ఇన్నేళ్లకు స‘పోర్టు’
- కాకినాడ డీప్ వాటర్, యాంకరేజ్ పోర్టులకు కేంద్ర బడ్జెట్‌లో చోటు
- హార్డ్‌వేర్ పార్కు ఏర్పాటు చేస్తామన్న కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ
- కార్మికులకు ఉపాధితో పాటు ఎగుమతులు పెరుగుతాయని పోర్టు వర్గాల హర్షం
కాకినాడ క్రైం : ఇన్నేళ్లకు కాకినాడ పోర్టుపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్ర సాధారణ బడ్జెట్‌లో కాకినాడ పోర్టు అభివృద్ధికి స్థానం కల్పించింది. పోర్టులో హార్డ్‌వేర్ పార్కు ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గురువారం తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కాకినాడలో డీప్‌వాటర్, యాంకరేజ్ పోర్టులు న్నాయి. వందేళ్లపైగా చరిత్ర కలిగిన యాంకరేజ్ పోర్టు నుంచి బియ్యం, మొక్కజొన్న వంటి వి, అత్యాధునిక వసతులతో ఏర్పాటైన డీప్ వా టర్ పోర్టు నుంచి క్రూడాయిల్, వంట నూనె, బొగ్గు, ఎరువులు, గ్రానైట్ రాళ్లు ఎగుమతవుతున్నాయి.
యాంకరేజ్ పోర్టులో నెలకు సుమారు 10 ఓడల్లో, డీప్‌వాటర్ పోర్టులో రమారమి రో జుకు పది ఓడల్లో ఎగుమతి దిగుమతులు జరుగుతుంటాయి. కోట్లాది రూపాయల వ్యాపార లావాదేవీలు జరుగుతుండడంతో భారీ స్థాయి లో విదేశీ మారకద్రవ్యం కేంద్ర ప్రభుత్వానికి లభిస్తోంది. అయితే ఇప్పటివరకు ప్రభుత్వాలు దృష్టి పెట్టకపోవడంతో యాంకరేజ్ పో ర్టు దాదాపు నిర్వీర్యమైపోయింది. కనీసం జట్టీలు కూడా లేక, రోడ్లు సక్రమంగా లేక ఎగుమతి దిగుమతులకు వ్యాపారులు వెనుకడుగు వేస్తున్నారు. వందేళ్ల క్రితం కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి బీడు పాళీలు, పొగాకు కూడా ఎగుమతయ్యేవి.
సౌకర్యాలు లేకపోవడంతో చాలా సరుకులు ముంబై, విశాఖపట్నం ఓడ రేవులకు తరలిపోవడంతో పోర్టుపై ఆధారపడిన వేల మంది కూలీల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ప్రస్తుత కేంద్రం కాకినాడ పోర్టు అభివృద్ధిపై దృష్టి సారించడంతో వేల మందికి ఉపాధితో పాటు భారీస్థాయిలో వ్యాపారం జరిగే అ వకాశం ఉందని పోర్టు వర్గాలు పేర్కొంటున్నా యి. కాకినాడ పోర్టులో హార్డ్‌వేర్ పార్కు అభివృ ద్ధి చేయడమే కాక త్వరలోనే కస్టమ్స్ కమిషరేట్ కూడా ఇక్కడికి మారనుంది. కాకినాడ పోర్టును అనుసంధానం చేస్తూ విశాఖ- చెన్నై ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి కూడా ప్రణాళికలు రూపొం దించడంతో కాకినాడ పోర్టుకు మహర్దశ పడుతుందని భావిస్తున్నారు. ఇక్కడ కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ ఏర్పాటుకు కూడా కేంద్రం సుముఖంగా ఉండడంతో పోర్టు ఆదాయం గణనీయంగా పెరుగుతుందని వ్యాపారులంటున్నారు.