ఆదివారం వచ్చింది. ముక్క నోట్లోకి పోనిద్దాం అని ఆశతో చాలామంది పొద్దున్నే సంచులతో బయలుదేరుతారు. ఇంతలో ‘కోళ్లకు బ్లాక్ ఫంగస్.. తస్మాత్ జాగ్రత్త!’ అని ఎక్కడో వాట్సాప్‌లోనో, ఎవరో చెప్పడంతోనే ఆలోచనల్లో పడతారు. కానీ, చికెన్‌తో ఆ భయం అక్కర్లేదని డాక్టర్లు, సైంటిస్టులు భరోసా ఇస్తున్నారు. ఇంతకీ వాట్సాప్‌లో వైరల్ అవుతున్న ఆ వార్త వెనుక అసలు విషయం ఏంటో చూద్దాం.
న్యూఢిల్లీ: కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ దేశాన్ని వణికిస్తోంది. ఈ క్రమంలో కోళ్ల కారణంగా కూడా బ్లాక్ ఫంగస్ వ్యాపిస్తోందని, కాబట్టి, కొన్ని రోజుల పాటు చికెన్‌కి దూరంగా ఉండడమే మంచిదని వాట్సాప్‌ల్లో ఈమధ్య వైరల్ అవుతోంది. దీనికి తోడు ఓ ప్రముఖ న్యూస్ వెబ్సైట్ పేరు మీద అది పబ్లిష్ కావడం, కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయని కథనాలు వైరల్ అవుతుండడంతో చాలామంది నమ్మేస్తున్నారు.
అయితే వాతావరణంలో అంతటా ఉండే బ్లాక్ ఫంగస్.. కోళ్లకి కూడా వస్తుందని, కానీ, ఆ కోళ్ల ద్వారా, చికెన్ ద్వారా మనుషులకు బ్లాక్‌ఫంగస్ వ్యాపిస్తుందన్న వాదనలో అర్థం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ అపర్ణ ముఖర్జీ చెప్తున్నారు. అసలు బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి కాదని, అలాంటప్పుడు జంతువులు, మనుషుల్లో ఒకరి ద్వారా మరొకరికి సోకుతుందన్న వాదనలో నిజం లేదని ఆమె స్ఫస్టత ఇచ్చారు. కాబట్టి చికెన్‌కి భయపడాల్సిన అవసరం లేదని ఆమె అంటున్నారు.
వీటికితోడు నల్లగా ఉండే ఉల్లిగడ్డల ద్వారా బ్లాక్‌ఫంగస్ వస్తోందని ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త ప్రచారమవుతోంది. ఫ్రిజ్‌లో నల్లగా పేరుకుపోయిన ఫంగస్ వల్ల కూడా సోకే అవకాశముందని వాట్సాప్ లో మెస్సేజ్‌లు సర్కులేట్ అవుతున్నాయి. ఉల్లిగడ్డలపై కనిపించే నల్లని పొర భూమిలో ఉండే ఫంగస్ వల్ల వస్తుంది. కట్ చేసేటప్పుడు దానిని కడిగి తినడం మంచిది. ఇక ఈ కరోనా టైంలో వైరస్ నుంచి వ్యాక్సిస్ దాకా.. వేరియెంట్ల నుంచి ట్రీట్మెంట్ దాకా అన్నింటి గురించి వాట్సాప్‌లో పుకార్లు జోరుగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఇలాంటి టైంలో ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని, లేకపోతే ప్రాణాలకు ప్రమాదమని డాక్టర్లు చెప్తున్నారు.
కోళ్లకు సోకినా..
అయితే ఒకవేళ ఏదైనా జంతువుకి ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ సోకితే వాటి నుంచి భయంకరమైన దుర్వాసన వస్తుంది. ఆ కుళ్లిన వాసనతో కోళ్లకు ఫంగస్ సోకినట్లు గుర్తించవచ్చని ఐసీఎఆర్ సైంటిస్ట్ డాక్టర్ ఎంఆర్ రెడ్డి చెప్తున్నారు. ఆ వాసన వచ్చిన మాంసాన్ని తినలేరు కదా. అయితే ఇప్పటివరకు జంతువులకు బ్లాక్‌ఫంగస్ సోకిన కేసులు నిర్ధారణ కాలేదని, దానిపై ఎలాంటి అధ్యయనాలు జరగలేదని ఎంఆర్‌రెడ్డి చెప్తున్నారు. అయితే కోళ్లను, బాతులను ముద్దు చేయడం ద్వారా సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ సోకుతుందని, ఇది సాధారణమైన ఇన్ఫెక్షన్ కలుగజేస్తుందని అన్నారు.
అంటువ్యాధి కాదు
బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి కాదని ఎయిమ్స్ డైరెక్టర్, పల్మనాలజిస్ట్ అయిన రణ్‌దీప్ గులేరియా ఇది వరకే స్పష్టం చేశారు. మ్యూకర్ అనే ఫంగస్ కారణంగా ఈ మ్యుకర్మైకోసెస్ వస్తుందని చెబుతూనే.. అపోహలపై క్లారిటీ ఇచ్చారాయన. ఇక యునైటెడ్ స్టేట్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఇది చాలా ప్రాణాంతకమైన ఫంగస్ ఇన్ఫెక్షన్ అని చెప్పింది. ఈ వైరస్ కారణంగా చాలా మందిలో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని పేర్కొంది. ఇమ్యూనిటి పవర్ తక్కువగా ఉండటం, స్టెరాయిడ్స్ అధికంగా వాడటం, షుగర్ పేషెంట్లకు ఫంగస్ల వల్ల ముప్పు ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
A clear and important thread on Mucor: What they are, how they cause infections, how to treat the infection, how to lower chances of infection, prevent infection, by controlling diabetes, steroid use. Finally, reduce possibilities of getting COVID: Masks, distance, ventilation! https://t.co/wVgEYaaBl7
— Principal Scientific Adviser, Govt. of India (@PrinSciAdvGoI) May 26, 2021
Comments
Please login to add a commentAdd a comment