3,500 నాటు కోళ్లు మృతి | 3500 natu kollu In Sangareddy | Sakshi
Sakshi News home page

3,500 నాటు కోళ్లు మృతి

Published Mon, Mar 10 2025 10:01 AM | Last Updated on Mon, Mar 10 2025 10:56 AM

3500 natu kollu In Sangareddy

నర్సాపూర్‌ మండలం లింగాపూర్‌లో ఘటన 

నర్సాపూర్‌ రూరల్‌: అంతుచిక్కని వ్యాధితో నాటు కోళ్లు మృతి చెందిన సంఘటన నర్సాపూర్‌ మండలం లింగాపూర్‌లో చోటు చేసుకుంది. లింగాపూర్‌ తండాకు చెందిన పాతులోత్‌ ప్రసాద్‌కు చెందిన 3,500 నాటు కోళ్లు అంతు చిక్కని వ్యాధితో మృత్యువాత పడ్డాయి. కొన్ని రోజులుగా నాటు కోళ్ల పెంపకంతో ఉపాధి పొందుతున్న ప్రసాద్‌ తీవ్ర ఆవేదనకు గురవుతున్నాడు. అప్పులు చేసి రూ. 8 లక్షల వరకు పెట్టుబడి పెట్టి నాటు కోళ్లను పెంచుతున్నట్లు బాధితుడు తెలిపాడు. 

ఇటీవల నా షెడ్డు దగ్గరలో ఉన్న బాయిలర్‌ పౌల్ట్రీ షెడ్డులో కోళ్లు చనిపోయాయని, అదే వ్యాధి నాటు కోళ్లకు వ్యాపించి చనిపోయని ఆరోపించాడు. ప్రైవేట్‌ బాయిలర్‌ కోళ్ల కంపెనీ, లేదా ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరుతున్నాడు. ఈ విషయమై పశుసంవర్ధక శాఖ వైద్యాధికారి సౌమిత్‌ను వివరణ కోరగా.. అతి ఉష్ణోగ్రత కారణంగా కోళ్లు చనిపోయి ఉంటాయని, లేదా ఇంకా ఏదైనా వ్యాధితో మృతి చెంది ఉంటాయన్నారు. బర్డ్‌ప్లూ అని మాత్రం నిర్ధారించలేమన్నారు. 

మృతి చెందిన కోళ్లను ల్యాబ్‌కు పంపుదామంటే బాధితుడు కోళ్లను గోతిలో పాతి పెట్టడంతో ల్యాబ్‌కు పంపలేకపోయినట్లు చెప్పారు. పౌల్ట్రీ షెడ్డులు నిర్వహించే రైతులు కోళ్లకు ఏదైనా సమస్య వచి్చనట్లయితే వెంటనే పశుసంవర్ధక శాఖ వైద్య అధికారులను సంప్రదించాలని సూచించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement