో పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా జియో, ఎయిర్‌టెల్ వంటి ప్రముఖ టెలికాం కంపెనీలు కొత్త సైట్లను, అదనంగా స్పెక్ట్రమ్‌ను జోడించి ముందస్తు చర్యలు చేపట్టాయి. పెరిగిన డేటా ట్రాఫిక్‌ను నిర్వహించడానికి, భక్తులకు అంతరాయం లేని సేవలను అందించడానికి ఈ వ్యూహాత్మక చర్య ఎంతో అవసరమైంది. దాంతో డేటా ట్రాఫిక్ గణనీయంగా 55% పెరిగినట్లు కంపెనీ తెలిపాయి.
కంపెనీలకు ఆదాయం పెంపు
మహా కుంభమేళా 2025 సందర్భంగా డేటా వినియోగం పెరగడం టెలికాం కంపెనీలకు గణనీయమైన ఆదాయాన్ని సమకూర్చినట్లు నిపుణులు తెలుపుతున్నారు. పెరిగిన డేటా ట్రాఫిక్ ప్రతి వినియోగదారుడి నుంచి సంస్థలకు వచ్చే సగటు ఆదాయాన్ని (ఏఆర్‌పీయూ) 4% నుంచి 6% వరకు పెంచుతుందని అంచనా. మిలియన్ల మంది ప్రజల కమ్యూనికేషన్ అవసరాలను తీర్చేందుకు మెరుగైన టెలికాం మౌలిక సదుపాయాలను అందించడంతోనే ఇది సాధ్యమైందని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: సెబీ కొత్త చీఫ్‌గా తుహిన్ కాంత పాండే
పరస్పర సహకారం
సర్వీస్ ప్రొవైడర్లతో కలిసి టెలికమ్యూనికేషన్స్ విభాగం ఈ మహా కుంభమేళాలో కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాల నిర్వహణలో కీలక పాత్ర పోషించింది. క్రౌడ్ మూవ్‌మెంట్, డేటా ట్రాఫిక్‌ను పర్యవేక్షించడం ద్వారా నెట్‌వర్క్ స్థిరంగా, సమర్థవంతంగా ఉండేలా చూసుకున్నారు. టెలికాం విభాగం, సర్వీస్ ప్రొవైడర్ల మధ్య ఈ సహకారం పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహించడంలో ఎంతో అవసరమనే విషయాన్ని హైలైట్ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment