boiler
-
అల్ట్రాటెక్ కంపెనీలో బాయిలర్ బ్లాస్ట్
-
షాద్‌నగర్ గ్లాస్ పరిశ్రమలో పేలుడు.. ఆరుగురు కార్మికులు మృతి
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సౌత్ గ్లాస్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఫ్యాక్టరీలో గ్యాస్ కంప్రెష్ చేస్తుండగా ఒక్కసారిగా పేలింది. పేలుడు తీవ్రతకు ఆరుగురు కార్మికులు మృతి చెందారు. 30 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. ఈ దుర్ఘటన సమయంలో ఫ్యాక్టరీలో 150 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారని, వారందరూ యూపీ, బీహార్‌కు చెందిన వారని తెలుస్తోంది. ఇక గాయపడ్డ బాధితుల్ని అత్యవసర చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.మరోవైపు పేలుడుతో ఫ్యాక్టరీలో పైకప్పు కూలగా..గ్లాస్ ముక్కలు గుచ్చుకుని బాధితులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న సిబ్బంది సహాయక చర్యల్ని ముమ్మరం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
రసాయన కర్మాగారంలో పేలుడు.. ఆరుగురు దుర్మరణం!
రాజస్థాన్‌లోని జైపూర్ పరిధిలో గల బస్సీలోని షాలిమార్ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. గాయపడిన ఇద్దరిని ఎస్ఎంఎస్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఒక వ్యక్తి మృతిచెందాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళానికి చెందిన వాహనాలు గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. మృతులను మనోహర్, హీరాలాల్, కృష్ణలాల్ గుర్జార్, గోకుల్ హరిజన్లుగా పోలీసులు గుర్తించారు. ఆసుపత్రిలో చేరిన వారిని ఇంకా గుర్తించలేదు. పరిశ్రమలోని బాయిలర్ పేలడంతో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక దళం, రెస్క్యూ టీం ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాయి. -
గుడ్లను యూరిన్‌లో ఉడికించి, ఉప్పుకారం జల్లి..
ప్రపంచంలో చాలామంది ఆరోగ్యం కోసం రకరకాల గృహవైద్యాలను అనుసరిస్తుంటారు. వాటిపై అపరిమితమైన నమ్మకం కలిగివుంటారు. ఒక్కోసారి అటుంటి ఆహారాలపై ఏవగింపు కలిగినా, ఆరోగ్యం పేరుతో వాటిని తింటారు. ఈ కోవలో కొందరు పాములను, మరికొందరు కీటకాలు, పురుగులను కూడా తింటుంటారు. అది వర్జిన్ గుడ్డు.. ఇదేకోవలోకి వచ్చే ఒక ‘పోషకాహారం’ గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. చైనాకు చెందిన చాలామంది తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మూత్రంలో గుడ్లను ఉడికించి, వాటిపై మసాలాలు చల్లి ఎంతో ఆనందంగా తింటుంటారు. యూరిన్‌లో గుడ్లను ఉడికించి, తినడం వలన మంచి ఆరోగ్యం సమకూరుతుందని చెబుతుంటారు. ఇలా మూత్రంలో ఉడికించిన గుడ్డును వారు వర్జిన్ గుడ్డు అని అంటారు. ఈ విధంగా గుడ్లను ఉడికించేందుకు కొందరు చైనావాసులు.. స్కూలుకు వెళ్లే పిల్లల నుంచి మూత్రం సేకరిస్తారు. స్కూలు టాయిలెట్లలో బకెట్లను ఉంచి.. మూత్రంలో ఉడికించిన గుడ్లను తినడం వలన ఎప్పుడూ జ్వరం రాదని కొందరు చైనావాసులు నమ్ముతారు. అదేవిధంగా రక్తపోటు అదుపులో ఉంటుందని కూడా చెబుతారు. మూత్రం సేకరించేందుకు ఇక్కడివారు ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తారు. స్కూళ్ల టాయిలెట్లలో బకెట్లను ఉంచి, చిన్నారుల నుంచి మూత్రాన్ని సేకరిస్తారు. దానిని గుడ్లను ఉడికించేందుకు వినియోగిస్తారు. ఇది కూడా చదవండి: చిరుతల మధ్య పోరాటం..‘అగ్నికి’ తీవ్రగాయాలు..! -
తెగిపడిన క్రేన్ వైర్: ఇద్దరు మృతి
సాక్షి, మెదక్: జిల్లాలోని మనోహరబాద్ మండలం కళ్లకల్ మహాలక్ష్మి స్టీల్ ప్లాంట్‌లో బాయిలర్ క్రేన్ వైర్ తెగిపోవడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతులను మధ్యప్రదేశ్‌కు చెందిన మహేష్ యాదవ్, నల్గొండ జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ సుమన్ గా గుర్తించారు. సామర్థ్యానికి మించి బరువు వేయడం వల్ల వైర్ తెగిపోయినట్లు సమాచారం. మానవ తప్పిదం వలనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతదేహాలను వెలికితీయడానికి పోలీసులు సుమారు 8 గంటలు శ్రమించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. -
సిర్పూర్ పేపర్‌మిల్లులో ఘోర ప్రమాదం
-
సిర్పూర్ పేపర్‌మిల్లులో ప్రమాదం
కొమురం భీం (ఆసిఫాబాద్): జిల్లాలోని సిర్పూర్ పేపర్ మిల్లులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నూతన బాయిలర్ నిర్మాణ కోసం పిల్లర్లు తవ్వుతున్న ప్రాంతంలో మట్టి పెళ్లలు కుప్పకులాయి. ఒక్కసారిగా మట్టిపెళ్లలు పడటంతో కూలీలు ఇరుక్కుపోయారు. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు మృతి చెందగా.. గాయపడ్డ నలుగురు కూలీలను చికిత్స కోసం మంచిర్యాల, కరీంనగర్ ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీం, పోలీసుల సాయంతో కూలీలను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో స్పామ్ కార్మికులు అంతా సురక్షితంగా ఉన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న కూలీలు బాయిలర్ నిర్మాణ పనులకు వచ్చిన వారిగా తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఫార్మా కంపెనీలో పేలుడు.. ఒకరు మృతి
పరవాడ(విశాఖపట్టణం జిల్లా): విశాఖపట్టణం జిల్లా పరవాడలోని ఓ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఎజికో ఫార్మా కంపెనీలో మంగళవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటనలో రియాక్టర్ మెయిన్ హోల్ ఓపెన్ అయి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. దాంతో కార్మికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. క్షతగాత్రులను కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
రైస్‌మిల్లులో పేలిన బాయిలర్
– ఇళ్ల గోడలు ధ్వంసం –ఉలికిపడిన కాలనీవాసులు మిర్యాలగూడ అర్బన్ ప్రమాద వశాత్తు రైస్‌మిల్లులో బాయిలర్ పేలడంతో ఇళ్ల పైకప్పులు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన పట్టణంలోని హనుమాన్‌పేటలో గల ఏకశిల పార్బాయిల్డ్ రైస్ మిల్లులో శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. హునామన్ పేటలో గల ఏకశిల పార్బాయిల్డ్ రైస్‌మిల్లులోని బాయిలర్ రాత్రి 8:30 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలింది. దీంతో నాలుగు గదుల వెడల్పుతో ఉన్న బాయిలర్ మెత్తం ధ్వంసమైంది. పేలుడు శబ్దానికి ఇనుప ముక్కలు, రేకు ముక్కలు, ఇటుక పెల్లలు ఎగిరి ఇళ్లపై పడ్డాయి. దీంతో కాలనీవాసులు భయంతో పరుగులు పెట్టారు. పేలుడు శబ్దానికి పలు ఇళ్లలో టీవీలు పేలిపోయాయి. తేరుకున్న కాలనీ వాసులు రైస్‌మిల్లు వైపుకు వచ్చి చూడగా రైస్‌మిల్లు గోడలు కూడా పగుళ్లు ఏర్పడ్డాయి. రాత్రి సమయంలో ప్రమాదం జరగడంతో మిల్లులో పని చేసే కార్మికులు ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైయింది. గతంలోనూ.. కాగా బాయిలర్‌లో బూడిద పేరుక పోవడంతోనే బాయిలర్ పేలిందని కాలనీ వాసులు పేర్కొంటున్నారు. రైస్‌మిల్లు వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఈ రైస్‌మిల్లులో గతంలోనూ ఇదే మాదిరిగా ప్రమాదం జరిగిందని అప్పుడుకూడా ఆస్తి నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లు నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. -
బాయిలర్‌లో పడి కార్మికుడి మృతి
ముత్తుకూరు: బాయిలర్‌లో పడి ఓ కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందిన సంఘటన నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులో గురువారం వెలుగు చూసింది. ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన రామదాసు(40) నేలటూరులోని ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రంలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈ రోజు విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు బాయిలర్‌లో పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. -
కర్మాగారంలో ప్రమాదం: ఇద్దరు మృతి
-
కర్మాగారంలో ప్రమాదం: ఇద్దరు మృతి
ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగలపల్లిలోని ఓ కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. గ్రామ సమీపంలోని తిరుమల ఆయిల్ కంపెనీలో శనివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో బాయిలర్‌లో పడి ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు బిహార్ రాష్ట్రానికి చెందినవారని సమాచారం. పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని ఒక మృతదేహాన్ని వెలికితీశారు. క్షతగాత్రుడిని హైదరాబాద్‌కు తరలించారు. -
బాయిలర్‌లో పడి వ్యక్తి మృతి
మల్హర్ (కరీంనగర్) : డాంబర్ ప్లాంట్‌లో పని చేస్తున్న కార్మికుడు ప్రమాదవశాత్తూ బాయిలర్‌లో పడి మృతిచెందిన సంఘటన కరీంనగర్ జిల్లా మల్హర్ మండలం కొండంపేట గ్రామంలో గురువారం చోటుచేసకుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం జుకల్ ఎర్రకుంటా గ్రామానికి చెందిన భద్రు(34) స్థానిక డాంబర్ ప్లాంట్‌లో కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం పని చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు బాయిలర్‌లో పడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు కరీంనగర్‌కు బయలుదేరారు.