
అభ్యర్థులకు ప్రభుత్వ నిధులు అసాధ్యం
న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీ చేసేవారికి ప్రభుత్వమే నిధులు సమకూర్చడం సాధ్యం కాదని ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పారు. దేశంలో ఉన్న పరిస్థితులకు ఆ విధానం సాధ్యం కాదని గురువారం లోక్‌సభలో చర్చలో అన్నారు. ఎన్నికల సంఘం సూచనల మేరకే రాజకీయ పార్టీలకు నగదు రూపంలో ఇచ్చే విరాళాల పరిమితిని రూ. 20 వేల రూ. 2 వేలకు తగ్గించామని వెల్లడిం చారు.
దీనిని మెరుగ్గా అమలు చేసేందుకు సూచనలు చేస్తే స్వాగతిస్తామన్నారు. ప్రజలు పార్టీలకు ఇచ్చే విరాళాలను చట్టబద్ధం చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. చెక్కుల ద్వారా చెల్లింపులు చేస్తే విరాళాలు ఇచ్చిన వారు, తీసుకున్న వారు పన్నుతో వచ్చిన లాభాన్ని పొందుతారని అన్నారు.