Minister itala
-
కాంగ్రెస్‌కు భవిష్యత్ శూన్యం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా మోకాలడ్డుతోందని.. ఎన్ని కుప్పిగంతులేసినా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ ఉండదని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. శనివారం కరీంనగర్‌లోని మానేరువాగుపై రూ.149 కోట్లతో నిర్మించనున్న కేబుల్ బ్రిడ్జి, కమాన్ నుంచి సదాశివపల్లి వరకు రూ.34 కోట్లతో చేపట్టనున్న నాలుగు లేన్ల రహదారి పనులకు మంత్రి ఈటల రాజేందర్‌తో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తుమ్మల మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు పెట్టిన నాటి నుంచి కాంగ్రెస్ నేతలు కోర్టుల్లో కేసులు వేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు ప్రజలెవరూ పట్టించుకునే స్థితిలో లేరని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజల అవసరాలను తెలుసుకుని పనిచేస్తోందన్నారు. ప్రాజెక్టులు, కరెంటు, రహదారులు, సంక్షేమం ఇలా అన్ని రంగాల్లో రాజకీయాలకు అతీతంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ ముందుకు పోతున్నామన్నారు. కరీంనగర్లో రూ.149 కోట్లతో నిర్మాణం జరగనున్న కేబుల్ బ్రిడ్జి సౌతిండియాలోనే మొదటిదని అన్నారు. బ్రిడ్జి పూర్తయితే కరీంనగర్‌కు మణిహారంలా ఉంటుందన్నారు. కరీంనగర్ ప్రజలు హక్కుదారులు.. ఉద్యమాన్ని భుజాల మీద వేసుకొని ప్రత్యేక రాష్ట్రం సిద్ధించే వరకు పోరాడిన కరీంనగర్ ప్రజలు ప్రభుత్వంలో హక్కుదారులని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ ఎంపీ, మంత్రి పదవులకు రాజీనామా చేసి ఉపఎన్నికల్లో పోటీ చేస్తే ఇక్కడి ప్రజలు అక్కున చేర్చుకున్నారని చెప్పారు. ఎన్ని జన్మలెత్తినా కరీంనగర్ ప్రజల రుణం తీర్చుకోలేనని కేసీఆర్ క్లాక్‌టవర్ సాక్షిగా చెప్పారని అన్నారు. ఎన్ని నిధులైనా అడిగి తీసుకునే హక్కు మనకుందన్నారు. కాళేశ్వరం పూర్తయితే తెలంగాణ పచ్చగా మారిపోతుందని, కరీంనగర్ వాటర్‌హబ్‌గా నిలుస్తుందని మంత్రి చెప్పారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, మేయర్ రవీందర్‌సింగ్, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
సౌతిండియాలో మొదటి కేబుల్ బ్రిడ్జి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా కేబుల్ బ్రిడ్జి నిర్మాణం కరీంనగర్లో జరగనుంది. దేశంలో ఇది మూడో బ్రిడ్జిగా ప్రసిద్ధిచెందనుంది. మానేరు నదిపై అత్యాధునిక టెక్నాలజీతో రూ.149 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న కేబుల్ బ్రిడ్జి పనులను రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ శనివారం ప్రారంభించనున్నారు. నిర్మాణ పనులను టాటా కన్సల్టెన్సీ, థాయ్‌లాండ్‌కు చెందిన గులేర్మాక్ సంస్థతో కలిసి చేపట్టనుంది. పూర్తిగా విదేశీ పరిజ్ఞానంతో రూపొందుతున్న ఈ కేబుల్ బ్రిడ్జి కరీంనగర్‌కు మణిహారంలా మారనుంది. గత అక్టోబర్‌లో బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం అనుమతినిచ్చి, నిధులు విడుదల చేసింది. 21.5 మీటర్ల వెడల్పు, 520 మీటర్ల పొడవు, 16 మీటర్ల ఎత్తుతో ఈ బ్రిడ్జిని నిర్మించనున్నారు. కేబుల్‌కు సపోర్టు ఇచ్చేందుకు 45 మీటర్ల ఎత్తులో రెండు టవర్లు ఏర్పాటు చేయనున్నారు. 2.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్ నిర్మాణం చేపట్టనున్నారు. మరోవైపు రూ.34 కోట్లతో కమాన్ నుంచి సదాశివపల్లి వరకు నాలుగు లైన్ల రోడ్డు పనులకూ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగసభలో మంత్రులు మాట్లాడనున్నారు. రోడ్డు, బ్రిడ్జి పనులు పూర్తయితే కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్లేందుకు సుమారు 7 కి.మీ. దూరం తగ్గనుంది. ఏడాదిలోగా ఈ పనులు పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాను పర్యాటక రంగంలో అభివృద్ధి చేస్తామని ఇటీవలి పర్యటనలో ప్రకటించిన సీఎం కేసీఆర్.. మానేరు రివర్‌ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జి, ఐటీ టవర్లను మంజూరు చేశారు. -
పరిమళించిన సాహితీ సుగంధం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహా సభల నాలుగో రోజున సాహితీ సుగంధాలు పరిమళించాయి. అన్ని వేదికలు భాషాభిమా నులతో కళకళలాడాయి. పలు వేదికల వద్ద పిల్లలు, పెద్దలు కుటుంబాలతో సహా సభలకు తరలిరావడం కనిపించింది. ఎల్బీ స్టేడియంలోని బమ్మెర పోతన వేదికపై సాహిత్య సభలో ‘తెలంగాణ పాట జీవితం’పై సదస్సు నిర్వ హించారు. ప్రముఖ కవి, గాయకుడు సుద్దాల అశోక్‌తేజ దీనికి అధ్యక్షత వహించగా.. మంత్రి ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ప్రజా జీవితంతో ముడిపడిన పాటపై ఈ కార్యక్రమంలో ఆసక్తికర చర్చ జరిగింది. ఉద్యమాల్లో, ప్రజల దైనందిన జీవితంలో పాట పెనవేసుకున్న తీరును వక్తలు వివరించారు. శ్రమకు పాటకు ఉన్న సంబంధం, సమాజ పరిణామ క్రమంలో పరవళ్లు తొక్కిన పాటపైన అశోక్ తేజ మాట్లాడారు. ప్రముఖ సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, రసమయి బాల కిషన్, జయరాజ్, దేశపతి శ్రీనివాస్ తదితరు లు పాటకు, తెలంగాణ సంస్కృతి సాంప్రదా యాలకు, సాహిత్యానికి ఉన్న అనుబంధాన్ని వివరించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో మలేసియా తెలుగువారి సాంస్కృతిక కదంబం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ సినీ కళాకారులు, సినీ మ్యూజీషియన్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సినీ సంగీత విభావరి’ ప్రేక్షకులను అలరించింది. విమర్శ–పరిశోధనపై సదస్సు తెలుగు వర్సిటీలో ‘తెలంగాణ విమర్శ– పరిశోధన’ అన్న అంశంపై జరిగిన సదస్సులో అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షత వహించగా.. రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి కీలకోపన్యాసం చేశారు. రాష్ట్రంలో 200 ఏళ్ల క్రితమే తెలుగు సాహిత్యంలో విమర్శ వచ్చిందని చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. ఆచార్య కోవెల సంపత్కుమారా చార్య, సురవరం ప్రతాపరెడ్డి, సి.నారాయణ రెడ్డి, పింగళి వంటి ఎంతోమంది కవులు విమర్శ, పరిశోధనలను సాహిత్య ప్రక్రియ లుగా అభివృద్ధి చేశారని వివరించారు. తాను త్వరలో కాకతీయుల చరిత్రపై గ్రంథం రాయనున్నట్లు మధుసూదనాచారి చెప్పారు. లక్ష్మణ చక్రవర్తి, బాలశ్రీనివాసమూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆకట్టుకున్న కార్యక్రమాలు తెలుగు వర్సిటీలోనే.. శతక, సంకీర్తనా, గేయ సాహిత్యంపై సదస్సు జరిగింది. ఇందులో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆచార్య కసిరెడ్డి వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సుద్దాల అశోక్‌తేజ పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇందులో ఆశావాది ప్రకాశ్‌రావు, జె.బాపురెడ్డి, వెలిచాల కొండలరావు తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకు కవి సమ్మేళనం నిర్వహించారు. మంత్రి మహేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో.. దేవరాజు మహారాజు, పాపినేని శివశంకర్, తిరుమ ల శ్రీనివాసాచార్యతోపాటు పలువురు కవులు, కవయిత్రులు పాల్గొన్నారు. ఇక తెలంగాణ సారస్వత పరిషత్తులో శతా వధానం ఆసక్తికరంగా సాగింది. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహిం చిన బృహత్ కవి సమ్మేళనంలో పలువురు కవులు కవితాగానం చేశారు. నేడు ముగింపు.. హాజరుకానున్న రాష్ట్రపతి కన్నుల పండుగగా జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు మంగళవారంతో ముగియనున్నాయి. ఎల్బీ స్టేడియంలో జరిగే ముగింపు వేడుకల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఆయన మంగళవారం మధ్యాహ్నం 2.55 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం ఐదు గంటల సమ యంలో ఎల్బీ స్టేడియానికి చేరుకుంటారు. 6.10 గంటలకు తిరిగి రాజ్‌భవన్‌కు వెళతారు. అనంతరం పలువు రితో సమావేశమవుతారు. రాత్రికి రాజ్‌భవన్‌లోనే బస చేస్తారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధ విగ్రహాన్ని సందర్శించిన అనంతరం ఢిల్లీకి బయలుదేరి వెళతారు. వాడుక భాషను ప్రామాణికం చేయాలి రవీంద్ర భారతి మినీ ఆడిటోరియంలో పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో తెలుగు అంశంపై సదస్సు జరిగింది. ఇందులో ఎంపీ కేశవరావు, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సీనియర్ సంపాదకులు పొత్తూరి వెంకటేశ్వర్రావు, జీఎస్ వరదాచారి, కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల వాడుక భాషను ప్రామాణికం చేసేందుకు పత్రికలు, ప్రెస్ అకాడమీ కృషి చేయాల్సి ఉందని వక్తలు సూచించారు. - అనంతరం న్యాయం, పరిపాలన రంగాల్లో తెలుగు అంశంపై నిర్వహించిన సదస్సులో ముఖ్యఅతిథిగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్, విశ్రాంత న్యాయమూర్తులు చంద్రయ్య, మంగారి రాజేందర్, సీనియర్ అధికారులు పార్థసారథి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. న్యాయస్థానాలు, పరిపాలన, శాసన రంగాల్లో తెలుగు భాషను వినియోగించాల్సి ఉందని ఈ సందర్భంగా వక్తలు అభిప్రాయపడ్డారు. - రవీంద్ర భారతి ప్రధాన హాల్లో ‘తెలంగాణ మహిళా సాహిత్యం’పై సదస్సు జరిగింది. ఆచార్య సూర్య ధనుంజయ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముదిగంటి సుజాతారెడ్డి, కొండపల్లి నిహారిక, జూపాక సుభద్ర తదితరులు ప్రసంగించారు. అనంతరం మహిళా కవయిత్రుల సమ్మేళనం జరిగింది. నేటి తీర్మానాలివీ.. - ఒకటి నుంచి 12వ తరగతి వరకు కచ్చితంగా తెలుగు భాష అమలు. - ప్రభుత్వం విడుదల చేసే జీవోలు, ఉత్తర్వులను తెలుగులో వెలువరించడం. - అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయా లు, సంస్థల్లో నేమ్ బోర్డులు (నామ ఫలకాలు) తెలుగులో రాయాలనే నిబంధన - వీటితో పాటు మరికొన్ని అంశాలపైన తీర్మానాలు చేయనున్నారు. -
జీఎస్టీని వీడని బాలారిష్టాలు!
సాక్షి, హైదరాబాద్: వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చి రెండున్నర నెలలు గడుస్తున్నా బాలారిష్టాలు వీడడం లేదు. ముఖ్యంగా జీఎస్టీఎన్ పోర్టల్‌లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు అటు డీలర్లను, ఇటు ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నాయి. దాంతో ఆగస్టులో దాఖలు చేయాల్సిన పన్ను రిటర్నుల ప్రక్రియ.. సెప్టెంబర్ నెల ముగుస్తున్నా 40 శాతం దాటకపోవడం గమనార్హం. సాంకేతిక సమస్యలకు తోడు డీలర్ల నిర్లక్ష్యం, అవగాహనా లోపం, దసరా సెలవులు కలిపి పన్నుల వసూలు తగ్గి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఇబ్బందికర పరిస్థితికి చేరుకుంది. జాతీయ సగటు కన్నా తక్కువే.. జీఎస్టీ రిటర్నుల దాఖలులో తెలంగాణ రాష్ట్రం చాలా వెనుకబడిందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి రాగా.. ఆ నెలకు సంబంధించి ఆగస్టు 20కల్లా రిటర్నులు దాఖలు చేయాల్సి ఉండేది. కానీ పోర్టల్‌లో ఎదురవుతున్న సమస్యలు, జీఎస్టీపై అవగాహనకు సమయం కావాలన్న యోచనతో గడువును సెప్టెంబర్ 15 వరకు పెంచారు. దీంతో కొంతమేర రిటర్నుల దాఖలు పెరిగింది. జూలై నెలకు గాను దేశవ్యాప్తంగా 83 శాతం రిటర్నులు దాఖలుకాగా.. మన రాష్ట్రంలో మాత్రం 74.78 శాతమే వచ్చాయి. దాంతో గడువును తిరిగి సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు. ఇక ఆగస్టు నెలకు సంబంధించిన రిటర్నులను సెప్టెంబర్ 20 వరకు దాఖలు చేయాలి. ఈ గడువును కూడా సెప్టెంబర్ 30 వరకు పెంచారు. కానీ ఆగస్టు నెల రిటర్నుల దాఖలు మాత్రం వెనుకబడిపోయింది. ఆగస్టుకు సంబంధించి దేశవ్యాప్తంగా సగటున 48.57 శాతం రిటర్నులు నమోదుకాగా... రాష్ట్రంలో మాత్రం 39.48 శాతమే నమోదయ్యాయి. ప్రభుత్వం తిరిగి గడువు పొడిగిస్తుందనే ఉద్దేశంతోనే డీలర్లు జాప్యం చేస్తున్నారని పన్నుల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అయితే డీలర్లు మాత్రం విభిన్న వాదన వినిపిస్తున్నారు. వ్యాట్ ఉన్నప్పుడు పన్ను కట్టకపోయినా రిటర్నులు దాఖలు చేసేవారమని.. ఇప్పుడు జరిగిన వ్యాపారంపై పన్ను కడితేనే జీఎస్టీఎన్ పోర్టల్ రిటర్నులను స్వీకరిస్తోందని చెబుతున్నారు. వ్యాపారాల్లో డబ్బు చెల్లింపులకు గడువు ఉంటుందని.. అందువల్ల పన్ను చెల్లింపునకు ముందే రిటర్నుల దాఖలుకు అవకాశమివ్వాలని కోరుతున్నారు. ఎన్నో సమస్యలు జీఎస్టీఎన్ పోర్టల్‌లో ఎదురవుతున్న సమస్యల పరిష్కారం కోసం మంత్రుల సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఈనెల 9న హైదరాబాద్‌లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ మోదీ అధ్యక్షతన రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్, మరో మూడు రాష్ట్రాల మంత్రులు సభ్యులుగా సంఘాన్ని నియమించారు. ఈ సంఘం ఈ నెల 20న ఢిల్లీలో సమావేశమై చర్చించింది. మొత్తం 25 రకాల ప్రధాన సమస్యలు జీఎస్టీ పోర్టల్‌లో ఎదురవుతున్నాయని గుర్తించింది. వాటిని తక్షణమే పరిష్కరించాలని జీఎస్టీఎన్కు సాంకేతిక సహకారం అందిస్తున్న ఇన్ఫోసిస్ సంస్థ ప్రతినిధులకు సూచించారు. కానీ ఇంకా ఆ సమస్యలను పరిష్కరించకపోవడంతో జీఎస్టీఎన్ సర్వర్ డౌన్ కావడం, అప్ లోడింగ్‌కు సహకరించకపోవడం వంటి ఇబ్బందులు వెంటాడుతూనే ఉన్నాయి. -
ప్రజోపయోగ పనులపై జీఎస్టీ వద్దు
-
ప్రజోపయోగ పనులపై జీఎస్టీ వద్దు
జీఎస్టీ కౌన్సిల్ భేటీలో ప్రతిపాదిస్తాం: ఈటల - కుదరకుంటే 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని కోరతాం - హైదరాబాద్ వేదికగా నేడే కౌన్సిల్ 21వ సమావేశం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం చేపట్టే ప్రజోపయోగ పనులపై జీఎస్టీని రద్దు చేయాలని, లేదంటే దాన్ని ప్రస్తుతమున్న 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తూ సవరించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనున్నట్లు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. శనివారం హైదరాబాద్ వేదికగా జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ 21వ సమావేశంలో జీఎస్టీ అమలుతో రాష్ట్రంపై పడుతున్న ఆర్థిక భారాన్ని మరోసారి ప్రస్తావిస్తామన్నారు. తెలంగాణలో ఏయే రంగాలపై ఆ ప్రభావముంది.. ఎంత నష్టం జరుగుతుందో అంచనాలు తయారు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలగకుండా పన్నుల విధానముండాలని తొలి నుంచీ చెబుతున్నామని, అందుకు అనుగుణంగానే కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఈసారి జరిగే సమావేశం తెలంగాణకు అనుకూలంగా ఉంటుందని మంత్రి ఈటల ఆశాభావం వ్యక్తం చేశారు. ఉదయం 11 గంటల నుంచి 5 గంటల వరకు జరిగే ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి, జీఎస్టీ కౌన్సిల్ చైర్మన్ అరుణ్ జైట్లీ సారథ్యం వహించనున్నారు. మూడు అంశాలను ప్రస్తావిస్తాం... ‘‘పన్నుల విధానం అనుసరణీయంగా ఉండాలని తొలి నుంచీ చెబుతున్నాం. అం దుకే తెలంగాణ లేవనెత్తే డిమాండ్లను దేశం లోని చాలా రాష్ట్రాలు బల పరుస్తున్నాయి. నిర్మాణంలో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులు, గృహ, రహదారుల నిర్మాణంపై 12 శాతం జీఎస్టీ విధించడంతో తెలంగాణలోనే దాదాపు రూ. 9 వేల కోట్ల నష్టం రానుంది. అందుకే వాటిపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని కోరతాం. అంతర్రాష్ట్ర జీఎస్టీ (ఐజీఎస్టీ) నుంచి రాష్ట్రాలకు వాటా త్వరగా రావట్లేదు. పన్నుల్లో రాష్ట్రాల వాటా కూడా ఆలస్యమవుతోంది. ఆన్లైన్లో ఉన్న ఇబ్బందులను కూడా ఇందులో ప్రస్తావిస్తాం. జీఎస్టీ అమలుతో లాభమా నష్టమా అనేది వచ్చే నెలలో స్పష్టత వస్తుంది. ఐజీఎస్టీ ద్వారా తెలంగాణకు ఎంత ఆదాయం వస్తుందనేది ఇంకా తేలలేదు’’అని ఈటల వివరించారు. ఏర్పాట్లపై సమీక్ష... జీఎస్టీ కౌన్సిల్ భేటీ హైదరాబాద్‌లో తొలిసారి జరుగుతుండటంతో ఈ సమావేశానికి అన్ని ఏర్పాట్లూ చేశామని, అతిథులకు ఇబ్బందుల్లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని ఈటల చెప్పారు. సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఉన్నందున జీఎస్టీ కౌన్సిల్ సమావేశ బాధ్యతలను ఈటలతోపాటు పర్యవేక్షిస్తున్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి హరీశ్‌రావు శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌తో ఏర్పాట్లపై చర్చలు జరిపారు. జీఎస్టీ భేటీ తర్వాత స్థానిక వ్యాపార, వాణిజ్య వర్గాలు వినతులను అరుణ్ జైట్లీకి సమర్పిస్తాయని ఈటల వివరించారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ముందు అన్ని రాష్ట్రాల మంత్రుల సమావేశం జరుగుతుంది. రాష్ట్రాలవారీగా డిమాండ్లపై ఇందులో చర్చలు జరుగుతాయి. కౌన్సిల్లో అన్ని రాష్ట్రాలు తమ ప్రతిపాదనలు సమర్పిస్తాయి. ఎజెండాకు స్వీకరించిన అంశాలపై ఓటింగ్ సమయంలో ఒక్కో రాష్టం నుంచి ఒక్కరే పాల్గొంటారు. మధ్యేమార్గంగా కమిటీకి! నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, పను లపై జీఎస్టీని తగ్గించాలన్న డిమాండ్‌పై కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటికే తొలుత 18% ఉన్న పన్నును గత కౌన్సిల్ సమావేశంలో 12 శాతానికి కుదించింది. అయినా రాష్ట్రం ఏకంగా పన్ను రద్దు చేయాలని లేదా 5 శాతానికి కుదించాలని ఒత్తిడి పెంచుతోంది. జీఎస్టీపై వివిధ రాష్ట్రాల ఫిర్యాదులపై ఏర్పాటు చేసిన కమిటీకి కేంద్రం ఈ అంశాన్ని అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో విందు జీఎస్టీ సమావేశంలో రాష్ట్రం తరఫున డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌తోపాటు ఉన్నతాధికారులు పాల్గొంటారు. సమావేశం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున జైట్లీ, వివిధ రాష్ట్రాల మంత్రులు, అతిథుల బృందానికి ఫలక్‌నుమా ప్యాలెస్‌లో విందు ఇవ్వనున్నారు. సమావేశానికి వచ్చే అతిథులకు పోచంపల్లి చేనేత వస్త్రాలతోపాటు రాష్ట్ర పర్యాటక వివరాలు, చారిత్రక సాంస్కృతిక వైభవానికి అద్దంపట్టే జ్ఞాపికలను బహూకరించనున్నారు. -
అందరికీ విద్య ప్రభుత్వ లక్ష్యం
- అంబేడ్కర్ 126వ జయంతి వేడుకల్లో మంత్రి ఈటల - అణగారిన వర్గాలకు ఉచిత విద్య అందించేందుకే గురుకులాలు - దేశానికి ఆదర్శంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం సాక్షి, హైదరాబాద్: దేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి పౌరుడు విద్యావంతుడు కావాలని, ఈ లక్ష్యంతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం విరివిగా గురుకులాలను ఏర్పాటు చేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. శుక్రవారం భారతరత్న, డాక్టర్ బీఆర్ అంబే డ్కర్ 126వ జయంతిని పురస్కరించుకుని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్‌రెడ్డి, పద్మా రావుగౌడ్లతో కలసి ట్యాంక్‌బండ్ వద్ద ఆయ న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఈటల మాట్లాడుతూ, రాష్ట్ర జనాభాలో అధిక శాతం బడుగు, బలహీన వర్గాలే ఉన్నాయని, వారి అభ్యున్నతికి అంబేడ్కర్ ఆశయాలను సూర్తిగా తీసుకుని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. సమ సమాజ స్థాపనే లక్ష్యంగా ముందుకెళ్తు న్నామన్నారు. ఆకలితో ఉన్న కడుపునకు ఆస రా అందిస్తూ అందర్నీ విద్యాధికులను చేసేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు చెప్పారు. మహమూద్ అలీ మాట్లాడుతూ, అంబేడ్కర్ జయంతి సందర్భంగా నగరంలో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయను న్నామని, ఇప్పటికే మంత్రుల బృందం చైనాలో పర్యటించి విగ్రహ నిర్మాణంపై పలు కంపెనీలతో చర్చించిందని తెలిపారు. కార్పొరేట్‌కు దీటుగా గురుకులాలు:జగదీశ్‌రెడ్డి దళితుల కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నామని, ప్రత్యేక రాయితీ లిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నామని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.40 వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. కార్పొరేట్ విద్యకు దీటుగా గురుకుల పాఠశాలలను తీర్చిదిద్దుతా మని, ప్రపంచంలో ఎలాంటి విద్యార్థితోనైనా పోటీ పడేలా గురుకుల విద్యార్థులను తయా రు చేస్తామని చెప్పారు. గతేడాది ప్రారంభిం చిన 23 మహిళా డిగ్రీ కాలేజీ విద్యార్థినులు అన్ని యూనివర్సిటీల్లో టాప్ మార్కులు సాధించారని తెలిపారు. మతపరమైన రిజర్వేషన్లొద్దు: బీజేపీ మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేక మని, అంబేడ్కర్ సైతం ఈ విషయంపై స్పష్ట త ఇచ్చారని బీజేపీ శాసనసభ పక్ష నేత జి. కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ట్యాంక్‌బండ్ వద్ద కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రే య, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌లతో కలసి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మతపరమైన రిజర్వేషన్లు కల్పిస్తూ సరికొత్త వివాదాలను ప్రేరేపిస్తోందని విమర్శించారు. భారతదేశ తొలి కార్మిక మంత్రిగా అంబేడ్కర్ సేవలందిం చారని దత్తాత్రేయ పేర్కొన్నారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రధాని మోదీ శ్రమి స్తున్నా రని, దళితులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిది ద్దేందుకు స్టాండప్ ఇండియా వంటి కార్యక్ర మాలు తీసుకొచ్చారని లక్ష్మణ్ తెలిపారు. దళితుల హామీలు నెరవేర్చాలి: ఉత్తమ్ టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు ఇచ్చి న హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్కొ న్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరిం చుకుని పార్టీ సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, అంజన్ కుమార్, సత్యనారా యణ తదితరులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వంలో సామాజిక న్యాయం కొరవ డిందని, కొన్ని వర్గాలకే పట్టం కడుతున్నా రని విమర్శించారు. దళితులకు ఎన్నో హామీ లిచ్చారని, కానీ వాటి అమలుపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని ఆరోపించారు. కాంగ్రె స్ శాసనసభ పక్ష నేత కె.జానారెడ్డి కూడా అంబేడ్కర్ విగ్రహానికి నివాళుర్పించారు. -
పూలే ఆశయ సాధనకు పునరంకితమవుదాం: ఈటల
పూలే జయంతి ఉత్సవ ఆహ్వానపత్రం విడుదల సాక్షి, హైదరాబాద్: ‘మహాత్మా జ్యోతిబాపూలే బడుగు, బలహీనవర్గాల్ని చైతన్యం చేయడానికి జీవితాంతం కృషి చేశారు. ఆయన ఆశయ సాధనకు పునరంకితమవుదాం, పూలే జయంతి ఉత్సవాలకు ప్రజలంతా తరలి రావాలి’ అని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. శనివారం సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మహాత్మా జ్యోతిబాపూలే రాష్ట్రస్థాయి జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ గణేశ్‌చారి, కమిటీ వైస్ చైర్మన్లతో కలసి పూలే జయంతి ఆహ్వానపత్రాన్ని రాజేందర్ ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలను విద్యావంతుల్ని చేయడానికి పూలే మహోన్నతమైన కృషి చేశారని, విద్య మాత్రమే పేదల జీవితాల్ని మారుస్తుందని చాటిచెప్పారని పేర్కొన్నారు. ఈ నెల 11న జ్యోతిబాపూలే జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తోందని, అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. పూలే ఆశయ సాధన దిశగా ప్రభుత్వం సాగుతోందని, బడుగు, బలహీన వర్గాల ప్రగతితోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ఉద్యమ సమయంలో చెప్పిన మాటకు కట్టుబడి ఆయావర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. గణేశ్ చారి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాకే బీసీలకు అసలైన స్వాతంత్య్రం వచ్చిందని, బీసీ వర్గాలకు, కులవృత్తులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుందని అన్నారు. సమావేశంలో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, బీసీ సంఘం నేత జాజుల శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
పడకేసిన ‘రెండు పడకలు’
- హరీశ్, తుమ్మల, ఈటల, జగదీశ్ ఇలాఖాల్లోనే వేగంగా పనులు - మిగతా మంత్రుల తీరుపై సీఎం ఆరా సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మానసపుత్రిక రెండు పడకల గదుల ఇళ్ల పథకం చాలా మంత్రుల ఇలాఖాల్లో బాలారిష్టాలు వీడడంలేదు. నలుగురు మంత్రుల నియోజకవర్గాల్లో మాత్రం అమాంతం వేగం అందుకుని గృహప్రవేశాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇళ్లను గరిష్ట సంఖ్యలో పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయక తప్పని పరిస్థితి నెలకొన్న కీలక దశలోనూ పనులు పడకేసి కనిపిస్తున్నాయి. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం లాభదాయకం కాకపోవటంతో కాంట్రాక్టర్లు మొహం చాటేస్తున్న తరుణంలో కొన్ని చోట్ల వేగం అందుకోవటానికి ఆయా జిల్లాల మంత్రుల చొరవే కారణంగా కనిపిస్తోంది. ఇలా పనులు పట్టాలెక్కి చకచకా పూర్తి అయ్యేలా చూడడంలో కేవలం నలుగురు మంత్రులకే పాస్ మార్కులు దక్కుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఈ ఇళ్లు కీలక భూమిక పోషించే పరిస్థితి ఉండటంతో కాంట్రాక్టర్ల సహాయ నిరాకరణను సవాల్‌గా స్వీకరించి నలుగురు మంత్రులు ముందడుగు వేస్తుంటే మిగతావారు పెద్దగా చొరవ చూపటం లేదని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు దీన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. ఏయే జిల్లాల్లో ఇళ్ల నిర్మాణం ఊపందుకుందో వివరాలు తెప్పించుకున్నారు. ఇందులో కేవలం నలుగురు మంత్రుల ఇలాఖాల్లోనే సానుకూల అంకెలు కనిపిస్తుండగా, చాలా మంది మంత్రుల జిల్లాల్లో సున్నాలు వెక్కిరిస్తున్నాయి. మంత్రి హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు, ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డిలు ప్రత్యేక చొరవ తీసుకుని కాంట్రాక్టర్లతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ రెండు పడక గదుల ఇళ్లు సిద్ధమయ్యేలా చూస్తున్నారన్న విషయం సీఎం దృష్టికి వెళ్లింది. వారి ఇలాఖాల్లో పనులు చకచకా ముఖ్యమంత్రి దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నరసన్నపేటల్లో 568 ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించారు. ఇవి పోను సిద్దిపేట జిల్లా పరిధిలో మరో 7 వేల ఇళ్లు వేగంగా రూపు దిద్దుకుంటున్నాయి. ఈ జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు రూ.40 కోట్ల పనులు పూర్తయ్యాయి. ఇందులో మంత్రి హరీశ్‌రావు చొరవే ముఖ్యమైంది. ప్రతి వారం కాంట్రా క్టర్లతో చర్చిస్తూ వారిని చైతన్య పరచడం మంచి ఫలితాలని స్తోంది. ఇక్కడ త్వరలో 500 ఇళ్లు గృహప్రవేశాలకు సిద్ధం కాబోతున్నాయి. ఆ తర్వాత రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇలాఖాలో ఇళ్ల నిర్మాణం వేగం అందుకుంది. ఖమ్మం జిల్లా పరిధిలో 1,404 ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఇందులో ఉగాది రోజు 22 ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించారు. త్వరలో మరో 200 ఇళ్లు సిద్ధం కాబోతున్నాయి. సత్తుపల్లి, వైరా, మధిర, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో పనులు వేగంగా సాగుతున్నా యి. ఇందులో ఖమ్మం, పాలేరు, సత్తుపల్లిలోని కొంతభా గంలో ఇళ్ల నిర్మాణ బాధ్యత ఆర్ అండ్ బీ పరిధిలో ఉంది. దీంతో రోడ్లు నిర్మించే కాంట్రాక్టర్లను పిలిపించి మంత్రి తుమ్మల తరచూ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. స్వయంగా ఆయనే ఆ శాఖను పర్యవేక్షిస్తుండటంతో వారిలో చాలామంది ఇళ్ల పనులు చేపట్టేందుకు ముందుకొస్తున్నారు. ఇక సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా పనుల్లో ఇటీవల చొరవ పెంచారు. ఆయన జిల్లాలో ప్రస్తుతం 470 ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాగా వాటిల్లో 192 ఇళ్లు దాదాపు సిద్ధమయ్యాయి. మే 21న వాటి గృహప్రవేశాలకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ జిల్లా కరీంనగర్లో కూడా పనులు ఊపందుకున్నాయి. అక్కడ 225 ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తి కావస్తుండగా గృహప్రవేశానికి దాదాపు 55 ఇళ్లు సిద్ధమయ్యాయి. ఇక వరంగల్ పట్టణంలో 1,484 ఇళ్లు, మహబూబ్‌నగర్ పట్టణంలో 1,334 ఇళ్ల నిర్మాణం జరుగుతున్నా ఈ రెండూ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రత్యేక చొరవతో మంజూరు చేసి సమీక్షిస్తున్నవే కావటం విశేషం. ఇవి పోనూ మరేమంత్రి ఇలాఖాల్లోనూ ఇళ్లు గృహప్రవేశాలకు సిద్ధం కాలేదు. వారు కాంట్రాక్టర్లతో చర్చించి చొరవ చూపకపోవటమే దీనికి కారణమంటూ స్వయంగా అధికారులు ఆరోపిస్తున్నారు. మిగతా మంత్రుల్లాగా వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే తప్ప కాంట్రాక్టర్లు పనులు చేపట్టేందుకు ముందుకు రారని తేల్చి చెబుతున్నారు. -
గొల్లోడు గొర్లే కాయాలి..చాకలోడు బట్టలే ఉతకాలా?
కేసీఆర్ ఇంటి ఇల్లాలితో సహా అధికారం కావాలి ⇒ మాయ మాటలతో మభ్యపెడుతున్నారు: సంపత్‌కుమార్ ⇒ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన అధికారపక్షం ⇒ వృత్తిని నమ్ముకున్న వాళ్లకే నిధులన్న మంత్రి ఈటల సాక్షి, హైదరాబాద్: ‘గొల్లోడు గొర్రెలు కాయా లి.. చాకలోడు బట్టలు ఉతకాలి. మంగలోడు గుండ్లు కొట్టాలి.. మా (కేసీఆర్) ఇంటి ఇల్లాలి తో సహా అధికారం కావాలి. ప్రతిపక్షాలకు మాత్రం బిస్కెట్లు వేస్తారు’’అని కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. దీంతో శుక్ర వారం శాసనసభ ఒక్కసారిగా వేడెక్కింది. సంక్షే మ శాఖల పద్దులపై చర్చ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడారు. కులవృత్తులను ప్రోత్స హించేందుకు బడ్జెట్లో భారీ కేటాయింపులు జరపడం వెనక ప్రభుత్వ ఉద్దేశాలను ప్రశ్నిం చారు. ‘తెలంగాణ జనాభాలో 80 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం మళ్లీ మళ్లీ అడగాల్సి వస్తోంది. మా ఆక్రందన, ఆర్తనాదాలు, కడుపు మంటను ప్రభుత్వం పట్టించు కోవడం లేదు. దళితుడిని సీఎం చేస్తానన్న గొప్ప మ నిషిని చూడలేదని సంబర పడ్డాం. కానీ మోసగిం చడంతో ఓర్చుకోవడం అలవాటైంది. దళిత పారిశ్రామికవేత్తలకు రూ.400 కోట్లు ఇచ్చామని మంత్రి కేటీఆర్ సభలో పేర్కొన్నారు. ఒక్క రూపాయీ ఇవ్వ లేదు. మాయమాటలతో ఎన్నిసార్లు మోసం చేస్తారు?’ అని నిలదీశారు. టీఎస్ఐపాస్, టీప్రై డ్ అంటూ కేటీఆర్ పదేపదే చెప్పే మాటలతో చెవులు గిల్లుమంటున్నాయని వ్యాఖ్యానించా రు. గిరిజన, ఆదివాసీ, అంబేడ్కర్, పూలే భవ నాలకు శిలాఫలకాలు వేసి మరిచిపోయారని, ఆ స్థలాల్లో పిచ్చి మొక్కలు మొలిచాయన్నారు. రుణమాఫీకి ఎస్సీ,ఎస్టీ నిధుల మళ్లింపు ‘రుణమాఫీ కింద చెల్లించిన సొమ్ములో 26 శాతాన్ని ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల నుంచే మళ్లించారు. జనాభాలో ఎస్సీ, ఎస్టీలు 26 శాతం ఉన్నా.. వారందరికీ భూములు లేవు. అందరూ రుణాలు తీసుకోలేదు..’’అని సంపత్ స్పష్టం చేశారు. 30 లక్షల మంది భూమి లేని ఎస్సీ కుటుంబాలకు మూడెకరాల చొప్పున భూములు పంపిణీ చేస్తామని చెప్పి కేవలం 3,671 మందికి 9,663 ఎకరాలు మాత్రమే పంపిణీ చేశారన్నారు. సంపత్ లేవనెత్తిన అంశాలపై మంత్రి ఈటల బదులిచ్చారు. దేశమంతటా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలు ఇలానే ఉందని, సబ్‌ప్లాన్ నిధులను ప్రత్యక్ష, పరోక్ష పద్ధతుల్లో ఖర్చు చేయడం సాంప్రదాయమని చెప్పారు. 30 లక్షల మంది ఎస్సీలకు ఒకేసారి భూములిస్తామని తాము ఎక్కడా హామీ ఇవ్వలేదన్నారు. అది నిరంతరాయంగా కొనసాగే ప్రక్రియని పేర్కొన్నారు. కుల వృత్తులకు నిధుల కేటాయింపుపై వివరణ ఇస్తూ.. గొప్పగా చదువుకున్నవాళ్లకు, వ్యాపారాలున్న వాళ్లకు నిధులివ్వబోమని.. వృత్తిని నమ్ముకుని బతికేవాళ్లకే ఇస్తామని ఈటల చెప్పారు. కుల వృత్తుల వారిని తక్కువ చేసి చూడవద్దని, మాట్లాడవద్దని సూచించారు. కొత్త సభ్యుడైన సంపత్‌కు అనుభవం, సంయమనం లేదని.. అందుకే ఇలా మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. జానారెడ్డి, ఉత్తమ్‌ల నుంచి సలహాలు తీసుకోవాలని సూచించారు. కాగా సంపత్ మాటల నుంచి సారాన్ని తీసుకుని సమాధానం ఇవ్వాలని విపక్షనేత కె.జానారెడ్డి సర్దిచెప్పారు. గృహ నిర్మాణం అస్తవ్యస్తం రాష్ట్రంలో గృహ నిర్మాణం అస్తవ్యస్తంగా మారిందని, పూర్తిగా ఎత్తేసినట్లు కనిపిస్తోందని సంపత్‌కుమార్ వ్యాఖ్యానించారు. విచారణ పేరిట 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు నిలిపివేశారన్నారు. ఎర్రవల్లి, నర్సన్నపేట, ఐడీహెచ్ కాలనీల్లో కట్టిన 1,400 డబుల్ ఇళ్లను ప్రభుత్వం గొప్పగా చూపించుకుంటోందని.. డబుల్ ఇళ్ల కోసం వచ్చిన 4 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ఈ మూడేళ్లలో 16 వేల డబుల్ బెడ్రూం ఇళ్లను మాత్రమే చేపట్టారని విమర్శించారు. -
వస్తువుల చేర్పుపై రాష్ట్రాలను సంప్రదించాలి
జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మంత్రి ఈటల సాక్షి, న్యూఢిల్లీ: జూలై నుంచి దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు కానున్న నేపథ్యంలో ఇప్పటికే నిర్దేశించిన శ్లాబుల్లో వస్తువుల చేర్పుపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను సంప్రదించాలని మంత్రి ఈటల రాజేందర్ కోరారు. శనివారం ఢిల్లీలో జరిగిన 11వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ చట్టాలకు సంబంధించి అన్ని రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని, కేంద్రపా లిత ప్రాంతాల విషయంలో కొన్ని అంశాలపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర, న్యాయ అధికారులు ఈ చట్టాలపై సమగ్ర విధానాలను రూపొందించారన్నారు. తీర ప్రాంత జలాల్లో 12 నాటికల్ మైళ్ల దూరంలో జరిగే రవాణాపై అధికారాన్ని రాష్ట్రాలకే వదిలేయడంపై కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందన్నారు. జీఎస్టీ అమలుతో ఎక్కువ మంది అర్హులైన వారు పన్ను పరిధిలోకి వస్తారని, ఒకే దేశం–ఒకే పన్ను విధానం అమలవుతుండడంతో ఇక సరిహద్దుల్లో చెక్‌పోస్టులు తొలగించుకోవచ్చన్నారు. వస్తుసేవల రవాణాపై తనిఖీలు నిర్వహించడానికి రాష్ట్రాల కు అధికారాలు ఇవ్వాలని కోరామన్నారు. ఈ నెల 16న జరిగే తదుపరి కౌన్సిల్ సమావేశంలో పెండింగ్‌లో ఉన్న వివిధ అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పూర్తి ఏకాభిప్రాయం కుదురుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
కలెక్టర్ వర్సెస్ ఎమ్మెల్యేలు.
-
కలెక్టర్ వర్సెస్ ఎమ్మెల్యేలు
⇒ మేళాలో ప్రొటోకాల్ వివాదం ⇒ సర్దిచెప్పిన మంత్రి ఈటల కరీంనగర్‌సిటీ: కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియం వేదికగా జరిగిన డీజీ ధన్ మేళాలో ప్రొటోకాల్ వివాదం చోటుచేసుకుంది. మేళాలో భాగంగా సభావేదికపై ఉన్న ఫ్లెక్సీ లో ఎంపీ, ఎమ్మెల్యేల ఫొటోలు లేకపోగా ప్రొటోకాల్‌పరంగా ఆహ్వానించ కుండా అవమానపరిచారంటూ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అసహనం వ్యక్తం చేశారు. సభా వేదిక కింది నుంచి అధికార యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిలిచి అవమానపరుస్తారా అంటూ మండిపడ్డారు. ఆహ్వానం మేరకు అక్కడ నుంచి వేదికను ఆసీనులవుతూనే రసమయి బాలకిషన్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటో కాల్ పాటించకుండా ప్రజా ప్రతినిధులను అగౌరవపరుస్తారా? అంటూ ఫైర్ అయ్యారు. అందుకు కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఘాటు గానే స్పందించడంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఒక దశలో కలె క్టర్ వర్సెస్ ఎమ్మెల్యేలుగా పరిస్థితి మారిపోయింది. తనకు కలెక్టర్‌తో క్షమాపణ చెప్పిం చాలంటూ కేంద్ర మంత్రి దత్తాత్రేయతో రస మయి గట్టిగానే అడిగాడు. ఇంతలో మంత్రి ఈటల రాజేందర్ జోక్యం చేసుకుని సర్ది చెప్పారు. తర్వాత మాట్లాడుకుందామని చెప్పడంతో సద్దుమణిగింది. అనంతరం ఈటల తన ప్రసంగంలో చివరగా ప్రజాప్రతినిధులను అగౌరవపర చడం సరైన సంప్రదాయం కాదని అన్నారు. ఇక్కట చోటు చేసుకున్న సంఘటనపై సమీక్షించు కుంటామని చెప్పారు. -
రేషన్ బియ్యం తిననివారు తీసుకోకండి!
