న్యూఢిల్లీ: ఒక హోటెల్‌లో స్విమ్మింగ్ పూల్ లేదా ఆ హోటెల్‌కు సంబంధించిన ఓపెన్ ఏరియాల వద్ద సర్వ్ చేసే ఆహారం, పానీయాలకు కూడా సేవల పన్ను వర్తిస్తుంది. రెస్టారెంట్లలో ఆయా ప్రాంతాల్లో కస్టమర్లకు అందించే సదుపాయాలు సేవల పరిధిలోకే వస్తాయని స్పష్టం చేసింది. రెస్టారెంట్ సేవలకు సంబంధించి వచ్చిన కొన్ని సందేహాలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) వివరణ ఇచ్చింది.
పరోక్ష పన్ను వ్యవస్థకు సంబంధించిన వ్యవహారాలను సీబీఈసీ పర్యవేక్షించే సంగతి తెలిసిందే. కాగా రెస్టారెంట్లలో వాటర్ బాటిల్ వంటి ఎంఆర్‌పీ (మాగ్జిమం రిటైల్ ప్రైస్) ధరలకు అమ్మే ఉత్పత్తులపై సేవల పన్ను వర్తించబోదని కూడా సీబీఈసీ పేర్కొంది. ఎయిర్ కండీషనింగ్ లేదా సెంట్రల్ ఎయిర్ హీటింగ్ సౌకర్యంతో ఉన్న రెస్టారెంట్లలో సర్వ్ చేసే ఆహారం, పానీయాలపై సేవల పన్ను వర్తిస్తుందని అయితే నాన్-ఎయిర్ కండీషన్డ్ రెస్టారెంట్లలో సర్వీసులను దీని నుంచి మినహాయించడం జరిగిందని సీబీఈసీ ఒక ప్రకటనలో పేర్కొంది. రెస్టారెంట్లలో 12 శాతం సేవల పన్నుతో పాటు ఫుడ్ బిల్లు 40 శాతంపై సెస్‌ను చార్జ్ చేస్తారు.
స్విమ్మింగ్ పూల్ వద్ద సర్వ్ చేసినా సేవా పన్ను తప్పదు
Published Thu, Oct 10 2013 12:27 AM | Last Updated on Fri, Sep 1 2017 11:29 PM
Advertisement