జీఎస్టీలో పౌల్ట్రీని మినహాయించాలి
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ నుంచి కోళ్ల పరిశ్రమ (పౌల్ట్రీ)ని మినహారుుంచాలని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనివల్ల కోళ్ల పరిశ్రమపై ఆధారపడిన వారికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. బుధవారం హైదరాబాద్‌లో భారత కోళ్ల ప్రదర్శన (పౌల్ట్రీ ఇండియా-2016) ప్రారంభమైంది. ఇందులో ఈటల ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కోళ్ల పరిశ్రమను వ్యవసాయరంగంలో భాగంగా గుర్తించాలని.. వడ్డీ మాఫీ సహా ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. దీనిపై ఇప్పటికే ప్రధాని, కేంద్ర ఆర్థికమంత్రులకు విన్నవించామన్నారు. కోళ్ల పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తోందని, 24 గంట ల విద్యుత్‌తో పాటు రారుుతీ ఇస్తున్నామన్నారు. మొక్కజొన్నతోపాటు సోయా పంటను ప్రోత్సహించడం వల్ల కోళ్ల పరిశ్రమలకు ఊపు వస్తుందన్నారు. నోట్ల రద్దుతో కోళ్ల పరిశ్రమ తీవ్రంగా నష్టపోరుుందని.. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు.
నోట్ల రద్దుతో నష్టాలు..
నోట్ల రద్దు ప్రభావంతో గుడ్లు, చికెన్ ధరలు పడిపోతున్నాయని మంత్రి తలసాని పేర్కొన్నారు. కోళ్ల పరిశ్రమను మరింత వృద్ధిలోకి తీసుకురావడానికి సంస్కరణలు తీసుకురావాల్సి ఉందని పశు సంవర్థకశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా పేర్కొన్నారు. జీఎస్టీ నుంచి కోళ్ల పరిశ్రమను, వ్యవసాయరంగాన్ని మినహారుుంచాలని తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రంజిత్‌రెడ్డి కోరారు. రాష్ట్ర కోళ్ల సంఘం అధ్యక్షుడు ఎరబ్రెల్లి ప్రదీప్‌రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా..3 రోజుల పాటు జరిగే కోళ్ల ప్రదర్శనలో 32 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. 49 విదేశీ కంపెనీలు, 199 భారతీయ కంపెనీలు స్టాళ్లను ఏర్పాటు చేశారుు.