LIC Agent
-
ఏజెంట్లకు భారీగా గ్రాట్యుటీ పెంపు.. ఎంతంటే..
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) తన ఏజెంట్లకు గ్రాట్యుటీ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతూ ప్రకటన విడుదల చేసింది. ఎల్ఐసీ ఆఫ్ ఇండియా(ఏజెంట్స్) రెగ్యులేషన్స్, 2017కు సవరణలు చేయడం ద్వారా ఇది సాధ్యమైంది. ఈ నియంత్రణలను ఎల్ఐసీ ఆఫ్ ఇండియా(ఏజెంట్స్) అమెండ్మెంట్ రెగ్యులేషన్స్, 2023గా పరిగణిస్తామని ఎల్ఐసీ తెలిపింది. అధికారిక పత్రాన్ని (అఫిషియల్ గెజిట్) ప్రచురించిన డిసెంబరు 6 నుంచి పెంపు అమల్లోకి వస్తుందని శుక్రవారం సంస్థ పేర్కొంది. ఎల్ఐసీ ఏజెంట్లు, ఉద్యోగుల ప్రయోజనాల నిమిత్తం గ్రాట్యుటీ పెంపు, కుటుంబ పింఛను తదితర పలు సంక్షేమ పథకాలకు ఆర్థిక శాఖ సెప్టెంబరులో అనుమతి ఇచ్చింది. తిరిగి నియమితులైన ఏజెంట్లకూ రెన్యువల్ కమీషన్‌కు అర్హత ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం ఏదైనా పాత ఏజెన్సీ కింద చేసిన వ్యాపారంపై రెన్యువల్ కమీషన్‌కు ఎల్ఐసీ ఏజెంట్లకు అర్హత లేదు. ఇదీ చదవండి: ‘ఈవీ’ ఇళ్లు..! ప్రస్తుతం ఎల్ఐసీలో 25 కోట్ల పాలసీ హోల్డర్లు ఉన్నారు. దాదాపు 12 లక్షల ఏజెంట్లు పని చేస్తున్నారు. ఎల్ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5.1 లక్షల కోట్లుగా ఉంది. -
ఐఆర్డీఏ డ్రాఫ్ట్ ఉపసంహరించేదాకా పోరు
కవాడిగూడ (హైదరాబాద్): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏ) డ్రాఫ్ట్‌ను ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్తంగా ఎల్ఐసీ ఏజెంట్లు పెద్దఎత్తున ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థను ఆగ్రభాగాన నిలబెట్టడంలో ఎల్ఐసీ ఏజెంట్ల పాత్ర మహోన్నతమైందని పేర్కొన్నారు. ఎల్ఐసీ ఏజెంట్ల సమస్యలను దేశ ప్రధాని, తెలంగాణ సీఎంలకు లేఖల ద్వారా పంపించి వివరిస్తామన్నారు. శుక్రవారం ఎల్ఐసీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీఏవోఐ) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల నుంచి వేలాదిమంది ఎల్ఐసీ ఏజెంట్లు ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్‌ఐసీఏవోఐ ఆలిండియా ప్రధాన కార్యదర్శి దిలీప్ మాట్లాడుతూ ఐఆర్డీఏ డ్రాఫ్ట్ వల్ల ఎల్ఐసీ ఏజెంట్ల మనుగడకే తీవ్రమైన నష్టం కలగడమే కాకుండా ఎల్ఐసీ వ్యవస్థ కనుమరుగయ్యే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. ఎల్‌ఐసీఏవోఐ సౌత్ జోన్ అధ్యక్షుడు మంజునాథ్, ప్రధాన కార్యదర్శి నరసింహారావు మాట్లాడుతూ బీమా సంగం పేరుతో ఎల్ఐసీని నిర్వీర్యం చేసి కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. కార్యక్రమంలో సీఐటీయూ ఆలిండియా వైస్ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ వాసుదేవ్ ఆచార్య, ఏఐఐఈఏ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. -
భార్య చనిపోయిందని..
మిర్యాలగూడ : పది సంవత్సరాలుగా మిర్యాలగూడ ఎల్ఐసీ కార్యాలయంలోనే ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఎల్ఐసీ పాలసీల గురించిన ఆయనకు అన్నీ తెలుసు. తన అవసరాల మేరకు నకిలీ పత్రాలు సృష్టించి డబ్బులు కాజేయాలని పథకం వేసి సక్సెస్ అయ్యాడు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో కథ అడ్డం తిరిగింది. వివరాలు.. మిర్యాలగూడ ఎల్ఐసీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కిషన్ తన భార్య రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లుగా నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించాడు. వాటితో తన భార్య పేరున ఉన్న రూ.2.5 లక్షల పాలసీని రెండు విడుతలుగా ఐదు లక్షల రూపాయలను డ్రా చేశాడు. తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా తన విధులు నిర్వర్తిస్తున్నాడు. విజిలెన్స్ తనిఖీలతో బయటపడిన వైనం.. నకిలీ డాక్యుమెంట్లతో ఐదు రూ.లక్షలు స్వాహా చేసిన విషయం విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. సికింద్రాబాద్‌కు చెందిన ఎల్ఐసీ విజెలన్స్ అధికారులు, డివిజనల్ అధికారులతో కలిసి సాధారణ తనిఖీలు చేపట్టారు. ఈ నెల 14న సదరు ఉద్యోగిని సస్పెండ్ చేశారు. అతడికి కార్యాలయ అధికారులు గానీ, ఏజెంట్లు గానీ సహకరించినట్లు సమాచారం. ఎవరు సహకరించారనే విషయంపై డివిజనల్ అధికారులు విచారణ చేపట్టారు. గోప్యంగా ఉంచుతున్న అధికారులు.. అక్రమాలకు పాల్పడిన ఎల్ఐసీ ఉద్యోగి సస్పెండ్ అయినా కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది మాత్రం విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. ఉద్యోగి తన భార్య పేరున డ్రా చేసిన డబ్బులు వివరాలు ఎక్కడా చెప్పడంలేదు. సదరుడాక్యుమెంట్‌లను పరిశీలించిన అధికారి ఎవరనే విషయం కూడా స్థానిక అధికారులకు తెలిసినా వెల్లడించడం లేదు. సస్పెండ్ చేశాం ఎల్ఐసీ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగి కిషన్ నకిలీ పత్రాలు సృష్టించినట్లు ఉన్నతాధికారులు తేల్చారు. ఆయనను వెంటనే ఈ నెల 14న సస్పండ్ చేశారు. సికింద్రాబాద్‌కు చెందిన ఎల్ఐసీ డివిజనల్ ఉన్నతాధికారులు విచారణ చేపడుతున్నారు. – ప్రసాద్, మేనేజర్, మిర్యాలగూడ -
ఎల్ఐసీ ఏజెంట్ కలలు
కమెడియన్ సుమన్ శెట్టి హీరోగా నటిస్తున్న చిత్రం ‘చెంబు చిన సత్యం’. ఇందులో ఆయన ఎల్ఐసీ ఏజెంట్ చెంబు చిన సత్యంగా టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ప్రమోదిని కథానాయిక. నామాల రవీంద్రసూరి దర్శకత్వంలో ఆలూరి సాంబశివరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాటల సీడీని హైదరాబాద్‌లో కేవీ రమణాచారి ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘ఇందులో సుమన్ శెట్టి కనే కలలన్నీ నిజమవుతుంటాయి. ఓ రోజు అతని కుటుంబ సభ్యులు చనిపోయినట్టు కల వస్తుంది. మరి సుమన్ శెట్టి ఎలా కాపాడుకున్నాడన్నదే ఈ సినిమా కథాంశం’’ అని చెప్పారు. సంగీత దర్శకుడు విజయ్ కురాకుల, వరా ముళ్లపూడి, వీరశంకర్ తదితరులు మాట్లాడారు. -
ధనలాభం పేరుతో దగా
మహిమగల నాణేలు, మంత్రించిన రుద్రాక్షల పేరుతో మోసం ముగ్గురు అరెస్టు విశాఖపట్నం, న్యూస్‌లైన్ : మహిమగల నాణేలు, మంత్రించిన రుద్రాక్షలు ఇంట్లో పెట్టుకుంటే ధనలాభం కలుగుతుందని ఓ వ్యక్తిని నమ్మించి నగదు గుంజిన ముగ్గురు మోసగాళ్లను ఎంవీపీ కాలనీ జోన్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ విద్యాసాగర్ కేసు వివరాలు వెల్లడించారు. మోసం చేశారిలా.. అనకాపల్లి శారద నగర్‌కు చె ందిన బోర్ల శ్రీనివాసరావు, కశింకోటకు చెందిన ఎల్ఐసీ ఏజెంట్ నిక్కల శంకరరావు, పెదగంట్యాడ వెంకన్నపాలేనికి చెందిన తిరుమల అప్పలరెడ్డి స్నేహితులు. పాత ఐదు పైసల నాణాలు ఏడు, వాటితో పాటు అయిదు రుద్రాక్షలు దగ్గర పెట్టుకున్నారు. వాటిని అమాయకులకు విక్రయించి నగదు చేసుకోవాలని వ్యూహం పన్నారు. నగరంలోని దుంగ వెంకటరెడ్డిని ఈనెల 27న కలిశారు. తమ వద్ద మిహమగల నాణాలున్నాయి. మం త్రించిన రుద్రాక్షలున్నాయి. వాటిని ఇంట్లో పెట్టుకుంటే ధనలాభం కలుగుతుందని నమ్మబలికారు. వీటి ఖరీదు రూ.3 లక్షలు. ముందుగా రూ.5వేలు అడ్వాన్స్ చెల్లించాలని తె లిపారు. దీంతో ఆశ పడిన వెంకటరెడ్డి రూ.5 వేలు అడ్వాన్స్ ఇచ్చాడు. అప్పలరెడ్డి ఈనెల 29న వెంకటరెడ్డికి ఫోన్ చేసి మిగతా రూ.2.95 లక్షలు ఇవ్వాలని చెప్పాడు. 30వ తేదీన అప్ఫుఘర్ వద్దకు తన స్నేహితులతో కలిసి వస్తాను మిగతా నగదు అక్కడే తీసుకుని నాణేలు, రుద్రాక్షలు ఇస్తానని తెలిపాడు. దీంతో వెంకటరెడ్డికి సందేహం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఎస్ఐ తులసీదాస్, సిబ్బంది ఉదయం అప్పుఘర్ వద్ద మాటు వేశారు. నిందితులు వచ్చి వెంకటరెడ్డికి ఫోన్ చేయగానే పోలీసులు దాడి చేసి వారిని పట్టుకున్నారు. నాణేలు, రుద్రాక్షలు, ఫోన్లు, రూ.5 వేలు నగదు స్వాధీనం చేసుకుని నిందితులు ముగ్గుర్నీ అరెస్ట్ చేశారు.