
'లోకేశ్.. గొడవలు పెట్టేలా మాట్లాడుతున్నారు'
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఇతర ప్రాంతాల ప్రజలు ప్రశాంతంగా ఉండటం టీడీపీకి ఇష్టం లేదా? అని టీఆర్ఎస్ ఎంపీ బాల్కా సుమన్ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో గొడవలు జరిగేరీతిలో టీడీపీ నేత లోకేశ్, బీజేపీ నాయకుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతున్నారని ఆయన మండ్డిపడ్డారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు అమలు చేయడం లేదని టీడీపీ-బీజేపీ నేతలను ప్రశ్నించారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల విషయమై మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్‌ను ఎందుకు ప్రతిపక్ష నేతలు స్వీకరించడం లేదని ఆయన ప్రశ్నించారు. దిగ్విజయ్‌సింగ్ ఎక్కడ అడుగుపెడితే.. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని బాల్క సుమన్ అన్నారు. దిగ్విజయ్ పేరును అపజయ్‌సింగ్‌గా మార్చాలని వ్యంగ్యంగా పేర్కొన్నారు.