షాద్‌ నగర్‌లో క్షుద్ర పూజలు..బయటపడ్డ దొంగ స్వామీజీ బాగోతం | Shadnagar: Young Woman Complains On a Fake Swami Who Cheated With Money | Sakshi
Sakshi News home page

షాద్‌ నగర్‌లో క్షుద్ర పూజలు..బయటపడ్డ దొంగ స్వామీజీ బాగోతం

Dec 11 2021 4:55 PM | Updated on Dec 11 2021 9:28 PM

Shadnagar: Young Woman Complains On a Fake Swami Who Cheated With Money - Sakshi

సాక్షి, రంగారెడ్డి: పల్లెల్లో మూఢనమ్మకాలు ఇంకా రాజ్యమేలుతున్నాయి. మంత్రతంత్రాలు, గుప్తనిధుల పేరుతో కొందరు గ్రామీణులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మంత్రతంత్రాలు, బాణామతి, చేతబడులు అంటూ మూఢ నమ్మకాలను అమాయక ప్రజలు నమ్ముతూనే ఉన్నారు. తాజాగా షాద్‌నగర్‌ మండలం కమ్మదనం గ్రామ శివారులు ఓ దొంగ బాబా క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. శివ‌స్వామి అనే వ్యక్తి కొంత‌కాలంగా ఓ ప్రైవేట్ వెంచ‌ర్ లో ఇల్లు క‌ట్టుకుని.. కాళికామాత విగ్ర‌హం పెట్టి పూజ‌లు చేస్తున్నాడు.

అతని వద్దకు వెళ్లేవారి కళ్ల‌ల్లో నిమ్మ రసం పిండి, వెంట్రుకలు పట్టి కొడుతున్నాడు. అమ్మవారి పాదాల కింద పోటోలు పెట్టి వశీకరణ మంత్రం రాగి పూతలతో కూడుకున్న పేర్లు రాసి పెడుతున్నాడు. గ‌తంలో మ‌ధురాపూర్ గ్రామంలో ఇలాగే ప్ర‌వ‌ర్తించగా.. గ్రామస్తులు బెదిరించడంతో అక్కడి నుండి వెంచర్ ద‌గ్గ‌ర‌కు క్షుద్ర పూజల‌ను షిఫ్ట్ చేశాడు. తాజాగా అతని వద్దకు  హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి తన తల్లి ఆరోగ్యం బాగా లేకపోవడంతో పూజలు చేయించడానికి  తీసుకొచ్చింది. 
చదవండి: కొలంబో క్యాసినోలో శాశ్వత టేబుల్‌! .. ఉద్యోగాలు పోయిన వారే టార్గెట్‌

అయితే డబ్బులు తీసుకొని  తల్లి ఆరోగ్యాన్ని నయం చేయలేదని మోపోయానని గ్రహించిన సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా నిందితుడు ఎలా క్షుద్ర పూజలు చేస్తాడో ఆ వీడియోతో సహా ఆధారాలు బయటపెట్టింది. దీంతో శివ స్వామీ బాబా బాగోతం వెలుగులోకి వచ్చింది. దొంగ స్వామిపై షాద్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని అదుపులోకి తీసుకున్నారు. కాగా తాను క్షుద్ర పూజలు చేయలేదని. ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే మంత్రిస్తానని స్వామి పోలీసులు తెలిపారు. 
చదవండి: మహిళా టెక్కీ ఆత్మహత్య.. రెండేళ్ల క్రితమే వివాహం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement