లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్‌ఐసీ) తన ఏజెంట్లకు గ్రాట్యుటీ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతూ ప్రకటన విడుదల చేసింది.
ఎల్‌ఐసీ ఆఫ్ ఇండియా(ఏజెంట్స్) రెగ్యులేషన్స్, 2017కు సవరణలు చేయడం ద్వారా ఇది సాధ్యమైంది. ఈ నియంత్రణలను ఎల్‌ఐసీ ఆఫ్ ఇండియా(ఏజెంట్స్) అమెండ్‌మెంట్ రెగ్యులేషన్స్, 2023గా పరిగణిస్తామని ఎల్‌ఐసీ తెలిపింది. అధికారిక పత్రాన్ని (అఫిషియల్ గెజిట్) ప్రచురించిన డిసెంబరు 6 నుంచి పెంపు అమల్లోకి వస్తుందని శుక్రవారం సంస్థ పేర్కొంది. ఎల్‌ఐసీ ఏజెంట్లు, ఉద్యోగుల ప్రయోజనాల నిమిత్తం గ్రాట్యుటీ పెంపు, కుటుంబ పింఛను తదితర పలు సంక్షేమ పథకాలకు ఆర్థిక శాఖ సెప్టెంబరులో అనుమతి ఇచ్చింది. తిరిగి నియమితులైన ఏజెంట్లకూ రెన్యువల్ కమీషన్‌కు అర్హత ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం ఏదైనా పాత ఏజెన్సీ కింద చేసిన వ్యాపారంపై రెన్యువల్ కమీషన్‌కు ఎల్‌ఐసీ ఏజెంట్లకు అర్హత లేదు.
ఇదీ చదవండి: ‘ఈవీ’ ఇళ్లు..!
ప్రస్తుతం ఎల్‌ఐసీలో 25 కోట్ల పాలసీ హోల్డర్లు ఉన్నారు. దాదాపు 12 లక్షల ఏజెంట్లు పని చేస్తున్నారు. ఎల్‌ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5.1 లక్షల కోట్లుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment