కలెక్టర్ వర్సెస్ ఎమ్మెల్యేలు
⇒ మేళాలో ప్రొటోకాల్ వివాదం
⇒ సర్దిచెప్పిన మంత్రి ఈటల
కరీంనగర్‌సిటీ: కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియం వేదికగా జరిగిన డీజీ ధన్ మేళాలో ప్రొటోకాల్ వివాదం చోటుచేసుకుంది. మేళాలో భాగంగా సభావేదికపై ఉన్న ఫ్లెక్సీ లో ఎంపీ, ఎమ్మెల్యేల ఫొటోలు లేకపోగా ప్రొటోకాల్‌పరంగా ఆహ్వానించ కుండా అవమానపరిచారంటూ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అసహనం వ్యక్తం చేశారు. సభా వేదిక కింది నుంచి అధికార యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిలిచి అవమానపరుస్తారా అంటూ మండిపడ్డారు. ఆహ్వానం మేరకు అక్కడ నుంచి వేదికను ఆసీనులవుతూనే రసమయి బాలకిషన్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటో కాల్ పాటించకుండా ప్రజా ప్రతినిధులను అగౌరవపరుస్తారా? అంటూ ఫైర్ అయ్యారు.
అందుకు కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఘాటు గానే స్పందించడంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఒక దశలో కలె క్టర్ వర్సెస్ ఎమ్మెల్యేలుగా పరిస్థితి మారిపోయింది. తనకు కలెక్టర్‌తో క్షమాపణ చెప్పిం చాలంటూ కేంద్ర మంత్రి దత్తాత్రేయతో రస మయి గట్టిగానే అడిగాడు. ఇంతలో మంత్రి ఈటల రాజేందర్ జోక్యం చేసుకుని సర్ది చెప్పారు. తర్వాత మాట్లాడుకుందామని చెప్పడంతో సద్దుమణిగింది. అనంతరం ఈటల తన ప్రసంగంలో చివరగా ప్రజాప్రతినిధులను అగౌరవపర చడం సరైన సంప్రదాయం కాదని అన్నారు. ఇక్కట చోటు చేసుకున్న సంఘటనపై సమీక్షించు కుంటామని చెప్పారు.