⇒ లబ్ధిదారులు ఇతరులకు బియ్యం అమ్మడం నేరం ⇒ కమాండ్ కంట్రోల్ కేంద్రం ప్రారంభోత్సవంలో మంత్రి ఈటల సాక్షి, హైదరాబాద్: ‘రేషన్ బియ్యం తిననివారు తీసుకోకండి. ఈ బియ్యాన్ని లబ్ధిదారులు ఇతరులకు అమ్మడం నేరం. ప్రజా పంపిణీ ద్వారా ప్రజల కోసం రూ.6,500, కోట్లను ఖర్చు చేస్తున్న సంస్థ ఇది. పారదర్శకంగా సరుకుల సరఫరాకు కమిషనర్ సి.వి. ఆనంద్ తీసుకుంటున్న చర్యలు అభినందనీయం.. ఈ శాఖలో మార్పులకు సహకరిస్తున్న ఉద్యోగులకు అభినందనలు’ అని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో నిత్యావసర సరుకుల పంపిణీలో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్టకు పౌరసరఫరాలశాఖ కమాండ్ కంట్రోల్ వ్యవస్థను సోమాజిగూడలోని ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసింది. మంగళవారం మంత్రి ఈటల ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్ర మంలో రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ ఎస్పీ సింగ్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు. బియ్యం తీసుకోకపోతే కార్డు తిరిగివ్వా లని కోరుతున్నానని ఈటల అన్నారు. సంక్షేమ ఫలాలు పక్కదారి పట్టకుం డా కమాండ్ కంట్రోల్ చేపట్టడం అభినందనీయమని సీఎస్ అన్నారు. త్వరలో అన్ని రేషన్ షాపుల్లో ఈ పాస్: త్వరలో అన్ని రేషన్ షాపుల్లో ఈ పాస్ అమలు చేస్తామని, అన్నీ గోడౌన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని సివిల్ సప్లైస్ కమిషనర్ సి.వి.ఆనంద్ చెప్పారు. కమాండ్ కంట్రోల్ కేంద్రం పనితీరు గురించి, శాఖలో చేపట్టిన సంస్కరణల గురించి వివరించారు. రైస్ మిల్లర్స్ నుంచి బకాయిల వసూళ్లు, గన్నీ బ్యాగుల రిటర్న్, సకాలంలో బియ్యం అందించడం వంటి చర్యలు చేపట్టామని.. దీనివల్ల రూ. 600 కోట్ల లాభం చేకూరిందని చెప్పారు. -
ప్రతిపక్షాల దిమ్మతిరిగేలా రాష్ట్ర అభివృద్ధి
కరీంనగర్ రుణం తీర్చుకోకుంటే ‘తెలంగాణ’కు అర్థముండదు: తుమ్మల కొత్తపల్లి(కరీంనగర్): ప్రతిపక్షాల దిమ్మతిరిగేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. కరీంనగర్ రూరల్ 2 మండలం ఎలగందులలో రూ.60 కోట్లతో ఎల్ఎండీ రిజ ర్వాయర్పై నిర్మించ తలపెట్టిన పాత రహదారి పునరు ద్ధరణ పనులకు ఆదివారం ఆర్థిక మంత్రి ఈటలతో కలసి శంకుస్థాపన చేశారు. ఈ పనులను ఏడాదిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం బహిరంగ సభలో తుమ్మల మాట్లాడుతూ ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టిస్తే అడ్డు తప్పించైనా పనులు చేపడతామన్నారు. బంగారు, ఆకుపచ్చ, భాగ్యవంతమైన తెలంగాణ నిర్మించి తీరు తామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను ఉన్నత స్థానంలో నిలిపిన కరీంనగర్ జిల్లా ప్రజల రుణం తీర్చుకోకుంటే తెలంగాణ సాధించిన అర్థమే ఉండదని తుమ్మల వ్యాఖ్యానించారు. మంత్రి ఈటల మాట్లాడుతూ కరీంనగర్‌ను పర్యాటక కారిడార్‌గా తీర్చిదిద్ది అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించి తెలంగాణలోనే మొదటి స్థానంలో నిలుపుతామన్నారు. -
అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు
- ఎత్తిపోతలకు రూ.50.36 కోట్లు - పదిరోజుల్లో విడుదల చేస్తాం: హరీశ్‌రావు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా మూలన పడిన, మరమ్మతులు చేయాల్సిన ఎత్తిపోతల పథకాల కోసం పదిరోజుల్లో 50.36 కోట్లు విడుదల చేయ నున్నట్టు నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. ఈ నిధులతో 90 ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరించి 70.893 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించ నున్నామని ఆయన చెప్పారు. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్ఎస్ సభ్యుడు జలగం వెంకట్రావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లిఫ్టులపై అడి గిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ఎకరానికి రూ.10వేల కన్నా తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వచ్చే లిఫ్టులు రాష్ట్ర వ్యాప్తంగా 90 ఉన్నాయని, వాటికి తొలిదశలో మరమ్మతులు చేస్తున్నామని మంత్రి చెప్పారు. పాఠశాలలు, హాస్టళ్లకు గ్యాస్ కనెక్షన్లు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లకు దీపం పథకం కింద గ్యాస్కనెక్షన్లు ఇస్తున్నట్టు పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. టీఆర్ఎస్ సభ్యురాలు బొడిగె శోభ, కోవాలక్ష్మి, రేఖా నాయక్‌లు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ తెలంగాణ ఏర్పాటయ్యే నాటికి రాష్ట్రంలో 19.85లక్షల దీపం గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, తాము వచ్చిన తర్వాత 8.51 లక్షలకు పైగా మంజూరు చేశామని చెప్పారు. ఇందుకోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక బడ్జెట్ కూడా పెట్టారని చెప్పారు. అడిగిన ప్రతి ఒక్కరికీ గ్యాస్ కనెక్షన్లు అందిస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను అంచెలంచెలుగా క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. పాత జిల్లా కేంద్రాల్లో వెల్నెస్ సెంటర్లు ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం (ఈజేహెచ్ఎస్) కింద సేవలందించేందుకు గాను అన్ని పాత జిల్లా కేంద్రాల్లోనూ వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఇప్పటికే ఓ కేంద్రాన్ని ప్రారంభించామని, మరో ఐదుచోట్ల ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కేంద్రాల్లో ఓపీ వరకు అవసరమయ్యే అన్నిరకాల వైద్యసేవలు అందుబాటులో ఉంటాయని, వారంలో ఒకటి లేదా రెండుసార్లు స్పెషలిస్ట్ డాక్టర్లను కూడా ఉంచే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత కల్పించే పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. ఉద్యోగుల పక్షాన మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు. డెంగీని ఆరోగ్యశ్రీలో చేర్చాం డెంగీ వ్యాధికి ఆరోగ్యశ్రీ కింద ఇప్పటికే చికిత్స అందిస్తున్నామని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో విషజ్వరాలపై సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఇప్పటికే డెంగీని ఆరోగ్యశ్రీలో చేర్చామని, అయితే, సెప్సిస్ అనే కోడ్‌తో అమలు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ ఏర్పాటయిన తర్వాత 12 చోట్ల ప్లేట్లెట్లను వేరు చేసే కేంద్రాలను ఏర్పాటు చేశామని, విషజ్వరాలు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. విజయ డెయిరీని ఆధునీకరిస్తున్నాం పాడిపరిశ్రమ అభివృద్ధి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు పశుసంవర్ధకశాఖ మంత్రి తల సాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. విజయ డెయిరీని ఆధునీకరించడం ద్వారా పాలసేకరణ పెంచుతామన్నారు. డెయిరీ అవుట్లెట్లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి అం దులో పాలతో పాటు నెయ్యి, స్వీట్లు కూడా అందుబాటులో ఉంచుతామని చెప్పారు. 104,108ల తరహాలోనే పశు వైద్యం కోసం ప్రతి నియోజకవర్గానికి ఓ మొబైల్ ఆంబు లెన్స్‌ను వచ్చే ఏడాది ఏప్రిల్ కల్లా పంపుతామని చెప్పారు. పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం ఎన్సీడీసీ నుంచి రూ.400 కోట్ల మేర రుణం వస్తుందని, ఆ రుణంపై కౌంటర్ గ్యారంటీ ఇవ్వడంతో పాటు పావలా వడ్డీని అమలు చేసే యోచన ఉందన్నారు. -
మండలిలో ప్రశ్నోత్తరాలు
సాదా బైనామాలకు 11,19,203 దరఖాస్తులు మండలిలో వెల్లడించిన మంత్రి ఈటల సాక్షి, హైదరాబాద్: సాదా బైనామాల ఆధారంగా పట్టాల మార్పిడికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా 11,19,203 దరఖాస్తులు వచ్చాయని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. వాటిలో 11,518 మార్పిడి చేసినట్లు, 1,93,330 దరఖాస్తులను తిరస్కరించినట్లు తెలిపారు. బ్రోకర్ల నివారణ కోసం దీన్ని కఠినతరం చేశామని, అర్హతలున్న వారికి త్వరలోనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అసైన్డ్ భూముల్లోని ఇళ్ల నిర్మాణాలను క్రమబద్ధీకరించే ప్రతిపాదన ఏదీ లేదని ఈటల చెప్పారు. జీవో 58, 59 కింద ఆయా దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కు చెందిన మమతా మెడికల్ కాలేజీకి 11 వేల చదరపు అడుగుల స్థలాన్ని ఏ విధంగా క్రమబద్ధీకరిస్తారని కాంగ్రెస్ సభ్యులు షబ్బీర్, పొంగులేటి ప్రశ్నించారు. స్థలాన్ని స్వాధీనం చేసుకుని పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. విజయ డైరీ విస్తరణ: తలసాని ఏపీ విజయ డైరి పేరును వాడరాదని నోటీసు ఇవ్వడంతో తెలంగాణ విజయ డైరీగా మార్చినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. విజయ డైరీ విస్తరణకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రైతులకు రూ.నాలుగు ఇన్సెంటివ్ ఇవ్వడంతో పాలు పోసే 31 వేల మంది రైతుల సంఖ్య 50 వేలకు పెరిగిందని వివరించారు. టీఆర్ఎస్ సభ్యుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, హెరిటేజ్ పాలల్లో రసాయనాలు కలుపుతున్నారని తేలడంతో కేరళ వంటి రాష్ట్రాల్లో రద్దు చేశారని, మన రాష్ట్రంలో ఇలాంటివి ఏమైనా బయటపడ్డాయా అని ప్రశ్నించారు. మార్చి నాటికి పరికరాల కొనుగోలు వచ్చే మార్చి నాటికి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన వస్తువులు, పరికరాలను కొనుగోలు చేస్తామని, మంచాలు, బెడ్లు, దుప్పట్లు, ఇతర వసతులను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని కొన్ని మెడికల్ షాపులు, క్లినిక్‌లలో ఉపసంహరించిన పోలియో ట్రైవాలెంట్ వాక్సిన్లను కలిగి ఉండటంతో చర్యలు తీసుకున్నట్లు లక్ష్మారెడ్డి చెప్పారు. పోలియో పూర్తిగా అదుపులో ఉందని తెలిపారు. గత ఏప్రిల్ నుంచి ట్రైవాలెంట్ నుంచి బైవాలెంట్గా మారిందని, ట్రైవాలెంట్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. పిల్లాయపల్లి వద్ద కాలువ మరమ్మతులు: హరీశ్ యాదాద్రి భువనగిరి జిల్లాలో పిల్లాయిపల్లి కాలువ పునరుద్ధరణ కోసం రూ.133.35 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సాంకేతిక మంజూరు టెం డర్లను పిలిచే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఒప్పంద షరతు ప్రకారం, ఒప్పందం తేదీ నుంచి 18 నేలల్లో పనులు పూర్తి చెయాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
జీఎస్టీలో పౌల్ట్రీని మినహాయించాలి
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ నుంచి కోళ్ల పరిశ్రమ (పౌల్ట్రీ)ని మినహారుుంచాలని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనివల్ల కోళ్ల పరిశ్రమపై ఆధారపడిన వారికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. బుధవారం హైదరాబాద్‌లో భారత కోళ్ల ప్రదర్శన (పౌల్ట్రీ ఇండియా-2016) ప్రారంభమైంది. ఇందులో ఈటల ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కోళ్ల పరిశ్రమను వ్యవసాయరంగంలో భాగంగా గుర్తించాలని.. వడ్డీ మాఫీ సహా ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. దీనిపై ఇప్పటికే ప్రధాని, కేంద్ర ఆర్థికమంత్రులకు విన్నవించామన్నారు. కోళ్ల పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తోందని, 24 గంట ల విద్యుత్‌తో పాటు రారుుతీ ఇస్తున్నామన్నారు. మొక్కజొన్నతోపాటు సోయా పంటను ప్రోత్సహించడం వల్ల కోళ్ల పరిశ్రమలకు ఊపు వస్తుందన్నారు. నోట్ల రద్దుతో కోళ్ల పరిశ్రమ తీవ్రంగా నష్టపోరుుందని.. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. నోట్ల రద్దుతో నష్టాలు.. నోట్ల రద్దు ప్రభావంతో గుడ్లు, చికెన్ ధరలు పడిపోతున్నాయని మంత్రి తలసాని పేర్కొన్నారు. కోళ్ల పరిశ్రమను మరింత వృద్ధిలోకి తీసుకురావడానికి సంస్కరణలు తీసుకురావాల్సి ఉందని పశు సంవర్థకశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా పేర్కొన్నారు. జీఎస్టీ నుంచి కోళ్ల పరిశ్రమను, వ్యవసాయరంగాన్ని మినహారుుంచాలని తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రంజిత్‌రెడ్డి కోరారు. రాష్ట్ర కోళ్ల సంఘం అధ్యక్షుడు ఎరబ్రెల్లి ప్రదీప్‌రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా..3 రోజుల పాటు జరిగే కోళ్ల ప్రదర్శనలో 32 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. 49 విదేశీ కంపెనీలు, 199 భారతీయ కంపెనీలు స్టాళ్లను ఏర్పాటు చేశారుు. -
జీతాలకు ఢోకా లేదు
నగదుగా చెల్లించేందుకు మాత్రం వీలుకాదు: ఈటల సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు ఢోకా లేదని.. జీతాలు ఆపాలన్న ప్రతిపాదనేదీ లేదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. అరుుతే ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నట్లుగా జీతాలు నగదు రూపంలో ఇచ్చేందుకు ఆస్కారం లేదని తెలిపారు. మంత్రి మంగళవారం హైదరాబాద్‌లో ‘సాక్షి’తో మాట్లాడారు. నోట్ల రద్దుతో తెలంగాణకు ఎంత నష్టమో, పరిస్థితి ఎప్పటికి చక్కబడుతుందో తేలేందుకు సమయం పడుతుందని... అప్పటివరకు ప్రజలు అర్థం చేసుకొని ఓపిక పట్టాలని సూచించారు. నోట్ల రద్దు తర్వాత జరుగుతున్న పరిణామాలు బాధాకరంగా ఉన్నాయని... నల్లధనం పేరుతో మెజారిటీ ప్రజలను ఇబ్బంది పెట్టడం సమంజసంగా లేదని వ్యాఖ్యానించారు. ప్రజల అవస్థలను సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రుల దృష్టికి తీసుకెళ్లారన్నారు. భారీ మొత్తంలో నోట్ల ముద్రణకు సమయం పడుతుందని, ప్రజలకు చేరటం ఆలస్యమవుతోందని ఈటల చెప్పారు. అందువల్ల పరిస్థితి మెరుగుపడేదాకా పాత కరెన్సీని కొనసాగించాల్సిందని అభిప్రాయపడ్డారు. సహకార బ్యాంకుల్లో నోట్ల మార్పిడికి అవకాశమివ్వాలని కోరినా.. కేంద్రం అనుకూలంగా లేదని, అవి ప్రభుత్వ అధీనంలో లేవనే అభిప్రాయంతో ఉందని తెలిపారు. నగదుగా చెల్లించండి: ఉద్యోగ సంఘాలు డిసెంబర్ ఒకటో తేదీన చెల్లించే జీతాలను నగదు రూపంలో ఇవ్వాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. టీఎన్జీవో ప్రతినిధులు దేవీప్రసాద్, రవీందర్‌రెడ్డి, రాజేందర్ మంగళవారం సాయంత్రం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను కలిశారు. నోట్ల రద్దు నేపథ్యంలో ఉద్యోగులందరూ ఇబ్బంది పడుతున్నారని, వచ్చేనెల వేతనాన్ని నగదు రూపంలో చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. అలా కుదరని పక్షంలో కనీసం రూ.10 వేలు అరుునా నగదుగా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక కొత్త జిల్లాల్లో కొనసాగుతున్న ఉద్యోగులకు పాత జిల్లాల స్థారుు హెచ్ఆర్ఏను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. -
జీఎస్టీ పరిధిపై వీడని ప్రతిష్టంభన
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అధికార పరిధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రతిష్టంభన వీడలేదు. ఆదివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి జైట్లీ ఏర్పాటు చేసిన అనధికారిక సమావేశంలో ప్రతిష్టంభనను తొలగించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఎకై ్సజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ వంటి పన్నుల స్థానంలో వచ్చిన జీఎస్టీపై కేంద్రం, రాష్ట్రాల అధికార పరిధి ఎలా ఉండాలన్న దానిపై మూడు గంటల పాటు చర్చించినప్పటికీ ఓ నిర్ణయానికి రాలేకపోరుునట్లు తెలిసింది. రూ. 1.5 కోట్ల వార్షిక టర్నోవర్ కలిగిన వ్యాపారాలకు సంబంధించిన జీఎస్టీపై పూర్తి అధికారం తమకే ఇవ్వాలని రాష్ట్రాలు పట్టుబడుతూ ఉన్న నేపథ్యంలో సోమవారం మళ్లీ ఒకసారి భేటీ జరగనుంది. ‘సమావేశం అర్ధంతరంగా ముగిసింది. ఈ నెల 25న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగేంతవరకూ దీనిపై చర్చలు కొనసాగుతూనే ఉంటారుు’అని జైట్లీ చెప్పారు. ఉత్తరాఖండ్ ఆర్థిక మంత్రి హృదయేష్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్, కేరళ, ఉత్తరాఖండ్, యూపీ, తమిళనాడు వంటి రాష్ట్రాలు రూ. 1.5 కోట్ల వార్షిక టర్నోవర్ కలిగిన చిన్న వ్యాపారాల సరుకులు, సేవలపై పన్నులు వసూలు చేసే అధికారం తమకే ఇవ్వాలని కోరాయన్నారు. సేవలను మినహారుుంచి సరుకులపై పన్ను వసూలు అధికారం ఇచ్చేందుకే కేంద్రం అంగీకరిస్తోందన్నారు. ఈ నెల 25న మళ్లీ భేటీ: ఈటెల ఈ నెల 25న మళ్లీ సమావేశమయ్యేందుకు నిర్ణరుుంచామని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రూ. 1.5 కోట్ల ఆదాయమున్న డీలర్ల నుంచి రాష్ట్రాలు, ఆపైన ఆదాయముంటే కేంద్రం వసూలు చేయాలనే ప్రతిపాదనలపై చర్చించామన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత రాష్ట్రాల్లో పరిస్ధితులను ఆర్థిక మంత్రులు జైట్లీకి వివరించారని చెప్పారు. పాత నోట్లతో బకారుుల వసూలు గడువును ఈ నెల 24 నుంచి మరి కొద్ది రోజుల పెంచాలని కోరామని, సానుకూలంగా స్పందించారన్నారు. -
చార్జీల పెంపునకు ప్రజలు సానుకూలం
ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ - ప్రతిపక్షాలవి పసలేని విమర్శలు - పల్లెవెలుగుతో రూ.500 కోట్ల నష్టాలు.. అయినా సర్వీసులు పెంచుతాం - కొత్తగా వేయికి పైగా గ్రామాలకు బస్సు వసతి కల్పిస్తాం - నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తాం సాక్షి, హైదరాబాద్: గతంలో ప్రభుత్వాలు ఆర్టీసీని నిర్లక్ష్యం చేయటం, సంస్థలో అంతర్గత సామర్థ్యం కొరవడటం వల్లనే ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయిందని సంస్థ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. పరిస్థితికి తగ్గట్టుగా టికెట్ల ధరలు పెంచకపోవటంతో క్రమంగా నష్టాలు మరింతగా పెరిగిపోయాయన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆర్టీసీపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నందున దాన్ని లాభాల్లోకి తెచ్చేందుకు అధికారులు, కార్మికులతో సమష్టిగా పనిచేస్తున్నట్టు వెల్లడించారు. కేవలం టికెట్ల రూపంలో వచ్చే ఆదాయంపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్టు వెల్లడించారు. ఇటీవల 10 శాతం మేర పెంచిన చార్జీలపై ప్రయాణికులు సానుకూలంగా స్పందించారని, రాజకీయ పార్టీలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయాలన్న లక్ష్యంతో విమర్శిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతిపక్షాలవి పసలేని విమర్శలన్నారు. సోమవారం ఆయన బస్‌భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పల్లె వెలుగు బస్సుల ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో రూ.500 కోట్ల నష్టాలు వచ్చాయని, అయినా వాటిని విస్తరిస్తామే తప్ప సర్వీసుల ఉపసంహరణ ఉండదన్నారు. ఇప్పటికీ వేయికిపైగా గ్రామాలకు బస్సు వసతి లేదని, వాటికి కూడా బస్సులు నడిపే యోచనలో ఉన్నట్టు సత్యనారాయణ వివరించారు. కొత్తగా 1,200 బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం చేయూత ఇవ్వనున్నందున చిన్నచిన్న బస్సులను కూడా కొనుగోలు చేస్తామన్నారు. ప్రైవేటు వేడుకలకు ప్రజలు ఆర్టీసీ బస్సులనే బుక్ చేసేలా వీటిని వినియోగిస్తామని, ప్రధాన బస్‌స్టేషన్ భవనాలను మినీ థియేటర్‌లాంటి వాటికి లీజుకివ్వటం ద్వారా ఆదాయం పెంచుకోబోతున్నామన్నారు. ఇటీవల నామమాత్రంగా 10 శాతం మేర పెంచిన చార్జీల వల్ల కేవలం మూడింట ఒకటోవంతు నష్టాలనే సర్దుబాటు చేయగలమన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే చార్జీలు తక్కువగా ఉన్నట్టు చెప్పారు. సర్పంచులు, స్థానిక నేతల సహకారం నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాల నుంచి ప్రయాణికులను ఆర్టీసీవైపు మళ్లించేందుకు వీలుగా ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు స్థానిక నేతల సహకారం తీసుకుంటున్నామని సోమారపు సత్యనారాయణ చెప్పారు. డిపో మేనేజర్లు వారితో భేటీ అయి ప్రజల్లో అవగాహన తెచ్చేలా కృషి చేస్తారన్నారు. గతంలో ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం ఉపయోగపడాల్సిన పొదుపు నిధి, భవిష్య నిధి నుంచి కూడా డబ్బులు వాడుకుని ఇప్పటివరకు వాటిని చెల్లించలేకపోయామని అన్నారు. ప్రభుత్వం ఆర్టీసీకి రూ.300 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించినందున అవి రాగానే వాటిని తీర్చేస్తామన్నారు. పొరుగు రాష్ట్రాలకు నడిచే బస్సుల సంఖ్యను పెంచుతున్నామన్నారు. ఇప్పటికే ఏపీకి 80 కొత్త సర్వీసులు ప్రార ంభించామన్నారు. నగరంలో సిగ్నల్ జంపింగ్‌కు పాల్పడే డ్రైవర్లే చలానాలు భరించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రధాన బస్టాండ్లను ఆధునీకరిస్తున్నామని, ఇందుకు అభివృద్ధి నిధులు కోరుతూ ఎమ్మెల్యేలకు లేఖలు రాశామని ఆర్టీసీ ఎండీ రమణారావు తెలిపారు. ఇటీవల కరీంనగర్ బస్టాండు అభివృద్ధికి మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.10 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించారని చెప్పారు. -
బొక్కలిరిసి కుప్పపెడుత..!
మంత్రి ఈటల సమక్షంలో విపక్ష నేతలపై ఎమ్మెల్యే బొడిగె శోభ అనుచిత వ్యాఖ్యలు చొప్పదండి : ‘బెదిరిస్తే పోయెటోళ్లం కాదు.. ప్లకార్డులు పట్టుకొని వస్తే.. మేం గంత సోయి లేనోళ్లం కాదు.. మేమెంత వర్కు జేత్తున్నమో గీ ప్రజలకు తెలువదా? ఇం కొక్కసారి మేం జేసే కార్యక్రమానికి వస్తే మంచిగుండదు.. మా పోలీసోల్లైతే ఏం సేత్తలేరు.. ఎందుకంటె ఫ్రెండ్లీ గవర్నమెంటు అన్నం కాబట్టి మా సీఐగారు, మా డీఎస్పీగారు, మా ఎస్సైలు అంతా నిలబడి సూత్తాండ్రు. బొక్కలిరిసి కుప్ప పెడుత నేనే.. ఇగ ఊర్కునే సమస్యేలేదు.’ అంటూ కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ విపక్షాల నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గురువారం మిషన్ కాకతీయ రెండోదశ కింద చొప్పదండిలోని కుడిచెరువు పునురద్ధరణ పనుల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి ఈటల రాజేందర్ సమక్షంలోనే ఆమె ఇలా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. కుడి చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయూలంటూ కాంగ్రెస్, బీజేపీ నాయకులతోపాటు చొప్పదండి గ్రామస్తులు ప్లకార్డులతో సభావేదిక వద్దకు వచ్చారు. మంత్రి ఈటల రాజేందర్‌కు వినతిపత్రం అందించి కుడిచెరువు పరిస్థితి వివరించేందు కు యత్నించారు. ఇంతలోనే ఎమ్మెల్యే శోభ జోక్యం చేసుకొని పిటిషన్ మాత్రమే ఇవ్వాలని, ఏమీ మాట్లాడవద్దని, వెంటనే వేదిక దిగాలని గద్దించారు. అదే సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు వారిపై దౌర్జన్యానికి దిగారు. -
మీరెక్కువా.. మేమెక్కువా?
♦ సంక్షేమ నిధుల ఖర్చుపై అసెంబ్లీలో సంవాదం ♦ లక్ష కోట్లు ఎలా ఖర్చు చేస్తారు: సీఎల్పీ నేత జానారెడ్డి ప్రశ్న ♦ చివరి మూడు నెలల్లోనే ఎక్కువ ఖర్చు: ఈటల సాక్షి, హైదరాబాద్: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రయోజనం చేసిందంటే.. తమ ప్రభుత్వమే మేలు చేసిందంటూ అసెంబ్లీలో మంత్రి ఈటల, కాంగ్రెస్ నేత జానారెడ్డి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. తొలుత జానారెడ్డి మాట్లాడుతూ.. ‘‘2013-14లో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమానికి రూ.4,091 కోట్లు ఖర్చు చేసింది. 2014-15లో టీఆర్ఎస్ ప్రభుత్వం తొలి పదినెలల్లో రూ.3,377 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అంటే ఏడాది మొత్తంలో రూ.4,051 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్క. సంక్షేమానికి మీరెన్ని నిధులు ఖర్చు చేశారో అర్థమవుతోంది. అసలు 2015-16 బడ్జెట్‌కు సంబంధించి జనవరి నెలాఖరు వరకు రూ.73వేల కోట్లు మాత్రమే ఖర్చయింది. మిగిలింది రెండు నెలలే. మొత్తం రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తామని ఎలా చెబుతున్నారు..’’ అని ప్రశ్నించారు. దీనికి మంత్రి ఈటల సమాధానమిస్తూ.. ఆడిటర్ జనరల్ మూడు నెలలకోసారి లెక్కలు ఇస్తారని, డిసెంబర్ నాటికి రూ.66 వేల కోట్లు ఖర్చయిందని చెప్పారు. ప్రతి ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లో ఎక్కువ ఖర్చు కావడం సహజమని, అందుకే రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తామనే నమ్మకం తమకుందని పేర్కొన్నారు. సంక్షేమానికి గడిచిన ఆరేళ్ల కేటాయింపులను విశ్లేషిస్తూ 2013-14లో రూ.4,091 కోట్లు కేటాయించారని.. తమ ప్రభుత్వం 2015-16లో మూడింతలుగా రూ.11,392 కోట్లు కేటాయిం చిందని చెప్పారు. దీనిపై జోక్యం చేసుకున్న జానా.. ‘‘ఈఏడాది లెక్కలొస్తే అందులో ఖర్చు సంగతి మాట్లాడుకోవచ్చు. ముందుగా మీరు చెప్పింది చాలు. తొలి ఏడాది ఖర్చు చూస్తే మీ కంటే మా ప్రభుత్వమే ఎక్కువ ఖర్చు చేసింది..’ అని చురక అంటించారు. కాగా, తాగునీటి కోసం ప్రతిజిల్లాకు 200కోట్లు కేటాయించాలని సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రనాయక్ డిమాండ్ చేశారు. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సూచించారు. ఆశావర్కర్ల జీతాలను పెంచాలని సీపీఎం ఎమ్మెల్యే రాజయ్య విజ్ఞప్తి చేశారు.