
'లోకేష్ ట్విట్టర్ బాబే కాదు.. బర్గర్ బాబు, టెడ్డీబేర్'
కరీంనగర్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్పై కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వ్యాఖ్యలుచేశారు. పట్టణంలోని మీడియాతో ఆయన గురువారం మాట్లాడుతూ... నారా లోకేష్ ట్విట్టర్ బాబే కాదు.. బర్గర్ బాబులా, టెడ్డీబేర్గా మారారని కమలాకర్ పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి.. ఒళ్లు ద్గగర పెట్టుకుని మాట్లాడు అని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ హెచ్చరించారు. టీడీపీ దొంగల ముఠా జైలుకెళ్తేనే న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఉంటుందని ఎంపీ అభిప్రాయపడ్డారు. ఆట మొదలు కాలేదు... టీడీపీ ఆట ముగిసింది అని, తెలంగాణతో పాటు ఏపీలోనూ టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమని బాల్క సుమన్ విమర్శలు గుప్పించారు.