
అన్నానగర్: రాజామంగళం సమీపం ఎల్‌ఐసీ ఏజెంట్ ఇంట్లో వరుడుని చూడటానికి వచ్చినట్లు నటించి, 8 తులాల నగలు అపహరించిన ఘట వెలుగు చూసింది. ఈ కేసులో నలుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కన్యాకుమారి జిల్లా రాజామంగళం ప్రాంతానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే అభిప్రాయ బేధాల కారణంగా ఆరేళ్ల కిందట భార్య అతడితో విడిపోయింది.
ప్రస్తుతం ఎల్‌ఐసీ ఏజెంట్ తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది. అతనిని చూసుకోవడానికి ఎల్‌ఐ సీ ఏజెంట్ రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఆన్‌లైన్ మ్యాచ్ మేకింగ్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకున్నాడు. ఇది చూసి మధురై చెందిన మురుగేశ్వరి అనే మహిళ ఎల్‌ఐసీ ఏజెంట్‌ని సంప్రదించి అతడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పింది. కుటుంబ సమేతంగా ప్రత్యక్షంగా చూడబోతున్నట్లు కూడా తెలిపింది. మురుగేశ్వరి, అతని చెల్లెలు కార్తిగైయాయిని(28), ముత్తులక్షి్మ(45), పోదుమ్ పొన్ను (43) ఎల్‌ఐసీ ఏజెంట్ ఇంటికి వచ్చారు.
అక్కడ ఎల్‌ఐసీ ఏజెంట్‌తోపాటు బంధువులు కూడా ఉన్నారు. ఆ తర్వాత రెండో పెళ్లికి ఒప్పుకుంటే ఎల్‌ఐసీ ఏజెంట్ 8 తులాల బంగారు గాజులు, ఉంగరాలు లాంటి నగలను అమ్మాయికి ఇస్తామని తెలిపాడు. వరుడిని చూసేందుకు వచ్చిన మహిళలు దీన్ని నిశితంగా గమనించారు. దీంతో ఎల్‌ఐసీ ఆ నగలను టేబుల్ డ్రాయర్‌లో ఉంచి వచ్చిన వారిని గమనించడంలో నిమగ్నం అయ్యా డు. వరుడిని చూసేందుకు వచ్చిన నలుగురు మహిళలు రాత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఎల్‌ఐసీ ఏజెంట్ టేబుల్‌పై ఉన్న నగలను పరిశీలించగా అవి కనిపించలేదు. దీంతో షాక్‌కు గురైన అతను తన కొడుకు, కుమార్తెకు సమాచారం ఇచ్చాడు.
వరుడిని చూసేందుకు వచ్చిన మహిళలే చోరీ చేసి ఉంటారని ఎల్‌ఐసీ ఎజెంట్ అనుమానించి వెంటనే మురుగేశ్వరిని సెల్‌ఫోన్‌లో సంప్రదించగా అది స్విచ్ఛాఫ్ అయింది. ఆ తర్వాత మురుగేశ్వరితో పాటు వచ్చిన మరో అమ్మాయికి ఫోన్ చేయగా.. నువ్వంటే ఇష్టం లేదని అందుకే పెళ్లికి ఒప్పుకోలేదని చెప్పింది. అలాగే ఆధ్యాత్మిక ఆభరణాల గురించి అడిగితే సరైన సమాధానం చెప్పలేదు. దీంతో ఎల్‌ఐసీ ఏజెంట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మధురైకి చెందిన నలుగురు మహిళలను సోమవారం అదుపులోకి తీసుకుని విచారించగా నగలు చోరీ చేసినట్లు తేలింది. అనంతరం మురుగేశ్వరి, కార్తిగైయాయిని, ముత్తులక్షి్మ, పోదుమ్ పొన్ను అనే నలుగురుని పోలీసులు అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment