స్వామీజీ ముసుగులో నగల అపహరణ | gold theft in nellore by a fake swamiji | Sakshi
Sakshi News home page

స్వామీజీ ముసుగులో నగల అపహరణ

Published Tue, Sep 27 2016 12:25 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

స్వామిజీ ముసుగులో ఓ వ్యక్తి మహిళను మోసం చేసి బంగారు నగలను అపహరించాడు.

సూళ్లూరుపేట : స్వామిజీ ముసుగులో ఓ గుర్తుతెలియని వ్యక్తి మహిళను మోసం చేసి ఐదు సవర్ల బంగారు నగలు అపహరించిన సంఘటన  పట్టణంలోని పార్కువీధిలో సోమవారం జరిగింది. బాధితురాలు వెలుగూరి కుమారి కథనం మేరకు.. స్థానిక సత్యం జూనియర్‌ కళాశాలకు ఎదురుగా టిఫిన్‌ సెంటర్‌ నడుపుకుంటుంది. సోమవారం సాయంత్రం రుద్రాక్షలు, కాషాయ దుస్తులు ధరించిన ఓ వ్యక్తి టిఫిన్‌ సెంటర్‌కు వచ్చి ఆమెతో మాటలు కలిపి నమ్మ బలికాడు. ఈ టిఫిన్‌ సెంటర్‌కు వాస్తు బాగలేదని, దీనికి తాను సూచించిన మేరకు చిన్నచిన్న మార్పులు చేస్తే బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పాడు.

దీంతో ఆమె అతన్ని నమ్మి ఇంట్లోకి తీసుకెళ్లి పూజలు చేయమని కోరగా ఆయన ఆమె నుదుటిన బొట్టు పెట్టి పూజ చేస్తానని చెప్పి తాళిబొట్టు ఉన్న బంగారు సరుడు ఇవ్వమని అడిగాడు. కొద్దిసేపటికే ఆమె స్పృహ తప్పి పడిపోయింది. దీంతో అతను ఐదు సవర్లు బంగారు నగలు తీసుకుని వెళ్లిపోయారు. పది నిమిషాల తర్వాత స్పృహలోకి వచ్చి చూసే సరికి అతను కనిపించకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. పట్టపగలే స్వామీజీ ముసుగులో చోరీకి పాల్పడిన వైనం స్థానికంగా సంచలనం రేపింది. ఏఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement