LIC agents
-
పిల్లల కోసం ‘ఎల్ఐసీ అమృత్‌బాల్’.. ప్రత్యేకతలివే..
గతంతో పోలిస్తే ఇప్పుడు ఎల్కేజీ, యూకేజీ చదివించాలంటే రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సిందే. చిరుద్యోగులైనా, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్లైనా, ప్రభుత్వోద్యోగులైనా, వ్యాపారులైనా తమ పిల్లలకు మెరుగైన విద్యాభ్యాసానికి మొగ్గు చూపుతున్నారు. మున్ముందు ఉన్నత విద్యాభ్యాసం కోసం భారీగా నిధులు అవసరం. ఈ నేపథ్యంలో భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) సరికొత్త పాలసీ తీసుకొచ్చింది. పిల్లల ఉన్నత చదువుల కోసం పొదుపు చేయాలని భావించే వారి కోసం ‘అమృత్ బాల్’ అనే పాలసీ తెచ్చింది. ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యూవల్, సేవింగ్స్ జీవిత బీమా పథకం. మెచ్చూరిటీ కాలం.. ఇటీవలే ప్రారంభమైన ఈ బీమా పాలసీని పిల్లల ఉన్నత చదువులకు పొదుపు చేసే తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టారు. ఇందులో అతి తక్కువ బీమా చెల్లింపు గడువు ఉంటుంది. సింగిల్ ప్రీమియం చెల్లింపు ఆప్షన్ కూడా ఉంది. పిల్లల ఉన్నత విద్య అవసరాల కోసం 18-25 ఏళ్ల వయసు మధ్య బీమా పాలసీ మెచ్యూరిటీ వస్తుంది. 30 రోజుల చిన్నారి పేరు మీద కూడా ఈ పాలసీ అప్లయ్ చేయొచ్చు. గరిష్టంగా 13 ఏండ్ల వయసు గల పిల్లల పేరిట తీసుకోవచ్చు. పాలసీ కనిష్ట మెచ్యూరిటీ 18 ఏళ్లు, గరిష్ట వయసు 25 ఏళ్లుగా నిర్ణయించారు. పాలసీ టర్మ్ కనీసం 10 ఏళ్లు, గరిష్టంగా 25 ఏళ్లు ఉంటుంది. ప్రతి రూ.1000కి ఏటా జమ అయ్యే సొమ్ము.. ఈ పాలసీలో సింగిల్ ప్రీమియం ఆప్షన్ కూడా ఉన్నది. ఈ ఆప్షన్ ఎంచుకుంటే మాత్రం కనీస పాలసీ టర్మ్ ఐదేండ్లు, గరిష్ట పాలసీ టర్మ్ 25 ఏళ్లు ఉంటుంది. కనీస సమ్ హామీ రూ.2 లక్షలు ఉంటుంది. గరిష్ట మొత్తానికి ఎటువంటి పరిమితుల్లేవు. తల్లిదండ్రులు తమ పిల్లల విద్యావసరాలను పరిగణనలోకి తీసుకుని, వారి ప్రీమియం చెల్లింపు ఆధారంగా పాలసీ తీసుకొవచ్చు. బీమా పాలసీపై ప్రతి రూ.1000 లకు ఏటా రూ.80 చొప్పున పాలసీ ఉన్నంత కాలం కలుస్తుంది. పాలసీ చెల్లింపు సమయంలో పాలసీదారుడికి ఏదేనా జరిగితే నామినీకి డెత్ బెనిఫిట్లు అందిస్తారు. ఇదీ చదవండి: మీ బైక్ మైలేజ్ ఇవ్వట్లేదా.. ఇవి పాటించాల్సిందే.. చెల్లింపుల వివరాలు.. ఈ పాలసీ కింద రుణం కూడా తీసుకోవచ్చు. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయవచ్చు. నెలవారీ, త్రైమాసికం, ఆరు నెలలు, ఏడాది ప్రీమియం ఎంచుకోవచ్చు. లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్ -1లో ఏడు రెట్లు, ఆప్షన్-2లో పది రెట్ల రిటర్న్స్ ఉంటాయి. సింగిల్ ప్రీమియం ఆప్షన్-3లో 1.25 రెట్లు, ఆప్షన్-4 ప్రకారం 10 రెట్లు బెనిఫిట్ ఉంటుంది. ఐదేళ్ల ప్రీమియం ఆప్షన్-1 కింద రూ.99,625, ఆప్షన్ 2 కింద రూ.1,00,100, ఆరేళ్లు ప్రీమియం ఆప్షన్ -1 కింద రూ.84,275, ఆప్షన్ -2లో రూ.84,625, ఏడేళ్లు ప్రీమియం టర్మ్ ఆప్షన్ -1 కింద రూ.73,625, ఆప్షన్ -2లో రూ.73,900 చెల్లించాలి. ఇక సింగిల్ ప్రీమియం పాలసీలో ఆప్షన్-3 కింద రూ.3,89,225, ఆప్షన్ -4 కింద రూ.4,12,600 చెల్లించాల్సి ఉంటుంది. -
ఏజెంట్లకు భారీగా గ్రాట్యుటీ పెంపు.. ఎంతంటే..
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) తన ఏజెంట్లకు గ్రాట్యుటీ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతూ ప్రకటన విడుదల చేసింది. ఎల్ఐసీ ఆఫ్ ఇండియా(ఏజెంట్స్) రెగ్యులేషన్స్, 2017కు సవరణలు చేయడం ద్వారా ఇది సాధ్యమైంది. ఈ నియంత్రణలను ఎల్ఐసీ ఆఫ్ ఇండియా(ఏజెంట్స్) అమెండ్మెంట్ రెగ్యులేషన్స్, 2023గా పరిగణిస్తామని ఎల్ఐసీ తెలిపింది. అధికారిక పత్రాన్ని (అఫిషియల్ గెజిట్) ప్రచురించిన డిసెంబరు 6 నుంచి పెంపు అమల్లోకి వస్తుందని శుక్రవారం సంస్థ పేర్కొంది. ఎల్ఐసీ ఏజెంట్లు, ఉద్యోగుల ప్రయోజనాల నిమిత్తం గ్రాట్యుటీ పెంపు, కుటుంబ పింఛను తదితర పలు సంక్షేమ పథకాలకు ఆర్థిక శాఖ సెప్టెంబరులో అనుమతి ఇచ్చింది. తిరిగి నియమితులైన ఏజెంట్లకూ రెన్యువల్ కమీషన్‌కు అర్హత ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం ఏదైనా పాత ఏజెన్సీ కింద చేసిన వ్యాపారంపై రెన్యువల్ కమీషన్‌కు ఎల్ఐసీ ఏజెంట్లకు అర్హత లేదు. ఇదీ చదవండి: ‘ఈవీ’ ఇళ్లు..! ప్రస్తుతం ఎల్ఐసీలో 25 కోట్ల పాలసీ హోల్డర్లు ఉన్నారు. దాదాపు 12 లక్షల ఏజెంట్లు పని చేస్తున్నారు. ఎల్ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5.1 లక్షల కోట్లుగా ఉంది. -
ఎల్ఐసీ ఏజెంట్లు, ఉద్యోగులకు బిగ్ బొనాంజా.. వరాలు కురిపించిన కేంద్ర ప్రభుత్వం
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఏజెంట్లు, ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ఎల్ఐసీ ఏజెంట్లు, ఉద్యోగుల ప్రయోజనాల కోసం సంక్షేమ చర్యలను కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించింది. ఎల్ఐసీ ఏజెంట్ల (LIC agents) గ్రాట్యుటీ పరిమితిని రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. అలాగే ప్రస్తుతం రూ. 3,000 నుంచి రూ.10,000 స్థాయిలో ఉన్న టర్మ్ ఇన్సూరెన్స్ కవర్‌ను రూ. 25,000 నుంచి రూ.150,000 స్థాయికి పెంచేందుకు అంగీకరిచింది. (PM Vishwakarma Scheme: రూ.13,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం.. ప్రయోజనాలు ఇవే..) టర్మ్ ఇన్సూరెన్స్‌లో ఈ పెంపుదలతో మరణించిన ఏజెంట్ల కుటుంబాలకు గణనీయంగా ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. అలాగే ఎల్ఐసీ ఉద్యోగుల కుటుంబాల సంక్షేమం కోసం 30 శాతం చొప్పున కుటుంబ పింఛను ఇవ్వాలని నిర్ణయించారు. దేశంలో ఎల్ఐసీ వృద్ధి, బీమా విస్తరణలో కీలక పాత్ర పోషిస్తున్న 13 లక్షలకు పైగా ఏజెంట్లు, లక్ష మందికి పైగా ఉద్యోగులు ఈ సంక్షేమ చర్యల ద్వారా ప్రయోజనం పొందుతారని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. (EPFO:వేతన జీవులకు షాక్.. తగ్గనున్న పీఎఫ్ వడ్డీ!) -
ఎల్ఐసీ పాలసీ దారులకు శుభవార్త.. ఉచితంగా క్రెడిట్ కార్డు!
LIC Policy Holders: ప్రముఖ ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ తన పాలసీ దారులకు శుభవార్త అందించింది. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ ఆఫ్ ఇండియా) తన కస్టమర్ లేదా పాలసీ హోల్డర్, ఏజెంట్లకు ఉచితంగా క్రెడిట్ కార్డును ఇవ్వనునట్లు తెలిపింది. ఐడీబీఐ బ్యాంక్ సహకారంతో ఎల్ఐసీ సీఎస్ఎల్ ఇటీవల రూపే క్రెడిట్ కార్డును ప్రారంభించింది. ఈ క్రెడిట్ కార్డును లుమైన్ కార్డు, ఎక్లాట్ కార్డుల పేరుతో తీసుకొచ్చింది. ఈ క్రెడిట్ కార్డులు ప్రస్తుతం ఎల్ఐసీ ఏజెంట్లు, సభ్యులు, పాలసీదారులకు ప్రత్యేకంగా ఇస్తుంది. త్వరలో ఈ కార్డులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని చూస్తుంది. ఈ క్రెడిట్ కార్డు తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఒకవేళ మీరు ఈ కార్డు ద్వారా ఎల్ఐసీ ప్రీమియం చెల్లించినట్లయితే రెట్టింపు రివార్డ్ పాయింట్లను అందుకుంటారు. అంతేకాక పెట్రోల్ బంకుల వద్ద ఫ్యూయల్ సర్ఛార్జ్ మినహాయింపు కూడా ఉంటుంది. ఈ కార్డుల పలు రకాల ఇతర ప్రయోజనాలను అందిస్తాయని ఎల్ఐసీ చెప్పింది. ఈ రెండు క్రెడిట్ కార్డులను ఎల్ఐసీ, ఐడిబిఐ బ్యాంక్ కలిసి సంయుక్తంగా అందిస్తున్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏమింటే ఈ కార్డులకు ఎలాంటి మెంబర్షిప్ ఫీజులు కానీ లేదా యాన్యువల్ ఫీజులు కానీ చెల్లించాల్సివసరం లేదు. ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ లింకు మీద క్లిక్ చేయండి. ఇతర ప్రయోజనాలు: లూమిన్ కార్డుపై రూ.100 ఖర్చు చేస్తే 3 డిలైట్ పాయింట్లను మీరు పొందవచ్చు. ఎక్లాట్ క్రెడిట్ కార్డుపై రూ.100 ఖర్చు చేస్తే 4 డిలైట్ పాయింట్లు వస్తాయి. ఎల్ఐసీ ఐడీబీఐ ఎక్లాట్ కార్డు హోల్డర్స్‌కు దేశీయ, అంతర్జాతీయ విమానశ్రయాల్లో కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సస్ కూడా లభిస్తుంది. ఈ కార్డుల ద్వారా రూ.400 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీ చేస్తే 1 శాతం ఫ్యూయల్ సర్ఛార్జ్ రియంబర్స్మెంట్ ఉంటుంది. 3000 కంటే ఎక్కువ మొత్తంలో ఏదైనా కొంటే, వాటిని తేలికగా ఈఎంఐల్లోకి మార్చుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డులకు కూడా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంది. రూ.5 లక్షల వరకు సమ్ అస్యూర్డ్ లభిస్తుంది. మీ పేరుపై ఇప్పటికే ఒక కార్డు ఉన్నప్పటికీ, భవిష్యత్‌లో మరిన్ని యాడ్-ఆన్ కార్డులను మీరు పొందవచ్చు. లూమిన్ క్రెడిట్ కార్డు లిమిట్ రూ. 50వేలు గాను, ఎక్లాట్ క్రెడిట్ కార్డు లిమిట్ రూ.2 లక్షలుగా ఉంది. ఈ కార్డుల యూనిక్ ఫీచర్ ఏమిటంటే ఎలాంటి ప్రాసెసింగ్ కాస్ట్ ఉండదు. ఈ రెండు క్రెడిట్ కార్డుల వ్యాలిడిటీ 4 ఏళ్లుగా ఉంది. (చదవండి: ఇస్మార్ట్ శంకర్ కాదు.. ఇస్మార్ట్ ఎలన్ మస్క్ !) -
ఎల్ఐసీ పాలసీదారులకు హెచ్చరిక.. వారితో జాగ్రత్త!
దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ బీమా కాంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ఆఫ్ ఇండియా తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు ఎన్నో కొత్త రకాల స్కీమ్స్ అందిస్తుంది. ఎండోమెంట్ ప్లాన్స్, చిల్డ్రన్స్ ప్లాన్స్, పెన్షన్ ప్లాన్స్, హెల్త్ ప్లాన్స్, లైఫ్ ప్లాన్స్ ఇలా పలు రకాల పాలసీలు ప్రజల కోసం తీసుకొచ్చింది. అందుకే ప్రతి కుటుంభంలో ఒకరికైనా ఏదైనా ఒక ఎల్ఐసీ పాలసీ అందుబాటులో ఉంటుంది. దేశ వ్యాప్తంగా దీనికి లక్షల్లో ఖాతాదారులు ఉన్నారు. అందుకే వారి భద్రతను దృష్టిలో పెట్టుకొని కొన్ని హెచ్చరికలను జారీ చేసింది. ఈ కరోనా కాలంలో సైబర్ క్రైమ్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకే సైబర్ నేరగాళ్ల దృష్టి బ్యాంక్ ఖాతాదారుల నుంచి ఎల్ఐసీ పాలసీదారులపై పడింది. ఎల్ఐసీ పాలసీదారులను లక్ష్యంగా చేసుకొని డబ్బులు కాజేస్తున్నారు. అందుకే మోసగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని ఎల్ఐసీ పాలసీదారులను అప్రమత్తం చేస్తోంది. ఎల్ఐసీ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ మధ్య కొందరు మోసగాళ్లు ఎల్ఐసీ ఏజెంట్లు, ఎల్ఐసీ & ఐఆర్డీఏఐ అధికారులమని ఫోన్ చేసి పాలసీలు తీసుకుంటే అదిరిపోయే బెనిఫిట్స్ పొందవచ్చని చెప్పి మోసం చేస్తారని వివరించింది. పాలసీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఎల్ఐసీ వెబ్ సైట్‌కు వెళ్లి వివరాలు చెక్ చేసుకోవాలని కోరింది. pic.twitter.com/yWebSpP5fH — LIC India Forever (@LICIndiaForever) May 24, 2021 చదవండి: ప్రమాదంలో 10 కోట్ల మంది మొబైల్ యూజర్ల డేటా -
పని ఎల్ఐసీది.. పాట్లు ఏఈవోలది
సాక్షి, హైదరాబాద్: రైతులకు అందుబాటులో ఉండటం,వారికి సాగు అంశాల్లో సలహాలు సూచనలు ఇవ్వడం, ఏటా రైతు చైతన్య యాత్ర లు జరపడంలో బాధ్యత వహించాల్సిన క్షేత్రస్థాయి వ్యవసాయాధికారులు ఇప్పుడు వాటన్నింటినీ పక్కన పెట్టాల్సి వస్తోంది. రైతుబంధు, రైతుబీమా పథకాలు వచ్చాక డేటా సేకరణ, పంపిణీ వంటి వాటిలో మునిగిపోవాల్సి వచి్చంది. రైతుబీమాతో ఇతర వ్యవ సాయ సంబంధిత పనులన్నింటినీ పక్కన పెట్టాల్సి వస్తోందన్న చర్చ జరుగుతోంది. దీనిపై క్షేత్రస్థాయిలో ఉండే వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో) గగ్గోలు పెడుతున్నారు. రైతుబీమాతోనే సరి: గతేడాది ఆగస్టు 14 నుంచి రైతుబీమా పథకాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఏ కారణంతోనైనా రైతు చనిపోతే సంబంధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వడమే దీని ఉద్దేశం. ఈ పథకం అమలును ఏఈవోలపైనే పడేశారు. రైతు చని పోతే సంబంధిత వివరాలను ఎల్ఐసీ ఏజెంటు లేదా ఆ సంస్థ ప్రతినిధి తీసుకోవాలి. తదుపరి రైతు మరణ ధ్రువీకరణ పత్రం, ఇతరత్రా వివరాలన్నింటినీ వారే సేకరించి డాక్యుమెంటేషన్ చేయాలని వ్యవసాయ అధికారులు అంటున్నారు. కానీ రైతు చనిపోయిన పది రోజుల్లోనే వారి కుటుంబానికి పరిహారం అందాలంటే తామే అన్నీ భుజాన వేసుకోవాలని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఎల్ఐసీ ప్రతి నిధుల పనిని ఏఈవోలే చేయాల్సి వస్తోందని అంటున్నారు. -
నేడు ఎల్ఐసీ ఏజెంట్ల సదస్సు
ఏలూరు (ఆర్ఆర్ పేట) : ఎల్ఐసీ ఏజెంట్ల దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక పోలీస్ కల్యాణ మండపంలో ఏజెంట్లకు ‘అవగాహన-ఆచరణ’ సదస్సు నిర్వహించనున్నట్టు ఎల్ఐసీ ఏజెంట్ల యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు బండారు కిరణ్‌కుమార్, మందపాటి వెంకటేశ్వరరావు ఓ ప్రకటనలో తెలపారు. ఏజెంట్లలో నైపుణ్యం పెంచేందుకు, గ్రాట్యూటీ, గ్రూప్ ఇన్సూరెన్సు, మెడిక్లెయిమ్, స్వావలంబన్, సంవర్థన్ పెన్షన్ పథకాల ప్రయోజనాలను వివరించేందుకు సదస్సు ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. -
రూ.4 కోట్లకు ఎల్ఐసీ ఉద్యోగి కుచ్చుటోపీ
వందమంది వర కూ బాధితులు సెలవులో వెళ్లి వచ్చిన ఉద్యోగిని పట్టుకున్న బాధితులు మదనపల్లెక్రైం, న్యూస్‌లైన్: ఎల్ఐసీలో ఉద్యోగం చేస్తూ తన కార్యాలయానికి వచ్చే ఏజెంట్లతో పాటు పట్టణంలోని పలువురి వద్ద సుమారు రూ.4కోట్ల మేర అప్పులు చేశాడు. ఎవరికీ చిల్లిగవ్వ చెల్లించకుండా ఒత్తిళ్లు తేవడంతో పట్టణం నుంచి ఉడాయించేందుకు పథకం ప న్నాడు. ఈ క్రమంలో 4 నెలలు ఉద్యోగానికి సెలవు పెట్టి వెళ్లిపోయాడు. తిరిగి సెలవును రెన్యూవల్ చేసుకోవడానికి శనివారం వచ్చిన అతన్ని బాధితులు పట్టుకుని నిలదీశారు. పట్టణంలోని సుభాష్‌రోడ్డుకు చెందిన పోలేపల్లె గిరిధర్ కుమార్ ఎల్ఐసీ కార్యాలయంలో హైగ్రేడ్ ఆఫీసర్ (హెచ్జీవో )గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఉద్యోగంతో పాటు షేర్మార్కెట్లో షేర్స్ కొనుగోలు చేయడం, చిట్స్ నిర్వహిం చడం, ఫైనాన్స్ వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. ఈ క్రమంలో తన కార్యాలయంలోని ఏ జెంట్ల వద్ద సుమారు రూ.60 లక్షల వరకు అప్పులు చేశాడు. వ్యాపార నిమిత్తం పట్టణంలోని వందమంది దగ్గర ఒకరికి తెలియకుండా ఒకరి వద్ద లక్షల్లో డబ్బులు తీసుకున్నాడు. చీటీలు వేసిన వారికి డబ్బులు ఇవ్వలేదు. రియల్ఎస్టేట్లో భూములకు అడ్వాన్స్ తీసుకున్న డబ్బులు చెల్లించలేదు. అధిక వడ్డీ ఇస్తానని ఏజెంట్ల వద్ద తీసుకున్న సొమ్ము చెల్లించలేదు. ఇవన్నీ తడిసి మోపెడయ్యాయి. సుమారు రూ.4కోట్ల మేర అప్పులు మిగిలాయి. మదనపల్లెలో సొంతిల్లుతో పాటు వాల్మీకిపురం మండలంలో భూములు, బెంగళూరులో ఇంటి స్థలం ఉంది. దీంతో అతనికి అప్పిచ్చిన వారు ఏనాటికైనా మన డబ్బులు వస్తాయని ఆశపడ్డారు. ఇదిలా ఉండగా అందరిని నిలువునా ముంచే ప్రయత్నంలో గిరిధర్ తన ఉద్యోగానికి 4 నెలలు సెలవు పెట్టి మదనపల్లె విడిచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతని వద్ద డబ్బులు రావాల్సిన వారికి దిగులుపట్టుకుంది. ఈ క్రమంలో గిరిధర్‌కుమార్ ఐపీ పెట్టేందుకు కోర్టును కూడా ఆశ్రయించాడు. అయితే కోర్టు అతని పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ క్రమంలో ఉద్యోగానికి పెట్టిన సెలవు పూర్తయిపోవడంతో దాన్ని రెన్యూవల్ చేసుకునే క్రమంలో శనివారం మదనపల్లెలోని ఎల్ఐసీ కార్యాలయానికి వచ్చాడు. అతను రావడాన్ని తెలుసుకున్న బాధితులు అక్కడికి వెళ్లి అతన్ని పట్టుకున్నారు. తమ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన వద్ద డబ్బులు లేవని, ఉన్న ఆస్తులు అమ్మి ఇస్తానని చెబుతున్నా బాధితులు వినడం లేదు. అతని ఆస్తులు కూడా అటాచ్మెంట్లో పెట్టినట్టు తెలిసింది. అయితే బాధితులు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు.