ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : ఎల్‌ఐసీ ఏజెంట్ల దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక పోలీస్ కల్యాణ మండపంలో ఏజెంట్లకు ‘అవగాహన-ఆచరణ’ సదస్సు నిర్వహించనున్నట్టు ఎల్‌ఐసీ ఏజెంట్ల యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు బండారు కిరణ్‌కుమార్, మందపాటి వెంకటేశ్వరరావు ఓ ప్రకటనలో తెలపారు. ఏజెంట్లలో నైపుణ్యం పెంచేందుకు, గ్రాట్యూటీ, గ్రూప్ ఇన్సూరెన్సు, మెడిక్లెయిమ్, స్వావలంబన్, సంవర్థన్ పెన్షన్ పథకాల ప్రయోజనాలను వివరించేందుకు సదస్సు ఏర్పాటుచేశామని పేర్కొన్నారు.