‘చిన్న హోటళ్లకు జీఎస్టీ వద్దు’
సాక్షి, న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలు వల్ల చిన్న హోటళ్లపై భారం పడకుండా చూడాలని ఆర్థిక మంత్రి జైట్లీని దక్షిణాది హోటళ్ల సమాఖ్య కోరింది. తెలంగాణలో 30 వేలు, ఏపీలో 40 వేలు వరకు చిన్న, మధ్యతరహా హోటళ్లు ఉన్నాయని, 80 శాతం మంది ప్రజలు వీటినే ఆశ్రయిస్తుంటారని పేర్కొంది. స్టార్ గుర్తింపు లేని హోటళ్లకు పన్ను ఐదు శాతం మించకుండా చూడాలని మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలంగాణ రాష్ట్ర హోటళ్ల సంఘం అధ్యక్షుడు వెంకట రెడ్డి చెప్పారు.