fake swamiji
-
పూజల పేరుతో దొంగస్వామి మోసం.. మహిళకు మాయమాటలు చెప్పి
సాక్షి,గుంటూరు: ఇంట్లో దేవుడి ఫొటోలు కాలిపోవటంతో ఓ మహిళ దొంగస్వామిని ఆశ్రయించింది. ఈ క్రమంలో మహిళకు మాయమాటలు చెప్పిన దొంగస్వామి ఆమె వద్ద రూ.13 లక్షలు వసూలు చేశాడు. కొన్ని రోజులు తర్వాత తాను మోసపోయినట్టు మహిళ ఆలస్యంగా గుర్తించింది. తన వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగడంతో దొంగస్వామి అనుచరుల నుంచి అట్రాసిటీ కేసు పెడుతామంటూ మహిళకు బెదిరింపులు మొదలయ్యాయి. బాధిత మహిళ గుంటూరు పోలీసులను ఆశ్రయించింది. చదవండి: ఓ మహిళా చిరుద్యోగి.. 20 ఏళ్లుగా న్యాయ పోరాటం చేసి -
భార్య సహకారం.. యువతిని భయపెట్టి ఐదేళ్లుగా అఘాయిత్యం
సైబర్ నేరగాళ్ల మాదిరిగానే నకిలీ బాబాలు, స్వాములు అమాయకులను వంచించడం విస్తరిస్తోంది. అమాయక యువతిపై కన్నేసి బెదిరింపుల ద్వారా లోబర్చుకున్నాడో నకిలీ స్వామి. యువతికి త్వరలోనే పెద్ద గండం ఉందని చెప్పాడు కానీ అది తన వల్లే అని చెప్పలేదు. గండం పోగొట్టుకోవాలని ఆశ్రమానికి వెళ్లిన అభాగ్యురాలు సాలెగూట్లో చిక్కుకున్న ప్రాణిలా విలవిలలాడింది. (కర్ణాటక) కృష్ణరాజపురం: యువతి అమాయకత్వాన్ని అనువుగా మలుచుకుని పూజల పేరుతో మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడో నకిలీ స్వామీజీ. ఆపై ఆమెను ఫొటోలు, వీడియోలు తీసి బెదిరిస్తూ వాంఛలు తీర్చుకుంటున్న కామాంధుడు చివరికి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన ఎక్కడో మారుమూల కుగ్రామంలో కాదు, సిలికాన్ సిటీలోని కృష్ణరాజపురం పరిధిలో చోటు చేసుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నకిలీ స్వామి ఆనంద మూర్తి, అతని భార్య లతపై అత్యాచారం, మోసం, హత్యాయత్నం, బెదిరింపు సెక్షన్ల కింద ఆవల హళ్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పెళ్లిలో కలిసి, ఆశ్రమానికి రప్పించి సుమారు ఐదు సంవత్సరాల కిందట ఆ యువతి స్నేహితురాలి పెళ్లికి వెళ్లినప్పుడు అక్కడ నకిలీ స్వామీజీ ఆనందమూర్తి పలకరించాడు. ఇతనికి ఆవలహళ్లిలో ఓ ఆశ్రమం ఉంది. నీ జీవితంలో చాలా పెద్ద గండం ఉంది. దాని వలన నీతో పాటు నీ కుటుంబ సభ్యులకు తీవ్ర ఇబ్బందుల్లో పడతారు, అది జరగకుండా ఉండాలంటే ప్రత్యేక పూజలు చేయాలని యువతిని మానసికంగా భయపెట్టాడు. గండం పోవాలనుకున్న బాధితురాలు అతను చెప్పినట్లు ఆశ్రమానికి వెళ్లి పెద్ద గండంలో చిక్కుకుంది. పూజ, హోమం చేస్తున్నట్లు చెప్పి యువతికి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడు. ఇందుకు అతని భార్య లత కూడా సహకరించింది. ఆపై యువతిని ఫొటోలు, వీడియోలు తీసి ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు, చెబితే వీడియోలను ఇంటర్నెట్లో పెడతా, నిన్ను చంపేస్తానని బెదిరించి సుమారు ఐదు సంవత్సరాలుగా యువతిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. యువతికి నిశ్చితార్థం చెడగొట్టి.. ఇటీవల యువతికి ఆమె తల్లిదండ్రులు పెళ్లి సంబంధం చూసి నిశ్చితార్థం నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న నకిలీ స్వామీజీ కాబోయే వరున్ని కలిసి తనవద్దనున్న యువతి వీడియోలను చూపించి పెళ్లిని రద్దు చేయించాడు. నీవు నా సొంతం, నా వద్ద ఉండాలి, నీవు ఎవరిని పెళ్లి చేసుకున్నా వదలను అని బెదిరించాడు. యువతి నకిలీ స్వామీజీ చిత్రవధను తట్టుకోలేక తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వెంటనే వారు ఆవలహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆనందమూర్తి దంపతులు ఇలా ఎంతోమందిని మోసం చేశారని ఆరోపణలున్నాయి. ఇతని బాధితులు ఎవరైనా ఉంటే తమను కలిసి ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరారు. -
నిధి అంటూ దంపతులకు బురిడీ
యశవంతపుర: నిధి ఆశ చూపి దంపతులకు రూ. 5 లక్షలు మోసం చేసి దొంగస్వామి అదృశ్యమైన ఘటన హాసన్ జిల్లాలో చోటు చేసుకుంది. తాలూకాలోని దొడ్డహళ్లి గ్రామానికి చెందిన గౌడకు గ్రామంలో కొంత భూమి ఉంది. ఆ భూమిలో నిధి ఉందంటూ మంజేగౌడ అనే దొంగస్వామి నమ్మించాడు. దైవశక్తితో బయటకు తీస్తానంటూ ముందుగానే మూడు కేజీల బంగారు పూత పూసిన బంగారు విగ్రహాన్ని పాతి పెట్టాడు. మొదట భూమి యజమాని గౌడ–లీలావతి దంపతులు పూజ చేస్తే బయటకు తీస్తానని చెప్పి వారి భూమిలో పాతి పెట్టిన నకిలీ పసిడి విగ్రహాన్ని బయటకు తీసి దంపతులకు ఇచ్చాడు. విగ్రహానికి రక్తాభిషేకం చేయాలని చెప్పి లీలావతి వేలును కోశాడు. దీంతో వేలు తెగిపోయింది. వారం రోజుల తరువాత గౌడ దంపతులు విగ్రహాన్ని తీసుకుని బంగారు షాపులో పరీక్షించగా అది వెండిదిగా తేలింది. అంతకు ముందే స్వామీజీ రూ. 5 లక్షల తీసుకుని పరారయ్యాడు. వేలు తెగిపోవడంతో లీలావతి ఆస్పత్రి పాలైంది. అయితే ఈ ఘటనపై ఇంత వరకు కేసు నమోదు కాలేదు. (చదవండి: వివాహేతర సంబంధం ఉందనే అనుమానం.. ఫోన్లో మాట్లాడుతుంటే చూసి..) -
షాద్ నగర్లో క్షుద్ర పూజలు..బయటపడ్డ దొంగ స్వామీజీ బాగోతం
సాక్షి, రంగారెడ్డి: పల్లెల్లో మూఢనమ్మకాలు ఇంకా రాజ్యమేలుతున్నాయి. మంత్రతంత్రాలు, గుప్తనిధుల పేరుతో కొందరు గ్రామీణులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మంత్రతంత్రాలు, బాణామతి, చేతబడులు అంటూ మూఢ నమ్మకాలను అమాయక ప్రజలు నమ్ముతూనే ఉన్నారు. తాజాగా షాద్‌నగర్ మండలం కమ్మదనం గ్రామ శివారులు ఓ దొంగ బాబా క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. శివస్వామి అనే వ్యక్తి కొంతకాలంగా ఓ ప్రైవేట్ వెంచర్ లో ఇల్లు కట్టుకుని.. కాళికామాత విగ్రహం పెట్టి పూజలు చేస్తున్నాడు. అతని వద్దకు వెళ్లేవారి కళ్లల్లో నిమ్మ రసం పిండి, వెంట్రుకలు పట్టి కొడుతున్నాడు. అమ్మవారి పాదాల కింద పోటోలు పెట్టి వశీకరణ మంత్రం రాగి పూతలతో కూడుకున్న పేర్లు రాసి పెడుతున్నాడు. గతంలో మధురాపూర్ గ్రామంలో ఇలాగే ప్రవర్తించగా.. గ్రామస్తులు బెదిరించడంతో అక్కడి నుండి వెంచర్ దగ్గరకు క్షుద్ర పూజలను షిఫ్ట్ చేశాడు. తాజాగా అతని వద్దకు హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి తన తల్లి ఆరోగ్యం బాగా లేకపోవడంతో పూజలు చేయించడానికి తీసుకొచ్చింది. చదవండి: కొలంబో క్యాసినోలో శాశ్వత టేబుల్! .. ఉద్యోగాలు పోయిన వారే టార్గెట్ అయితే డబ్బులు తీసుకొని తల్లి ఆరోగ్యాన్ని నయం చేయలేదని మోపోయానని గ్రహించిన సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా నిందితుడు ఎలా క్షుద్ర పూజలు చేస్తాడో ఆ వీడియోతో సహా ఆధారాలు బయటపెట్టింది. దీంతో శివ స్వామీ బాబా బాగోతం వెలుగులోకి వచ్చింది. దొంగ స్వామిపై షాద్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని అదుపులోకి తీసుకున్నారు. కాగా తాను క్షుద్ర పూజలు చేయలేదని. ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే మంత్రిస్తానని స్వామి పోలీసులు తెలిపారు. చదవండి: మహిళా టెక్కీ ఆత్మహత్య.. రెండేళ్ల క్రితమే వివాహం.. -
సామీజీల వేషం.. పూజలంటూ మోసం
సాక్షి, జగిత్యాల(కరీంనగర్): వారు స్వామీజీల వేషం కట్టారు.. రెండ్రోజులుగా ఇంటింటికీ తిరుగుతున్నారు.. సమస్యలు పరిష్కరిస్తామని నమ్మిస్తున్నారు.. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మార్చుతామని చెబుతూ పూజలు చేస్తున్నారు.. తాయత్తులు కడుతూ అందిన కాడికి దండుకుంటున్నారు.. నిందితులను జగిత్యాల ఖిలాగడ్డ ప్రాంతంలో స్థానికులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులు స్వామిజీల అవతారంలో రెండు రోజులుగా ఖిలాగడ్డ ప్రాంతంలో ఇంటింటికీ వెళ్తున్నారు. ముందుగా వీరిలో ఒకరు మీ ఇంట్లో సమస్య ఉందని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించి, వెళ్తారు. గంట తర్వాత మరొకరు వచ్చి, లేని సమస్యలు ఉన్నట్లు నమ్మించి, రూ.2 వేలు, రూ.2,500 విలువైన తాయత్తులు ఉన్నాయని, వాటిని కట్టుకుంటే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని నమ్మిస్తారు. ఇలా పెద్దఎత్తున డబ్బు వసూలు చేస్తున్నారు. విషయం స్థానికులకు అర్థమవడంతో నిందితులను మంగళవారం ఉదయం పట్టుకొని, దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. -
బట్టబయలైన శ్రీకాంత్ స్వామి బాగోతం
-
బట్టబయలైన శ్రీకాంత్ స్వామి బాగోతం
సాక్షి, నల్గొండ : ప్రజల నమ్మకాలను ఆసరాగా తీసుకుని దొంగ స్వామిజీలు, బాబాలు అక్రమాలు సాగిస్తున్నారు. డబ్బులు దండుకోవడమే కాకుండా.. మాయ మాటలు చెప్పి కొందరి జీవితాలను రోడ్డున పడేలా చేస్తున్నారు. తాజాగా జిల్లాలోని చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో ఇలాంటి సంఘటనే వెలుగుచూసింది. వట్టిమర్తిలో కొలువు చెప్పే శ్రీకాంత్ స్వామి.. తెరవెనక చేస్తున్న బాగోతం బయటపడింది. కొందరు మహిళలు, యువతలు పట్ల అతడు అసభ్యకరంగా ప్రవర్తించిన ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో రంగంలోకి దిగిన చిట్యాల పోలీసులు శ్రీకాంత్‌ను శుక్రవారం అరెస్ట్ చేశారు. ఆ ఫొటోలకు సంబంధించి అతన్ని విచారిస్తున్నారు. -
దోషం ఉందని ఉంగరం కాజేసే యత్నం
ఇంద్రకీలాద్రి(విజయవాడ వెస్ట్): కాషాయం కట్టాడు.. నుదిటిన విభూది రాసాడు.. మెడలో రుద్రాక్ష వేశాడు.. ఆకలి అన్నాడు... నీకు దోషం ఉందన్నాడు.. శాంతి చేస్తా.. ఆ తర్వాత అంతా మంచే జరుగుతుందని నమ్మకంగా చెప్పాడు.. తీరా దగ్గరకు వెళ్లే సరికి మాటలతో మాయ చేశాడు.. మత్తు మందు చల్లినట్లుగా అంతా క్షణంలో జరిగిపోయింది.. తీరా రెండు అడుగులు వేసే సరికి చేతికి ఉన్న బంగారపు ఉంగరం మాయమైంది. ఇదీ దుర్గగుడి ఘాట్ రోడ్డు వద్ద ఆదివారం ఓ దొంగ స్వామి నిర్వాకం. భక్తుడిని మాయ చేసి ఉంగరాన్ని కాజేయాలని చూసిన దొంగస్వామిని ఆదివారం భక్తులు పట్టుకుని వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు. దొంగస్వామిని పోలీసులు తమదైన శైలిలో విచారించి గతంలో ఇటువంటి ఘటనలకు ఏమైనా సంబంధం ఉందా అనే దిశగా పోలీసులు విచారిస్తున్నారు. సేకరించిన వివరాల ప్రకారం కాకినాడకు చెందిన వంకాయల శ్రీకాంత్, భార్యతో కలిసి అమ్మవారి దర్శనానికై ఇంద్రకీలాద్రికి విచ్చేశాడు. ఘాట్ రోడ్డు ద్వారా కొండపైకి నడుచుకుంటూ వెళ్లేందుకు శ్రీకాంత్ కుటుంబం టోల్‌గేటు వద్దకు వచ్చే సరికి మార్గమధ్యలో ఓ సాధువు కనిపించాడు. మెడలో రుద్రాక్షలు, వంటిపై కాషాయంతో ఉన్న ఆ సాధువు ఆకలిగా ఉంది భోజనం పెట్టించండీ అంటూ అటుగా వచ్చి పోయే భక్తులను అడుగుతున్నాడు. దీంతో శ్రీకాంత్ వెంటనే రూ. 50 తీసి సాధువుకు ఇచ్చాడు. అయితే శ్రీకాంత్ చేయి పట్టుకున్న సాధువు నీకు దోషగుణం ఉందని చెప్పాడు. అంతేకాదు శాంతి చేయాలని చెప్పి శ్రీకాంత్‌ను మాటలోకి దింపాడు. చాకచక్యంగా ఉంగరాన్ని లాగేశాడు. తర్వాత కొద్ది నిమిషాలకు శ్రీకాంత్ యథాస్ధితికి చేరుకోగా, భార్య చేతికి ఉంగరం లేదని గుర్తించింది. దీంతో అప్రమత్తమైన బాధితుడు వెంటనే సాధువును పట్టుకున్నాడు. అక్కడే ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న సీఐ రాజేంద్రప్రసాద్‌కు అప్పగించారు. నిందితుడి సమక్షంలో సాధువును తనిఖీ చేయగా, అతని వద్ద ఉంగరం లభించింది. దీంతో సాధువును వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సాధువు వేషంలో ఉన్న వ్యక్తి మధ్యప్రదేశ్‌కు చెందిన అశోక్నాగ్గా పోలీసుల విచారణలో తేలింది. అయితే స్టేషన్లోనూ దొంగ సాధువు తన మాటల చాతుర్యంలో తప్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాడు. బాధితుడి నుంచి ఫిర్యాదు తీసుకున్న వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
‘దొంగ’ స్వామీజీకి చంద్రబాబు ఒంగి ఒంగి దండాలు
-
‘దొంగ’ స్వామికి ఒంగి ఒంగి దండాలు!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితుల వ్యవహారంలో తీవ్ర విమర్శలెదుర్కొంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. జరిగిన నష్టాన్ని పూడ్చుకోవా లని అనుకున్నారో ఏమో తాజాగా ఓ దొంగ స్వామీజీ విషయంలో తప్పులో కాలేశారు. సదరు స్వామీజీ గురించి ఏమాత్రం తెలుసుకోకుండానే ఒంగి ఒంగి దండాలు పెట్టడం ఇప్పుడు విశాఖ నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. ముక్కూమొహం తెలియని.. నేరచరిత్ర కలిగి వున్న ఆ దొంగ స్వామీజీ పట్ల సీఎం ఎంతో భక్తిప్రపత్తులు ప్రదర్శించి ఆయన నుంచి ఆశీస్సులు అందుకోవడం ఇప్పుడు వివాదా స్పదమవుతోంది. శాలువా కప్పుతున్న శంకరస్వామి చోరీ కేసులో స్వామి (ఫైల్) విశాఖ విమానాశ్రయంలో గత మంగళవారం జరిగిన ఈ ఎపిసోడ్ కథాకమామిషు ఏంటంటే.. ధర్మపోరాట సభ పురస్కరించుకుని విశాఖకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబును విమానాశ్రయంలో దొంగ స్వామి కలుసుకున్నారు. తాను శంకర విద్యానంద సరస్వతినని, అమ్మవారి ఉపాసకుడినని చెప్పుకోవడంతో సీఎం ఆయనపట్ల ఎంతో భక్తి ప్రదర్శించారు. అంతేకాక.. ఆయనకు ఒంగి ఒంగి దండాలు పెట్టి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. ఆ తర్వాత సదరు శంకర సదానంద స్వామి అలియాస్ శంకరస్వామి అలియాస్ శ్రీ శంకర విద్యానంద సరస్వతిస్వామి నేరచరిత్ర వెలుగులోకి వచ్చింది. తీగలాగితే డొంక కదిలినట్లు.. స్వామీజీ లీలలు బయటపడ్డాయి. అవి.. - 2014 మే నెలలో పోలీసు జీపు నుంచి వైర్లెస్ సెట్, మైక్రో ఫోన్, వాకీటాకీ తదితర సామగ్రి అపహరించాడంటూ విశాఖ నాలుగో టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో అతనిని సీఐ లక్ష్మణరావు అరెస్టుచేసి రిమాండ్‌కు పంపారు. ఆ కేసు ఇప్పటికీ నడుస్తోంది. - ఆ తర్వాత కూడా శంకరస్వామిపై అనేక ఆరోపణలు వచ్చాయి. రాత్రిపూట బీచ్‌రోడ్‌లో బ్లూలైట్ ఉన్న కారులో తిరుగుతూ మఫ్టీలో ఉన్న పోలీస్ అధికారినని ప్రజలను భయపెట్టిన దాఖలాలూ ఉన్నాయి. - ఇటీవల ఓ కారు షోరూమ్‌కు వెళ్లి ఐదు వేలు అడ్వాన్స్, మిగిలిన మొత్తానికి పోస్ట్‌డేటెడ్ చెక్‌తో కారు కొనుగోలు చేసిన స్వామి.. ఆ తర్వాత నయాపైసా కూడా చెల్లించలేదు. దీంతో షోరూమ్ వారు వాహనాన్ని వెనక్కి తీసేసుకున్నారు. ఇంత ఘనమైన నేర చరిత్ర ఉన్న దొంగ స్వామి నుంచి ఆశీస్సులు అందుకోవడం ఇప్పుడు విశాఖలో చర్చనీయాంశమైంది. కాగా, దీనిపై విశాఖ నగర సీపీ యోగానంద్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. జరిగిన సంఘటనపై విచారణ జరుపుతున్నామన్నారు. -
అవతార పురుషుడని... అకృత్యాలు
సాక్షి, బళ్లారి: కర్ణాటక చిత్రదుర్గలో తనకు కంచీవరదస్వామి ఆవహిస్తున్నాడని, గత కొంతకాలంగా అక్కడ ప్రజలను నమ్మబలికాడు ఓ వ్యక్తి. అంతేకాక ఆ ప్రాంత ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత తనకు తాను..అవతార పురుషుడుగా ప్రకటించుకుని కార్యకలాపాలు సాగిస్తున్న లోకేష్ అనే బురిడీబాబా అసలు స్వరూపం బుధవారం బయట పడింది. వివరాలు.. చిత్రదుర్గ జిల్లా హొసదుర్గ తాలూకా కంచీపురం గ్రామానికి చెందిన లోకేష్ అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా అదే గ్రామంలో ఎంతో మహిమాన్వితుడుగా, దేవమానవుడుగా పేరుగాంచిన కంచీవరద స్వామి తనకు పూనుతున్నాడని ప్రజలను నమ్మించాడు. అవీ ఇవీ జిమ్మిక్కులు చేస్తూ జిల్లాతో పాటు బెంగళూరులోనూ నమ్మకం సంపాదించాడు. ఇంజినీరింగ్ విద్యార్థినిపై కన్ను అదే గ్రామానికి చెందిన ఓ ఉపాధ్యాయుని కుమార్తె ఇంజినీరింగ్ చదువుతోంది. ఆమెను తనకు ఇచ్చి పెళ్లి చేయాలని స్వామి ఆదేశించారని నేరుగా అమ్మాయి తల్లిదండ్రుల వద్ద లోకేష్ ప్రతిపాదన తెచ్చాడు. దీంతో టీచర్ బంధువులు లోకేష్ అసలు విషయం తెలుసుకుని ప్రజలకు తెలియజేశారు. ఈ విషయంపై స్థానిక పోలీసు స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం ఒక్కసారిగా చిత్రదుర్గ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. బురిడీ బాబా తెర వెనుక చేస్తున్న కార్యకలాపాలు ఎన్నో ఉన్నాయని పలువురు పోలీసు స్టేషన్‌కు వచ్చి ఆందోళన చేశారు. తమను కూడా వేధించారని, ఆయనకు ఏ స్వామీ ఆవహించడం లేదని దొంగ స్వామి అంటూ మండిపడ్డారు. రెండు వర్గాలుగా జనం అయితే అదే గ్రామానికి చెందిన మరో సగం మంది లోకేష్‌కు మద్దతుగా నిలుస్తూ స్వామీజీ ఎన్నో మహిమలు చూపారని, అంతేకాక చాలా మందికి మంచి జరిగిందని, అవతార పురుషుడు, దైవాంశ సంభూతుడని మద్దతుగా నిలిచారు. దీంతో పరిస్థితిని అర్థం చేసుకున్న పోలీసులు లోకేష్‌తో లిఖిత పూర్వకంగా రాయించుకుని జామీను మీద వదిలిపెట్టారు. -
షాక్ : నటితో స్వామిజీ రాసలీలలు
సాక్షి, బెంగళూర్ : మరో దిగ్భ్రాంతి కలిగించిన ఘటన వెలుగు చూసింది. కర్ణాటకలో ఓ స్వామిజీ రాసలీలలు వెలుగులోకి రావటంతో పెను కలకలమే చెలరేగింది. నంజేశ్వర స్వామిజీ అలియాస్ దయానంద్ ఓ యువతితో అభ్యంతరకర స్థితిలో ఉన్న ఫోటోలు, వీడియో స్థానిక మీడియాలో వైరల్ అవుతోంది. ఎల్హంక ప్రాంతంలోని మద్దెవనపుర మఠ ఆశ్రమంలో ఇది చోటు చేసుకున్నట్లు సమాచారం. పైగా వీడియోలో ఉంది ఓ నటి అని తెలుస్తోంది. పర్వతరాజ్ శివాచార్య స్వామి నుంచి వారసత్వంగా బాధ్యతలు తీసుకున్న తనయుడు నంజేశ్వర స్వామిజీగా ప్రస్తుతం మఠ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. సీక్రెట్ కెమెరాలతో ఆయన భాగోతాన్ని బయటపెట్టారు. నటికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే మఠానికి సంబంధించి భూముల అవకతవకల్లో ఆయన హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజా ఉదంతంతో మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే దయానంద్ రాసలీలలు కొత్తేం కాదని ఆయన అనుచరులే చెబుతుండగా.. ట్రస్ట్ సభ్యులు దయానంద్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియోలు కన్నడ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. -
పొలతల మల్లిఖార్జున స్వామి ఆలయంలో భూతవైద్యులు
-
స్వామీజీ ముసుగులో నగల అపహరణ
సూళ్లూరుపేట : స్వామిజీ ముసుగులో ఓ గుర్తుతెలియని వ్యక్తి మహిళను మోసం చేసి ఐదు సవర్ల బంగారు నగలు అపహరించిన సంఘటన పట్టణంలోని పార్కువీధిలో సోమవారం జరిగింది. బాధితురాలు వెలుగూరి కుమారి కథనం మేరకు.. స్థానిక సత్యం జూనియర్ కళాశాలకు ఎదురుగా టిఫిన్ సెంటర్ నడుపుకుంటుంది. సోమవారం సాయంత్రం రుద్రాక్షలు, కాషాయ దుస్తులు ధరించిన ఓ వ్యక్తి టిఫిన్ సెంటర్‌కు వచ్చి ఆమెతో మాటలు కలిపి నమ్మ బలికాడు. ఈ టిఫిన్ సెంటర్‌కు వాస్తు బాగలేదని, దీనికి తాను సూచించిన మేరకు చిన్నచిన్న మార్పులు చేస్తే బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పాడు. దీంతో ఆమె అతన్ని నమ్మి ఇంట్లోకి తీసుకెళ్లి పూజలు చేయమని కోరగా ఆయన ఆమె నుదుటిన బొట్టు పెట్టి పూజ చేస్తానని చెప్పి తాళిబొట్టు ఉన్న బంగారు సరుడు ఇవ్వమని అడిగాడు. కొద్దిసేపటికే ఆమె స్పృహ తప్పి పడిపోయింది. దీంతో అతను ఐదు సవర్లు బంగారు నగలు తీసుకుని వెళ్లిపోయారు. పది నిమిషాల తర్వాత స్పృహలోకి వచ్చి చూసే సరికి అతను కనిపించకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. పట్టపగలే స్వామీజీ ముసుగులో చోరీకి పాల్పడిన వైనం స్థానికంగా సంచలనం రేపింది. ఏఎస్ఐ మల్లికార్జునరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దొంగ బాబాకు దేహశుద్ధి