MLA Gangula Kamalakar
-
ఘనంగా శివాజీ జయంతి వేడుకలు
కరీంనగర్ సిటీ: ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా హిందూ సామ్రాజ్య స్థాపన దినోత్సవాన్ని శివాజీ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. హిందూ ధర్మయాత్ర చేపట్టారు. కమిటీ అధ్యక్షుడు తోట అర్జున్ ఆధ్వర్యంలో మారుతినగర్ హన్మాన్ ఆలయం నుంచి యాత్ర ప్రారంభించారు. నగర పురవీధుల గుండా యాత్ర సాగింది. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్, డిప్యూటీ మేయర్ రమేశ్, శివసేన జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పి.వి.మాధవ్‌రాజు హాజరయ్యారు. సమాజహితం కోసం పని చేసిన శివాజీని ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కమిటీ సభ్యులు పెద్ది శివ, చిగుళ్ల అనుష్, శేఖర్, దిలీప్, శేఖర్, శివగణేశ్, వినీత్‌రెడ్డి, అశోక్, రంజిత్, మల్లికార్జున్ పాల్గొన్నారు. బైక్ ర్యాలీ హైందవ సంస్కృతి కీర్తి పతాక శివాజీ అని వీహెచ్‌పీ జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు గాజుల రవీందర్ అన్నారు. విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్‌రావు, కార్యదర్శి కోమళ్ల రాజేందర్‌రెడ్డి, తోట రాజేందర్, భజరంగ్‌దళ్ జిల్లా కన్వీనర్ తోట ప్రదీప్, శ్రావణ్‌కుమార్, గుజ్జేటి రాజేందర్ పాల్గొన్నారు. శివసేన ఆధ్వర్యంలో.. శివసేన పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలో జయంతి యాత్ర నిర్వహించారు. కిసాన్‌నగర్‌లో గల శివసేన పార్టీ కార్యాలయం నుంచి నగర పురవీధుల గుండా యాత్ర సాగి సర్కస్ గ్రౌండ్లో ముగిసింది. ముఖ్య అతిథిగా శివసేన పార్టీ తెలంగాణ ఇన్చార్జి దామెర క్రిష్ణ హాజరై యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా అధ్యక్షుడు సోమిడి వేణుప్రసాద్, ఇందూర్ అధ్యక్షుడు శ్రీహరి, యువసేన నాయకులు రాజేందర్, సట్ల సాయి, చందు, రావుల సాయికిరణ్, క్రాంతికుమార్, గుగ్గిళ్ల సత్యనారాయణ, వంగల ప్రదీప్, కార్తీక్, శ్రీకర్, నర్సింగ్, శివ గణేశ్, అజయ్, సోను, రఘు పాల్గొన్నారు. -
కలెక్టర్ వర్సెస్ ఎమ్మెల్యేలు.
-
కలెక్టర్ వర్సెస్ ఎమ్మెల్యేలు
⇒ మేళాలో ప్రొటోకాల్ వివాదం ⇒ సర్దిచెప్పిన మంత్రి ఈటల కరీంనగర్‌సిటీ: కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియం వేదికగా జరిగిన డీజీ ధన్ మేళాలో ప్రొటోకాల్ వివాదం చోటుచేసుకుంది. మేళాలో భాగంగా సభావేదికపై ఉన్న ఫ్లెక్సీ లో ఎంపీ, ఎమ్మెల్యేల ఫొటోలు లేకపోగా ప్రొటోకాల్‌పరంగా ఆహ్వానించ కుండా అవమానపరిచారంటూ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అసహనం వ్యక్తం చేశారు. సభా వేదిక కింది నుంచి అధికార యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిలిచి అవమానపరుస్తారా అంటూ మండిపడ్డారు. ఆహ్వానం మేరకు అక్కడ నుంచి వేదికను ఆసీనులవుతూనే రసమయి బాలకిషన్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటో కాల్ పాటించకుండా ప్రజా ప్రతినిధులను అగౌరవపరుస్తారా? అంటూ ఫైర్ అయ్యారు. అందుకు కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఘాటు గానే స్పందించడంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఒక దశలో కలె క్టర్ వర్సెస్ ఎమ్మెల్యేలుగా పరిస్థితి మారిపోయింది. తనకు కలెక్టర్‌తో క్షమాపణ చెప్పిం చాలంటూ కేంద్ర మంత్రి దత్తాత్రేయతో రస మయి గట్టిగానే అడిగాడు. ఇంతలో మంత్రి ఈటల రాజేందర్ జోక్యం చేసుకుని సర్ది చెప్పారు. తర్వాత మాట్లాడుకుందామని చెప్పడంతో సద్దుమణిగింది. అనంతరం ఈటల తన ప్రసంగంలో చివరగా ప్రజాప్రతినిధులను అగౌరవపర చడం సరైన సంప్రదాయం కాదని అన్నారు. ఇక్కట చోటు చేసుకున్న సంఘటనపై సమీక్షించు కుంటామని చెప్పారు. -
కార్మికుల సంక్షేమమే ధ్యేయం
► మెకానిక్‌ల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తాం ► ఎమ్మెల్యే గంగుల, ఎమ్మెల్సీ నారదాసు కరీంనగర్: బడుగు బలహీన వర్గాల ప్రజలతో పాటు కార్మికుల సమగ్రాభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు అన్నారు. ఆదివారం పట్టణంలోని బైపాస్‌రోడ్‌లో గల ఎల్లమ్మ గుడి వద్ద ఆల్ టూవీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి సదస్సులో ముఖ్య అతిథిలుగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారన్నారు. మెకానిక్‌ల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లుతానని, రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తానన్నారు. మెకానిక్‌లకు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంతో పాటు కార్మిక సంక్షేమ శాఖ నుంచి అమలవుతున్న సంక్షేమ పథకాల అమలు విషయంతో పాటు హెల్త్‌కార్డులు అందేలా చొరవ చూపుతానన్నారు. మెకానిక్‌ల కమ్యూనిటీ హాల్ కోసం ఇప్పటికే 3 లక్షలు కేటాయించానని, భవన నిర్మాణం చేపడితే ఎమ్మెల్యే కోటా నిధుల నుంచి మరో 30 లక్షల రూపాయల కేటాయిస్తానని హమీ ఇచ్చారు. కార్యక్రమంలోనగర మేయర్ రవీందర్‌సింగ్, ఆల్ టూవీలర్స్ మెకానిక్ వెల్పేర్ సోసైటీ రాష్ట్ర అధ్యక్షుడు తోడేటి బాబు, గౌరవ అధ్యక్షుడు గజ్జెల స్వామి, కార్పొరేటర్లు ఎల్.రూప్సింగ్, కంసాల శ్రీనివాస్, మహ్మద్ అరీఫ్, మాజీ కార్పొరేటర్ పడిశెట్టి భూమయ్య, ఏఎంసీ చైర్మన్ ముల్కల గంగారాం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్కె ఖాజా అలీమొద్దీన్, ఎండీ అఫ్రోజ్, మల్లిఖార్జున్, వినోద్‌కుమార్, శ్రీను, నరేశ్, ఆంజనేయులు, ముజాహిద్‌తో పాటు వివిధ జిల్లాల ప్రతినిధులు, పెద్ద ఎత్తున మెకానిక్‌లు పాల్గొన్నారు. -
విద్యకే ఉన్నత ప్రాధాన్యత
ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎస్సారార్‌లో ప్రతిభా పురస్కారాలు ప్రదానం కరీంనగర్‌కల్చరల్ : రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఉన్నత ప్రాధాన్యత ఇస్తుందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్‌లోని ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన విద్యార్థుల ప్రతిభా పురస్కారాల ప్రధాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలల్లోనే ఉత్తమ విద్యనందిస్తున్నా.. ప్రై వేట్‌కు వచ్చినంత ప్రచారం రావడం లేదన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివిన వారెందరో ఉన్నతస్థాయిలో ఉన్నారన్నారు. ఎస్సారార్ కళాశాల గొప్పతనాన్ని, వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతేడాది వివిధ సబ్జెక్టుల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్‌ను, సర్టిఫికెట్లు, జ్ఞాపికలు అందజేశారు. ఎంపీపీ వాసాల రమేశ్, కళాశాల ప్రిన్సిపాల్ పి.నితిన్, అధ్యాపకులు వై.సత్యనారాయణ, వంగల శ్రీనివాస్, స్టాఫ్ క్లబ్ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, వై.మహేశ్, ఎలిజబెత్ రాణి, సంజీవ్, వడ్లూరి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
'లోకేష్ ట్విట్టర్ బాబే కాదు.. బర్గర్ బాబు, టెడ్డీబేర్'
కరీంనగర్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్‌పై కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వ్యాఖ్యలుచేశారు. పట్టణంలోని మీడియాతో ఆయన గురువారం మాట్లాడుతూ... నారా లోకేష్ ట్విట్టర్ బాబే కాదు.. బర్గర్ బాబులా, టెడ్డీబేర్గా మారారని కమలాకర్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి.. ఒళ్లు ద్గగర పెట్టుకుని మాట్లాడు అని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ హెచ్చరించారు. టీడీపీ దొంగల ముఠా జైలుకెళ్తేనే న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఉంటుందని ఎంపీ అభిప్రాయపడ్డారు. ఆట మొదలు కాలేదు... టీడీపీ ఆట ముగిసింది అని, తెలంగాణతో పాటు ఏపీలోనూ టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమని బాల్క సుమన్ విమర్శలు గుప్పించారు. -
సీఎం పర్యటన రద్దు
కరీంనగర్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కరీంనగర్ పర్యటన రద్దయింది. ఈ నెల 22న రాత్రి తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్లో బస చేసి, 23న కరీంనగర్లో మురికివాడలను సందర్శించనున్నట్టు సీఎం కేసీఆర్ నాలుగు రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు సమాచారం అందించారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా సీఎం పర్యటన ఖరారు కావడంతో నగరంలోని హడావుడి నెలకొంది. అధికారులు, ప్రజాప్రతినిధులు ఆగమేఘాలపై నగరంలో సీఎం సందర్శించే మురికివాడలను గుర్తించే పనిలో పడ్డారు. సంక్షేమ పథకాలు అమలు తీరుపై అధికారులు, ప్రజాప్రనిధులు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, కలెక్టర్ నీతూకుమారిప్రసాద్, జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, మున్సిపల్ కమిషనర్ కేవీ.రమణాచారితో పాటు పలు విభాగాల అధికారులు సీఎం పర్యటన విజయవంతానికి ఏర్పాట్లు చేశారు. మంగళవారం సాయంత్రం వరకు సీఎం పర్యటన రూట్ మ్యాప్ సైతం ఖరారు చేశారు. తీరా ముఖ్యమంత్రి పర్యటన రద్దయినట్టు రాత్రి సమాచారం అందడంతో అటు నాయకులు, ఇటు అధికారులు హడావుడి తగ్గించారు. ఈ సందర్భంగా మేయర్ రవీందర్‌సింగ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నగరంలో పర్యటిస్తే మురికివాడలకు మహర్దశ వచ్చేదన్నారు. ఇప్పటికే నగర అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదనలు తయారు చేశామని వివరించారు. ఈ సమయంలో సీఎం పర్యటన వాయిదాపడటం కొంత నిరాశకు గురిచేసిందన్నారు. తిరిగి కేసీఆర్ నగరానికి ఎప్పుడు వస్తారనే విషయం ఖరారు కాలేదని ఆయన తెలిపారు. -
‘స్వచ్ఛ'ందంగా కదిలారు...
పుస్తకాలు.. పెన్నులతో.. నిత్యం కుస్తీపట్టే.. చిట్టిచేతులు చీపుర్లు పట్టాయి.. నగరపాలక సంస్థ ఇచ్చిన స్వచ్ఛనగరం పిలుపుతో స్వచ్ఛందంగా కదిలివచ్చారు.. కార్యక్రమంలో సింహభాగమై చెత్తను తరిమే పనిపట్టారు.. చెత్తను రోడ్లపై వేసేవారికి కనువిప్పు కలిగించారు.. నగరంలోని గల్లీగల్లీలోకి వెళ్లి రోడ్లు ఊడ్చి.. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజల్లో స్ఫూర్తి నింపారు.. - టవర్‌సర్కిల్ స్వచ్ఛభారత్‌లో భాగంగా నగరపాలక సంస్థ పరిధిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛనగరం- మన కరీంనగర్’ కార్యక్రమం శనివారం అన్ని డివిజన్లలో నిర్వహించారు. రోడ్లను ఊడ్చి, చెత్తను పోగుచేసి ట్రాక్టర్లలో పంపే వరకు విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలంతా బాధ్యతగా పనులు నిర్వహించారు. నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యాసంస్థల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తరలివచ్చారు. ఆయా డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు, మున్సిపల్ నియమించిన ప్రత్యేకాధికారులతో కలిసి రోడ్లుఊడ్చి, చెత్తను తొలగించారు. మూడు గంటలు.. యాభై డివిజన్లు.. ‘స్వచ్ఛ నగరం - మన కరీంనగర్’ కార్యక్రమం ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అన్ని డివిజన్లలో జరిగింది. మూడు గంటలపాటు విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఉద్యమంలా పనులు చేపట్టారు. ఎక్కడ చూసినా స్వచ్ఛ భారత్ కనిపించింది. డివిజన్‌కు వెయ్యి మందితో కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించినా విద్యాసంస్థలు తక్కువగా ఉన్న డివిజన్లలో తక్కువగా, కొన్ని డివిజన్లలో ఎక్కువగా హాజరయ్యారు. లక్ష్యాన్ని చేరువగా వచ్చామని ప్రజాప్రతినిధులు, అధికారులు వెల్లడించారు. పాశ్చాత్యదేశాలకు ధీటుగా - ఎమ్మెల్యే, మేయర్ పాశ్చాత్య దేశాలైన అమెరికా, లండన్, చైనాల్లో ఇంతమంది పారిశుధ్య కార్మికులు ఉండరని, ఎవరి పనిని వారే చేసుకుంటారని, అందుకే ఆ దేశాలు సుందరంగా కనబడతాయని ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్ అన్నారు. పలు డివిజన్లలో జరిగిన స్వచ్ఛ నగరం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ... మనం కూడా ఎవరి చెత్తను వారే తొలగించుకుంటే ఆయా దేశాలకు ధీటుగా మనం నిలబడగలమన్నారు. చెత్తలేని రహదారులపై చెత్త వేయాలంటేనే ఇబ్బంది పడే పరిస్థితిని తీసుకురావాలని కోరారు. పరిసరాలు శుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు.ఒక్క రోజుతోనే స్వచ్ఛత పనులు నిలపవద్దని, పరిసరాల్లో ఎక్కడ చెత్త కనబడినా తొలగించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ శ్రీకేశ్‌లట్కర్, డెప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, బీజేపీ నాయకులు బండి సంజయ్, ఎడవెల్లి విజయేందర్‌రెడ్డి, డీఎస్పీ జె.రామారావు, కార్పొరేటర్లు వై.సునీల్‌రావు, చల్ల స్వరూపరాణి, కమల్జిత్కౌర్, చాడగొండ కవిత, ఏవీ.రమణ, మాచర్ల రజిత, ఎడ్ల స్వరూప, కంసాల శ్రీనివాస్, గందె మాధవి, వైద్యుల శ్రీదేవి, రవీందర్, వేణు, ట్రస్మా అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు, అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.