జీఎస్టీ పరిధిపై వీడని ప్రతిష్టంభన
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అధికార పరిధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రతిష్టంభన వీడలేదు. ఆదివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి జైట్లీ ఏర్పాటు చేసిన అనధికారిక సమావేశంలో ప్రతిష్టంభనను తొలగించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఎకై ్సజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ వంటి పన్నుల స్థానంలో వచ్చిన జీఎస్టీపై కేంద్రం, రాష్ట్రాల అధికార పరిధి ఎలా ఉండాలన్న దానిపై మూడు గంటల పాటు చర్చించినప్పటికీ ఓ నిర్ణయానికి రాలేకపోరుునట్లు తెలిసింది. రూ. 1.5 కోట్ల వార్షిక టర్నోవర్ కలిగిన వ్యాపారాలకు సంబంధించిన జీఎస్టీపై పూర్తి అధికారం తమకే ఇవ్వాలని రాష్ట్రాలు పట్టుబడుతూ ఉన్న నేపథ్యంలో సోమవారం మళ్లీ ఒకసారి భేటీ జరగనుంది.
‘సమావేశం అర్ధంతరంగా ముగిసింది. ఈ నెల 25న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగేంతవరకూ దీనిపై చర్చలు కొనసాగుతూనే ఉంటారుు’అని జైట్లీ చెప్పారు. ఉత్తరాఖండ్ ఆర్థిక మంత్రి హృదయేష్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్, కేరళ, ఉత్తరాఖండ్, యూపీ, తమిళనాడు వంటి రాష్ట్రాలు రూ. 1.5 కోట్ల వార్షిక టర్నోవర్ కలిగిన చిన్న వ్యాపారాల సరుకులు, సేవలపై పన్నులు వసూలు చేసే అధికారం తమకే ఇవ్వాలని కోరాయన్నారు. సేవలను మినహారుుంచి సరుకులపై పన్ను వసూలు అధికారం ఇచ్చేందుకే కేంద్రం అంగీకరిస్తోందన్నారు.
ఈ నెల 25న మళ్లీ భేటీ: ఈటెల
ఈ నెల 25న మళ్లీ సమావేశమయ్యేందుకు నిర్ణరుుంచామని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రూ. 1.5 కోట్ల ఆదాయమున్న డీలర్ల నుంచి రాష్ట్రాలు, ఆపైన ఆదాయముంటే కేంద్రం వసూలు చేయాలనే ప్రతిపాదనలపై చర్చించామన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత రాష్ట్రాల్లో పరిస్ధితులను ఆర్థిక మంత్రులు జైట్లీకి వివరించారని చెప్పారు. పాత నోట్లతో బకారుుల వసూలు గడువును ఈ నెల 24 నుంచి మరి కొద్ది రోజుల పెంచాలని కోరామని, సానుకూలంగా స్పందించారన్నారు.