![ఎల్‌ఐసీ ఏజెంట్ కలలు](/styles/webp/s3/article_images/2017/09/3/61438884347_625x300.jpg.webp?itok=2DAQOJRW)
ఎల్‌ఐసీ ఏజెంట్ కలలు
కమెడియన్ సుమన్ శెట్టి హీరోగా నటిస్తున్న చిత్రం ‘చెంబు చిన సత్యం’. ఇందులో ఆయన ఎల్‌ఐసీ ఏజెంట్ చెంబు చిన సత్యంగా టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ప్రమోదిని కథానాయిక. నామాల రవీంద్రసూరి దర్శకత్వంలో ఆలూరి సాంబశివరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాటల సీడీని హైదరాబాద్‌లో కేవీ రమణాచారి ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘ఇందులో సుమన్ శెట్టి కనే కలలన్నీ నిజమవుతుంటాయి. ఓ రోజు అతని కుటుంబ సభ్యులు చనిపోయినట్టు కల వస్తుంది. మరి సుమన్ శెట్టి ఎలా కాపాడుకున్నాడన్నదే ఈ సినిమా కథాంశం’’ అని చెప్పారు. సంగీత దర్శకుడు విజయ్ కురాకుల, వరా ముళ్లపూడి, వీరశంకర్ తదితరులు మాట్లాడారు.