![5 dead, over 20 injured as blast in boiler fire in shadnagar](/styles/webp/s3/article_images/2024/06/28/blast.jpg.webp?itok=JCo0DkHA)
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సౌత్ గ్లాస్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఫ్యాక్టరీలో గ్యాస్ కంప్రెష్ చేస్తుండగా ఒక్కసారిగా పేలింది. పేలుడు తీవ్రతకు ఆరుగురు కార్మికులు మృతి చెందారు. 30 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. ఈ దుర్ఘటన సమయంలో ఫ్యాక్టరీలో 150 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారని, వారందరూ యూపీ, బీహార్‌కు చెందిన వారని తెలుస్తోంది. ఇక గాయపడ్డ బాధితుల్ని అత్యవసర చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు పేలుడుతో ఫ్యాక్టరీలో పైకప్పు కూలగా..గ్లాస్ ముక్కలు గుచ్చుకుని బాధితులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న సిబ్బంది సహాయక చర్యల్ని ముమ్మరం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment