కూతురి ఉసురు తీసిన తండ్రి.. అదృశ్యమైందంటూ.. | Father Assassinated 9 Year Old Daughter Due To Health issue In Shadnagar | Sakshi
Sakshi News home page

కూతురి ఉసురు తీసిన తండ్రి.. అదృశ్యమైందంటూ..

Published Tue, Apr 5 2022 7:25 PM | Last Updated on Tue, Apr 5 2022 7:30 PM

Father Assassinated 9 Year Old Daughter Due To Health issue In Shadnagar - Sakshi

హత్యకు గురైన పాప ప్రియ, నిందితుడు నరేశ్‌

సాక్షి, షాద్‌నగర్‌: కన్నకూతురును కళ్లలో పెట్టుకొని చూసుకోవాల్సిన తండ్రి కర్కశంగా ఆ చిన్నారి ఉసురు తీశాడు. ఈ ఘటన షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం సాయత్రం  వెలుగుచూసింది. ఫరూఖ్‌నగర్‌ మండలం బాపన్‌గుట్ట తండాకు చెందిన నరేశ్, రజిత దంపతులకు కూతురు ప్రియ (9 నెలలు) ఉంది. తన కూతురు కనిపించడంలేదని నరేశ్‌ ఆదివారం షాద్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా క్లూస్ట్ టీం ,డాగ్ స్క్వార్డ్‌తో రంగంలోకి దిగిన సీఐ నవీన్ కుమార్, ఎస్సై వెంకటేశ్వర్లు 24 గంటల్లో కేసును చేధించారు. ప్రియ మిస్సింగ్ కేసు హత్య కేసుగా మార్చి హత్యకు గల కారణాలను ఏసీ కుశల్కర్ మంగళవారం మీడియాకు వెల్లాడించారు. రెండేళ్ల కిత్రం నరేశ్‌, రజితకు వివాహమైనట్లు తెలిపారు. అయితే నరేశ్‌ వ్యవహారశైలిని అనుమానించి అతన్ని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా, చిన్నారిని తానే హత్యచేసినట్లు అంగీకరించినట్లు పేర్కొన్నారు.
చదవండి: విషాదం మిగిల్చిన ఫోటోషూట్‌.. పెళ్లైన రెండు వారాలకే..

భార్య గర్భవతిగా ఉన్న సమయంలో పరీక్షల్లో ఎయిడ్స్‌ ఉందని నిర్ధారణ అయ్యినట్లు, దీనితో అనారోగ్యం, ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో తమకు ఏమైనా అయితే పాప పరిస్థితి ఏంటని అనాలోచితంగా ఆలోచించిన నరేశ్‌ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిపారు.  హంతకుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. అలాగే ఈ ఘటనలో తల్లిపాత్ర కూడా ఉందా అనే కోణంలో విచారిస్తున్నారు. మృతదేహాన్ని షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  
చదవండి: Extra Marital Affair: స్నేహితుడి ప్రియురాలితో సానిహిత్యం.. ఏడాది తర్వాత!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement